ఫైనల్లో భారత బౌలర్ల జోరు
లండన్:మహిళల వన్డే వరల్డ్ కప్లో భాగంగా ఇక్కడ లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న టైటిల్ పోరులో భారత బౌలర్లు జోరు కొనసాగిస్తున్నారు. వరుస విరామాల్లో మూడు ప్రధాన వికెట్లను తీసి ఇంగ్లండ్ ను కష్టాల్లోకి నెట్టారు. తొలి వికెట్ గా విన్ ఫీల్డ్ (24)నిష్ర్కమించగా, రెండో వికెట్ గా బీమాంట్(23) పెవిలియన్ చేరారు. దాంతో 60 పరుగుల వద్ద ఇంగ్లండ్ రెండో వికెట్ ను నష్టపోయింది.
ఆపై మరో మూడు పరుగుల వ్యవధిలో కెప్టెన్ హీథెర్ నైట్(1) అవుటైంది. దాంతో 63 పరుగులకే ఇంగ్లండ్ మూడు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ మూడు వికెట్లలో పూనమ్ యాదవ్ రెండు వికెట్లు సాధించగా, గైక్వాడ్ కు ఒక దక్కింది. తొలి వికెట్ కు బీమాంట్ తో కలిసి 47 పరుగులు జోడించిన తరువాత విన్ ఫీల్డ్.. గ్వైక్వాడ్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యింది. ఆపై పూనమ్ యాదవ్ బౌలింగ్ భారీ షాట్ కు యత్నించిన బీమాంట్ సైతం పెవిలియన్ చేరింది. ఇక ఇంగ్లండ్ కెప్టెన్ హీథెర్ నైట్ ఎల్బీ రూపంలో మూడో వికెట్ గా పెవిలియన్ బాట పట్టింది.