PR sreejesh
-
ప్రతిష్టాత్మక అవార్డుల రేసులో భారత హాకీ స్టార్లు
భారత దిగ్గజం, మాజీ గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) స్టార్స్ అవార్డుల రేసులో నిలిచారు. ఎఫ్ఐహెచ్ విడుదల చేసిన తుది జాబితాలో భారత పురుషుల జట్టు నుంచి వీరిద్దరిరు మాత్రమే నామినేట్ అయ్యారు. ఇక మహిళల జట్టులో ఏ ఒక్కరు రేసులో నిలువలేకపోయారు. ఎవరు ఏ కేటగిరీలో అంటే?కాగా.. ఇటీవల ప్యారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో భారత జట్టు కాంస్యం గెలవడంలో కెప్టెన్ హర్మన్‌తో పాటు గోల్‌కీపర్ శ్రీజేశ్లు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ కేటగిరీలో హర్మన్‌ప్రీత్‌తో పాటు బ్రింక్‌మన్, జోప్ డి మోల్ (నెదర్లాండ్స్), ముల్లర్ (జర్మనీ), వాలెస్ (ఇంగ్లండ్) నామినేట్య్యాడు.ఇక.. ‘బెస్ట్ గోల్‌కీపర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు కోసం పీఆర్ శ్రీజేశ్, పిర్మన్ బ్లాక్ (నెదర్లాండ్స్), కాల్జడో (స్పెయిన్), డేన్బర్గ్ (జర్మనీ), శాంటియగో (అర్జెంటీనా) పోటీపడుతున్నారు. ఎఫ్ఐహెచ్ నియమించిన నిపుణుల ప్యానెల్ వీరిని తుది జాబితాకు ఎంపిక చేసింది. ఈ ప్యానెల్లో పలువురు ప్లేయర్లు, కోచ్‌లు, వివిధ దేశాలకు చెందిన సమాఖ్యల్లోని సీనియర్ అధికారులు సభ్యులుగా ఉన్నారు. విజేతల్ని ఎంపిక చేస్తారిలా!ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఎఫ్ఐహెచ్ హాకీ ప్రొ లీగ్, నేషన్స్ కప్ హాకీ, ఒలింపిక్ క్వాలిఫయర్స్, ఒలింపిక్స్‌లలో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా నిపుణుల ప్యానెల్... ఆటగాళ్లను అవార్డుల కోసం నామినేట్ చేసింది. ఇక వచ్చే నెల 11 వరకు జరిగే ఓటింగ్‌లో పోల్ అయిన ఓట్ల శాతంతో విజేతల్ని ప్రకటిస్తారు. కాగా ప్యారిస్‌లో భారత్ కాంస్యం గెలిచిన తర్వాత శ్రీజేశ్ తన అంతర్జాతీయ కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. హర్మన్‌ప్రీత్ తాజాగా ఆసియా చాంపియన్స్‌లో భారత్‌కు టైటిల్ అందించిన జోష్‌లో ఉన్నాడు.చదవండి: అజేయంగా ‘ఆసియా’ విజేతగా -
హాకీ లెజెండ్ శ్రీజేశ్కు ప్రధాని మోదీ లేఖ..
న్యూఢిల్లీ: భారత హాకీ దిగ్గజం, మాజీ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేఖ రాశారు. అతని కెరీర్ సాఫల్యతలో ఎదురైన ఆటుపోట్లు... పడిన కష్టం... చిందించిన చెమటను కీర్తిస్తూ ఆ లేఖలో ప్రధాని ప్రశంసల వర్షం కురిపించారు. త్వరలో భారత జూనియర్ జట్టుకు కోచ్‌గా సరికొత్త ఇన్నింగ్స్ మొదలు పెట్టనున్న శ్రీజేశ్కు శుభాకాంక్షలు కూడా తెలిపారు. గోల్‌కీపర్‌గా విజయవంతమైనట్లే... కోచ్‌గానూ జూనియర్లను తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. ‘ఆటలో నీ అంకితభావం, నిబద్ధత నాకు తెలుసు. ఇకపై కోచ్‌గానూ ఇదే పంథా కొనసాగిస్తావని ఆశిస్తున్నా. కోచ్ పాత్రలో జూనియర్ జట్టును ప్రభావంతంగా, స్ఫూర్తిదాయకంగా మలుస్తావని విశ్వసిస్తున్నాను.సుదీర్ఘకాలం పాటు భారత హాకీకి సేవలందించిన నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’నని మోదీ తన లేఖలో పేర్కొన్నారు. కేవలం పతకాలు, ఘన విజయాలే కాదు... లెక్కలేనన్ని స్మృతులెన్నో అతని కెరీర్లో ఉన్నాయని ప్రధాని కొనియాడారు. అతనేంటో అతన్ని వరించిన అవార్డులు, పతకాలే తెలియజేస్తాయని ప్రశంసించారు. ప్రధాని లేఖ తన గుండెని తాకిందని శ్రీజేశ్ బదులిచ్చాడు. ‘హాకీనే నా జీవితం. అందుకే ఆట కోసమే ఇన్నాళ్లు శ్రమించాను. ఇకపై కూడా శ్రమిస్తాను. ప్రపంచ హాకీలో భారత్ బలీయమైన శక్తిగా అవతరించేందుకు నా వంతు కృషి చేస్తాను’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు కాంస్యం గెలుపొందడంలో కృషి చేసిన శ్రీజేశ్ తన కెరీర్‌కు పతకంతో గుడ్‌బై చెప్పాడు. గోల్‌పోస్ట్ ముందు పెట్టని గోడలా నిలబడే శ్రీజేశ్ 15 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో రెండు ఆసియా క్రీడల స్వర్ణాలతో పాటు చాంపియన్స్ ట్రోఫీ రజత పతకాలు కూడా ఉన్నాయి. -
శ్రీజేష్‌కు రూ.2 కోట్ల భారీ నజరానా.. ప్రకటించిన కేరళ సర్కార్
భారత స్టార్ హాకీ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ తన 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌ను ఘనంగా ముగించిన సంగతి తెలిసిందే. ప్యారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన తర్వాత శ్రీజేష్ అంతర్జాతీయ హాకీకీ విడ్కోలు పలికాడు.ఈ నేపథ్యంలో శ్రీజేష్‌కు కేరళ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. అతడికి రూ.2 కోట్ల నగదు బహుమతి ఇవ్వునున్నట్లు కేరళ సర్కార్ వెల్లడించింది. బుధవారం ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.‘భారత హాకీ జట్టులో సభ్యుడు, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన శ్రీజేశ్కు రెండు కోట్ల రూపాయలు బహుమతిగా అందిస్తున్నాం’ అని సీఎంఓ ప్రకటనలో పేర్కొంది. ప్యారిస్‌లో భారత హాకీ జట్టు కాంస్య పతకం సాధించడంలో శ్రీజేష్‌ది కీలక పాత్ర. ముఖ్యంగా బ్రిటన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీజేష్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కోట గోడలా నిలిచిన శ్రీజేష్ బ్రిటన్‌కు ఎక్స్ట్రా గోల్ చేసే ఛాన్స్ ఇవ్వలేదు. కాగా తన 18 ఏళ్ల కెరీర్లో శ్రీజేష్ భారత్ తరఫున 336 మ్యాచ్‌లు ఆడాడు. -
భారత జూనియర్ హాకీ జట్టు కోచ్‌గా శ్రీజేశ్!
పారిస్ ఒలింపిక్స్‌లో అద్భుతమైన ప్రదర్శనతో వరుసగా రెండో కాంస్య పతకం సాధించిన అనంతరం కెరీర్‌కు వీడ్కోలు పలికిన భారత హాకీ జట్టు గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్ త్వరలోనే కొత్త అవతారంలో దర్శనమివ్వనున్నాడు. గోల్ పోస్ట్ ముందు తన అసమాన ప్రతిభతో దేశానికి ఎన్నో మధుర విజయాలు అందించిన శ్రీజేశ్.. ఇకపై జాతీయ జూనియర్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ‘త్వరలోనే శ్రీజేశ్‌ను జూనియర్ (అండర్–21) జట్టు కోచ్‌గా నియమిస్తాం. దీని గురించి అతడితో మాట్లాడాం. యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేయడంలో అతడికి మించిన వారు మరొకరు లేరు. దీంతో పాటు శ్రీజేశ్ స్థానాన్ని భర్తీ చేయనున్న గోల్ కీపర్లు సూరజ్ కార్కెరా, క్రిషన్ బహదూర్ పాఠక్‌కు కూడా దిశా నిర్దేశం చేయాల్సి ఉంటుంది’ అని హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ పేర్కొన్నాడు. -
నీరజ్ చోప్రా మంచి మనసు.. శ్రీజేశ్కు అరుదైన గౌరవం
భారత హాకీ జట్టు గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్కు అరుదైన గౌరవం దక్కింది. ప్యారిస్ ఒలింపిక్స్-2024 ముగింపు వేడుకల్లో భారత బృంద పతకధారిగా అతడు వ్యవహరించనున్నాడు. కాంస్య పతకాల విజేత, షూటర్ మనూ భాకర్‌తో కలిసి ఫ్లాగ్‌బేరర్ హోదాలో ముందుండి నడవనున్నాడు.భారత ఒలింపిక్ సంఘం ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. రెండు దశాబ్దాలుగా భారత హాకీకి వెన్నెముకగా ఉన్న శ్రీజేశ్ ఈ గౌరవానికి అర్హుడని పేర్కొంది. ఈ విషయం గురించి జావెలిన్ త్రోయర్, రజత పతక విజేత నీరజ్ చోప్రాతో చర్చించామని.. అందుకు అతడు సంతోషంగా ఒప్పుకొన్నాడని తెలిపింది. ఈ క్రమంలో శ్రీజేశ్ పేరును ఫ్లాగ్‌బేరర్‌గా ఎంపిక చేసినట్లు పేర్కొంది.పతకాల ఖాతా తెరిచిన మనూ భాకర్కాగా షూటర్ మనూ భాకర్ ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత పతకాల ఖాతా తెరిచిన విషయం తెలిసిందే. తొలుత మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్యం గెలిచిన ఈ హర్యానా షూటర్.. సరబ్జోత్ సింగ్‌తో కలిసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మరో కాంస్యం కైవసం చేసుకుంది. తద్వారా ఒలింపిక్స్ ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలు గెలిచిన తొలి భారత ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది.ఈ క్రమంలో ఆమెను ఫ్లాగ్‌బేరర్‌గా ప్రకటించింది భారత ఒలింపిక్ సంఘం. మరోవైపు.. టోక్యోలో స్వర్ణం గెలిచిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. ప్యారిస్‌లో రజతంతో సరిపెట్టుకున్నాడు. అయినప్పటికీ.. వరుస ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో రెండు పతకాలు గెలిచిన నాలుగో భారత ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. ఈ నేపథ్యంలో మనూతో పాటు ఫ్లాగ్‌బేరర్‌గా ఈ హర్యానా ఆటగాడు ఉంటాడని అంతా భావించారు.అయితే, వరుసగా భారత హాకీ జట్టు రెండోసారి కాంస్యం గెలవడంలో కీలక పాత్ర పోషించిన గోల్ కీపర్ శ్రీజేశ్ వైపు ఒలింపిక్ సంఘం మొగ్గుచూపింది. ప్యారిస్‌లో రిటైర్మెంట్ ప్రకటించిన ఈ కేరళ క్రీడాకారుడు.. భారత క్రీడా రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా సముచిత గౌరవం ఇవ్వాలని భావించింది.శ్రీజేశ్ పట్ల నీరజ్‌కు ఉన్న గౌరవానికి నిదర్శనంఈ విషయం గురించి భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష మాట్లాడుతూ.. ‘‘ముగింపు వేడుకల్లో శ్రీజేశ్‌ను ఫ్లాగ్‌బేరర్‌గా నియమించాలనుకుంటున్నామని నీరజ్ చోప్రాతో చెప్పాను. అందుకు బదులిస్తూ.. ‘మేడమ్.. ఒకవేళ పతకధారిగా ఎవరు సరైనవ్యక్తి అని మీరు గనుక నన్ను అడిగితే.. నేను కూడా కచ్చితగా శ్రీ భాయ్ పేరునే చెపుతా’ అన్నాడు.శ్రీజేశ్ పట్ల నీరజ్‌కు ఉన్న గౌరవానికి ఇది నిదర్శనం. క్రీడా స్ఫూర్తితో తను ఇందుకు అంగీకరించాడు’’ అని హర్షం వ్యక్తం చేశారు. కాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత్‌కు నాలుగు కాంస్యాలు(షూటింగ్లో మూడు, హాకీ 1), ఒక రజత పతకం(పురుషుల జావెలిన్ త్రో) దక్కింది. ఇక ఆగష్టు 11న ఒలింపిక్స్ ముగింపు వేడుకలు జరుగనున్నాయి. ఇక ఆరంభ వేడుకల్లో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, టేబుల్ టెన్నిస్ వెటరన్ ప్లేయర్ శరత్ కమల్ భారత బృంద పతకధారులుగా వ్యవహరించిన విషయం తెలిసిందే.చదవండి: అర్షద్ కూడా మా బిడ్డ లాంటివాడే: నీరజ్ చోప్రా తల్లిదండ్రులు -
కాంస్య పతకంతో వీడ్కోలు పలికిన భారత హాకీ లెజెండ్...
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత హాకీ జట్టు అద్భుతం చేసింది. ఈ విశ్వ క్రీడల్లో వరుసగా రెండోసారి కాంస్య పతకాన్ని భారత హాకీ జట్టు సొంతం చేసుకుంది. సెమీస్‌లో జర్మనీ చేతిలో పోరాడి ఓడిన టీమిండియా.. స్పెయిన్‌తో కాంస్య పతక పోరులో మాత్రం సత్తాచాటింది. 2-1 తేడాతో స్పెయిన్ ఓడించిన భారత జట్టు కాంస్య పతకాన్ని ముద్దాడింది. ఇక ఈ చిరస్మరణీయ విజయంతో భారత స్టార్ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్ తన 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు విడ్కోలు పలికాడు. కాగా తన రిటైర్మెంట్ విషయాన్ని ఒలింపిక్స్ ఆరంభానికి ముందే శ్రీజేశ్ ప్రకటించాడు.ఈ క్రమంలో తన కెరీర్లో చివరి మ్యాచ్ ఆడిన పీఆర్ శ్రీజేష్‌కు సహచర ఆటగాళ్లు ఘన వీడ్కోలు పలికారు. ఆటగాళ్లంతా శ్రీజేష్‌కు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. తమ భుజాలపై ఎత్తుకొని గోల్ పోస్ట్ పోల్‌పై కూర్చోబెట్టారు. తమ హాకీ స్టిక్స్‌తో జేజేలు కొట్టారు. కాగా భారత్ కాంస్య పతకం సాధించడంలో శ్రీజేష్‌ది కీలక పాత్ర. ముఖ్యంగా బ్రిటన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీజేష్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కోట గోడలా నిలిచిన శ్రీజేష్ బ్రిటన్‌కు ఎక్స్ట్రా గోల్ చేసే ఛాన్స్ ఇవ్వలేదు.ఇక 2006లో సౌత్ ఆసియన్ గేమ్స్‌తో అరంగేట్రం చేసిన శ్రీజేష్.. ఎన్నో ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు. కెప్టెన్‌గా, గోల్‌కీపర్‌గా భారత్‌కు చిరస్మరణీయ విజయాలను అందించాడు. రియో ఒలింపిక్స్‌లో భారత జట్టుకు శ్రీజేష్ సారథ్యం వహించాడు.2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత హారీ జట్టులో శ్రీజేష్ సభ్యునిగా ఉన్నాడు. ఇది శ్రేజేష్కు నాలుగో ఒలింపిక్స్ కావడం గమనార్హం. అతడి కెరీర్లో రెండు ఆసియా గేమ్స్ బంగారు పతకాలు, రెండు ఆసియా కప్ టైటిల్స్, నాలుగు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్స్ కూడా ఉన్నాయి. 2021లో శ్రేజేష్ 2021లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును అందుకున్నాడు."నా ఆటను ముగించేందుకు ఇంతకంటే సరైన సమయం ఉండదు. మేం పతకంతో తిరిగి వెళుతున్నాం. కొందరు అభిమానులు నన్ను కొనసాగించమని కోరుతున్నారు. కానీ నా నిర్ణయంలో మార్పు లేదు. కొన్ని నిర్ణయాలు కఠినమైనవే అయినా వాటిని సరైన సమయంలో తీసుకోవడమే బాగుంటుంది. మా జట్టు సభ్యులంతా చాలా బాగా ఆడారు. టోక్యోలో గెలిచిన కాంస్యానికి నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే ఒలింపిక్స్‌లో మేం పతకం గెలవగలమనే నమ్మకాన్ని అది కల్పించిందని" తన రిటైర్మెంట్ ప్రకటనలో శ్రీజేష్ పేర్కొన్నాడు. -
రిటైర్మెంట్ ప్రకటించిన భారత హాకీ లెజెండ్..
భారత హాకీ లెజెండ్ పీఆర్ శ్రీజేష్ తన 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు విడ్కోలు పలికేందుకు సిద్దమయ్యాడు. ప్యారిస్ ఒలింపిక్స్-2024 తర్వాత శ్రీజేష్ అంతర్జాతీయ హాకీకి రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. ఈ విషయాన్ని అతడు సోమవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఎక్స్(ట్విటర్)లో భావోద్వేగ నోట్ షేర్ చేశాడు. "ప్యారిస్‌లో జరిగే ఒలింపిక్స్ అనంతరం నా కెరీర్‌కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాడు. భారత జెర్సీని ధరించడం ఇదే చివరి సారి. ఈ సారి ఒలింపిక్స్ కోసం ఎంతో ఆతృగా ఎదురుచూస్తున్నాను. నా ఈ 18 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఇన్నాళ్లు నాకు మద్దతుగా నిలిచిన హాకీ ఇండియా, నా కుటుంబం, సహచరులు, కోచ్‌లు, అభిమానులందరికి ధన్యవాదాలు. వారి ప్రేమాభిమానాలకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనని. నాపై ఇప్పటికి నమ్మకం ఉంచినందుకు హాకీ ఇండియాకు స్పెషల్ థాంక్స్ చెప్పాలనకుంటున్నాను.నా సహచరలు సైతం కఠినమైన సమయాల్లో నా పక్కనే ఉన్నారు. ఎన్నో టోర్నీల్లో మేమందరం కలిసి విజయం సాధించాము. ఇప్పుడు మరోసారి ప్యారిస్‌లోనూ మన జెండా ఎగరవేద్దాం" అని ఎక్స్‌లో శ్రీజేష్ పేర్కొన్నాడు. 2006లో సౌత్ ఆసియన్ గేమ్స్‌తో అరంగేట్రం చేసిన శ్రీజేష్.. ఎన్నో ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు. కెప్టెన్‌గా, గోల్‌కీపర్‌గా భారత్‌కు చిరస్మరణీయ విజయాలను అందించాడు. రియో ఒలింపిక్స్‌లో భారత జట్టుకు శ్రీజేష్ సారథ్యం వహించాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత హారీ జట్టులో శ్రీజేష్ సభ్యునిగా ఉన్నాడు. ఇది శ్రేజేష్కు నాలుగో ఒలింపిక్స్ కావడం గమనార్హం. అతడి కెరీర్లో రెండు ఆసియా గేమ్స్ బంగారు పతకాలు, రెండు ఆసియా కప్ టైటిల్స్, నాలుగు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్స్ కూడా ఉన్నాయి. 2021లో శ్రేజేష్ 2021లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును అందుకున్నాడు. Once a Champion, Always a Champion 💪🏻#WinItForSreejesh https://t.co/LdR0SP3NMW— Hockey India (@TheHockeyIndia) July 22, 2024 -
Paris Olympics: భారత పురుషుల హాకీ జట్టు ప్రకటన
పారిస్ ఒలింపిక్స్-2024లో పాల్గొనబోయే భారత పురుషుల హాకీ జట్టును బుధవారం ప్రకటించారు. విశ్వ క్రీడల్లో ఆడబోయే 16 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను వెల్లడించారు.కెప్టెన్‌గా అతడేడ్రాగ్ ఫ్లికర్ హర్మన్‌ప్రీత్ సింగ్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. మిడ్ ఫీల్డర్ హార్దిక్ సింగ్‌ను అతడికి డిప్యూటీగా ఎంపిక చేశారు. ఇక ఈ జట్టులో ఐదుగురు కొత్త ఆటగాళ్లకు తొలిసారిగా చోటు దక్కింది. కాగా 2016లో మొదటిసారిగా ఒలింపిక్స్(రియో) జట్టులో చోటు దక్కించుకున్న హర్మన్‌ప్రీత్ సింగ్.. 2020 టోక్యో క్రీడల జట్టులోనూ భాగమయ్యాడు. అదే విధంగా.. వెటరన్ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్, మాజీ కెప్టెన్, మిడ్ ఫీల్డర్ మన్‌ప్రీత్ సింగ్‌కు ఇవి నాలుగో ఒలింపిక్స్. భారత హాకీ జట్టు డిఫెన్స్ విభాగం హర్మన్‌ప్రీత్ సింగ్, జర్మన్‌ప్రీత్ సింగ్, అమిత్ రోహిదాస్, సుమిత్, సంజయ్‌లతో పటిష్టంగా ఉంది. ఇక మిడ్ ఫీల్డర్లుగా రాజ్ కుమార్ పాల్, షంషేర్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్ సత్తా చాటుతున్నారు.అదే విధంగా ఫార్వర్డ్ లైన్లో అభిషేక్ , సుఖ్జీత్ సింగ్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, మన్దీప్ సింగ్, గుజ్రాంత్ సింగ్ తదితరులు ఉండనే ఉన్నారు.ఇక వీరితో పాటు అదనపు ఆటగాళ్లుగా గోల్‌కీపర్ క్రిషన్ బహదూర్ పాఠక్, మిడ్ ఫీల్డర్ నీలకంఠ శర్మ, డిఫెండర్ జుగ్రాజ్ సింగ్ అందుబాటులో ఉండనున్నారు. కాగా తమ జట్టు అనుభవజ్ఞులైన, యువ ప్రతిభావంతులైన ఆటగాళ్లతో సమతూకంగా ఉందని చీఫ్ కోచ్ క్రెయిగ్ ఫాల్టన్ పేర్కొన్నాడు. ఇక జూలై 29 నుంచి ఒలింపిక్ క్రీడలు ఆరంభం కానున్నాయి.పారిస్ ఒలింపిక్స్‌కు భారత పురుషుల హాకీ జట్టుగోల్ కీపర్: శ్రీజేష్ పరాట్టు రవీంద్రన్డిఫెండర్లు: జర్మన్‌ప్రీత్ సింగ్, అమిత్ రోహిదాస్, హర్మన్‌ప్రీత్ సింగ్(కెప్టెన్), సుమిత్, సంజయ్మిడ్ ఫీల్డర్లు: రాజ్ కుమార్ పాల్, షంషేర్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్ఫార్వర్డ్స్: అభిషేక్, సుఖ్జీత్ సింగ్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, మన్దీప్ సింగ్, గుర్జాంత్ సింగ్ప్రత్యామ్నాయ ఆటగాళ్లు: నీలకంఠ శర్మ, జుగ్రాజ్ సింగ్, క్రిషన్ బహదూర్ పాఠక్.తొలిసారి ఒలింపిక్స్ హాకీ జట్టులో చోటు దక్కించుకున్నది వీళ్లేజర్మన్ప్రీత్ సింగ్, సంజయ్, రాజ్ కుమార్ పాల్, అభిషేక్, సుఖ్జీత్ సింగ్. -
శ్రీజేశ్కు ‘వరల్డ్ గేమ్స్ అథ్లెట్’ అవార్డు
భారత హాకీ జట్టు గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్ ప్రతిష్టాత్మక ‘వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు ఎంపికయ్యాడు. అడ్వెంచర్ క్రీడాకారుడు అల్బెర్టో గైన్స్ లోపెజ్ (స్పెయిన్), వుషూ ప్లేయర్ గియోర్డనో (ఇటలీ)లతో శ్రీజేశ్ పోటీ æపడ్డాడు. ఓటింగ్‌లో శ్రీజేశ్కు 1,27,647 ఓట్లు రాగా, లోపెజ్కు 67, 428, మైకేల్‌కు 52,046 ఓట్లే పోలయ్యాయి. భారత్ తరఫున 2020లో మహిళల హాకీ కెప్టెన్ రాణి రాంపాల్‌కు ఈ అవార్డు లభించింది. -
ఓవైపు కోటి నజరానా.. మరోవైపు వెయ్యి రూపాయల ధోతి, షర్టు!
తిరువనంతపురం: టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు కాంస్య పతకం గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించిన గోల్ కీపర్ పరాట్టు రవీంద్రన్ శ్రీజేశ్కు మళయాళీ వ్యాపారవేత్త ఒకరు భారీ నగదు కానుక అందించనున్నారు. గల్ఫ్‌లో నివాసం ఉంటున్న వీపీఎస్ హెల్త్‌కేర్ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ షంషీర్ వయలిల్ తన తరఫు నుంచి కేరళకు చెందిన శ్రీజేశ్కు రూ. కోటి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మరోవైపు.. పీఆర్ శ్రీజేశ్కు కేరళ చేనేత శాఖ వెయ్యి రూపాయల విలువ చేసే ధోతి, షర్టు రివార్డుగా ప్రకటించినట్లు మలయాళ వార్తా సంస్థ జన్మభూమి వెల్లడించింది. ఈ విషయంపై స్పందించిన నెటిజన్లు.. ‘‘ఒలింపియన్‌కు ఇంతటి ఘన సన్మానమా.. భేష్’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే, మరికొంత మంది మాత్రం.. శ్రీజేశ్ పట్ల అభిమానాన్ని డబ్బుతో పోల్చి చూడవద్దని హితవు పలుకుతున్నారు. కాగా కేరళకు చెందిన శ్రీజేశ్ భారత పురుషుల హాకీ జట్టులో గోల్ కీపర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. ముఖ్యంగా టోక్యో ఒలింపిక్స్‌లో జర్మనీపై 5-4 తేడాతో గెలుపొంది టీమిండియా 41 ఏళ్ల తర్వాత కాంస్య పతకం దక్కించుకోవడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. చదవండి: Neeraj Chopra: తను ఒలింపియన్ అయితే కావొచ్చు.. కానీ -
PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
ఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుత విజయంతో కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్న భారత పురుషుల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. ఈ విజయంలో గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ పాత్ర మరువలేనిది. జర్మనీకి 13 పెనాల్టీ కార్నర్లు లభించినప్పటికీ, అడ్డుగోడగా నిలబడి, అద్భతమైన డిఫెన్స్‌తో ప్రత్యర్థి గోల్స్‌ను అడ్డుకొని విజయంలో కీలకపాత్ర పోషించాడు. ప్రస్తుతం శ్రీజేష్ పేరు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్. తాజాగా శ్రీజేష్ గురించి ఒక ఆసక్తికర విషయం తెలిసింది. 1998లో తన 12 ఏళ్ల వయసులో హాకీలో ఓనమాలు నేర్చుకునేందుకు తిరువనంతపురంలోని జీవీ రాజా స్పోర్ట్స్ స్కూల్లో చేరాడు. అయితే ఆ స్కూల్ హాకీ కోచ్ శ్రీజేష్ను గోల్ కీపింగ్ చేయమని సలహా ఇచ్చాడు. కోచ్ చెప్పిన విషయాన్ని శ్రీజేష్ తన తండ్రికి వివరించాడు. కొడుకు కలను సాకారం చేసేందుకు తండ్రి పీవీ రవీంద్రన్ తన ఇంటి దైవంగా భావించిన ఆవును అమ్మేసి శ్రీజేష్‌కు గోల్ కీపింగ్ కిట్‌ను కొనిచ్చాడు. అయితే ఆ సమయంలో రవీంద్రన్ శ్రీజేష్‌కు ఒక మాట చెప్పాడు. '' ఈరోజు నీ భవిష్యత్తు కోసం నా ఇంటి దైవాన్ని తాకట్టు పెడుతున్నా. నువ్వు అనుకున్న కలను సాధించాలి.. హాకీలో గోల్ కీపర్‌గా మెరవాలి.. దేశానికి పతకం తేవాలి.'' అని చెప్పుకొచ్చాడు. తండ్రి మాటలను శ్రీజేష్ ఈరోజుతో నెరవేర్చాడు. టోక్యో ఒలింపిక్స్‌లో జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో తన గోల్ కీపింగ్‌తో మెప్పించి దేశానికి కాంస్యం అందించాడు. ఇటు తండ్రి కోరికను నెరవేర్చడంతో పాటు ఒలింపిక్స్‌లో 41 సంవత్సరాల పతక నిరీక్షణకు తన జట్టుతో కలిసి తెరదించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే .. హోరా హోరీ పోరులో చివరికి జర్మనీపై మన్ ప్రీత్ సింగ్ నేతృత్వంలో టీమిండియా హాకీ జట్టు ఆధిపత్యాన్ని చాటుకుంది. 41 సంవత్సరాల తర్వాత ఒలింపిక్ పతకం సాధించి చరిత్రను తిరగ రాసింది. ముఖ్యంగా నువ్వా నేనా అన్నట్టుగా ఉత్కంఠ భరితంగా సాగిన ఈ టఫ్ ఫైట్ లో భారత్ 5-4 తేడాతో జయకేతనం ఎగురవేసి కాంస్యం దక్కించుకుంది. -
హాకీ ప్రపంచకప్ జట్టు ఇదే
న్యూఢిల్లీ: స్వదేశంలో జరిగే ప్రపంచకప్‌లో పాల్గొనే భారత హాకీ జట్టును హాకీ ఇండియా (హెచ్ఐ) గురువారం ప్రకటించింది. 18 మందితో కూడిన భారత బృందానికి మన్‌ప్రీత్ సింగ్ సారథ్యం వహించనున్నాడు. ఈ నెల 28 నుంచి డిసెంబర్ 16 వరకు భువనేశ్వర్‌లో ఈ మెగా టోర్నీ జరుగుతుంది. ప్రపంచ మూడో ర్యాంకర్ బెల్జియం, కెనడా, దక్షిణాఫ్రికాలతో కలిసి భారత్ పూల్ ‘సి’లో ఉంది. రూపిందర్ పాల్‌సింగ్, ఎస్వీ సునీల్‌లకు ఈసారి కూడా చాన్స్ దక్కలేదు. ‘అందుబాటులో ఉన్న వారి నుంచి అత్యుత్తమ ప్లేయర్లను ఎంపిక చేశాం’ అని కోచ్ హరేంద్ర సింగ్ తెలిపారు. మరోవైపు కప్‌లో పాకిస్తాన్ పాల్గొనడం సందేహంగా మారింది. అర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్తాన్ హాకీ సమాఖ్య డబ్బు కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి మొర పెట్టుకోగా... పీసీబీ నిరాకరించింద భారత జట్టు: గోల్‌కీపర్స్: పీఆర్ శ్రీజేశ్, బహదూర్ పాఠక్. డిఫెండర్స్: హర్మన్‌ప్రీత్ సింగ్, బిరేంద్ర లక్డా, వరుణ్ కుమార్, కొతాజిత్ సింగ్, ఖడంగ్బమ్, సురేందర్ కుమార్, అమిత్ రొహిదాస్. మిడ్ఫీల్డర్స్: మన్‌ప్రీత్ సింగ్ (కెప్టెన్), చింగ్లెన్సనా సింగ్ (వైస్ కెప్టెన్), నీలకంఠ శర్మ, హార్దిక్ సింగ్, సుమీత్. ఫార్వర్డ్స్: ఆకాశ్‌దీప్ సింగ్, మన్దీప్ సింగ్, దిల్‌ప్రీత్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ్, సిమ్రన్‌జీత్ సింగ్. -
శ్రీజేశ్ పునరాగమనం
న్యూఢిల్లీ: భారత స్టార్ గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్ ఎనిమిది నెలల తర్వాత మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చాడు. న్యూజిలాండ్‌లో జరిగే నాలుగు దేశాల హాకీ టోర్నీలో పాల్గొనే భారత జట్టును హాకీ ఇండియా (హెచ్ఐ) సోమవారం ప్రకటించింది. 20 మంది సభ్యులు గల ఈ జట్టుకు మిడ్‌ఫీల్డర్ మన్‌ప్రీత్ సింగ్ సారథ్యం వహిస్తాడు. మోకాలి గాయంతో శ్రీజేశ్ గతేడాది కీలకమైన టోర్నీలకు దూరమయ్యాడు. ఇప్పుడు పూర్తిగా కోలుకోవడంతో మళ్లీ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. ఈ నెల 17 నుంచి జరిగే టోర్నీలో భారత్, కివీస్‌లతో పాటు బెల్జియం, జపాన్ జట్లు తలపడనున్నాయి. -
పాక్‌ను ఓడించి వీర జవాన్లకు అంకితమిస్తాం
బెంగళూరు: ఆసియా చాంపియన్స ట్రోఫీలో పాకిస్తాన్‌ను ఓడించి... ఆ విజయాన్ని వీరజవాన్లకు అంకితమిస్తామని భారత సీనియర్ హాకీ జట్టు కెప్టెన్ శ్రీజేశ్ తెలిపాడు. ఉడీ ఉదంతం నేపథ్యంలో ఇరు దేశాల మధ్య మళ్లీ నిప్పురాజుకున్న సంగతి తెలిసిందే. మలేసియాలోని కుంటాన్‌లో వచ్చే నెల 20 నుంచి 30 వరకు ఆసియా ఈవెంట్ జరగనుంది. ఇందులో భారత సైనికులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశపర్చబోమని దాయాది జట్టును ఓడించి మన జవాన్లకు జోహార్లు అర్పిస్తామని శ్రీజేశ్ చెప్పాడు. ఈ టోర్నీలో భాగంగా అక్టోబర్ 23న చిరకాల ప్రత్యర్థుల మధ్య లీగ్ మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం పాకిస్తాన్ స్థాయికి తగినట్లు ఆడలేకపోతోందని, అయితే ఆ జట్టు గట్టి ప్రత్యర్థేనని తెలిపాడు. ఆ టోర్నీ కోసం ప్రస్తుతం సీనియర్ హాకీ జట్టుకు ఇక్కడి ‘సాయ్’ సెంటర్లో నాలుగు వారాల పాటు సన్నాహక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నేడు జూనియర్ల పోరు ఢాకా: ఆసియా కప్ అండర్-18 టోర్నమెంట్లో భారత్, పాకిస్తాన్ల మధ్య గురువారం సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఆతిథ్య బంగ్లాదేశ్‌తో తొలి లీగ్ మ్యాచ్‌లో పోరాడి ఓడిన భారత్... తర్వాతి మ్యాచ్‌లో ఒమన్‌పై గోల్స్ సునామీతో 11-0తో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. జోరు మీదున్న భారత్ ఇదే స్ఫూర్తితో పాక్‌ను కంగుతినిపించాలనే ఉత్సాహంతో ఉంది. ఇబుంగో సింగ్, దిల్‌ప్రీత్ సింగ్ చెరో 4 గోల్స్ సాధించి చక్కని ఫామ్‌లో ఉన్నారు. పాకిస్తాన్ కూడా వరుస విజయాలతో ఊపుమీదుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు తప్పదు. -
ఉత్తమ ఆటగాడిగా శ్రీజేష్
బెంగళూరు: ఈ ఏడాది ‘అత్యుత్తమ హాకీ ఆటగాడు’ అవార్డును భారత గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ గెలుచుకున్నాడు. మహిళల విభాగంలో దీపికాకు ఈ పురస్కారం లభించింది. శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో హాకీ ఇండియా (హెచ్ఐ) వార్షిక అవార్డులను ప్రదానం చేసింది. ఈ ఇద్దరికి చెరో రూ. 25 లక్షల నగదుతో పాటు ట్రోఫీలను బహూకరించారు. దివంగత కెప్టెన్ శంకర్ లక్ష్మణ్‌కు... ప్రతిష్టాత్మక మేజర్ ధ్యాన్‌చంద్ జీవితకాల సాఫల్య పురస్కారం లభించింది. ఈ అవార్డు కింద రూ. 30 లక్షల నగదుతో పాటు ట్రోఫీని అందజేశారు. భారత్ తరఫున 100 మ్యాచ్‌లు ఆడినందుకు ధర్మవీర్ సింగ్, కొతాజిత్ సింగ్, బీరేంద్ర లక్రా, సుశీలా చానులకు తలా రూ. 50 వేల నగదు పురస్కారం, ట్రోఫీని ఇచ్చారు. 200 మ్యాచ్‌లు ఆడిన వీఆర్ రఘునాథ్, గుర్బాజ్ సింగ్‌లకు చెరో లక్ష చొప్పున ఇచ్చారు. 36 ఏళ్ల తర్వాత రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన మహిళల జట్టును ఈ సందర్భంగా సత్కరించారు.