రూపాయి కట్నంతో యోగేశ్వర్...
న్యూఢిల్లీ:లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో స్ఫూర్తిగా నిలిచిన యోగేశ్వర్ దత్ తాజాగా తన పెళ్లితో అందరికి ఆదర్శంగా నిలిచాడు. వివాహానికి వరకట్నంగా అతను ఒక్క రూపాయి మాత్రమే తీసుకున్నాడు. ఇతరత్రా కానుకల్ని కూడా డిమాండ్ చేయలేదని రెజ్లర్ తల్లి సుశీలా దేవి వెల్లడించారు.
‘అక్కాచెల్లెళ్ల వివాహాలకు కట్నం కోసం నా కుటుంబం పడిన పాట్లు నేను చూశాను. అందుకే కట్నం తీసుకోకూడదని అప్పట్లోనే నిర్ణరుుంచుకున్నా. నా జీవితంలో నేను అనుకున్న రెండూ సాధించాను. మొదటిది రెజ్లర్‌గా రాణించడం... రెండోది కట్నం లేకుండా వివాహమాడటం’ అని 34 ఏళ్ల దత్ చెప్పాడు. కాంగ్రెస్ నేత జై భగవాన్ శర్మ కుమార్తె శీతల్‌ను సోమవారం యోగేశ్వర్ పెళ్లిచేసుకోనున్నాడు. ఢిల్లీలో ఈ వేడుక జరుగనుంది.