Yogeshwar Dutt
-
వినేశ్ ఫోగట్.. దేశానికి క్షమాపణలు చెప్పాల్సింది: యోగేశ్వర్ దత్
ఢిల్లీ: స్టార్ రెజ్లర్ వినేశ్ పోగట్‌పై ఒలింపిక్ మెడలిస్ట్ యోగేశ్వర్ దత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్యారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత గురికావటంపై బాధ్యత తీసుకోవాల్సింది పోయి.. ఇతరులపై నిందలు వేయటం సరికాదని విమర్శలు గుప్పించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ‘‘ఒకవేళ నేను ఇటువంటి అనర్హత వేటు పరిస్థితిని ఎదుర్కొంటే.. తక్షణమే దేశం మొత్తానికి క్షమాపణలు చెప్పేవాడిని. ఈ అంశాన్ని వినేశ్ ఫోగట్ ప్రజల్లోకి తీసుకువెళ్లిన విధానం పట్ల అసంతృప్తికి గురయ్యాను. ఒలింపిక్స్ జరిగిన అంశంపై వినేశ్ ఫోగట్ వ్యాప్తి చేసిన కుట్ర పూర్తిత విధానాలు చాలా ఆశ్చర్యం కలిగించాయి.అదీకాక.. ఈ విషయంలో ఆమె ప్రధానమంత్రి మోదీని నిందించే స్థాయికి వెళ్లిపోయారు. ఆమె ఒలింపిక్స్‌లో అనర్హతకు గురైతే.. జరిగిన పొరపాటుకు దేశానికి క్షమాపణలు తెలపాలి. కానీ, ఆమె ఈ విషయంలో కుట్ర జరిగిందని ఆరోపణలు చేశారు. గ్రాము కంటే ఎక్కువ బరువు ఉంటే అనర్హత వేటు వేస్తారని అందరికీ తెలుసు. కానీ ఆమె ఒలింపిక్స్‌లో ఏదో తప్పు జరిగిందని పేర్కొంది.ఫైనల్ వెళ్లిన సమయంలోనే ఆమె దేశం దృష్టిలో చాలా గౌరవం సంపాదించుకున్నారు’ అని అన్నారు.ప్యారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత వేటుపడి పతకం కోల్పోయిన వినేశ్ అనంతం రాజకీయాల్లో చేరారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరగా.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా జులానా నియోజకవర్గంలో బరిలోకి దించిన విషయం తెలిసిందే. మరోవైపు.. రెజ్లింగ్‌లో యోగేశ్వర్ దత్ లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన విషయం విధితమే.చదవండి: పీటీ ఉషపై వినేశ్ ఫొగట్ సంచలన ఆరోపణలు -
బ్రిజ్‌భూషణ్ ఎంగిలి మెతుకులు తినే బతుకు తనది!
న్యూఢిల్లీ: లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత యోగేశ్వర్ దత్ ఆరుగురు స్టార్ రెజ్లర్లకు ట్రయల్స్‌లో ఇచ్చిన మినహాయింపును తప్పుబట్టాడు. ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌ల కోసం నిర్వహించే సెలక్షన్ ట్రయల్స్‌లో వినేశ్, సంగీత, సాక్షి మలిక్, సత్యవర్త్, బజరంగ్, జితేందర్‌లకు కేవలం ఒక్క బౌట్ పోటీ పెట్టారు. భారత ఒలింపిక్ సంఘం అడ్‌హక్ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయం అనుచితమని బీజేపీ నేత కూడా అయిన యోగేశ్వర్ దత్ అన్నాడు. ‘దేని ఆధారంగా ఇలాంటి మినహాయింపు నిర్ణయం తీసుకున్నారో నాకైతే అర్థం కావడం లేదు. కమిటీ నిర్ణయం ఏమాత్రం సరికాదు. నా సలహా ఏంటంటే జూనియర్ రెజ్లర్లంతా నిరసన చేపట్టో, ప్రధానికి లేఖ రాసో దీనిపై పోరాడాలి’ అని యోగేశ్వర్ ట్వీట్ చేశాడు. రెజ్లింగ్ సమాఖ్య మాజీ చీఫ్ బ్రిజ్‌భూషణ్ లైంగిక వేధింపులపై నియమించిన కమిటీలో యోగేశ్వర్ సభ్యుడిగా ఉన్నాడు. బ్రిజ్‌భూషణ్ కీలుబొమ్మ దత్.. తమ విన్నపాన్ని మన్నించి అడ్‌హక్ కమిటీ ఇచ్చిన మినహాయింపును తప్పుబట్టిన యోగేశ్వర్ దత్‌పై స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. అతనో వెన్నెముక లేని మనిషని, బ్రిజ్‌భూషణ్ చేతిలో కీలుబొమ్మని విమర్శించింది. ‘బ్రిజ్‌భూషణ్ ఎంగిలి మెతుకులు తినే బతుకు యోగేశ్వర్‌ది. అతని అడుగులకు మడుగులొత్తే తొత్తు యోగేశ్వర్. ఇతని చరిత్ర రెజ్లింగ్ లోకానికి బాగా తెలుసు’ అని ట్విట్టర్లో వినేశ్ మండిపడింది. విచారణ కమిటీలో ఉంటూ ఎవరెవరు బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా మాట్లాడారో వారి పేర్లను అతనికి చేరవేశాడని దుయ్యబట్టింది. లైంగిక వేధింపులకు పాల్పడినట్లు స్టేట్మెంట్ ఇచి్చన రెజ్లర్లతో రాజీకొచ్చేలా ప్రవర్తించాడని ఆరోపించింది. గ్యాంజస్ గ్రాండ్‌మాస్టర్స్ గెలుపు దుబాయ్: గ్లోబల్ చెస్ లీగ్‌లో గ్యాంజస్ గ్రాండ్‌మాస్టర్స్ జట్టు రెండో విజయం నమోదు చేసింది. అల్పైన్ వారియర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో గ్యాంజస్ గ్రాండ్‌మాస్టర్స్ జట్టు 11–6తో గెలిచింది. ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సన్ (అల్పైన్ వారియర్స్)తో జరిగిన గేమ్‌లో గ్యాంజస్ జట్టు ప్లేయర్, భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్‌తో 44 ఎత్తుల్లో ఓడిపోయినా... రాపోర్ట్, బెలా గ్యాంజస్ జట్టు తరఫున నెగ్గడంతో ఆ జట్టుకు విజయం దక్కింది. ఇతర మ్యాచ్‌ల్లో బాలన్ అలస్కాన్ నైట్స్ 14–5తో అప్‌గ్రాడ్ ముంబా మాస్టర్స్ జట్టుపై, త్రివేని కాంటినెంటల్ కింగ్స్ 8–7తో చింగారి గల్ఫ్ టైటాన్స్‌పై, అల్పైన్ వారియర్స్ 9–7తో బాలన్ అలస్కాన్ నైట్స్‌పై గెలిచాయి. క్వార్టర్ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ జోడీ ఓటమి సించ్ టెన్నిస్ చాంపియన్íÙప్ ఏటీపీ–500 టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ కథ ముగిసింది. లండన్‌లో జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 3–6, 6–7 (5/7)తో వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్)–నీల్ స్కప్‌స్కీ (బ్రిటన్) జోడీ చేతిలో ఓడిపోయింది. బోపన్న జోడీకి 18,190 యూరోల (రూ. 16 లక్షల 24 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ప్రణయ్ పరాజయం భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ తైపీ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి ని్రష్కమించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ ప్రణయ్ 19–21, 8–21తో ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్) చేతిలో ఓడిపోయాడు. చదవండి: KP Chowdary Case: మా బిడ్డకు కేపీ చౌదరితో అసలు పరిచయమే లేదు.. వారం రోజులు ఇల్లు కావాలంటే: సిక్కిరెడ్డి తల్లి -
రెజ్లర్ల మీటూ ఉద్యమం.. కీలక పరిణామం
భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్ తమను లైంగికంగా వేధింపులకు గురి చేశారంటూ భారత రెజ్లర్లు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. డబ్ల్యూఎఫ్ఐ పదవి నుంచి ఆయనను తొలగించాలంటూ రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద మూడురోజులుగా ఆందోళన చేపట్టారు. గురువారం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో రెజ్లర్లు తమ ఆందోళనను మరింత ఉదృతం చేశారు. ఈ నేపథ్యంలో వినేశ్ పొగాట్, భజరంగ్ పూనియా సహా మిగతా రెజ్లర్లు శుక్రవారం ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐవోఏ)కు లేఖ రాశారు. తాజగా డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై భారత ఒలింపిక్ కమిటీ(ఐవోఏ) ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. ఈ కమిటీలో మేరీకోమ్ సహా డోలా బెనర్జీ, అలకనంద ఆశోక్, యోగేశ్వర్ దత్, సహదేవ్ యాదవ్‌లతో పాటు ఇద్దరు అడ్వకేట్లు ఉన్నారు. కాగా సభ్యుల్లో ఒకరైన సహదేవ్ యాదవ్ మాట్లాడుతూ.. మేము ఆందోళన చేస్తున్న రెజ్లర్ల వాదనలు వింటాం. అభియోగాలను పరిశీలించిన తర్వాత నిష్పక్షపాతంగా విచారణ జరిపి తగిన న్యాయం జరిగేలా చూస్తాం అని పేర్కొన్నారు. Indian Olympic Association (IOA) has formed a seven-member committee to probe the allegations of sexual harassment against WFI chief Brij Bhushan Sharan Singh. Members are Mary Kom, Dola Banerjee, Alaknanda Ashok, Yogeshwar Dutt, Sahdev Yadav and two advocates: IOA pic.twitter.com/BjuyEbUHZu — ANI (@ANI) January 20, 2023 చదవండి: రెజ్లర్ల మీటూ ఉద్యమం.. అథ్లెట్లకు షాక్?! ఐవోఏకు లేఖ.. పీటీ ఉష చెంతకు పంచాయతీ -
బీజేపీలో చేరిన యోగేశ్వర్, సందీప్
న్యూఢిల్లీ : ఒలంపిక్ పతక విజేత, స్టార్ రెజ్లర్ యోగేశ్వర్ దత్, భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ సందీప్ సింగ్ గురువారం బీజేపీలో చేరారు. హర్యానా బీజేపీ చీఫ్ సుభాశ్ బరాలా సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా యోగేశ్వర్ దత్ మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోదీ తననెంతో ప్రభావితం చేశారని.. ఆయన స్ఫూర్తితో రాజకీయాల్లో ప్రవేశించానని పేర్కొన్నారు. ‘ ప్రజలకు సేవ చేయాలనే ఆశయంతో బీజేపీలో చేరాను. ప్రధాని మోదీ పాలన నన్నెంతగానో ప్రభావితం చేసింది. క్రీడాకారులు కూడా ప్రజా సేవలో భాగస్వామ్యం కావాల్సిన ఆవశ్యకతను చాటిచెప్పింది. ఈ కుటుంబం(బీజేపీ)లో సభ్యుడిని కావడం చాలా సంతోషంగా ఉంది’ అని పేర్కొన్నాడు. కాగా హర్యానా ఎన్నికలు సమీపిస్తున్న వేళ యోగేశ్వర్ దత్, సందీప్ సింగ్ బీజేపీలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున వీరిద్దరు బరిలోకి దిగే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక 2012 ఒలంపిక్ క్రీడల్లో భారత్‌కు కాంస్య పతకం అందించిన యోగేశ్వర్ దత్‌ను సోనెపట్ నియోజకవర్గం నుంచి పోటీలో దింపాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో యోగేశ్వర్ ఇప్పటికే తన పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇక సందీప్ సింగ్‌తో పాటు శిరోమణి అకాలీ దళ్ ఎమ్మెల్యే బాల్కౌర్ సింగ్ కూడా గురువారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా సందీప్ సింగ్ మాట్లాడుతూ...ప్రధాని మోదీ, హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌లను ఆదర్శంగా తీసుకుని పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు. జాతికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో కాషాయ కండువా కప్పుకొన్నానని తెలిపారు. -
బజరంగ్ కోసం బై...బై
అంతర్జాతీయస్థాయిలో భారత రెజ్లింగ్ ముఖచిత్రాన్ని మార్చిన రెజ్లర్లు సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్‌లాంటి మెగా ఈవెంట్స్‌లో పతకాలు గెలిచిన వీరిద్దరిలో సుశీల్ ఇంకా ‘కుస్తీ’ పడుతుండగా... యోగేశ్వర్ దత్ మాత్రం రెండేళ్లుగా ‘మ్యాట్’కు దూరంగా ఉన్నాడు. అయితే శుక్రవారం తన 35వ పుట్టిన రోజు సందర్భంగా రెజ్లింగ్ కెరీర్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నట్లు యోగేశ్వర్ దత్ తెలిపాడు. సోనెపట్ (హరియాణా): ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించడం కలగానే మిగిలి పోయినప్పటికీ... ఇక రెజ్లింగ్ మ్యాట్‌పై బరిలోకి దిగే ఆలోచన లేదని భారత స్టార్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ తెలిపాడు. హరియాణాకు చెందిన 35 ఏళ్ల యోగేశ్వర్ 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం... 2014 కామన్వెల్త్ గేమ్స్... 2014 ఏషియన్ గేమ్స్‌లలో భారత్‌కు స్వర్ణ పతకాలు అందించాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో ఫేవరెట్‌గా పోటీపడినా తొలి రౌండ్లోనే నిష్క్రమించిన అతను ఆ తర్వాత మళ్లీ మ్యాట్‌పైకి అడుగు పెట్టలేదు. 2017లో వివాహం చేసుకొని, అదే ఏడాది తన సొంత రాష్ట్రం హరియాణాలో అకాడమీని నెలకొల్పిన యోగేశ్వర్ 10 నుంచి 17 ఏళ్లలోపు ఉన్న 80 మంది కుర్రాళ్లకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. అతని ప్రియమైన శిష్యుడు బజరంగ్ పూనియా ఇటీవలే ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో 65 కేజీల విభాగంలో రజత పతకం గెలిచాడు. అంతేకాకుండా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ రెజ్లర్‌గా కొత్త చరిత్ర సృష్టించాడు. శుక్రవారం తన పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో మాట్లాడిన యోగేశ్వర్ అధికారికంగా రెజ్లింగ్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపాడు. ఈ నేపథ్యంలో పలు అంశాలపై యోగేశ్వర్ అభిప్రాయాలు అతని మాటల్లోనే... సరైన నిర్ణయమే... నేను 2020 టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశం లేదు కాబట్టి బజరంగ్‌కు అవసరమైన ప్రోత్సాహం ఇవ్వాల్సిన బాధ్యత నాపై ఉంది. ఇప్పటివరకు ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ స్వర్ణ పతకం సాధించలేదు. ఇప్పటి నుంచే బజరంగ్‌కు సరైన దిశానిర్దేశం చేస్తే టోక్యో ఒలింపిక్స్‌లో అతను తప్పకుండా పసిడి పతకం గెలుస్తాడన్న నమ్మకం ఉంది. వ్యక్తిగతంగా నా కెరీర్ అద్భుతంగా సాగింది. వరుసగా నాలుగు ఒలింపిక్స్‌లలో పాల్గొన్నాను. ఆ పతకం లేకపోయినా... దాదాపు అన్ని మెగా ఈవెంట్స్‌లో నేను పతకం సాధించినా ప్రపంచ చాంపియన్‌షిప్ పతకం మాత్రం మిగిలిపోయింది. ఈ ఏడాది బుడాపెస్ట్‌లో పోటీపడాలని భావించాను. అయితే అద్భుతమైన ఫామ్‌లో ఉన్న బజరంగ్ బరిలోకి దిగితేనే బాగుంటుందని నా ఆలోచనను విరమించుకున్నాను. చిన్నప్పటి నుంచి బజరంగ్‌ను చూస్తున్నాను. ఈస్థాయికి రావడానికి అతను ఎన్నో త్యాగాలు చేశాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అతని ప్రదర్శన ఆకట్టుకుంది. అయితే అతని ఆటలో కొన్ని బలహీనతలు ఉన్నా యి. అయితే ప్రాక్టీస్ ద్వారా వాటిని అధిగమిస్తాడన్న నమ్మకం ఉంది. అకాడమీ నిర్వహణలో ప్రస్తుతం ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహకారం లేకున్నా జేఎస్‌డబ్ల్యూ 15 మంది రెజ్లర్లకు స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. బజరంగ్‌ను ఒలింపిక్ చాంపియన్‌గా చూడాలన్నదే నా స్వప్నం. అంతే కాకుండా నా అకాడమీ నుంచి ప్రపంచ చాంపియన్లను తయారు చేయాలన్నదే నా సుదీర్ఘ లక్ష్యం. -
ఉగ్రవాదులు... క్యాన్సర్ కారకాలే!
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్ సరిహద్దులోని బీఎస్ఎఫ్ పోస్ట్‌పై మంగళవారం ఉదయం జరిగిన ఉగ్రదాడిని 2012 ఒలంపిక్ పతక విజేత యోగేశ్వర్ దత్ తీవ్రంగా ఖండించారు. బీఎస్ఎఫ్ బలగాలపై జరిగిన దాడిని.. ఆయన పిచ్చిచేష్టలుగా అభవర్ణించారు. ఉగ్రవాదుల చేష్టలే నేడు క్యాన్సర్ కారకాలుగా మారాయని ఆయన అభివర్ణించారు. నేడు ఉగ్రవాదం ప్రపంచమంతా క్యాన్సర్‌లా విస్తరించిందని చెప్పారు. ఉగ్రదాడిని ఖండిస్తూ ఆయన ట్విటర్లో ట్వీట్ చేశారు. ఈ ప్రపంచంలో కేవలం ఉగ్రవాదులు మాత్రమే జీవించాలని వాళ్లు కోరుకుంటున్నట్లు ఉందని చెప్పారు. आतंकी हमला आम बात हो गयी है,सारे विश्व मे ये कैन्सर जड़ जमा चुका है।क्या चाहते है आख़िर ये?अकेले रहेंगे सारी धरती पर?मर जाए या मार दे?पागलपन https://t.co/nIjE211KhV — Yogeshwar Dutt (@DuttYogi) October 3, 2017 -
'అలా చేస్తే కాల్చిపారేయాలి'
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ జవాన్లపై అల్లరిమూకలు అనుచితంగా ప్రవర్తించడం పట్ల ప్రముఖ రెజ్లర్ యోగేశ్వర్ దత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. సైనికుల పట్ల దురుసుగా ప్రవర్తించిన వారిని కాల్చిపారేయాలని అన్నాడు. అల్లరి మూకల ఆట కట్టించేందుకు సైనికులకు పూర్తి అధికారాలు ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు. 'కశ్మీర్ లో ఏదైతే జరిగిందో అది చాలా తప్పు. మన సీఆర్పీఎఫ్ జవాన్లను తీవ్రంగా అవమానించారు. సైనికుడిపై దారుణంగా దాడి చేశారు. అతడి హెల్మెట్ రోడ్డుపై దొర్లకుంటూ వెళ్లింది. భారత్ కు తీరని అవమానం జరిగింది. మన సైనికుడిని యువకులు తోసివేయడం చాలా బాధ కలిగించింది. ఎవరైనా దేశానికి వ్యతిరేకంగా నడుచుకున్నా, సైనికుల పట్ల అనుచితంగా ప్రవర్తించినా కాల్చిపారేయాల'ని యోగేశ్వర్ దత్ అన్నాడు. శ్రీనగర్ లో పోలింగ్ బూత్ నుంచి తిరిగివస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్లపై యువకులు దాడి చేసిన వీడియో బయటకు రావడంతో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పలువురు ప్రముఖులు సైనికులకు మద్దతుగా మాట్లాడారు. సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడిని క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, విశ్వనటుడు కమల్ హాసన్ ఖండించారు. -
గుర్మెహర్ కౌర్ ట్వీట్ పై దుమారం
న్యూఢిల్లీ:తన తండ్రి మణ్ దీప్ సింగ్ కు చావుకు పాకిస్తాన్ కారణం కాదని, ఆనాటి కార్గిల్ యుద్ధమే కారణమని ఢిల్లీ విద్యార్థిని గుర్మెహర్ కౌర్ చేసిన ట్వీట్ పై దుమారం రేగుతోంది. ఇప్పటికే ఆ ట్వీట్ పై భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ఘాటుగా స్పందించగా, తాజాగా రెజ్లర్ యోగశ్వర్ దత్ కూడా ఆ జాబితాలో చేరిపోయాడు. ఆల్ ఖైదా వ్యవస్ధాపకుడు ఒసామా బిన్ లాడెన్ ప్రజల్ని చంపలేదని, బాంబులే ఆ పని చేశాయని యోగేశ్వర్ ట్వీట్ చేశాడు. ఒకనాటి జర్మనీ నియంత హిట్లర్ కూడా తనను వ్యతిరేకించిన జ్యూస్‌కు చావుకు కారణం కాలేదని, అతను ప్రయోగించిన గ్యాసే ఆ పని చేసిందని చమత్కరించాడు. ఈ మేరకు ఫోటోను ట్వీట్టర్లో పోస్ట్ చేసి గుర్మెహర్ కు కౌంటర్ ఇచ్చాడు. అంతకుముందు వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఇదే తరహాలో గుర్మెహర్ ట్వీట్ ను తప్పుబట్టిన సంగతి తెలిసిందే. తన టెస్టు కెరీర్లో చేసిన రెండు ట్రిపుల్ సెంచరీలను చేసింది తాను కాదని, అవి చేసింది బ్యాట్ అని రిప్లే ఇచ్చాడు. ఇప్పడు సెహ్వాగ్ సరసన యోగేశ్వర్ దత్ కూడా చేరిపోయాడు. గుర్మెహర్ తీరును తీవ్రంగా తప్పుబట్టిన యోగేశ్వర్.. ఫ్లకార్డుతో ఉన్న ఆమె ఫోటోకు మరో మూడు ఫోటోల్ని జోడించి మరీ విమర్శించాడు. 1999 కార్గిల్ యుద్ధంలో కెప్టెన్ గా పని చేసిన మణ్‌దీప్ సింగ్ ప్రాణాలు కోల్పోయాడు. దానిపై అతని కుమార్తె గుర్మెహర్ ఇటీవల ట్వీట్ చేసింది. తన తండ్రి అమరుడు కావడానికి పాకిస్తాన్ కాదని పేర్కొంది. యుద్ధమే తన తండ్రిని చంపిందని ఆ ట్వీట్ లో పేర్కొంది. దాంతో పాటు ఢిల్లీ రాంజాస్ కాలేజిలో బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ కార్యకర్తలు చేసిన దాడిని గుర్మెహర్ తీవ్రంగా ఖండించింది. ఆ క్రమంలోనే తర్వాత గుర్మెహర్ సోషల్ మీడియాలో నిత్యం పోస్ట్‌లు చేస్తోంది. దీనిలో భాగంగా తనను రేప్ చేస్తామని ఏబీవీపీ కార్యకర్తలు బెదిరించారని ఆరోపించింది.దాంతో పాటు వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్‌పై కూడా గుర్మెహర్ స్పందించింది. సెహ్వాగ్ చేసిన ట్వీట్ చూడగానే తనకు చాలా బాధ కలిగిందని, తన చిన్నతనం నుంచి ఆయనను చూస్తున్నానని, తనను ఉద్దేశిస్తూ ఎందుకు ఇలా ట్వీట్ చేశాడోనని ఆవేదన వ్యక్తం చేసింది. 🙈🙈🙈 pic.twitter.com/SiH90ouWee — Yogeshwar Dutt (@DuttYogi) 28 February 2017 -
రూపాయి కట్నంతో యోగేశ్వర్...
