
రెజ్లింగ్ లో భారత్ కు గోల్డ్ మెడల్
ఇంచియాన్: ఆసియా క్రీడల్లో భారత్ మూడో స్వర్ణం దక్కించుకుంది. రెజ్లింగ్ లో పసిడి పతకం చేజిక్కించుకుంది. భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్ రెజ్లింగ్ 65 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో విజేతగా నిలిచి దేశానికి మూడో స్వర్ణం అందించాడు. లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించిన యోగేశ్వర్ దత్ ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించడం విశేషం.
కాగా మహిళల 400 మీటర్ల రేసులో భారత క్రీడాకారిణి ఎంఆర్ పువ్వమ్మ కాంస్య పతకం నెగ్గింది.