BSF camp
-
టీవీ బాంబు కలకలం
మల్కన్‌గిరి: ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా మత్తిలి సమితి ఉదిరిబెడ గ్రామం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మావోయిస్టులు టీవీలో పెట్టిన బాంబును బీఎస్ఎఫ్ జవాన్లు పేల్చివేశారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలావున్నాయి. మల్కన్‌గిరి జిల్లా మత్తిలి సమితి ఉదిరిబెడ గ్రామం సమీపంలో ఓ చెట్టు వద్ద మావోయిస్టులు టీవీలో బాంబు పెట్టి ఉంచారు. మల్కన్‌గిరి–జయపురం రోడ్డు పక్కన దీనిని పెట్టారు. ఈ ప్రాంతం బీఎస్ఎఫ్ క్యాంప్‌నకు సుమారు 200 మీటర్ల దూరం ఉంటుంది. అయితే చెట్టు వద్ద టీవీ ఉండడం గమనించిన స్థానికులు బీఎస్ఎఫ్ జవాన్లకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. టీవీలో బాంబు ఉన్నట్టు గుర్తించారు. వెంటనే బాంబు స్క్వాడ్ తీసుకొచ్చి మరో బాంబుతో టీవీలో ఉన్న బాంబును పేల్చివేశారు. ఈ సంఘటన నేపథ్యంలో మల్కన్‌గిరి–జయపురం రహదారిలో సుమారు మూడు గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిపివేశారు. దీంతో సుమారు కిలోమీటరు మేర వాహనాలు బారులు తీరాయి. ప్రయాణికులు, వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ ఘటనపై మల్కన్‌గిరి ఎస్పీ జోగ్‌మోహన్ మిన్నా మాట్లాడుతూ బీఎస్ఎఫ్ క్యాంప్‌నకు సుమారు 200 మీటర్ల దూరం టీవీ ఉండడంతో అందులో బాంబు ఉందేమోనని అనుమానం వచ్చిందన్నారు. దీంతో బాంబు స్క్వాడ్ తీసుకొచ్చి టీవీని పరిశీలించి అందులో బాంబును పేల్చివేశామన్నారు. -
బీఎస్ఎఫ్ క్యాంప్‌పై ఉగ్ర దాడి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చి పోయారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే శ్రీనగర్ విమానాశ్రయం సమీపంలోని బీఎస్ఎఫ్ క్యాంప్‌పై పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. అయితే ఉగ్రవాదుల చర్యను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఏఎస్ఐ కన్నుమూశాడు. బాంబులతో దాడి.. గోగోల్యాండ్లోని శ్రీనగర్ ఎయిర్‌పోర్టును ఆనుకుని ఉన్న బీఎస్ఎఫ్ 182 బెటాలియన్ హెడ్క్వార్టర్స్లోకి మంగళవారం ఉదయం ముగ్గురు ఉగ్రవాదులు ప్రవేశించి కాల్పులకు తెగబడ్డారని, ఈ కాల్పుల్లో బీఎస్ఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ బీకే యాదవ్(50) మరణించగా.. మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారని జమ్మూకశ్మీర్ డీజీపీ ఎస్పీ వైద్ చెప్పారు. ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చినట్టు వెల్లడించారు. అయితే ఉగ్రవాదులు బాంబులను పెట్టి ఉండొచ్చనే అనుమానంతో గాలింపు చర్యలు చేపట్టామన్నారు . ఘటనపై కశ్మీర్ రేంజ్ ఐజీ మునీర్‌ఖాన్ విలేకరులతో మాట్లాడుతూ.. ఆర్మీ దుస్తుల్లో సమీప నివాస గృహాల నుంచి కంచెను కత్తిరించి ఉగ్రవాదులు లోనికి ప్రవేశించినట్టు చెప్పారు. జైషే ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడ్డారా అని ప్రశ్నించగా.. ఇటువంటి దాడులకు పాల్పడేది ఆ గ్రూప్ ఒక్కటే అని ఆయన తెలిపారు. ఈ గ్రూపులో ఇంకా ఆరు నుంచి ఏడుగురు ఉగ్రవాదులు ఉండొచ్చని, వీరికి సహాయ సహకారాలు అందిస్తున్న వారిని గుర్తించామని చెప్పారు. నిలిచిన విమాన సేవలు: ఉగ్ర దాడి నేపథ్యంలో శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌లో పౌర విమానయాన సేవలు మూడు గంటల పాటు నిలిచిపోయాయి. ఉదయం పది గంటల తర్వాత సేవలను పునరుద్ధరించారు. కాగా, ఈ దాడికి పాల్పడింది తామే అని జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటిం చుకుంది. శ్రీనగర్ విమానాశ్రయం వద్ద ఆత్మాహుతి దాడిని తిప్పికొట్టిన భద్రతా దళాలపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రశంసల జల్లు కురిపించారు. పూంచ్‌లో జవాన్ మృతి: పూంచ్ జిల్లాలో పాక్ బలగాలు జరిపిన కాల్పుల్లో ఓ సైనికుడు మృతి చెందాడు. ఎదురుకాల్పుల్లో జవాన్ నాయక్ మహేంద్ర చెమ్జంగ్(35) మరణించారు. క్రిష్ణ ఘాటి సెక్టార్లో పాక్ ఆర్మీ కవ్వింపు చర్యలకు దిగడంతో భారత సైనికులు దీటుగా బదులిచ్చారని ఆర్మీ వర్గాలు తెలిపాయి. -
ఉగ్రవాదులు... క్యాన్సర్ కారకాలే!
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్ సరిహద్దులోని బీఎస్ఎఫ్ పోస్ట్‌పై మంగళవారం ఉదయం జరిగిన ఉగ్రదాడిని 2012 ఒలంపిక్ పతక విజేత యోగేశ్వర్ దత్ తీవ్రంగా ఖండించారు. బీఎస్ఎఫ్ బలగాలపై జరిగిన దాడిని.. ఆయన పిచ్చిచేష్టలుగా అభవర్ణించారు. ఉగ్రవాదుల చేష్టలే నేడు క్యాన్సర్ కారకాలుగా మారాయని ఆయన అభివర్ణించారు. నేడు ఉగ్రవాదం ప్రపంచమంతా క్యాన్సర్‌లా విస్తరించిందని చెప్పారు. ఉగ్రదాడిని ఖండిస్తూ ఆయన ట్విటర్లో ట్వీట్ చేశారు. ఈ ప్రపంచంలో కేవలం ఉగ్రవాదులు మాత్రమే జీవించాలని వాళ్లు కోరుకుంటున్నట్లు ఉందని చెప్పారు. आतंकी हमला आम बात हो गयी है,सारे विश्व मे ये कैन्सर जड़ जमा चुका है।क्या चाहते है आख़िर ये?अकेले रहेंगे सारी धरती पर?मर जाए या मार दे?पागलपन https://t.co/nIjE211KhV — Yogeshwar Dutt (@DuttYogi) October 3, 2017 -
ఒకేరోజు మూడుసార్లు ఉల్లంఘన
జమ్మూ: సరిహద్దులో పాకిస్థాన్ ఆర్మీ బరితెగిస్తోంది. కాల్పుల విరమణ ఉల్లంఘనలో శ్రుతిమించిపోతోంది. సోమవారం ఒక్కరోజే పాక్ ఆర్మీ జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్, సాంబా జిల్లాల్లో భారత ఆర్మీ ఔట్‌పోస్టులపై మూడు పర్యాయాలు కాల్పులకు తెగబడింది. మోర్టార్లు, రాకె ట్లను భారీగా ప్రయోగించింది. భారత సైనికులు వీటిని అంతే దీటుగా తిప్పికొట్టారు. ఇరు పక్షాల మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. పాక్ గత మూడు రోజుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇది ఏడోసారి. ఆ దేశ బలగాలు ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం 6 గంటల మధ్య పూంచ్ సరిహద్దు, దిగావర్, మాన్‌కోటే, దుర్గా బెటాలియన్ ప్రాంతాల్లోని 11 పోస్టులపై భారీ కాల్పులు జరిపాయి. సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో సాంబాలోని కోతాయ్ ఔట్ పోస్టుపై, రాత్రి 9.20 ప్రాంతంలో పూంచ్‌లోని మెంధార్ సబ్ సెక్టార్ పోస్టుపై కాల్పులకు పాల్పడ్డాయి. బీఎస్ఎఫ్ జవాన్లు పాక్ సైనికులకు గట్టి సమాధానమిచ్చారు. తమ వైపు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని భారత ఆర్మీ అధికారులు తెలిపారు. మరోపక్క.. భారత ఆర్మీ తమ అధీనంలోని కాశ్మీర్(పీఓకే)లో కాల్పులు జరపడంతో ఒక పౌరుడు చనిపోయాడని పాక్ విదేశాంగ శాఖ ఆరోపించింది. ఇస్లామాబాద్‌లోని భారత డిప్యూటీ హై కమిషనర్ గోపాల్ బాగ్లేను పిలిపించుకుని నిరసన తెలిపింది.