వినేశ్‌ ఫోగట్‌కు బంగారు పతకం | Haryana Khap Panchayat Gave Gold Medal To Vinesh Phogat | Sakshi
Sakshi News home page

వినేశ్‌ ఫోగట్‌కు బంగారు పతకం

Published Mon, Aug 26 2024 1:49 PM | Last Updated on Mon, Aug 26 2024 3:48 PM

Haryana Khap Panchayat Gave Gold Medal To Vinesh Phogat

ఇటీవలి ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హతకు గురైన భారత మహిళా రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌ను రోహ్‌తక్‌లోని (హర్యానా) సర్వ్‌ఖాప్ పంచాయతీ బంగారు పతకంతో సత్కరించింది. ఈ సందర్భంగా వినేశ్‌ ఫోగట్‌ మాట్లాడుతూ..

“మా పోరాటం ముగియలేదు, మా బిడ్డల పరువు కోసం పోరాటం ఇప్పుడే మొదలైంది. మహిళా రెజర్లపై లైంగిక దాడుల సమయంలో ఇదే విషయాన్ని చెప్పాము” అంటూ ప్రసంగించింది. తనను సన్మానించిన ఖాప్‌ పెద్దలకు ఫోగట్‌ ధన్యవాదాలు తెలిపింది. ఖాప్‌ పెద్దలంతా మద్దతుగా నిలవడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని పేర్కొంది. మహిళా క్రీడాకారులకు కష్ట సమయాల్లో ఖాప్‌ పెద్దలు తోడుగా ఉంటే ప్రోత్సాహకంగా ఉంటుందని అంది.

కాగా, వినేశ్‌ ఫోగట్‌ గతేడాది లైంగిక వేధింపుల ఆరోపణలపై అప్పటి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బిజేపీ సీనియర్‌ లీడర్‌ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా హర్యానా  రెజ్లర్లతో కలిసి పోరాటం చేసిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే, పారిస్‌ ఒలింపిక్స్‌ మహిళల రెజ్లింగ్‌ 50 కేజీల విభాగంలో వినేశ్‌ ఫోగట్‌ ఫైనల్‌కు చేరింది. ఫైనల్‌కు ముందు ఫోగట్‌ నిర్దేశిత బరువు కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉండటంతో అనర్హతకు గురైంది. దీంతో ఆమె కనీసం రజత పతకాన్ని కూడా నోచుకోలేకపోయింది. తనకు జరిగిన అన్యాయం విషయంలో వినేశ్‌ సీఏఏస్‌ను ఆశ్రయించినా ప్రయోజనం లేకుండా పోయింది. రూల్స్‌ రూల్సే అని సీఏఏస్‌ ఫోగట్‌ అభ్యర్థనను కొట్టిపారేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement