
కన్హయ్యపై రెజ్లర్ ట్విట్టర్ దాడి
న్యూఢిల్లీ: రెజ్లర్, ఒలింపిక్ పతక విజేత, యోగేశ్వర్ దత్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. గతంలో జెఎన్యూ వివాదంలో సోషల్ మీడియాలో దేశ భక్తియుత కవితను పోస్ట్ చేసిన యోగి ఇపుడు తన దాడిని కన్నయ్యపై ఎక్కుపెట్టారు. ట్విట్టర్ లో జెఎన్యూ విద్యార్థినేత కన్హయ్య కుమార్ కొంతమంది రాజకీయవేత్తలపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది పాములకు పాలుపోసి పెంచితే... పాలు తాగిన ఆ పాములు మన అమర జవాన్లపై ఆరోపణలు గుప్పిస్తున్నాయని మండిపడ్డారు. మన సైనిక సోదరులపై విషాన్ని వెదజల్లుతున్నారంటూ ట్విట్ చేశారు.
కాగా జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్‌యూ)లో జాతి వ్యతిరేక కార్యక్రమం జరిగిన నేపథ్యంలో యోగేశ్వర్ ఫేస్ బుక్ లో స్పందించారు. పార్లమెంటుపై దాడి చేసిన అఫ్జల్ గురు అమరవీరుడైతే, లాన్స్ నాయక్, హనుమంతప్ప ఏమవుతారో చెప్పాలని యోగేశ్వర్ ప్రశ్నించారు. దీంతో ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు రాజకీయ నాయకులు ఆయనపై ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.
कुछ लोगों ने नाग को दुध पिलाया है जो अब हमारे फ़ौजी भाईयों पर इल्ज़ाम लगा कर उन पे ज़हर उगल रहा है.
— Yogeshwar Dutt (@DuttYogi) March 9, 2016