భారత స్టార్ హాకీ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ తన 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌ను ఘనంగా ముగించిన సంగతి తెలిసిందే. ప్యారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన తర్వాత శ్రీజేష్ అంతర్జాతీయ హాకీకీ విడ్కోలు పలికాడు.
ఈ నేపథ్యంలో శ్రీజేష్‌కు కేరళ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. అతడికి రూ.2 కోట్ల నగదు బహుమతి ఇవ్వునున్నట్లు కేరళ సర్కార్ వెల్లడించింది. బుధవారం ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
‘భారత హాకీ జట్టులో సభ్యుడు, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన శ్రీజేశ్‌కు రెండు కోట్ల రూపాయలు బహుమతిగా అందిస్తున్నాం’ అని సీఎంఓ ప్రకటనలో పేర్కొంది.
ప్యారిస్‌లో భారత హాకీ జట్టు కాంస్య పతకం సాధించడంలో శ్రీజేష్‌ది కీలక పాత్ర. ముఖ్యంగా బ్రిటన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీజేష్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కోట గోడలా నిలిచిన శ్రీజేష్ బ్రిటన్‌కు ఎక్స్‌ట్రా గోల్ చేసే ఛాన్స్ ఇవ్వలేదు. కాగా తన 18 ఏళ్ల కెరీర్‌లో శ్రీజేష్ భారత్ తరఫున 336 మ్యాచ్‌లు ఆడాడు.
Comments
Please login to add a commentAdd a comment