భారత జూనియర్‌ హాకీ జట్టు కోచ్‌గా శ్రీజేశ్‌! | PR Sreejesh becomes Indian mens hockey teams head coach | Sakshi
Sakshi News home page

#PR Sreejesh: భారత జూనియర్‌ హాకీ జట్టు కోచ్‌గా శ్రీజేశ్‌!

Published Sat, Aug 10 2024 11:20 AM | Last Updated on Sat, Aug 10 2024 11:29 AM

PR Sreejesh becomes Indian mens hockey teams head coach

పారిస్‌ ఒలింపిక్స్‌లో అద్భుతమైన ప్రదర్శనతో వరుసగా రెండో కాంస్య పతకం సాధించిన అనంతరం కెరీర్‌కు వీడ్కోలు పలికిన భారత హాకీ జట్టు గోల్‌ కీపర్‌ పీఆర్‌ శ్రీజేశ్‌ త్వరలోనే కొత్త అవతారంలో దర్శనమివ్వనున్నాడు. 

గోల్‌ పోస్ట్‌ ముందు తన అసమాన ప్రతిభతో దేశానికి ఎన్నో మధుర విజయాలు అందించిన శ్రీజేశ్‌.. ఇకపై జాతీయ జూనియర్‌ జట్టుకు కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ‘త్వరలోనే శ్రీజేశ్‌ను జూనియర్‌ (అండర్‌–21) జట్టు కోచ్‌గా నియమిస్తాం. దీని గురించి అతడితో మాట్లాడాం. 

యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేయడంలో అతడికి మించిన వారు మరొకరు లేరు. దీంతో పాటు శ్రీజేశ్‌ స్థానాన్ని భర్తీ చేయనున్న గోల్‌ కీపర్లు సూరజ్‌ కార్కెరా, క్రిషన్‌ బహదూర్‌ పాఠక్‌కు కూడా దిశా నిర్దేశం చేయాల్సి ఉంటుంది’ అని హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్‌ టిర్కీ పేర్కొన్నాడు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement