Hockey India
-
Rani Rampal: మకుటం లేని మహారాణి
భారత పురుషుల హాకీ జట్టుకు ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. దిగ్గజాలూ ఉన్నారు. కానీ మహిళల హాకీకి ఆదరణే అంతంత మాత్రం! ఇలాంటి ఆటలో ఓ నిరుపేద కుటుంబానికి చెందిన రాణి రాంపాల్... తన ఆటతీరుతో నిజంగా ‘రాణి’గా ఎదిగింది. బాల్యంలో పేదరికం వెంటాడినా... పెద్దయ్యాక ఆటలో గోల్స్ వేటలో పడింది. మేటి ఫార్వర్డ్ ప్లేయర్‌గా, తదనంతరం కెప్టెన్ గా జట్టును నడిపించింది. టోక్యో ఒలింపిక్స్‌లో ఆమె సారథ్యంలోని భారత మహిళల జట్టు త్రుటిలో కాంస్యం కోల్పోయి నాలుగో స్థానంలో నిలిచింది. న్యూఢిల్లీ: భారత మహిళల హాకీ జట్టు మాజీ కెప్టెన్ రాణి రాంపాల్ తన 16 ఏళ్ల కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు గురువారం ఆమె ప్రకటించింది. మహిళల జట్టులో అరుదైన మేటి క్రీడాకారిణిల్లో ఆమె ఒకరు. ‘పారిస్’ కంటే ముందు జరిగిన టోక్యో విశ్వక్రీడల్లో భారత మహిళల జట్టుకు పతకం రేసులో నిలిచే సత్తా ఉందని తన సారథ్యంతో చాటి చెప్పిన స్టార్ ఫార్వర్డ్ రాణి. దురదృష్టవశాత్తూ కాంస్య పతక పోరులో రాణి బృందం ఓడి చివరకు నాలుగో స్థానంలో నిలిచింది. భారత మహిళల హాకీ చరిత్రలో ఒలింపిక్స్ పతకం లేకపోవచ్చేమో గానీ... నాలుగో స్థానంతో దేశంలో మహిళల హాకీ భవిష్యత్తుకు బంగారు బాట వేసింది. ఇదీ నేపథ్యం... హరియాణాలోని మారుమూల పల్లెకు చెందిన నిరుపేద కుటుంబ నేపథ్యం రాణి రాంపాల్‌ది. తండ్రి రాంపాల్ రోజూ బండిలాగితే వచ్చే అరకొర డబ్బులతో వీరి కుటుంబం పూట గడిచేది. అలాంటి చిన్నారి ఓ హాకీ స్టిక్ చూడగలదేమో కానీ కొనుక్కోలేదు. బాల్యంలో సరైన తిండిలేక పోషకాహార లోపంతో కనబడే రాణిని చూసిన జిల్లాస్థాయి కోచ్ ఆమెకు కోచింగ్ నిరాకరించాడు. కానీ ఆ బాలిక మాత్రం మక్కువ పెంచుకున్న హాకీ ఆటపై మనసు లగ్నం చేసింది. విరిగిపోతే పడేసిన ఓ హాకీ స్టిక్‌తో అదేపనిగా ప్రాక్టీస్ చేసింది. అలా మెల్లిగా స్థానిక జట్టులోకి వచ్చి... ఎన్నో ఒడిదొడుకులు, పేదరికపు కష్టాలు, ఆటుపోట్లకు ఎదురీది ఎట్టకేలకు 14 ఏళ్ల వయసులో భారత జట్టులోకి ఎంపికై అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది. ఆ తర్వాత ఏళ్లు గడుస్తున్న కొద్దీ పేరుకు తగ్గట్టే భారత మహిళల హాకీ జట్టుకు ‘రాణి’ అయ్యింది. ఫీల్డ్‌లో చక్కని సమయస్ఫూర్తి, పాస్‌లలో చురుకుదనం, ప్రత్యర్థి గోల్‌పోస్ట్ వద్ద కొరకరాని ఫార్వర్డ్‌గా ఎదిగింది. తదనంతరం జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టాక భారత్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఆసియా క్రీడలు, ప్రపంచకప్, ఒలింపిక్స్‌లో మహిళల జట్టుకు అద్భుతం చేసే సత్తా ఉందని కెప్టెన్ గా నిరూపించింది. తాజాగా 29 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ ప్రకటించింది. కెరీర్లో ఘనతలు స్టార్ ఫార్వర్డ్ రాణి సారథ్యంలోనే టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు నాలుగో స్థానం లభించింది. 2018 మహిళల ప్రపంచకప్ హాకీ (లండన్)లో క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. అదే ఏడాది ఆసియా క్రీడల్లో రాణి జట్టు రజత పతకం గెలిచింది. చిరు ప్రాయంలో అంతర్జాతీయ కెరీర్‌ను ఆరంభించిన ఆమె 254 అంతర్జాతీయ మ్యాచ్‌లాడి 205 గోల్స్ చేసింది. 2020లో ఆమె ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డును ప్రదానం చేసింది. అదే ఏడాది నాలుగో పౌర పురస్కారమైన ‘పద్మశ్రీ’ కూడా ఆమె కీర్తి కిరీటంలో చేరింది. ఆమె 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో సాధించిన మైలురాళ్లకు ఘనమైన గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించుకున్న హాకీ ఇండియా ఆమె జెర్సీ నంబర్ 28కి రిటైర్మెంట్ ఇచ్చింది. గురువారం న్యూఢిల్లీలో భారత్, జర్మనీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం రాణిని కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవియా సన్మానించి రూ. 10 లక్షలు నగదు పురస్కారం అందజేశారు. నాకే ఆశ్చర్యమనిపిస్తోంది నా క్రీడా ప్రయాణం చూసుకుంటే నాకే ఆశ్చర్యమేస్తుంది. ఇన్నేళ్లు భారత్‌కు ఆడతానని ఏనాడు అనుకోలేదు. బీదరికంలో కష్టాలు చూసిన ఆ కళ్లతోనే ఆటపై దృష్టి పెట్టాను. అనుకున్నది సాధించాను. సుదీర్ఘ కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కానీ ఏనాడూ నిరాశ చెందలేదు. భారత్‌కు ఆడటంపట్ల ఎంతో గర్విస్తున్నాను. నిజం చెప్పాలంటే నేను 254 మ్యాచ్‌ల్లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాననని గానీ, 200 పైచిలుకు గోల్స్ సాధిస్తానని గానీ ఎప్పుడు అనుకోలేదు. బాల్యంలో నాన్న ఆ తర్వాత కుటుంబం, నా కోచ్ బల్దేవ్ సింగ్ నా లైఫ్‌ను తీర్చిదిద్దారు. బల్దేవ్లాంటి కోచ్, టీచర్ దొరకడమే నా అదృష్టం. ఆటలో నైపుణ్యం నేర్పిన అతను జీవితానికి సరిపడా పాఠాలూ చెప్పారు. రిటైర్మెంట్ నిర్ణయం కఠినమైనా తప్పదు. దీనికిదే సరైన సమయమని భావిస్తున్నా. భారత సబ్ జూనియర్ జట్టుకు ఇటీవల కోచ్‌గా నన్ను నియమించారు. త్వరలో జరిగే హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో హరియాణా–పంజాబ్‌కు చెందిన సూర్మా హాకీ మహిళల జట్టుకు కోచ్, మెంటార్‌గా సరికొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టనున్నాను. ఒలింపిక్స్‌లో మా జట్టు పోడియంలో నిలువలేదు... కానీ భవిష్యత్తులో తప్పకుండా పతకాలు సాధిస్తుంది. –రాణి రాంపాల్ -
PR Sreejesh: జెర్సీ నంబర్ 16కు వీడ్కోలు
న్యూఢిల్లీ: భారత దిగ్గజ గోల్‌కీపర్ శ్రీజేశ్ ఇకపై హాకీ మైదానంలో కనిపించడు. అలాగే అతని జెర్సీ నంబర్ 16 కూడా కనిపించదు. గోల్‌పోస్ట్ ముందు ప్రత్యర్థులకు అడ్డుగోడలా నిలబడి భారత జట్టుకు విశేష సేవలందించిన శ్రీజేశ్ ఘనకీర్తికి గుర్తుగా ఆ జెర్సీకి అతనితోపాటే రిటైర్మెంట్ ఇవ్వాలని హాకీ ఇండియా (హెచ్ఐ) నిర్ణయించింది. బుధవారం ఒలింపిక్స్ కాంస్య పతక విజేత జట్టు సభ్యులను ఘనంగా సన్మానించారు. శ్రీజేశ్కు రూ. 25 లక్షల నగదు పురస్కారం చెక్ రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా హెచ్ఐ అధ్యక్ష, కార్యదర్శులు దిలీప్ టిరీ్క, భోళానాథ్ సింగ్‌లు మాట్లాడుతూ శ్రీజేశ్‌ను ఆకాశానికెత్తారు. ఆధునిక భారత హాకీకి అతనొక దేవుడని కితాబిచ్చారు. భారత సీనియర్ పురుషుల జట్టులో 16వ నంబర్ జెర్సీని ఎవరికీ కేటాయించబోమని భోళానాథ్ చెప్పారు. ‘శ్రీజేశ్ త్వరలోనే జూనియర్ భారత జట్టు కోచ్‌గా వెళతారు. ఘనమైన కెరీర్‌కు అతను వీడ్కోలు పలికితే ... హాకీ ఇండియా అతని ఘనకీర్తికి గుర్తుగా జెర్సీ నంబర్ 16కు రిటైర్మెంట్ ఇచ్చింది. అయితే ఇది సీనియర్ స్థాయికే పరిమితం. జూనియర్ జట్టులో 16వ జెర్సీ యథాతథంగా కొనసాగుతుంది’ అని ఆయన వివరించారు. -
రిటైర్మెంట్ ప్రకటించిన భారత హాకీ లెజెండ్..
భారత హాకీ లెజెండ్ పీఆర్ శ్రీజేష్ తన 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు విడ్కోలు పలికేందుకు సిద్దమయ్యాడు. ప్యారిస్ ఒలింపిక్స్-2024 తర్వాత శ్రీజేష్ అంతర్జాతీయ హాకీకి రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. ఈ విషయాన్ని అతడు సోమవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఎక్స్(ట్విటర్)లో భావోద్వేగ నోట్ షేర్ చేశాడు. "ప్యారిస్‌లో జరిగే ఒలింపిక్స్ అనంతరం నా కెరీర్‌కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాడు. భారత జెర్సీని ధరించడం ఇదే చివరి సారి. ఈ సారి ఒలింపిక్స్ కోసం ఎంతో ఆతృగా ఎదురుచూస్తున్నాను. నా ఈ 18 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఇన్నాళ్లు నాకు మద్దతుగా నిలిచిన హాకీ ఇండియా, నా కుటుంబం, సహచరులు, కోచ్‌లు, అభిమానులందరికి ధన్యవాదాలు. వారి ప్రేమాభిమానాలకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనని. నాపై ఇప్పటికి నమ్మకం ఉంచినందుకు హాకీ ఇండియాకు స్పెషల్ థాంక్స్ చెప్పాలనకుంటున్నాను.నా సహచరలు సైతం కఠినమైన సమయాల్లో నా పక్కనే ఉన్నారు. ఎన్నో టోర్నీల్లో మేమందరం కలిసి విజయం సాధించాము. ఇప్పుడు మరోసారి ప్యారిస్‌లోనూ మన జెండా ఎగరవేద్దాం" అని ఎక్స్‌లో శ్రీజేష్ పేర్కొన్నాడు. 2006లో సౌత్ ఆసియన్ గేమ్స్‌తో అరంగేట్రం చేసిన శ్రీజేష్.. ఎన్నో ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు. కెప్టెన్‌గా, గోల్‌కీపర్‌గా భారత్‌కు చిరస్మరణీయ విజయాలను అందించాడు. రియో ఒలింపిక్స్‌లో భారత జట్టుకు శ్రీజేష్ సారథ్యం వహించాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత హారీ జట్టులో శ్రీజేష్ సభ్యునిగా ఉన్నాడు. ఇది శ్రేజేష్కు నాలుగో ఒలింపిక్స్ కావడం గమనార్హం. అతడి కెరీర్లో రెండు ఆసియా గేమ్స్ బంగారు పతకాలు, రెండు ఆసియా కప్ టైటిల్స్, నాలుగు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్స్ కూడా ఉన్నాయి. 2021లో శ్రేజేష్ 2021లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును అందుకున్నాడు. Once a Champion, Always a Champion 💪🏻#WinItForSreejesh https://t.co/LdR0SP3NMW— Hockey India (@TheHockeyIndia) July 22, 2024 -
పక్షవాతాన్ని జయించి.. ప్యారిస్ ఒలింపిక్స్‌లో!
సంకల్ప బలం గట్టిగా ఉంటే.. ఎలాంటి అడ్డంకులు ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ సుఖ్జీత్ సింగ్. పక్షవాతం బారినా పడినా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి.. తన కలను నిజం చేసుకున్నాడు.హాకీ ఆటగాడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుని విశ్వ క్రీడల్లో పాల్గొనే అవకాశం దక్కించుకున్నాడు. పంజాబ్‌లోని జలంధర్‌లో 1996లో జన్మించాడు సుఖ్జీత్ సింగ్. అతడి తండ్రి అజిత్ సింగ్ పంజాబ్ పోలీస్ విభాగంలో పనిచేసేవాడు.తండ్రిని చూసిపోలీస్ టీమ్ తరఫున హాకీ ఆడే తండ్రిని చూసి చిన్ననాటి నుంచే గమనించిన సుఖ్జీత్.. ఆటపై మక్కువ పెంచుకున్నాడు. ఆరో ఏటనే హాకీ స్టిక్ చేతబట్టి ఓనమాలు నేర్చాడు.నాటి నుంచి తండ్రి ప్రోత్సాహంతో భారత జట్టులో చోటే లక్ష్యంగా శ్రమించాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ లక్ష్యానికి చేరువగా వచ్చాడు. కానీ.. తానొకటి తలిస్తే దైవమొకటి తలిచినట్లు పక్షవాతం రూపంలో ప్రమాదం ముంచుకొచ్చింది. తాత్కాలిక పక్షవాతంఆరేళ్ల క్రితం వెన్నునొప్పి బారిన పడిన సుఖ్జీత్.. కుడికాలు తాత్కాలిక పక్షవాతానికి గురైంది. దీంతో అతడి కలలు కల్లగానే మిగిలిపోతాయేమోనని కుటుంబం భయపడింది. అయితే, తండ్రి ప్రోత్సాహం, తన సంకల్ప బలం వల్ల సుఖ్జీత్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు.భారత జట్టు తరఫున అరంగేట్రం చేసి తానేంటో నిరూపించుకున్నాడు. తద్వారా ప్యారిస్ ఒలింపిక్స్-2024 జట్టులో స్థానం సంపాదించాడు ఈ ఫార్వర్డ్ ప్లేయర్. ఈ నేపథ్యంలో తన ప్రయాణం గురించి మాట్లాడుతూ..ఐదు నెలలు మంచానికే పరిమితం‘‘ఒలింపిక్స్ ఆడటం నా కల. నా కుటుంబం కూడా ఇదే కోరుకుంది. నాకు దక్కిన గొప్ప గౌరవం ఇది. కఠినంగా శ్రమిస్తే కచ్చితంగా ఫలితం వస్తుందని నేను నమ్ముతాను.ఇప్పుడు అది మరోసారి నిరూపితమైంది. జట్టు ప్రయోజనాలే ప్రధానంగా ఆడుతాను. నాపై నమ్మకం ఉంచిన కోచ్‌లు, సహచర ఆటగాళ్లు తలెత్తుకునేలా చేస్తాను.ఇక హాకీ ఆడలేమోనని భయపడ్డాఅయితే, ఈ ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నాను. ముఖ్యంగా పాక్షిక పక్షవాతం కారణంగా ఐదు నెలలు మంచానికే పరిమితం కావాల్సిన దుస్థితి వచ్చింది.నా జీవితంలో అత్యంత కఠినమైన దశ అదే. శారీరకంగా.. మానసికంగా చాలా చాలా అలసిపోయాను. నడవలేకపోయాను. కనీసం నా పనులు కూడా నేను చేసుకోలేకపోయాను.ఇక హాకీ ఆడలేమోనని భయపడ్డాను. అయితే, మా నాన్న నన్ను తేలికగా తలవంచనీయలేదు. నొప్పిని భరించేలా తన మాటలతో ఉపశమనం కలిగించారు. నాలో స్ఫూర్తిని రగిల్చారు.ఆయన వల్లే నేను కోలుకోగలిగాను. ప్రస్తుతం నా దృష్టి మొత్తం ప్యారిస్ ఒలింపిక్స్‌పైనే ఉంది. నా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాను’’ అని సుఖ్జీత్ సింగ్ ఉద్వేగభరిత వ్యాఖ్యలు చేశాడు.పసిడి గెలిచిన జట్లలో సభ్యుడుకాగా రెండేళ్ల క్రితం సుఖ్జీత్ భారత జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. FIH Pro League 2021-2022 సీజన్లో స్పెయిన్‌తో మ్యాచ్ సందర్భంగా ఎంట్రీ ఇచ్చిన అతడు ఇప్పటి వరకు 70 మ్యాచ్‌లు ఆడి.. 20 గోల్స్ స్కోరు చేశాడు.భువనేశ్వర్‌లో జరిగిన హాకీ వరల్డ్‌కప్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడిన సుఖ్జీత్.. మూడు గోల్స్ కొట్టాడు. ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో పసిడి పతకం గెలిచిన భారత జట్టులో అతడు సభ్యుడు.గతేడాది ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన జట్టులోనూ సుఖ్జీత్ ఉన్నాడు. మైదానంలో పాదరసంలా కదులుతూ డిఫెన్స్ స్ప్లిట్టింగ్ పాస్‌లు మూవ్ చేసే సుఖ్‌జీత్‌కు, టీమిండియాకు ఆల్ ది బెస్ట్!.. ప్యారిస్ ఒలింపిక్స్‌లో భాగంగా భారత్ తొలుత న్యూజిలాండ్‌ను ఢీకొట్టనుంది. పూల్-బిలోని ఇరు జట్ల మధ్య జూలై 27న ఈ మ్యాచ్ జరుగనుంది.చదవండి: ఏడేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వనున్న మాక్సీ!.. కారణం అదే! -
Hockey India: హాకీ ఇండియా సీఈఓ ఎలీనా రాజీనామా
న్యూఢిల్లీ: హాకీ ఇండియా (హెచ్ఐ)లో మరో కుదుపు!... 13 ఏళ్లుగా హాకీ ఇండియాకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా వ్యవహరిస్తున్న ఎలీనా నార్మన్ రాజీనామా చేసింది. ఇటీవలే మహిళల జట్టు చీఫ్ కోచ్ యానిక్ షాప్‌మన్ కూడా రాజీనామా చేసింది.‘భారత హాకీలోని రెండు గ్రూపుల మధ్య విబేధాలతో గురుతర బాధ్యతలు నిర్వర్తించడం చాలా కష్టం. మూడు నెలలుగా జీతం నిలిపి వేశారు. సంప్రదింపులు, సముదాయింపుతో గతవారం పూర్తిగా జీతం చెల్లించారు’ అని 49 ఏళ్ల ఎలీనా వివరించారు.2011లో సీఈఓగా నియమితులైన ఎలీనా హయాంలోనే భారత్‌లో రెండు పురుషుల ప్రపంచకప్‌లు (2018, 2023), రెండు జూనియర్ పురుషుల ప్రపంచకప్‌లు (2016, 2021) విజయవంతంగా నిర్వహించారు. చదవండి: క్రికెట్‌పై రాజకీయాలు చేయడం దురదృష్టకరం: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ -
రగులుతున్న 'పనౌటీ' వివాదం! తెరపైకి నాడు ఇందీరా గాంధీ..
రెండు రోజుల్లో రాజస్తాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలు పోటాపోటీగా ఎన్నికల ప్రచార ర్యాలీలతో హోరెత్తించారు. ఎవరికి వారు మాటల తుటాలతో ఓటర్లను ఆకర్షించేలా ప్రచారం చేశారు. ఐతే కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఓ ప్రచార ర్యాలీ మోదీని విమర్శిస్తూ చేసిన పనౌటీ వ్యాఖ్య ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తిపై అలాంటి వ్యాఖ్యలా అని బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. ఈ వ్యాఖ్యల విషయమై రాహుల్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఏకంగా ఎలక్షన్ సంఘాన్ని కోరింది. అంతటితో ఆగకుండా 1982లో జరిగిన ఆసియా క్రీడల హాకీ ఫైనల్ మ్యాచ్‌ని గుర్తు చేస్తూ కాంగ్రెస్‌పై విమర్శలు ఎక్కిపెట్టింది బీజేపి. ఆ టైంలో ఇందిరాగాంధీ నేరుగా హాకీ మ్యాచ్‌ని వీక్షించేందుకు స్టేడియంకు వచ్చారని, ఐతే భారత హాకీ జట్టు మ్యాచ్‌లో వెనుకబడి ఉండటంతో ఆమె మధ్యలో వెళ్లిపోయారంటూ నాటి సంఘటనను గుర్తు చేసింది బీజేపి. అలా మధ్యలో వెళ్లిపోయి ఇందిరా గాంధీ భారత జట్టుని అవమానించారు అని విమర్శించారు. ఇలాంటి ప్రవర్తన నిజంగా క్రీడాకారుల మనోస్థైర్యాన్ని దెబ్బతియడంతో సమానం అంటూ కాంగ్రెస్‌ని దుమ్మెత్తిపోసింది. కానీ ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ క్రికెట్ ప్రపంచ వరల్డ్ కప్‌లో అలా చేయలేదని చివరి వరకు ఉండి, భారత జట్టుని కలిసి ప్రశంసించి, స్టైర్యాన్ని నింపితే ఇలానా వ్యాఖ్యానించేదని చీవాట్లు పెట్టింది. రాహుల్ లాంటి అపరిపక్వత వ్యక్తి కూడా ప్రధాని మోదీని విమర్శించడం సిగ్గు చేటు అంటూ మండిపడింది. ఇదిలా ఉండగా అస్సాం ముఖ్యమంత్రి బీజేపీ నేత హిమంత్ శర్మ టీమ్ ఇండియా ప్రపంచ కప్పు ఫైనల్లో ఓడిపోవడానికి భిన్నమైన వివరణ ఇస్తూ విమర్శలు చేశారు. ఇందిరా గాంధీ జయంతి రోజునే ఫైనల్ మ్యాచ్ జరగడంతోనే టీమ్ ఇండియా ఓడిపోయిందన్నారు. అందువల్ల దయచేసి గాంధీ కుటుంబ సభ్యల పుట్టిన రోజున టీం ఇండియా ఎట్టిపరిస్థితుల్లోనూ మ్యాచ్‌లు ఆడకూదనే విషయం అవగతమైందంటూ వ్యగ్యంగా మాట్లాడారు. ఏదీఏమైన రాహుల్ గాంధీ పనౌటీ వ్యాఖ్యలపై బీజేపీ చాలా గుర్రుగా ఉంది, ఏకంగా రాజస్తాన్ ఎనికల సంఘానికి ఫిర్యాదు కూడా చేసింది. కాగా, ఈ రోజు సాయంత్రంతో ఇరు పార్టీల ప్రచార ర్యాలీకి తెరపడనుంది. ఈ నెల 25న రాజస్తాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగునుంది. (చదవండి: ఆ రెండు భారతదేశానికి రాహు-కేతువులు! అమిత్ షా ఫైర్) -
భారత్ నుంచి ఒక్కరే... ఒలింపిక్స్‌లో రఘు ప్రసాద్! ప్రతిష్టాత్మక ఈవెంట్లో నీరజ్..
Paris Olympics 2024: వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో హాకీ ఈవెంట్లో విధులు నిర్వహించే అంపైర్ల వివరాలను అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రకటించింది. పురుషుల, మహిళల మ్యాచ్‌లకు కలిపి మొత్తం 28 మంది అంపైర్లును ఎంపిక చేశారు. భారత్ నుంచి రఘు ప్రసాద్ ఒక్కడే అంపైరింగ్ బాధ్యతలు నిర్వహించేందుకు ఎంపికయ్యాడు. 2003 నుంచి అంపైర్‌గా వ్యవహరిస్తున్న రఘు 186 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అంపైర్‌గా పని చేశాడు. 2012 లండన్, 2021 టోక్యో ఒలింపిక్స్‌లోనూ రఘు ప్రసాద్ అంపైరింగ్ బాధ్యతలు నిర్వహించాడు. నీరజ్ చోప్రా ఒక్కడే ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ మీట్ ఫైనల్స్‌లో భారత్ నుంచి జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మాత్రమే పోటీపడుతున్నాడు. అవినాశ్ సాబ్లే (3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్), మురళీ శ్రీశంకర్ (లాంగ్‌జంప్) కూడా అర్హత సాధించినా ఆసియా క్రీడల నేపథ్యంలో ఈ ఇద్దరు దూరంగా ఉన్నారు. ఈనెల 16, 17వ తేదీల్లో అమెరికాలోని యుజీన్‌లో ఈ ఫైనల్స్ జరుగుతాయి. గత ఏడాది జ్యూరిక్‌లో జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో నీరజ్ జావెలిన్ త్రో ఈవెంట్ స్వర్ణ పతకం సాధించాడు. -
మన హాకీ... మళ్లీ మొదటికి!
కొన్నేళ్ల క్రితం వరకు భారత హాకీ జట్టుకు కొత్త విదేశీ కోచ్ రావడం... కొన్నాళ్లు ఆ పదవిలో కొనసాగడం... అభిప్రాయభేదాలు రావడం... ఆ తర్వాత పదవికి రాజీనామా చేసి వెళ్లిపోవడం తరచూ జరిగేది. కానీ నాలుగేళ్ల క్రితం ఆస్ట్రేలియాకు చెందిన గ్రాహమ్ రీడ్ మాత్రం సుదీర్ఘంగానే ఈ పదవిలో కొనసాగారు. ఆయన ఆధ్వర్యంలో భారత్ చెప్పుకోదగ్గ విజయాలే అందుకుంది. కానీ తాజాగా స్వదేశంలో జరిగిన ప్రపంచకప్‌లో భారత జట్టు వైఫల్యం నేపథ్యంలో ఆయన చీఫ్ కోచ్ పదవికి రాజీనామా చేశారు. ఫలితంగా హాకీ ఇండియా (హెచ్ఐ) కొత్త కోచ్‌ను వెదికే పనిలో పడింది. ఈ ఏడాది ఆసియా క్రీడలు... వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్ ఉండటంతో హాకీ ఇండియా మళ్లీ విదేశీ కోచ్ వైపు మొగ్గు చూపుతుందా లేక స్వదేశీ కోచ్‌కు ప్రాధాన్యత ఇస్తుందా వేచి చూడాలి. న్యూఢిల్లీ: నాలుగేళ్లుగా నిలకడగా కొనసాగుతున్న భారత పురుషుల హాకీ జట్టు శిక్షణ బృందంలో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయి. స్వదేశంలో అట్టహాసంగా జరిగిన ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత హాకీ జట్టు కనీసం క్వార్టర్ ఫైనల్ చేరకపోవడం... చివరకు తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకోవడంతో హాకీ ఇండియా (హెచ్ఐ) దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాదే పారిస్ ఒలింపిక్స్ ఉండటం... ఈ సంవత్సరం ఆసియా క్రీడల టోర్నీలో విజేతగా నిలిచిన జట్టుకు నేరుగా పారిస్ ఒలింపిక్ బెర్త్ దక్కనున్న నేపథ్యంలో హెచ్ఐ ప్రస్తుతం ఉన్న శిక్షణ బృందాన్ని మార్చాలని నిశ్చయించింది.v హెచ్ఐ భవిష్యత్ ప్రణాళికల్లో తన పేరు ఉండే అవకాశం లేదని గ్రహించిన ప్రస్తుత చీఫ్ కోచ్ గ్రాహమ్ రీడ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతోపాటు ఎనలిటికల్ కోచ్ గ్రెగ్ క్లార్క్, సైంటిఫిక్ అడ్వైజర్ మిచెల్ డేవిడ్ పెంబర్టన్ కూడా తమ రాజీనామా లేఖలను హెచ్ఐ అధ్యక్షుడు దిలీప్ టిర్కీకి సమర్పించారు. ఆస్ట్రేలియాకు చెందిన 58 ఏళ్ల రీడ్ 2019 ఏప్రిల్‌లో భారత జట్టుకు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఒప్పందం ప్రకారం ఆయన 2024 జూలై–ఆగస్టులో జరిగే పారిస్ ఒలింపిక్స్ క్రీడల వరకు పదవిలో ఉండాలి. అయితే స్వదేశంలో జరిగిన ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టు కనీసం క్వార్టర్ ఫైనల్ కూడా చేరకపోవడం... స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వకపోవడం... పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలచడంలో వైఫల్యం...ఆటగాళ్ల మధ్య సమన్వయలేమి... వెరసి రీడ్ రాజీనామాకు దారి తీశాయి. భారత్ 1975 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన తర్వాత మరోసారి ఈ మెగా ఈవెంట్లో సెమీఫైనల్ దశకు చేరుకోలేకపోయింది. ఒలింపిక్ పతకం వచ్చినా... రీడ్ నాలుగేళ్ల శిక్షణ కాలంలో భారత హాకీ జట్టు చెప్పుకోదగ్గ విజయాలు సాధించింది. భారత జట్టు 41 ఏళ్ల ఒలింపిక్ పతక నిరీక్షణకు తెరదించడంలో రీడ్ సఫలమయ్యారు. ఆయన శిక్షణలోనే భారత్ 2021 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించింది. 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం గెలిచింది. 2021–2022 ప్రొ లీగ్ సీజన్లో మూడో స్థానం సంపాదించింది. 2019లో చీఫ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ఏడాదే భువనేశ్వర్‌లో జరిగిన ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో భారత్ గెలిచి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందింది. ‘చీఫ్ కోచ్ పదవి నుంచి తప్పుకొని ఆ బాధ్యతలు వేరేవారికి అప్పగించే సమయం వచ్చింది. భారత జట్టుతో, హాకీ ఇండియాతో కలిసి పనిచేసినందుకు గర్వంగా ఉంది. ఈ నాలుగేళ్ల కాలంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. భవిష్యత్‌లో భారత జట్టుకు మంచి విజయాలు లభించాలని కోరుకుంటున్నాను’ అని రీడ్ వ్యాఖ్యానించారు. రీడ్, గ్రెగ్ క్లార్క్, మిచెల్ డేవిడ్ రాజీనామాలను ఆమోదించినట్లు హాకీ ఇండియా (హెచ్ఐ) అధ్యక్షుడు దిలీప్ టిర్కీ తెలిపారు. గతంలోనూ... భారత హాకీ జట్టుకు తొలి విదేశీ కోచ్‌గా వ్యవహరించిన ఘనత జర్మనీకి చెందిన గెరార్డ్ రాచ్‌కు దక్కుతుంది. ఆయన 2004 జూలైలో టీమిండియాకు తొలి విదేశీ కోచ్ అయ్యారు. 2007 ఫిబ్రవరిలో ఆయన రాజీనామా చేసి వెళ్లిపోయారు. 2009 మేలో స్పెయిన్‌కు చెందిన జోస్ బ్రాసా కోచ్‌గా వచ్చి 2010 నవంబర్ వరకు ఆ పదవిలో కొనసాగారు. 2011 జూన్‌లో ఆస్ట్రేలియాకు చెందిన మైకేల్ నాబ్స్ ఐదేళ్ల కాలానికి భారత జట్టుకు కోచ్‌గా వచ్చారు. కానీ ఆయన రెండేళ్లు మాత్రమే ఆ పదవిలో కొనసాగి 2013 జూన్‌లో వెళ్లిపోయారు. అనంతరం ఆస్ట్రేలియాకే చెందిన టెర్రీ వాల్‡్ష 2013 అక్టోబర్ నుంచి 2014 అక్టోబర్ వరకు... నెదర్లాండ్స్‌కు చెందిన పాల్ వాన్ యాస్ 2015 జనవరి నుంచి జూన్ వరకు... నెదర్లాండ్స్‌కు చెందిన రోలంట్ ఆల్ట్‌మన్స్ 2015 జూన్ నుంచి 2017 సెప్టెంబర్ వరకు... నెదర్లాండ్స్‌కే చెందిన జోయెర్డ్ మరీన్ 2017 సెప్టెంబర్ నుంచి 2018 మే వరకు భారత జట్టుకు కోచ్‌లుగా వ్యవహరించారు. -
హాకీ ఇండియా అధ్యక్షుడిగా దిలీప్ టిర్కీ..
హాకీ ఇండియా కొత్త అధ్యక్షుడిగా భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ దిలీప్ టిర్కీ ఎన్నికయ్యారు. ఈ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ వేసిన రాకేష్ కాత్యాల్, బోలా నాథ్ తప్పుకోవడంతో ఏకగ్రీవంగా టిర్కీ గెలుపొందాడు. కాగా హాకీ ఇండియా అధ్యక్ష పదవికి ఎన్నికలు అక్టోబర్ 1వ తేదీన జరగాల్సి ఉంది. కానీ ఎంపిక ఏకగ్రీవం కావడంతో వారం రోజుల ముందే నిర్వహకులు ప్రకటించారు. అయితే జాతీయ క్రీడా నియమావళిని హాకీ ఇండియా ఉల్లంఘించిందే అని చెప్పుకోవాలి. నేషనల్ స్పోర్ట్స్ కోడ్ ప్రకారం.. ఎన్నికల తేదికు ముందు విజేతను ప్రకటించకూడదు. కాగా హాకీ ఇండియా కొత్త అధ్యక్షుడిగా తనను ఎన్నుకున్నందుకు నిర్వాహకుల కమిటీ సభ్యలకు టిర్కీ ట్విటర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. కాగా 44 ఏళ్ల టిర్కీ 1998 ఆసియా గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన భారత జట్టులో సభ్యుడు. అదే విధంగా హాకీ ఇండియా జనరల్ సెక్రటరీగా భోలా నాథ్ సింగ్, కోశాధికారిగా శేఖర్ జె. మనోహరన్ ఎంపికయ్యారు. చదవండి: Duleep Trophy 2022 Final: డబుల్ సెంచరీతో చెలరేగిన యశస్వి జైశ్వాల్.. -
Men Hockey World Cup 2023: హాకీ ప్రపంచకప్ డ్రా విడుదల
భువనేశ్వర్: వచ్చే ఏడాది భారత్‌లో నిర్వహించే పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్‌కు సంబంధించిన డ్రా గురువారం విడుదల చేశారు. భువనేశ్వర్, రూర్కెలా వేదికల్లో వచ్చే జనవరి 13 నుంచి 28వరకు ఈ మెగా ఈవెంట్ జరుగనుంది. ప్రపంచ ఐదో ర్యాంకర్, ఆతిథ్య భారత్ ‘పూల్–డి’లో ఇంగ్లండ్, స్పెయిన్, వేల్స్‌లతో తలపడనుంది. ఈ పూల్‌లో మెరుగైన ర్యాంకింగ్ జట్టు భారతే! ఇంగ్లండ్ (6), స్పెయిన్ (8), వేల్స్ (16)లు ఆతిథ్య జట్టుకు దిగువనే ఉన్నాయి. ‘పూల్–ఎ’లో ప్రపంచ నంబర్‌వన్ ఆస్ట్రేలియా, 2016 ఒలింపిక్ చాంపియన్ అర్జెంటీనా, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా ఉన్నాయి. ప్రపంచ చాంపియన్ బెల్జియం ‘పూల్–బి’లో ఉంది. ఈ పూల్‌లో జర్మనీ, కొరియా, జపాన్ మిగతా జట్లు. ‘పూల్–సి’లో గత రన్నరప్ నెదర్లాండ్స్, న్యూజిలాండ్, మలేసియా, చిలీ ఉన్నాయి. -
Varinder Singh: భారత హాకీ దిగ్గజం కన్నుమూత
ఒలంపిక్ పతక విజేత, వరల్డ్‌కప్ సాధించిన భారత హాకీ జట్టు సభ్యుడైన వారీందర్ సింగ్(75) కన్నుమూశారు. స్వస్థలం జలంధర్‌లో మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. వారీందర్ సింగ్ మరణం పట్ల హాకీ ఇండియా సంతాపం వ్యక్తం చేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించింది. ఈ సందర్భంగా వారీందర్ సింగ్ లేని లోటు పూడ్చలేనిదంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. పాకిస్తాన్‌పై విజయంలో భాగస్వామిగా.. 1947లో పంజాబ్‌లోని జలంధర్‌లో జన్మించిన వారీందర్ సింగ్ హాకీపై మక్కువ పెంచుకున్నారు. అంచెలంచెలుగా ఎదుగుతూ భారత హాకీ జట్టులో చోటు సంపాదించారు. హాకీ వరల్డ్‌కప్-1975 టోర్నీలో పాకిస్తాన్‌ను 2-1 తేడాతో ఓడించి స్వర్ణ పతకం గెలిచిన భారత జట్టులో ఆయన సభ్యుడు. అదే విధంగా... 1972 నాటి మ్యూనిచ్ ఒలంపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన భారత జట్టులో ఆయన భాగస్వామిగా ఉన్నారు. అంతేగాక 1973లో ప్రపంచకప్‌లో రజతం గెలిచిన జట్టులో సభ్యుడు. ఇక 1974, 1978 ఏసియన్ గేమ్స్‌లో రజతం గెలిచిన భారత జట్టుకు ఆయన ప్రాతినిథ్యం వహించారు. కాగా హాకీ ఆటగాడిగా క్రీడా రంగానికి చేసిన సేవకు గానూ 2007లో ప్రతిష్టాత్మక ధ్యాన్‌చంద్ జీవన సాఫల్య పురస్కారాన్ని వారీందర్ సింగ్ అందుకున్నారు. చదవండి: India T20 Captain: అలా అయితే రోహిత్ స్థానంలో ఇకపై అతడే టీ20 కెప్టెన్! In light of the tragic passing of the great Hockey player Shri Varinder Singh, we pray to the Almighty to grant the departed person's soul eternal rest and to provide the family members the fortitude to endure this irreparable loss. 🙏🏻 pic.twitter.com/s7Jb5xH0e3 — Hockey India (@TheHockeyIndia) June 28, 2022 -
బత్రాపై సీబీఐ దర్యాప్తు.. కారణమేంటి?
న్యూఢిల్లీ: హాకీ ఇండియా (హెచ్ఐ)లో నరీందర్ బత్రా నిధుల దుర్వినియోగానికి సంబంధించి కేంద్రీయ దర్యాప్తు సంస్థ (సీబీఐ) ప్రాథమిక విచారణ చేపట్టింది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ), అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) అధ్యక్షుడైన నరీందర్ బత్రా.. హెచ్‌ఐకి చెందిన రూ. 35 లక్షలను వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐకి హెచ్ఐ ఫిర్యాదు చేయడంతో ప్రాథమిక విచారణ నిమిత్తం కేసు రిజిస్టర్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల నరీందర్ బత్రాకు హాకీ ఇండియాకు మధ్య విబేధాలు పొడసూపాయి. భారత పురుషుల హాకీ జట్టు ప్రదర్శనపై పదేపదే బత్రా విమర్శించడం, ప్రశ్నించడం మింగుడుపడని హెచ్ఐ తమ నిధులు, విధుల్లో జోక్యం చేసుకుంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేసింది. 1975 ప్రపంచకప్ హాకీ విజేత జట్టు సభ్యుడైన అస్లామ్ షేర్‌ఖాన్... బత్రా మితిమీరిన జోక్యంపై ఢిల్లీ హైకోర్టులో సవాలు చేశారు. చదవండి: IPL 2022: కమిన్స్ కమాల్.. ముంబై ఢమాల్.. తిలక్ కొట్టిన సిక్సర్ మాత్రం హైలైట్! -
Anurag Thakur: ‘కామన్వెల్త్’పై హెచ్ఐ ఎలా నిర్ణయిస్తుంది?
Anurag Thakur Comments On Hockey India Decison: వచ్చే ఏడాది జరిగే కామన్వెల్త్ గేమ్స్ నుంచి భారత హాకీ జట్లు తప్పుకుంటున్నట్లు హాకీ ఇండియా (హెచ్ఐ) తీసుకున్న ఏకపక్ష నిర్ణయం చెల్లదని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. జాతీయ క్రీడా సమాఖ్యలు ఇలాంటి కీలక అంశాలపై ప్రభుత్వాన్ని లేదంటే సంబంధిత శాఖను సంప్రదించాలన్నారు. నిర్ణయాధికారాన్ని ప్రభుత్వానికే వదిలేయాలని... జట్లు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాయని, క్రీడా సమాఖ్యలకు కాదని ఠాకూర్ అన్నారు. చదవండి: CSK Vs DC: చెన్నై అడుగు టైటిల్ వైపు -
కామన్వెల్త్ క్రీడల బరి నుంచి తప్పుకున్న భారత జట్లు
న్యూఢిల్లీ: బర్మింగ్‌హామ్ వేదికగా వచ్చే ఏడాది జరగనున్న కామన్వెల్త్ క్రీడల బరి నుంచి భారత పురుషుల, మహిళల హాకీ జట్లు తప్పుకున్నాయి. ఈ మేరకు హాకీ ఇండియా అధ్యక్షుడు జ్ఞానంద్రో నింగోంబం మంగళవారం ప్రకటన విడుదల చేశారు. కామన్వెల్త్ గేమ్స్ బరి నుంచి తప్పుకున్న భారత జట్లు.. ఆసియా క్రీడలపై దృష్టిసారించనున్నాయని నింగోంబం తెలిపారు. ఆసియా క్రీడల్లో చక్కని ప్రదర్శన కనబరిస్తే 2024 పారిస్ ఒలింపిక్స్ బెర్త్ ఖరారు కానుందని, అందుకే కామన్వెల్త్ క్రీడల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కాగా, 2022 జులైలో కామన్వెల్త్ క్రీడలు, ఆగస్టులో ఆసియా క్రీడలు జరగనున్న సంగతి తెలిసిందే. చదవండి: ప్రాంక్ చేసి భార్యను బెదరగొట్టిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.. -
గంటల వ్యవధిలో ఇద్దరు ఆటగాళ్ల రిటైర్మెంట్ ప్రకటన
Olympic Bronze Medalist Rupinder Singh, Birendra Lakra Retired: టోక్యో ఒలింపిక్స్ పురుషుల హాకీలో భారత్ కాంస్య పతకం సాధించడంలో కీలకపాత్ర పోషించిన ఇద్దరు స్టార్ క్రీడాకారులు గంటల వ్యవధిలో రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించారు. తొలుత డ్రాగ్ ఫ్లికర్‌గా పేరుగాంచిన రూపిందర్ పాల్ సింగ్ అంతర్జాతీయ హాకీకి వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించగా.. గంటల వ్యవధిలో మరో స్టార్ ఆటగాడు, డిఫెండర్ బీరేంద్ర లక్రా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. రూపిందర్ గురువారం ట్విటర్ వేదికగా రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించగా.. బీరేంద్ర లక్రా వీడ్కోలు పలుకుతున్న విషయాన్ని ఇన్‌స్టా వేదికగా వెల్లడించింది. యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించేందుకే రిటైర్ అవుతున్నట్లు ఈ ఇద్దరూ ప్రకటించారు. భారత హాకీకి చేసిన సేవలకు గాను హాకీ ఇండియా వీరిద్దరిని అభినందించింది. ఇదిలా ఉంటే, దేశంలో అత్యుత్తమ డ్రాగ్ ఫ్లికర్‌గా గుర్తింపు పొందిన 30 ఏళ్ల రూపీందర్ పాల్.. భారత్ తరఫున 223 మ్యాచ్‌ల్లో 119 గోల్స్ సాధించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో జర్మనీతో జరిగిన కాంస్య పతక పోరులో అతను నాలుగు కీలక గోల్స్ సాధించి జట్టు పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక, 31ఏళ్ల బీరేంద్ర లక్రా విషయానికొస్తే.. టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన అతను.. 201 మ్యాచ్‌ల్లో 10 గోల్స్ సాధించాడు. 2014లో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత జట్టులో లక్రా కీలక సభ్యుడు. చదవండి: ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ బౌలర్ సరికొత్త రికార్డు.. -
రాజీవ్ ఖేల్‌రత్న: హాకీ గోల్‌కీపర్ శ్రీజేష్ పేరు నామినేట్
న్యూఢిల్లీ: రాజీవ్ ఖేల్‌రత్న అవార్డ్‌కు హాకీ గోల్‌కీపర్ శ్రీజేష్ పేరును నామినేట్ చేస్తున్నట్లు హాకీ ఇండియా శనివారం ప్రకటించింది. అదే విధంగా.. హాకీ మహిళా జట్టుకు ప్రాతినిథ్యం వహించిన క్రీడాకారిణి దీపిక పేరును కూడా ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ చేసింది. ధ్యాన్‌చంద్ లైఫ్‌టైం అవార్డుకు డాక్టర్ ఆర్పీ సింగ్, సంగాయి ఇబెంహాల్ పేర్లను ప్రతిపాదించింది. ద్రోణాచార్య పురస్కారానికి బీజే కరియప్ప, సీఆర్ కుమార్ పేర్లను నామినేట్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఇక అర్జున పురస్కారానికి హర్మన్‌ప్రీత్ సింగ్, వందనా కటారియాతో పాటు నవజోత్ కౌర్ పేర్లను ప్రతిపాదించింది. చదవండి: 2 డజన్లకు పైగా పతకాలు.. రోడ్డు పక్కన చిప్స్ అమ్ముతూ -
హాకీ ఇండియా అధ్యక్షుడిగా జ్ఞానేంద్రో
న్యూఢిల్లీ: హాకీ ఇండియా (హెచ్చ్ఐ) కొత్త అధ్యక్షుడిగా మణిపూర్‌కు చెందిన జ్ఞానేంద్రో నింగోంబం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన వీడియో సమావేశంలో ఆయనను ఎన్నుకుంటూ హెచ్ఐ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఈశాన్య రాష్ట్రాల నుంచి హెచ్ఐ అధ్యక్ష పదవిని చేపట్టిన తొలి వ్యక్తిగా నింగోంబం నిలిచారు. ఆయన ఈ పదవిలో రెండేళ్ల పాటు ఉండనున్నారు. ఆయన 2009–14 మధ్య మణిపూర్ హాకీ సీఈవోగా పనిచేయడం విశేషం. 2018లో అధ్యక్ష పదవిని చేపట్టిన మొహమ్మద్ ముస్తాక్ అహ్మద్ ఎన్నిక చెల్లదంటూ గతంలో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ పేర్కొంది. జాతీయ క్రీడా నియమావళి ప్రకారం ఏ వ్యక్తి కూడా వరుసగా మూడు పర్యాయాలు ఆఫీస్ బేరర్‌గా ఉండరాదు. ముస్తాక్ అహ్మద్ 2010–14 మధ్య హెచ్ఐ కోశాధికారిగా, 2014–18 మధ్య సెక్రటరీ జనరల్‌గా పనిచేశారు. 2018లో జాతీయ క్రీడా నియమావళి నిబంధనలను ఉల్లంఘిస్తూ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దాంతో ఆగ్రహించిన క్రీడా మంత్రిత్వ శాఖ... అహ్మద్‌ను వెంటనే పదవి నుంచి దిగిపోవాలని, మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో అహ్మద్‌ను సీనియర్ ఉపాధ్యక్ష పదవికి ఎన్నుకోవడం విశేషం. -
భారత హాకీలో కరోనా కలకలం
న్యూఢిల్లీ: భారత హాకీలో కరోనా కలకలం రేపుతోంది. జాతీయ స్థాయి ఆటగాళ్లు వరుసగా కరోనా బారిన పడుతూ ఉండటం ఇండియన్ హాకీలో ఆందోళన రేకెత్తిస్తోంది. తాజాగా ఆరో పాజిటివ్ నమోదు కావడంతో మరోసారి అలజడి రేగింది. హాకీ ఆటగాడు మన్దీప్ సింగ్‌కు తాజాగా కరోనా బారిన పడ్డాడు. తాజాగా జరిపిన కోవిడ్-19 టెస్టుల్లో మన్‌దీప్‌కు కరోనా సోకినట్లు నిర్దారణ అయ్యింది. తద్వారా భారత హాకీలో ఆరో పాజిటివ్ నమోదైంది. ఈ విషయాన్ని సాయ్ ఓ ప్రకటనలో తెలిపింది.ఆగస్టు 20వ తేదీ నుంచి నేషనల్ క్యాంప్ ఆరంభించడానికి సన్నాహకాలు ప్రారంభించిన తరుణంలో వరుసగా క్రీడాకారులు కరోనా బారిన పడటం గుబులు పుట్టిస్తోంది. (నర్సింగ్ వస్తున్నాడు...) దాంతో జాతీయ క్యాంపును వాయిదా వేసే పరిస్థితిపై భారత హాకీ సమాఖ్య చర్చలు జరుపుతోంది. గతవారం భారత హాకీ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్‌తో పాటు మరో నలుగురు కోవిడ్ బారిన పడ్డారు. సుదీర్ఘ విరామం తర్వాత సాయ్ సెంటర్‌కు వెళ్లిన క్రమంలో వీరికి కరోనా సోకింది. సాయ్ సెంటర్‌కు 20 మంది ఆటగాళ్లు హాజరు కాగా అందులో ఆరుగురికి కరోనా సోకడంతో కలవరం మొదలైంది. కరోనా సోకిన హాకీ ఆటగాళ్లలో మన్దీప్, మన్‌ప్రీత్ సింగ్‌లతో పాటు సురేంద్ర కుమార్, జస్కరన్ సింగ్, వరుణ్ కుమార్, కృష్ణ బహుదుర్ పాఠక్‌లు ఉన్నారు. వీరంతా ప్రస్తుతం తేలికపాటి లక్షణాలతో చికిత్స తీసుకుంటున్నట్లు సాయ్ వెల్లడించింది. -
హాకీ ఇండియా అధ్యక్షుడు ముస్తాక్ అహ్మద్ రాజీనామా
న్యూఢిల్లీ: హాకీ ఇండియా (హెచ్ఐ) అధ్యక్షుడు మొహమ్మద్ ముస్తాక్ అహ్మద్ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారమే అహ్మద్ తన రాజీనామా పత్రాన్ని హెచ్‌ఐకి అందజేయగా... శుక్రవారం సమావేశమైన హెచ్ఐ ఎగ్జిక్యూటివ్ బోర్డు దాన్ని ఆమోదించింది. అతని స్థానంలో హాకీ ఇండియా సీనియర్ ఉపాధ్యక్షుడు జ్ఞానేంద్రో నిగోంబమ్ (మణిపూర్)ను నియమించినట్లు బోర్డు ప్రకటించింది. అయితే జాతీయ క్రీడా నిబంధనలకు వ్యతిరేకంగా 2018లో అహ్మద్ ఎన్నిక జరిగిందని పేర్కొన్న భారత క్రీడా మంత్రిత్వ శాఖ అతన్ని అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలని గతంలోనే పేర్కొంది. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి వరుసగా రెండు పర్యాయాలు మాత్రమే ఆఫీస్ బేరర్‌గా వ్యవహరించేందుకు అవకాశముంది. ముస్తాక్ అహ్మద్ 2010–2014 వరకు హాకీ ఇండియా కోశాధికారిగా, 2014–2018 వరకు కార్యదర్శిగా పనిచేశారు. అనంతరం 2018–2022 కాలానికిగానూ అధ్యక్షునిగా నియమితులయ్యారు. ప్రస్తుతం వ్యక్తిగత కారణాలను చెబుతున్నప్పటికీ క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన ఒత్తిడి మేరకే ఆయన రాజీనామా చేసినట్లు సమాచారం. -
ఎట్టకేలకు హాకీ క్రీడాకారులు ఇంటికి
న్యూఢిల్లీ: మూడు నెలలుగా ఇంటి మొహమే చూడని భారత మహిళల, పురుషుల హాకీ జట్లకు ఎట్టకేలకు ఊరట లభించింది. హాకీ ఇండియా (హెచ్ఐ) ఇరు జట్ల క్రీడాకారులకు నెల రోజుల పాటు ‘హోమ్ సిక్’ సెలవులు మంజూరు చేసింది. దీంతో శుక్రవారం వారంతా స్వస్థలాలకు పయనమయ్యారు. భారత పురుషుల, మహిళల హాకీ జట్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించాయి. దీంతో వీరికి బెంగళూరులోని స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కేంద్రంలో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసింది. అయితే కరోనా మహమ్మారి వల్ల మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ మొదలైంది. వైరస్ ఉధృతి కొనసాగడంతో టోక్యో ఈవెంట్ కూడా వచ్చే ఏడాదికి వాయిదా పడింది. అయినప్పటికీ లాక్డౌన్ వల్ల ఆటగాళ్లంతా బెంగళూరులోనే చిక్కుకుపోయారు. గతనెల చివరి వారం నుంచి సడలింపులు ఇవ్వడంతో ఇక ఇంటికి వెళ్లే వెసులుబాటు దక్కింది. దీంతో హెచ్ఐ ఇరు జట్ల చీఫ్ కోచ్‌లను సంప్రదించి నెలపాటు శిక్షణకు విరామం ఇస్తేనే మళ్లీ నూతనోత్సాహంతో బరిలోకి దిగుతారని భావించి సెలవులు మంజూరు చేసింది. -
‘పద్మశ్రీ’కి విజయన్ పేరు సిఫారసు
న్యూఢిల్లీ: అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ఫుట్‌బాల్ దిగ్గజం, మాజీ కెప్టెన్ ఐఎమ్ విజయన్ను ‘పద్మశ్రీ’ పురస్కారానికి సిఫారసు చేసింది. కేరళకు చెందిన మాజీ స్ట్రయికర్ 90వ దశకంలో భారత్ తరఫున విశేషంగా రాణించాడు. 79 అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన విజయన్ 40 గోల్స్ చేశాడు. 1993, 1997, 1999లలో ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’గా నిలిచాడు. 2000 నుంచి 2003 వరకు జట్టు సారథిగా వ్యవహరించాడు. 2003లో ఆయనకు అర్జున అవార్డు లభించింది. అత్యున్నత నాలుగో పురస్కారమైన ‘పద్మశ్రీ’కి విజయన్ పేరును పరిశీలించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ప్రతిపాదించామని ఏఐఎఫ్ఎఫ్ కార్యదర్శి కుశాల్ దాస్ తెలిపారు. పౌర పురస్కారానికి తనను సిఫార్సు చేయడం పట్ల విజయన్ సంతోషం వ్యక్తం చేశాడు. మరో వైపు భారత పురుషుల హాకీ జట్టు మాజీ సహాయ కోచ్ రమేశ్ పరమేశ్వరన్ ద్రోణాచార్య అవార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది హాకీ ఇండియా (హెచ్ఐ) కరియప్ప, రమేశ్ పఠానియాలను ఆ అవార్డు కోసం నామినేట్ చేయగా... పరమేశ్వరన్ సొంతంగా హాకీ కర్ణాటక అండతో దరఖాస్తు చేసుకున్నారు. -
13న హాకీ ఇండియా ప్రత్యేక సమావేశం
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ వాయిదా పడటంతో హాకీ జట్ల సన్నాహకాలపై చర్చించేందుకు హాకీ ఇండియా (హెచ్ఐ) ఈ నెల 13న వీడియో సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశంలో భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్ బాత్రా, హెచ్ఐ అధికారులు పాల్గొంటారు. ఇందులో భారత పురుషుల, మహిళల జట్లకు ఏర్పాటు చేసే శిబిరాలు, సన్నాహాకాలపై ప్రధానంగా చర్చించే అవకాశముంది. దీంతో పాటు దేశవాళీ హాకీ లీగ్‌లపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఈ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనుంది. -
అదనంగా మరో రూ. 75 లక్షలు... కేంద్రానికి హాకీ ఇండియా విరాళం
హాకీ ఇండియా (హెచ్ఐ) మరోసారి తన పెద్ద మనసు చాటుకుంది. కరోనా కట్టడి కోసం ఇప్పటికే కేంద్రానికి రూ. 25 లక్షల విరాళం ప్రకటించిన హెచ్ఐ శనివారం అదనంగా మరో రూ. 75 లక్షలు పీఎం–కేర్స్ సహాయనిధికి ప్రకటించింది. దీంతో హెచ్ఐ మొత్తం కోటి రూపాయల విరాళమిచ్చినట్లయింది. ప్రస్తుత పరిస్థితులరీత్యా ప్రభుత్వానికి మరింత అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు హెచ్ఐ తెలిపింది. ‘దేశంలో సంక్షోభం ముదురుతోన్న ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ చేదోడుగా నిలవాలి. కరోనాను అరికట్టేందుకు కేంద్రం నిర్విరామంగా కృషి చేస్తోంది. ఇన్నాళ్లుగా దేశ ప్రజల నుంచి హాకీ అమితమైన ప్రేమ, ఆదరణను పొందింది. ఇది దేశానికి తిరిగి ఇవ్వాల్సిన సమయం’ అని హాకీ ఇండియా అధ్యక్షుడు ముస్తాక్ అహ్మద్ పేర్కొన్నారు. -
హాకీ ఇండియా, ఏఐఎఫ్ఎఫ్ విరాళం రూ. 25 లక్షలు
న్యూఢిల్లీ: కరోనాపై పోరు కోసం చేతులు కలిపే వారి జాబితా తాజాగా హాకీ ఇండియా (హెచ్ఐ), అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) చేరాయి. పీఎం కేర్స్ సహాయ నిధి కోసం హెచ్ఐ, ఏఐఎఫ్ఎఫ్ చెరో రూ. 25 లక్షలు బుధవారం విరాళంగా ప్రకటించాయి. గంగూలీ ఉదారత కరోనా కారణంగా ఆహారం లేక ఇబ్బంది పడే వారిని ఆదుకునేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ముందుకొచ్చాడు. అతను బుధవారం రామకృష్ణ మిషన్ హెడ్‌కార్టర్స్ అయిన బేలూరు మఠానికి 2,000 కేజీల బియ్యాన్ని అందజేశాడు. ‘25 ఏళ్ల తర్వాత బేలూరు మఠాన్ని సందర్శించాను. అన్నార్థుల కోసం 2,000 కేజీల బియ్యాన్ని అప్పగించాను’ అని దాదా ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. -
ఎఫ్ఐహెచ్ ఫైనల్స్‌కు రజని
న్యూఢిల్లీ: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ఆధ్వర్యంలో జరగనున్న మహిళల సిరీస్ ఫైనల్స్ టోర్నీకి ఆంధ్రప్రదేశ్ అమ్మా యి, గోల్‌కీపర్ ఎతిమరపు రజని ఎంపికైంది. రాణి రాంపాల్ నేతృత్వంలోని భారత జట్టును హాకీ ఇండియా (హెచ్ఐ) బుధవారం ప్రకటించింది. జపాన్‌లోని హిరోషిమాలో వచ్చే నెల 15 నుంచి జరుగుతుంది.