భారత హాకీ లెజెండ్ పీఆర్ శ్రీజేష్ తన 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు విడ్కోలు పలికేందుకు సిద్దమయ్యాడు. ప్యారిస్ ఒలింపిక్స్-2024 తర్వాత శ్రీజేష్ అంతర్జాతీయ హాకీకి రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. ఈ విషయాన్ని అతడు సోమవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఎక్స్(ట్విటర్)లో భావోద్వేగ నోట్ షేర్ చేశాడు.
"ప్యారిస్‌లో జరిగే ఒలింపిక్స్ అనంతరం నా కెరీర్‌కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాడు. భారత జెర్సీని ధరించడం ఇదే చివరి సారి. ఈ సారి ఒలింపిక్స్ కోసం ఎంతో ఆతృగా ఎదురుచూస్తున్నాను. నా ఈ 18 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి.
ఇన్నాళ్లు నాకు మద్దతుగా నిలిచిన హాకీ ఇండియా, నా కుటుంబం, సహచరులు, కోచ్‌లు, అభిమానులందరికి ధన్యవాదాలు. వారి ప్రేమాభిమానాలకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనని. నాపై ఇప్పటికి నమ్మకం ఉంచినందుకు హాకీ ఇండియాకు స్పెషల్ థాంక్స్ చెప్పాలనకుంటున్నాను.
నా సహచరలు సైతం కఠినమైన సమయాల్లో నా పక్కనే ఉన్నారు. ఎన్నో టోర్నీల్లో మేమందరం కలిసి విజయం సాధించాము. ఇప్పుడు మరోసారి ప్యారిస్‌లోనూ మన జెండా ఎగరవేద్దాం" అని ఎక్స్‌లో శ్రీజేష్ పేర్కొన్నాడు.
2006లో సౌత్ ఆసియన్ గేమ్స్‌తో అరంగేట్రం చేసిన శ్రీజేష్.. ఎన్నో ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు. కెప్టెన్‌గా, గోల్‌కీపర్‌గా భారత్‌కు చిరస్మరణీయ విజయాలను అందించాడు. రియో ఒలింపిక్స్‌లో భారత జట్టుకు శ్రీజేష్ సారథ్యం వహించాడు.
2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత హారీ జట్టులో శ్రీజేష్ సభ్యునిగా ఉన్నాడు. ఇది శ్రేజేష్‌కు నాలుగో ఒలింపిక్స్ కావడం గమనార్హం. అతడి కెరీర్‌లో రెండు ఆసియా గేమ్స్ బంగారు పతకాలు, రెండు ఆసియా కప్ టైటిల్స్, నాలుగు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్స్ కూడా ఉన్నాయి. 2021లో శ్రేజేష్ 2021లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును అందుకున్నాడు.
Once a Champion, Always a Champion 💪🏻#WinItForSreejesh https://t.co/LdR0SP3NMW
— Hockey India (@TheHockeyIndia) July 22, 2024
Comments
Please login to add a commentAdd a comment