‘అర్జున’కు రీతూ రాణి, రఘునాథ్ పేర్లు ప్రతిపాదన | 'Arjuna' Ritu Rani, Raghunath names of the proposal | Sakshi
Sakshi News home page

‘అర్జున’కు రీతూ రాణి, రఘునాథ్ పేర్లు ప్రతిపాదన

Published Thu, May 12 2016 1:14 AM | Last Updated on Sun, Sep 3 2017 11:53 PM

‘అర్జున’కు రీతూ రాణి, రఘునాథ్ పేర్లు ప్రతిపాదన

‘అర్జున’కు రీతూ రాణి, రఘునాథ్ పేర్లు ప్రతిపాదన

న్యూఢిల్లీ: భారత మహిళల జట్టు కెప్టెన్ రీతూ రాణి... భారత పురుషుల జట్టు కీలక ఆటగాళ్లు రఘునాథ్, ధరమ్‌వీర్ సింగ్ పేర్లను అర్జున అవార్డు కోసం ప్రతిపాదన చేశామని హాకీ ఇండియా (హెచ్‌ఐ) తెలిపింది. మరోవైపు 1980 మాస్కో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత జట్టు సభ్యుడు సిల్వానస్ డుంగ్ డుంగ్ పేరును ధ్యాన్‌చంద్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారానికి...

వెటరన్ కోచ్ సీఆర్ కుమార్ పేరును ద్రోణాచార్య అవార్డు కోసం సిఫారసు చేశారు. హరియాణాకు చెందిన 25 ఏళ్ల రీతూ రాణి భారత్ తరఫున 223 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించింది. కర్ణాటక ప్లేయర్ రఘునాథ్ 203 మ్యాచ్‌లు ఆడి 127 గోల్స్ చేయగా... పంజాబ్‌కు చెందిన ధరమ్‌వీర్ 126 మ్యాచ్‌ల్లో పాల్గొని 31 గోల్స్ సాధించాడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement