ఆఖరి ఆశ యోగేశ్వర్ | last hope to Yogeshwar | Sakshi
Sakshi News home page

ఆఖరి ఆశ యోగేశ్వర్

Aug 21 2016 12:57 AM | Updated on Sep 4 2017 10:06 AM

ఆఖరి ఆశ యోగేశ్వర్

ఆఖరి ఆశ యోగేశ్వర్

రియో ఒలింపిక్స్ చివరి రోజు.. మొత్తం 12 బంగారు పతకాలకోసం పోటీలు జరగనున్నాయి. ఇందులో భారత క్రీడాకారులు రెండు ఈవెంట్లలో పాల్గొననున్నారు.

రియో ఒలింపిక్స్ చివరి రోజు.. మొత్తం 12 బంగారు పతకాలకోసం పోటీలు జరగనున్నాయి. ఇందులో భారత క్రీడాకారులు రెండు ఈవెంట్లలో పాల్గొననున్నారు. లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యపతక విజేత యోగేశ్వర్ దత్ పురుషుల రెజ్లింగ్‌లో 65 కిలోల ఫ్రీస్టయిల్‌లో ఆదివారం బరిలో దిగనున్నాడు.

భారత్‌కు మరో పతకం వచ్చే అవకాశాలున్న ఈ ఈవెంట్ ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుంచి జరుగుతుంది. మరోవైపు, ముగ్గురు భారత రన్నర్లు (నితేంద్ర సింగ్ రావత్, ఖేతా రామ్, గోపీ థోనక్ల) కూడా ఆదివారం జరిగే మారథాన్‌లో పాల్గొననున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement