నిరాశపరిచిన యోగేశ్వర్ దత్ | Mandakhnaran Ganzorig beats Yogeshwar in 65kg Qualification set | Sakshi
Sakshi News home page

నిరాశపరిచిన యోగేశ్వర్ దత్

Published Sun, Aug 21 2016 5:15 PM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM

నిరాశపరిచిన యోగేశ్వర్ దత్

నిరాశపరిచిన యోగేశ్వర్ దత్

లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్ రియోలో నిరాశపరిచాడు. ఆదివారం సాయంత్రం జరిగిన 65 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో క్వాలిఫికేషన్ రౌండ్లోనే ఓటమి పాలయ్యాడు.  భారత రెజ్లర్ యోగేశ్వర్ పై 3-0 తేడాతో మంగోలియాకు చెందిన రెజ్లర్ మందక్నరన్ గంజోరిజ్ విజయాన్ని సాధించాడు. బౌట్ ప్రారంభం నుంచి పట్టుకోసం యోగేశ్వర్ ప్రయత్నించగా మంగోలియా రెజ్లర్ ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. దీంతో తొలి రౌండ్లో అతడు 1-0 తో ఆధిక్యాన్ని ప్రదర్శించాడు. రెండో రౌండ్లోనూ ఇదే జోరులో మరో రెండు పాయింట్లు సాధించి బౌట్ నెగ్గాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement