
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక మహిళల ప్రపంచ కప్‌నకు ముందు హాకీ ఇండియా (హెచ్‌ఐ) ప్రత్యేక జాతీయ శిబిరాన్ని నిర్వహించనుంది. ఈ నెల 28 నుంచి జూన్ 9 వరకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఆధ్వర్యంలో బెంగళూరులో నిర్వహించే ఈ శిబిరం కోసం హాకీ ఇండియా 48 మంది సీనియర్ క్రీడాకారిణుల పేర్లను శనివారం ఎంపిక చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గోల్‌కీపర్ ఎతిమరపు రజని, తెలంగాణ ఫార్వర్డ్ ప్లేయర్ యెండల సౌందర్య కూడా ఉన్నారు.
ఇటీవల ముగిసిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో రన్నరప్‌తో సరిపెట్టుకున్న భారత మహిళల హాకీ జట్టు తిరిగి సోమవారం నుంచి శిబిరంలో పాల్గొననుంది. చీఫ్ కోచ్ జోయర్డ్ మరీనే నేతృత్వంలో ఈ శిబిరాన్ని నిర్వహించనున్నారు. ‘ఫిట్‌నెస్ ప్రమాణాలు పెంచుకునేందుకు ఈ క్యాంప్‌ను వినియోగించుకుంటాం. దీంతో పాటు మానసికంగా ఇంకా ధృడంగా మారేందుకు కృషిచేస్తాం’ అని కోచ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment