
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్ సరిహద్దులోని బీఎస్‌ఎఫ్ పోస్ట్‌పై మంగళవారం ఉదయం జరిగిన ఉగ్రదాడిని 2012 ఒలంపిక్ పతక విజేత యోగేశ్వర్ దత్ తీవ్రంగా ఖండించారు. బీఎస్‌ఎఫ్ బలగాలపై జరిగిన దాడిని.. ఆయన పిచ్చిచేష్టలుగా అభవర్ణించారు. ఉగ్రవాదుల చేష్టలే నేడు క్యాన్సర్ కారకాలుగా మారాయని ఆయన అభివర్ణించారు. నేడు ఉగ్రవాదం ప్రపంచమంతా క్యాన్సర్‌లా విస్తరించిందని చెప్పారు. ఉగ్రదాడిని ఖండిస్తూ ఆయన ట్విటర్‌లో ట్వీట్ చేశారు. ఈ ప్రపంచంలో కేవలం ఉగ్రవాదులు మాత్రమే జీవించాలని వాళ్లు కోరుకుంటున్నట్లు ఉందని చెప్పారు.
आतंकी हमला आम बात हो गयी है,सारे विश्व मे ये कैन्सर जड़ जमा चुका है।क्या चाहते है आख़िर ये?अकेले रहेंगे सारी धरती पर?मर जाए या मार दे?पागलपन https://t.co/nIjE211KhV
— Yogeshwar Dutt (@DuttYogi) October 3, 2017