డెర్బీ: మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా భారత్ తో ఆరంభపు మ్యాచ్ లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ హీథెర్ నైట్ తొలుత భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఇంగ్లండ్‌తో ఆడిన గత 10 మ్యాచ్‌ల్లో భారత్ ఎనిమిదిసార్లు ఓడిపోయింది. అయితే అన్ని విభాగాల్లో సమతుల్యంతో ఉన్న భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శనపైనే గెలుపు ఆధారపడి ఉంటుంది. భారత బ్యాటింగ్ లో ఓపెనర్లు దీప్తిశర్మ, పూనమ్ రౌత్, మిడిల్ ఆర్డర్ లో హర్మన్ ప్రీత్ కౌర్, మేశ్రమ్లతో పాటు కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా కీలకం.
మరోవైపు స్వదేశంలో జరిగిన రెండు ప్రపంచకప్‌లలోనూ విజేతగా నిలిచిన ఇంగ్లండ్ ముచ్చటగా మూడోసారి మళ్లీ గెలవాలని తహతహలాడుతోంది. సారా టేలర్, కెప్టెన్ హీథెర్ నైట్, పేసర్ కేథరీన్ బ్రంట్, సివెర్ రాణిస్తే ఇంగ్లండ్ శుభారంభం చేసే అవకాశముంది.ఓవరాల్‌గా భారత్, ఇంగ్లండ్ జట్లు 61 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. 25 మ్యాచ్‌ల్లో భారత్... 34 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ గెలిచాయి. రెండు మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు. ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు తొమ్మిది సార్లు ముఖాముఖి తలపడగా... మూడుసార్లు భారత్, ఆరుసార్లు ఇంగ్లండ్ విజయం సాధించాయి. దాంతో ఇంగ్లండ్ పై సమష్టిగా పోరాడితేనే భారత్ విజయం సాధించే అవకాశం ఉంది.
మిథాలీ సేన బ్యాటింగ్
Published Sat, Jun 24 2017 3:01 PM | Last Updated on Tue, Sep 5 2017 2:22 PM
Advertisement