న్యూఢిల్లీ:లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో స్ఫూర్తిగా నిలిచిన యోగేశ్వర్ దత్ తాజాగా తన పెళ్లితో అందరికి ఆదర్శంగా నిలిచాడు. వివాహానికి వరకట్నంగా అతను ఒక్క రూపాయి మాత్రమే తీసుకున్నాడు. ఇతరత్రా కానుకల్ని కూడా డిమాండ్ చేయలేదని రెజ్లర్ తల్లి సుశీలా దేవి వెల్లడించారు. ‘అక్కాచెల్లెళ్ల వివాహాలకు కట్నం కోసం నా కుటుంబం పడిన పాట్లు నేను చూశాను. అందుకే కట్నం తీసుకోకూడదని అప్పట్లోనే నిర్ణరుుంచుకున్నా. నా జీవితంలో నేను అనుకున్న రెండూ సాధించాను. మొదటిది రెజ్లర్‌గా రాణించడం... రెండోది కట్నం లేకుండా వివాహమాడటం’ అని 34 ఏళ్ల దత్ చెప్పాడు. కాంగ్రెస్ నేత జై భగవాన్ శర్మ కుమార్తె శీతల్‌ను సోమవారం యోగేశ్వర్ పెళ్లిచేసుకోనున్నాడు. ఢిల్లీలో ఈ వేడుక జరుగనుంది. -
క్యాట్‌వాక్ చేసిన సాక్షిమాలిక్, యోగేశ్వర దత్
-
అట్టహాసంగా ప్రోరెజ్లింగ్ లీగ్ అవిష్కరణ
-
యోగేశ్వర్ కు కాంస్యమా.. రజతమా?
న్యూఢిల్లీ: భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్ లండన్ ఒలింపిక్స్ పతకంపై స్పష్టత కరువైంది. 2012 లండన్ ఒలింపిక్స్ లో యోగేశ్వర్ కాంస్య పతకం నెగ్గగా.. తాజాగా ఆ పతకంపై కొన్ని పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. రష్యాకు చెందిన రెజ్లర్ బేసిక్ కుదుకోవ్ శాంపిల్స్ పాజిటీవ్ గా తేలడంతో యోగేశ్వర్ పతకం కాంస్యం నుంచి రజతానికి అప్ గ్రేడ్ అవుతుందని కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ విషయంపై భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) మంగళవారం నాడు బాంబు పేల్చింది. ఓ వైపు దేశమంతా యోగేశ్వర్ కు రజత పతకం వస్తుందని ఆనందంలో మునిగి తేలుతుండగా, సంబంధిత క్రీడా సమాఖ్య మాత్రం విచిత్రంగా వ్యవహరిస్తోంది. అసలు తమకు లండన్ ఒలింపిక్స్ లో యోగేశ్వర్ పతకానికి సంబంధించి జరుగుతున్న తాజా పరిణామాలపై తమ వద్ద ఎలాంటి సమాచార లేదని డబ్ల్యూఎఫ్ఐ తెలిపింది. లండన్ ఒలింపిక్స్ లో కుదుకోవ్ చేతిలోనే యోగేశ్వర్ ఓటమిపాలు కాగా, ఆ తర్వాత అతడు ఫైనల్ కు వెళ్లడంతో యోగేశ్వర్ దశ తిరిగి కాంస్యం సాధించాడు. ఒలింపిక్స్ పతకాలపై దర్యాప్తు చేయడం, విచారణ చేసి ఆటగాళ్ల పతకాలపై నిర్ణయం తీసుకునే అధికారం అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ(ఐఓసీ)కి ఉంది. అయితే ఐఓసీ మాత్రం కుదుకోవ్ విషయాన్ని తేలికగా తీసుకుని దర్యాప్తును ఆపివేయాలని యోచిస్తుండటం గమనార్హం. డోపీగా తేలిన రష్యా రెజ్లర్ కుదుకోవ్ 2013లో జరిగిన ఓ రోడ్డుప్రమాదంలో మృతిచెందాడు. -
త్వరలో ఓ ఇంటివాడు కానున్న రెజ్లర్
న్యూఢిల్లీ: భారతీయ రెజ్లర్ యోగేశ్వర్ దత్ త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. కాంగ్రెస్ నాయకుడు జై భగవాన్ శర్మ కుమార్తె శీతల్ ను యోగేశ్వర్ వివాహాం చేసుకోనున్నాడు. ఆదివారం సాయత్రం ఓ ప్రైవేటు పార్టీలో ఇరువురికి పెద్ద సమక్షంలో నిశ్చితార్ధం జరిగింది. ఈ కార్యక్రమానికి కొద్దిమంది సన్నిహితులనే ఆహ్వానించారు. భారతీయ రెజ్లింగ్ ఫౌండేషన్(ఐడబ్ల్యూఎఫ్) చైర్మన్ బ్రిజ్ భూషణ్ శరణ్, కొందరు కాంగ్రెస్ పార్టీ లీడర్లు నిశ్చితార్ధానికి హాజరైనట్లు తెలిసింది. వచ్చే ఏడాది జనవరి 16న శీతల్, యోగేశ్వర్ ల వివాహం జరనుంది. -
యోగేశ్వర్ దత్ నిశ్చితార్థం
న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి రెజ్లర్, ఒలింపిక్ పతక విజేత యోగేశ్వర్ దత్ త్వరలో ఒక ఇంటివాడు కానున్నాడు. ఢిల్లీకి చెందిన షీతల్‌తో అతని వివాహ నిశ్చితార్థం ఆదివారం జరిగింది. వచ్చే జనవరి 16న వీరి పెళ్లి జరుగుతుంది. బీఏ విద్యార్థిని అయిన షీతల్... స్థానిక కాంగ్రెస్ నేత జై భగవాన్ శర్మ కూతురు. నిశ్చితార్థ కార్యక్రమానికి ప్రముఖ రాజకీయ నాయకులు, రెజ్లింగ్ సమాఖ్య అధికారులు హాజరయ్యారు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో యోగేశ్వర్ కాంస్యం గెలుచుకోగా... నాడు రజతం గెలిచిన కుడుఖోవ్ డోపింగ్‌లో పట్టుబడటంతో యోగి సాధించిన కాంస్యం రజత పతకంగా మారింది. -
స్వర్ణ యోగం కాదు..!
‘లండన్ ఒలింపిక్స్‌లో సాధించిన కాంస్యం రజతంగా మారి మూడు రోజులు కూడా కాలేదు... అప్పుడే ఆ రజతం స్వర్ణంగా మారిపోతోంది... పసిడి సాధించిన రెజ్లర్ కూడా డోపింగ్‌లో పట్టుబడటంతో మన యోగేశ్వర్ దత్ బంగారు పతకాన్ని అందుకోబోతున్నాడు...’ శుక్రవారం భారత క్రీడాభిమానులను ఆనందంలో ముంచెత్తిన వార్త ఇది. అరుుతే వాస్తవం వేరుగా ఉంది. మరో ఆటలో అయితే స్వర్ణ విజేత పట్టుబడితే రజతం ఆటోమెటిక్‌గా స్వర్ణంగా మారిపోయేదేమో కానీ... ఇక్కడ అది సాధ్యం కాదు. యోగేశ్వర్‌తో పాటు మరో పార్శ్వంనుంచి కాంస్యం సాధించిన అమెరికా రెజ్లర్ కొలెమాన్ స్కాట్‌ను ఆ అదృష్టం వరించనుంది. 2012లో స్వర్ణం గెలిచిన అస్గరోవ్ డోపీగా తేలడంతో ఈ తాజా పరిణామం చోటు చేసుకుంది. * యోగేశ్వర్‌కు రజత పతకమే * కొలెమాన్ స్కాట్‌కు పసిడి! * ఒలింపిక్స్ పతకంలో మరో మార్పు * డోపింగ్‌లో పట్టుబడ్డ అస్గరోవ్ న్యూఢిల్లీ: నాలుగేళ్ల క్రితం జరిగిన లండన్ ఒలింపిక్స్ 60 కేజీల ఫ్రీ స్టయిల్ రెజ్లింగ్‌లో భారత ఆటగాడు యోగేశ్వర్‌దత్ కాంస్య పతకం గెలుచుకున్నాడు. అయితే ఈ పోటీల్లో రజతం సాధించిన కుదుఖోవ్ (రష్యా) డోపింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో అతని పతకాలు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) రద్దు చేసింది. దాంతో యోగేశ్వర్ పతకం కంచునుంచి వెండిగా మారింది. అయితే తాజా డోపింగ్ పరీక్షల్లో నాడు స్వర్ణం సాధించిన ఆటగాడు కూడా పట్టుబడ్డాడు. ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) నిర్వహించిన పరీక్షల్లో అజర్‌బైజాన్‌కు చెందిన తోగ్రుల్ అస్గరోవ్ పాజిటివ్‌గా తేలాడు. ప్రపంచ డోపింగ్ వ్యతిరేక సంస్థ (వాడా) ఇంకా దీనిని అధికారికంగా ఖరారు చేయలేదు. అస్గరోవ్ పతకాన్ని వెనక్కి తీసుకుంటే యోగేశ్వర్‌కు స్వర్ణ యోగం పట్టవచ్చని వినిపించింది. ఎందుకు కాదు? కాంస్యాలు సాధించిన యోగేశ్వర్, కొలెమాన్ స్కాట్ రెండు వేర్వేరు పార్శ్వాలలో ఆడారు. పై పార్శ్వంనుంచి సెమీస్‌కు చేరిన స్కాట్... అక్కడ అస్గరోవ్ (స్వర్ణవిజేత) చేతిలో ఓడాడు. అనంతరం కాంస్య పతక పోరులో యుమొటో (జపాన్)ను ఓడించి పతకం సాధించాడు. దిగువ భాగంలో ప్రిక్వార్టర్లో ఓడిన యోగి...ఆ తర్వాత రెండు రెపిచేజ్ మ్యాచ్‌లతో పాటు జాంగ్ మ్యోంగ్ (ఉత్తర కొరియా)పై గెలిచి కంచు పతకం అందుకున్నాడు. రజతం సాధించిన కుడుఖోవ్... యోగేశ్వర్ ఉన్న పార్శ్వంలోనే న్నాడు. అందుకే అతని పతకం రద్దు కాగానే అదే వైపునుంచి కాంస్యం సాధించిన యోగి పతకం అప్‌గ్రేడ్ అయింది. ఇదే నిబంధనను వర్తింపజేస్తే అస్గరోవ్, స్కాట్ ఒకే పార్శ్వంలో ఉన్నారు. కాబట్టి అస్గరోవ్ స్వర్ణం స్కాట్‌కు అందేందుకే అవకాశం ఉంది. నేరుగా రజతంనుంచి స్వర్ణంగా మారేందుకు స్కాట్‌తో పోలిస్తే యోగేశ్వర్‌కు అదనపు అర్హత ఏమీ లేదు. ఇద్దరూ కాంస్య విజేతలుగా సమాన స్థాయిలోనే ఉన్నారు. అవకాశాలు ఏమిటి? ఈ అంశంపై ప్రస్తుతానికి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. అయితే నిబంధనల ప్రకారం ఎలా చూసినా యోగేశ్వర్‌కు స్వర్ణం లభించడం సాధ్యం కాకపోవచ్చు. వరుసగా రెండు బౌట్లు నెగ్గి నేరుగా సెమీ ఫైనల్‌కు చేరిన స్కాట్ ప్రదర్శనే ఒలింపిక్స్‌లో యోగికంటే మెరుగ్గా ఉంది. ఈ విషయంలో భారత రెజ్లర్కంటే అతని వైపు మొగ్గు ఉంది. పతకం కోసం యోగేశ్వర్ రెండు రెపిచేజ్ రౌండ్లు కూడా ఆడగా... స్కాట్ వాటి అవసరం లేకుండా నేరుగా కాంస్య పోరులో తలపడ్డాడు. ఇప్పటికే యోగేశ్వర్ పతకం అప్‌గ్రేడ్ అయింది కాబట్టి మరో కాంస్య విజేతగా కొలెమాన్కు కూడా ఇదే అవకాశం ఉంది. పూర్తిగా అతడిని పక్కన పెట్టేసి యోగేశ్వర్‌నే మరో మెట్టు ఎక్కించేందుకు ఎలాంటి కారణం కనిపించడం లేదు. అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తే... అస్గరోవ్ చేతిలో ఓడిన కొలెమాన్కే స్వర్ణం దక్కవచ్చు. లేదంటే అతడికి కూడా రజతం ఇవ్వవచ్చు. ఇద్దరు రెజ్లర్లకు రజతాలు ఇచ్చి ఈ ఈవెంట్‌కు సంబంధించి స్వర్ణాన్ని పూర్తిగా రద్దు చేసే అవకాశం కూడా ఉంది. భారతీయుడిగా స్వర్ణం కావాలని కోరుకోవడంలో తప్పేమీ లేదు కానీ అది అంత ఏకపక్షంగా మాత్రం సాధ్యం కాదు! నాకూ ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అయితే నాకున్న అవగాహన ప్రకారం నాకు రజతం మాత్రమే లభిస్తుంది. మేమిద్దరం కాంస్యాలు గెలుచుకున్నాం. నేను రెపిచేజ్ ద్వారా అర్హత పొంది సిల్వర్ మెడలిస్ట్ చేతిలో ఓడాను. అయితే స్కాట్ మాత్రం చాంపియన్ చేతిలో ఓడాడు. కాబట్టి స్వర్ణం అతనికే దక్కాలి. నాకు తెలిసి నా పతకం స్వర్ణంగా మారదు. - యోగేశ్వర్‌దత్ -
ఆ రజతం వాళ్ల దగ్గరే ఉంచండి
► రెజ్లర్ కుదుఖోవ్ మరణంతో అతని కుటుంబం బాధలో ఉంది ► భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్ అభ్యర్థన న్యూఢిల్లీ: లండన్ ఒలింపిక్స్‌లో తాను గెలిచిన కాంస్య పతకంతో సంతృప్తిగా ఉన్నానని... రష్యా దివంగత రెజ్లర్ బెసిక్ కుదుఖోవ్ డోప్ పరీక్షలో విఫలమైనప్పటికీ... అతని రజత పతకం వెనక్కి తీసుకొని తనకు ఇవ్వాల్సిన అవసరం లేదని భారత స్టార్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ యునెటైడ్ వరల్డ్ రెజ్లింగ్ (యుడబ్ల్యూడబ్ల్యూ), అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధికారులకు విజ్ఞప్తి చేశాడు. మానవతా దృక్పథంతో వ్యవహరించి కుదుఖోవ్ కుటుంబ సభ్యుల వద్దే ఈ రజత పతకం ఉండేలా చూడాలని 2012 లండన్ ఒలింపిక్స్‌లో 60 కేజీల విభాగంలో కాంస్యం నెగ్గిన యోగేశ్వర్ దత్ అన్నాడు. ‘రజత పతకం వెనక్కి తీసుకుంటే కుదుఖోవ్ కుటుంబానికి బాధ కలుగుతుంది. పతకం రూపంలోనైనా కుదుఖోవ్ తల్లిదండ్రులకు తమ కుమారుడి జ్ఞాపకాలు మిగిలి ఉంటారుు. 2013 డిసెంబరులో కుదుఖోవ్ కారు ప్రమాదంలో చనిపోయాడని తెలిసింది. ఒకవేళ అతను బతికిఉంటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ అతను ఈ లోకంలో లేడు. నిన్ననే అతని కుటుంబసభ్యులు, తల్లిదండ్రుల గురించి ఆలోచించాను. కేవలం తమ కుమారుడి జ్ఞాపకాలతోనే వారు జీవిస్తున్నారు. కుదుఖోవ్ డోప్ పరీక్షలో విఫలమయ్యాడనేది అనవసరం. కొడుకు సాధించిన పతకం జ్ఞాపకంతో జీవిస్తున్న ఆ కుటుంబం నుంచి నేను దానిని తీసుకోదల్చుకోలేదు. రజత పతకం వారి వద్దే ఉండటం సబబుగా ఉంటుంది’ అని యోగేశ్వర్ దత్ అభిప్రాయపడ్డాడు. ‘డోప్ పరీక్షలో కుదుఖోవ్ విఫలమయ్యాక నేను సాధించిన కాంస్యం రజతం అవుతున్న వార్త విని అంతగా సంతోషపడలేదు. కుదుఖోవ్ నాకు మంచి మిత్రుడు. లండన్ ఒలింపిక్స్‌కంటే ముందు రష్యాలో నేను రెండు నెలలు ప్రాక్టీస్ చేశాను. నా కాంస్యం నా వద్దే ఉంది. ఇప్పుడు ఏ పతకమున్నా పెద్దగా తేడా ఉండదు’ అని హరియాణా పోలీసు విభాగంలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న యోగేశ్వర్ అన్నాడు. యోగేశ్వర్ శాంపిల్‌నూ పరీక్షిస్తారు... లండన్ ఒలింపిక్స్ సందర్భంగా యోగేశ్వర్ దత్ వద్ద సేకరించిన డోప్ పరీక్షల ఫలితాలు క్లీన్‌గా వస్తేనే అధికారికంగా అతనికి రజత పతకం ఖరారు చేస్తారు. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) కొత్త నిబంధనల ప్రకారం అంతర్జాతీయ టోర్నీలలో క్రీడాకారుల నుంచి సేకరించిన శాంపిల్స్‌ను 10 ఏళ్లపాటు డీప్‌ఫ్రీజ్‌లో పెడుతున్నారు. తాజా టెక్నాలజీని ఉపయోగించి బీజింగ్, లండన్ ఒలింపిక్స్‌లలో క్రీడాకారుల నుంచి సేకరించిన నమూనాలను మళ్లీ పరీక్షిస్తున్నారు. ఈ పరీక్షల ద్వారానే కుదుఖోవ్ లండన్ ఒలింపిక్స్‌లో నిషేధిత ఉత్ప్రేరకాలు వాడాడని తేలింది. -
యోగేశ్వర్ దత్ ఎంతో హుందాగా ప్రవర్తించాడు!
భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్ ఎంతో హుందాతనంతో ప్రవర్తించాడు. మంచి ఆటగాడిగానే కాదు మంచి మనసున్న వ్యక్తిగానూ ఈ రెజ్లర్ నిరూపించుకున్నాడు. డోపింగ్ ఫలితాలలో పాజిటీవ్ అని తేలిన రెజ్లర్ ప్రస్తుతం మన మధ్య లేనందున.. ఇప్పటికే బాధపడుతున్న ఆ కుటుంబానికి సాంత్వన చేకూర్చేలా ప్రవర్శించాడు రెజ్లర్ యోగేశ్వర్. 2012 లండన్ ఒలింపిక్స్‌లో తను సాధించిన కాంస్యం.. నాలుగేళ్ల తర్వాత రజతంగా మారిన విషయం తెలిసిందే. ఆ గేమ్స్‌లో రజతం సాధించిన రష్యా రెజ్లర్ బేసిక్ కుదుఖోవ్ డోపింగ్ పరీక్షలో పాజిటివ్ ఫలితం రావడంతో ఆ పతకాన్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో యోగేశ్వర్‌కు రజతం దక్కింది. ఈ విషయంపై యోగేశ్వర్ దత్ తన ట్విట్టర్ ద్వారా స్పందించాడు. రష్యా రెజ్లర్ బేసిక్ కుదుఖోవ్ మంచి వస్తాదు అని కితాబిచ్చాడు. 'ఇప్పటికే ఆ రెజ్లర్‌ను కోల్పోయి కుదుఖోవ్ కుటుంబం ఎంతో బాధలో ఉండి ఉంటుంది. అందుకే ఆ రెజ్లర్ సాధించిన పతకాన్ని అతడి గౌరవార్థం ఆ కుటుంబం వద్దనే ఉండాలి. అయితే చనిపోయిన తర్వాత డోపింగ్ టెస్టులో విఫలమవడం దురదృష్టకరం. ఈ సమయంలో మనం మానవతాదృక్పథంతో నడుచుకోవాలి'అని తన ట్వీట్లలో వెల్లడించాడు. Besik Kudukhov शानदार पहलवान थे। उनका मृत्यु के पश्चात dope test में fail हो जाना दुखद हैं। मैं खिलाड़ी के रूप में उनका सम्मान करता हूँ। — Yogeshwar Dutt (@DuttYogi) 31 August 2016 अगर हो सके तो ये मेडल उन्ही के पास रहने दिया जाए। उनके परिवार के लिए भी सम्मानपूर्ण होगा। मेरे लिए मानवीय संवेदना सर्वोपरि है। — Yogeshwar Dutt (@DuttYogi) 31 August 2016 -
'నాకు రజతం ఖాయమైంది'
లండన్: లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో మెరిసిన భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్.. ఇప్పడు రజత పతక విజేతగా మారాడు. ఈ విషయాన్ని యోగేశ్వర్ తాజాగా ధృవీకరించాడు. తనకు రజత పతకం ఖాయమైందంటూ ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశాడు. 2012 ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన రష్యా బాక్సర్ బెసిక్ కుదుఖోవ్ శాంపిల్స్ కు తాజాగా చేసిన పరీక్షల్లో అతను డ్రగ్స్ తీసుకున్నట్లు వెల్లడైంది. దీంతో ఆ ఒలింపిక్స్‌లో రజతం సాధించిన కుదుఖోవ్ పతకాన్నివెనక్కు తీసుకోనున్నారు. లండన్ ఒలింపిక్స్ 60 కేజీల ఫ్రీస్టయిల్లో భాగంగా కాంస్య పతకం కోసం జరిగిన పోరులో యోగేశ్వర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఉత్తర కొరియకు చెందిన రి జాంగ్ యాంగ్‌పై గెలిచి కాంస్యాన్ని దక్కించుకున్నాడు. అంతకుముందు ప్రి కార్టర్ ఫైనల్లో రష్యా బాక్సర్ బెసిక్ కుదుఖోవ్ చేతిలో యోగేశ్వర్ ఓటమి పాలయ్యాడు. కాగా, కుదుకోవ్ ఫైనల్ కు చేరడంతో యోగేశ్వర్ రెప్ చేజ్ ద్వారా కాంస్య పతకం సాధించాడు. అయితే ఇప్పుడు కుదుఖోవ్ శాంపిల్స్ పాజిటివ్ రావడంతో అతని పతకం యోగేశ్వర్ ఖాతాలో చేరింది. కొంతమంది రియో విన్నర్లకు తిరిగి పరీక్షలు నిర్వహించడానికి రష్యా డోపింగ్ ఉదంతమే ప్రధాన కారణం. గత కొంతకాలంగా రష్యా అథ్లెట్లు భారీ స్థాయిలో డోపింగ్‌లో పట్టుబడి యావత్ ప్రపంచాన్ని ఒక్క కుదుపు కుదిపారు. దీంతో అత్యధిక శాతం రష్యా క్రీడాకారులు రియో ఒలింపిక్స్‌లో పాల్గొనలేకపోయారు. ఈ నేపథ్యంలో గత ఒలింపిక్స్ల్లో పాల్గొన్న క్రీడాకారుల శాంపిల్స్‌ను కూడా భద్ర పరిచి, ప్రస్తుతం అత్యాధునికి టెక్నాలజీ సాయంతో ఆ శాంపిల్స్‌ను పరీక్షిస్తున్నారు. కాగా 2013లో జరిగిన రోడ్డుప్రమాదంలో కుదుస్కోవ్ మరణించిన విషయం తెలిసిందే. -
యోగేశ్వర్ దత్‌కు ఒలింపిక్స్ రజత పతకం!
తాజాగా జరిగిన రియో ఒలింపిక్స్ లో ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే ఇంటిబాట పట్టిన భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్‌కు కాస్త ఊరట లభించనుంది. అదేంటీ.. పతకం ఓడిన వ్యక్తికి లాభించే అంశం ఏమిటని ఆలోచిస్తున్నారా..! లండన్ ఒలింపిక్స్‌లో 60 కేజీ ఫ్రీస్టైల్ విభాగంలో బరిలోకి దిగన యోగేశ్వర్ కాంస్య పతకాన్ని 'పట్టు'కొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ ఒలింపిక్స లో రజతం సాధించిన రష్యా రెజ్లర్ బేసిక్ కుదుఖోవ్ శాంపిల్స్ పై తాజాగా జరిపిన డోప్ టెస్టుల్లో అతడి శాంపిల్స్ పాజిటీవ్ అని తేలింది. ఇప్పటివరకూ అధికారికంగా ఈ విషయంపై ఎలాంటి ప్రటకన వెలువడలేదు. 2013లో జరిగిన రోడ్డుప్రమాదంలో కుదుస్కోవ్ మరణించిన విషయం తెలిసిందే. అత్యాధునిక టెక్నాలజీ గత ఒలింపిక్స్ వరకూ లేని కారణంగా దాదాపు అన్ని దేశాల అథ్లెట్ల శాంపిల్స్ పై తాజాగా టెస్టులు నిర్వహిస్తున్నారు. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ జరిపిన టెస్టుల్లో నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లుగా తేలింది. నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత అయిన తమ అథ్లెట్ కుదుఖోవ్ డోపింగ్ టెస్టుల్లో విఫలమవడంతో రష్యా అధికారులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. కుదుఖోవ్ తో పాటు ఉజ్బెకిస్తాన్ కు చెందిన రెజ్లర్ తేమజోవ్(120కేజీ) కూడా పాజిటీవ్ అని తేలింది. తేమజోవ్ బీజింగ్ ఒలింపిక్స్ లో స్వర్ణపతకం సాధించాడు. వాడా టెస్టుల ఫలితాలపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిర్ణయం వెల్లడిస్తే వారి పతకాలు వెనక్కి తీసుకుంటారు. దీంతో లండన్ లో కాంస్యంతో మెరిసిన యోగేశ్వర్ రజత పతక విజేతగా మారి ఆ ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించిన సుశీల్ కుమార్ సరసన నిలవనున్నాడని అంతర్జాతీయ రెజ్లింగ్ సమాఖ్య అధికారి ఒకరు వెల్లడించారు. -
నిరాశపరిచిన యోగేశ్వర్ దత్
లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్ రియోలో నిరాశపరిచాడు. ఆదివారం సాయంత్రం జరిగిన 65 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో క్వాలిఫికేషన్ రౌండ్లోనే ఓటమి పాలయ్యాడు. భారత రెజ్లర్ యోగేశ్వర్ పై 3-0 తేడాతో మంగోలియాకు చెందిన రెజ్లర్ మందక్‌నరన్ గంజోరిజ్ విజయాన్ని సాధించాడు. బౌట్ ప్రారంభం నుంచి పట్టుకోసం యోగేశ్వర్ ప్రయత్నించగా మంగోలియా రెజ్లర్ ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. దీంతో తొలి రౌండ్లో అతడు 1-0 తో ఆధిక్యాన్ని ప్రదర్శించాడు. రెండో రౌండ్లోనూ ఇదే జోరులో మరో రెండు పాయింట్లు సాధించి బౌట్ నెగ్గాడు. -
'భారత రెజ్లర్ స్వర్ణం నెగ్గుతాడు'
లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన యోగేశ్వర్‌దత్ పై భారత అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. భారత కాలమాన ప్రకారం ఆదివారం సాయంత్రం జరుగనున్న 65 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో బరిలోకి దిగనున్న రెజ్లర్ యోగేశ్వర్ స్వర్ణాన్ని నెగ్గుతాడని మరో భారత రెజ్లర్, రెండు ఒలింపిక్ పతకాల వీరుడు సుశీల్ కుమార్ ధీమా వ్యక్తంచేశాడు. హరియాణాకు చెందిన యోగేశ్వర్ దత్ కు తన చిన్ననాటి స్నేహితుడు సుశీల్ బెస్ట్ విషెస్ చెప్పాడు. భారత్ మొత్తం అతడికి అండగా ఉంటుందన్నాడు. పతకాలను సాధించి దేశం గర్వించేలా చేసిన మహిళా అథ్లెట్లు పీవీ సింధు, రెజ్లర్ సాక్షి మాలిక్, పతకం కోసం చివరివరకు పోరాడిన దీపా కర్మాకర్ రియోలో అద్భుత ప్రదర్శన చేశారని కొనియాడాడు. ఎన్నో ఆశలతో రియోకు వెళ్లిన మరో రెజ్లర్ నర్సింగ్ యాదవ్ డోపింగ్ వివాదంతో బరిలోకి దిగక ముందురోజే వెనుదిరగాల్సి రావడంతో యోగేశ్వర్ పతకావకాశాలపై ప్రభావం చూపుతుందని భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
'ఆ గేమ్ చూస్తే నాకు బీపీ పెరుగుతుంది'
రియో ఒలింపిక్స్ చివరి అంకానికి చేరుకున్నాయి. చివరి రోజు పోటీల్లో భాగంగా రెజ్లర్ యోగేశ్వర్ దత్ తలపడనున్నాడు. ఈ నేపథ్యంలో లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన యోగేశ్వర్పై అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఈ హర్యానా రెజ్లర్ భారత పతకాల సంఖ్యను మూడుకు పెంచుతాడని క్రిడా పండితులు సైతం అంచనా వేస్తున్నారు. యోగేశ్వర్ పతకం గెలవాలని కాంక్షిస్తూ అతని మిత్రులు, అభిమానులు సోనిపట్‌లో ఆదివారం యాగం నిర్వహించారు. హరిద్వార్‌లో స్థానికులు యోగేశ్వర్ గెలవాలని కోరుతూ గంగా నదిలో పూజలు చేశారు. అయితే.. యోగేశ్వర్ తల్లి మాత్రం తన కుమారుడు తలపడే బౌట్‌ను చూడనని చెబుతున్నారు. గతంలో యోగేశ్వర్ తలపడిన బౌట్‌ను చూసిన ఆమెకు బీపీ పెరిగిందట. అందుకే, యోగేశ్వర్ బౌట్‌ను చూడనని, అయితే తన కొడుకు ఈ ఒలింపిక్స్‌లో తన కాంస్యాన్ని స్వర్ణంగా మారుస్తాడని నమ్మకంగా చెబుతున్నారు. యోగేశ్వర్ బౌట్ ఆదివారం సాయంత్రం జరుగుతుంది. -
యోగేశ్వర్ సాధిస్తాడా?
రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం వచ్చే అవకాశం రెజ్లర్ యోగేశ్వర్ దత్పైనే ఆధారపడి వుంది. గత లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన యోగేశ్వర్పై భారత అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. భారతకాలమాన ప్రకారం ఆదివారం సాయంత్రం జరుగనున్న 65 కేజీల ఫ్రీ స్టయిల్ రెజ్లింగ్‌లో యోగేశ్వర్ బరిలోకి దిగనున్నాడు. హరియాణాకు చెందిన యోగేశ్వర్ రెజ్లింగ్‌లో మరో పతకాన్ని సాధిస్తాడనేది విశ్లేషకుల అంచనా. అయితే ఎన్నో ఆశలతో రియోకు వెళ్లిన మరో రెజ్లర్ నర్సింగ్ యాదవ్ పోరుకు సిద్ధం కాకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. గతంలో అతనిపై వచ్చిన డోపింగ్ ఆరోపణలతో ఒలింపిక్స్ కు దూరం కావాల్సి వచ్చింది. నర్సింగ్ యాదవ్‌కు వ్యతిరేకంగా కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) తీర్పు రావడంతో యోగేశ్వర్పై ప్రభావం చూపే అవకాశం ఉందని ఒక వాదనగా వినబడుతోంది. అయితే గేమ్స్‌లో ఈ తరహా ఘటనలు సహజం కావడంతో యోగేశ్వర్ ఎటువంటి ఒత్తిడి లేకుండానే బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇప్పటికే రెజ్లింగ్‌లో సాక్షి మాలిక్ ఒక పతకం తేవడంతో మరో పతకాన్ని యోగేశ్వర్ కూడా తెస్తాడని యావత్ భారతదేశం ఆశగా ఎదురుచూస్తోంది. మరోవైపు భారత రెజ్లింగ్ ఫ్రీ స్టయిల్ కోచ్ జగ్మిందర్ సింగ్ కూడా యోగేశ్వర్ పతకంపై ఆశాభావం వ్యక్తం చేశారు. తాము ఏది చేయాలో అది చేయడానికి సర్వశక్తులు ఒడ్డుతామని పేర్కొన్నారు. రెజ్లర్ నర్సింగ్ యాదవ్ నిషేధం విధించడం తమను నిరాశకు గురి చేసినా, ప్రస్తుతం భారత్ ఖాతాలో పతకం చేర్చడమే తమ లక్ష్యమన్నారు. ఈ రోజు జరిగే యోగేశ్వర్ రెజ్లింగ్ పోరు కోసం మరోసారి అభిమానులు టీవీలకు అతుక్కుపోయే అవకాశం ఉంది. మొత్తం అన్ని రౌండ్ల రెజ్లింగ్ ఒకేసారి జరుగుతుండటంతో యోగేశ్వర్ ఏం చేస్తాడనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. -
ఆఖరి ఆశ యోగేశ్వర్
రియో ఒలింపిక్స్ చివరి రోజు.. మొత్తం 12 బంగారు పతకాలకోసం పోటీలు జరగనున్నాయి. ఇందులో భారత క్రీడాకారులు రెండు ఈవెంట్లలో పాల్గొననున్నారు. లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యపతక విజేత యోగేశ్వర్ దత్ పురుషుల రెజ్లింగ్‌లో 65 కిలోల ఫ్రీస్టయిల్లో ఆదివారం బరిలో దిగనున్నాడు. భారత్‌కు మరో పతకం వచ్చే అవకాశాలున్న ఈ ఈవెంట్ ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుంచి జరుగుతుంది. మరోవైపు, ముగ్గురు భారత రన్నర్లు (నితేంద్ర సింగ్ రావత్, ఖేతా రామ్, గోపీ థోనక్ల) కూడా ఆదివారం జరిగే మారథాన్‌లో పాల్గొననున్నారు. -
'నర్సింగ్ పై నాకు నమ్మకం ఉంది'
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్‌లో డోపింగ్ వివాదం చోటు చేసుకోవడం చాలా బాధాకరమని లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత యోగేశ్వర్ దత్ అభిప్రాయపడ్డాడు. నర్సింగ్ యాదవ్ డోపింగ్ ఉదంతాన్ని చూస్తే చాలా అనుమానాలకు తావిస్తోందన్నాడు. తన సహచర రెజ్లర్ నర్సింగ్ డోపింగ్ కు పాల్పడ్డాడని తాను అనుకోవడం లేదన్నాడు. దీనిపై కచ్చితంగా ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందన్నాడు. ' ఈ డోపింగ్ వివాదం చాలా దురదృష్టకరం. ఈ అంశంపై దర్యాప్తు జరిపితేనే అసలు విషయ తెలుస్తుంది. నర్సింగ్పై నాకు నమ్మకం ఉంది. ఈ తరహా చర్యలకు నర్సింగ్ పాల్పడతాడని నేను అనుకోవడం లేదు' అని యోగేశ్వర్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు. రియో ఒలింపిక్స్‌లో నర్సింగ్ యాదవ్ పాల్గొంటాడా లేదా అనే విషయం ‘నాడా’ క్రమశిక్షణ సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా నిర్ణయిస్తామని కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయల్ సోమవారం స్సష్టం చేసిన సంగతి తెలిసిందే. నాడా క్లీన్ చిట్ ను బట్టే నర్సింగ్ రియో భవితవ్యం ఆధారపడి వుంటుందన్నాడు. ఈ విషయంలో తాము ఏమీ చేయలేమని, చట్టపరిధిలో ఉన్న ఒక సంఘంలో ఎవ్వరూ తలదూర్చే అవకాశం ఉండదన్నారు. దీంతో నర్సింగ్ కు అవకాశాలు దాదాపు మూసుకుపోయినట్లు కనబడుతోంది.ఒలింపిక్స్ కమిటీ ముందు నర్సింగ్ వాదనను బట్టే అతని రియో బెర్తు అవకాశాలు ఆధారపడివున్నాయి. -
ఒలింపిక్స్‌కు యోగేశ్వర్ అర్హత
ఆసియా క్వాలిఫయింగ్ రెజ్లింగ్ టోర్నీలో స్వర్ణం ఆస్తానా (కజకిస్తాన్): అంచనాలకు అనుగుణంగా రాణించిన స్టార్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ భారత్‌కు రియో ఒలింపిక్స్ బెర్త్‌ను అందించాడు. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో యోగేశ్వర్ దత్ పురుషుల 65 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఫైనల్లో యోగేశ్వర్‌తో తలపడాల్సిన అతని ప్రత్యర్థి కతాయ్ యెర్లాన్బీకీ (చైనా) బరిలోకి దిగకపోవడంతో భారత రెజ్లర్‌ను విజేతగా ప్రకటించారు. ఈ టోర్నీలో ఆయా విభాగాలలో ఫైనల్‌కు చేరిన రెజ్లర్లకు మాత్రమే ఒలింపిక్ బెర్త్ ఖాయమవుతుంది. యోగేశ్వర్ ఫలితంతో ఇప్పటివరకు రెజ్లింగ్‌లో భారత్‌కు రెండు బెర్త్‌లు ఖాయమయ్యాయి. గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నర్సింగ్ యాదవ్ (74 కేజీలు) కాంస్యం సాధించి భారత్‌కు తొలి బెర్త్‌ను అందించాడు. -
కన్హయ్యపై రెజ్లర్ ట్విట్టర్ దాడి
న్యూఢిల్లీ: రెజ్లర్, ఒలింపిక్ పతక విజేత, యోగేశ్వర్ దత్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. గతంలో జెఎన్యూ వివాదంలో సోషల్ మీడియాలో దేశ భక్తియుత కవితను పోస్ట్ చేసిన యోగి ఇపుడు తన దాడిని కన్నయ్యపై ఎక్కుపెట్టారు. ట్విట్టర్ లో జెఎన్యూ విద్యార్థినేత కన్హయ్య కుమార్ కొంతమంది రాజకీయవేత్తలపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది పాములకు పాలుపోసి పెంచితే... పాలు తాగిన ఆ పాములు మన అమర జవాన్లపై ఆరోపణలు గుప్పిస్తున్నాయని మండిపడ్డారు. మన సైనిక సోదరులపై విషాన్ని వెదజల్లుతున్నారంటూ ట్విట్ చేశారు. కాగా జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్‌యూ)లో జాతి వ్యతిరేక కార్యక్రమం జరిగిన నేపథ్యంలో యోగేశ్వర్ ఫేస్ బుక్ లో స్పందించారు. పార్లమెంటుపై దాడి చేసిన అఫ్జల్ గురు అమరవీరుడైతే, లాన్స్ నాయక్, హనుమంతప్ప ఏమవుతారో చెప్పాలని యోగేశ్వర్ ప్రశ్నించారు. దీంతో ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు రాజకీయ నాయకులు ఆయనపై ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. कुछ लोगों ने नाग को दुध पिलाया है जो अब हमारे फ़ौजी भाईयों पर इल्ज़ाम लगा कर उन पे ज़हर उगल रहा है. — Yogeshwar Dutt (@DuttYogi) March 9, 2016 -
యోగేశ్వర్ ‘పట్టు’ అదిరింది
నోయిడా: నిర్ణయాత్మక బౌట్లో ఒలింపిక్ పతక విజేత యోగేశ్వర్ దత్ తన ‘పట్టు’ పవర్‌ను చూపెట్టడంతో... ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యుఎల్)లో హరియాణా హ్యామర్స్ మరో విజయాన్ని నమోదు చేసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో హరియాణా 4-3తో యూపీ వారియర్స్‌పై నెగ్గింది. రెండు జట్లు మూడేసి బౌట్లలో విజయం సాధించడంతో స్కోరు 3-3తో సమానమైంది. ఈ దశలో నిర్ణాయక బౌట్లో హరియాణా ఐకాన్ ప్లేయర్ యోగేశ్వర్ దత్ పురుషుల 65 కేజీల బౌట్లో సంచలన ఆటతీరును చూపెట్టాడు. 9-4తో వికాస్ కుమార్ (యూపీ)ని ఓడించాడు. అద్భుతమైన టెక్నిక్‌తో ఫైనల్ విజిల్ రాకముందే ప్రత్యర్థిని చిత్తు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. అంతకుముందు పురుషుల 74 కేజీల బౌట్లో లివెన్ లోపెజ్ అజుకి (హరియాణా), 57 కేజీల బౌట్లో నితిన్ (హరియాణా), 125 కేజీల బౌట్లో హితేందర్ (హరియాణా) విజయం సాధించారు. ఆదివారం జరిగే మ్యాచ్‌లో బెంగళూరు యోధా స్తో పంజాబ్ రాయల్స్ జట్టు తలపడుతుంది. -
రెజ్లింగ్ లో భారత్ కు గోల్డ్ మెడల్
ఇంచియాన్: ఆసియా క్రీడల్లో భారత్ మూడో స్వర్ణం దక్కించుకుంది. రెజ్లింగ్ లో పసిడి పతకం చేజిక్కించుకుంది. భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్ రెజ్లింగ్ 65 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో విజేతగా నిలిచి దేశానికి మూడో స్వర్ణం అందించాడు. లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించిన యోగేశ్వర్ దత్ ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించడం విశేషం. కాగా మహిళల 400 మీటర్ల రేసులో భారత క్రీడాకారిణి ఎంఆర్ పువ్వమ్మ కాంస్య పతకం నెగ్గింది.