ఢిల్లీ: స్టార్ రెజ్లర్ వినేశ్ పోగట్‌పై ఒలింపిక్ మెడలిస్ట్ యోగేశ్వర్ దత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్యారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత గురికావటంపై బాధ్యత తీసుకోవాల్సింది పోయి.. ఇతరులపై నిందలు వేయటం సరికాదని విమర్శలు గుప్పించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు.
‘‘ఒకవేళ నేను ఇటువంటి అనర్హత వేటు పరిస్థితిని ఎదుర్కొంటే.. తక్షణమే దేశం మొత్తానికి క్షమాపణలు చెప్పేవాడిని. ఈ అంశాన్ని వినేశ్ ఫోగట్ ప్రజల్లోకి తీసుకువెళ్లిన విధానం పట్ల అసంతృప్తికి గురయ్యాను. ఒలింపిక్స్ జరిగిన అంశంపై వినేశ్ ఫోగట్ వ్యాప్తి చేసిన కుట్ర పూర్తిత విధానాలు చాలా ఆశ్చర్యం కలిగించాయి.
అదీకాక.. ఈ విషయంలో ఆమె ప్రధానమంత్రి మోదీని నిందించే స్థాయికి వెళ్లిపోయారు. ఆమె ఒలింపిక్స్‌లో అనర్హతకు గురైతే.. జరిగిన పొరపాటుకు దేశానికి క్షమాపణలు తెలపాలి. కానీ, ఆమె ఈ విషయంలో కుట్ర జరిగిందని ఆరోపణలు చేశారు. గ్రాము కంటే ఎక్కువ బరువు ఉంటే అనర్హత వేటు వేస్తారని అందరికీ తెలుసు. కానీ ఆమె ఒలింపిక్స్‌లో ఏదో తప్పు జరిగిందని పేర్కొంది.ఫైనల్ వెళ్లిన సమయంలోనే ఆమె దేశం దృష్టిలో చాలా గౌరవం సంపాదించుకున్నారు’ అని అన్నారు.
ప్యారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత వేటుపడి పతకం కోల్పోయిన వినేశ్ అనంతం రాజకీయాల్లో చేరారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరగా.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా జులానా నియోజకవర్గంలో బరిలోకి దించిన విషయం తెలిసిందే. మరోవైపు.. రెజ్లింగ్‌లో యోగేశ్వర్ దత్ లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన విషయం విధితమే.
Comments
Please login to add a commentAdd a comment