
కన్నయ్య కుమార్(ఫైల్ ఫోటో)
పాట్నా : జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ కాన్వాయ్ మీద దాడి జరిగింది. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు.. కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి. అయితే ఈ దాడికి పాల్పడిన వారి గురించి ఎటువంటి వివరాలు తెలియరాలేదు. కొన్ని రోజుల క్రితం కన్నయ్య మీద ఎయిమ్స్ డాక్టర్, సెక్యూరిటీ గార్డ్ కేసు పెట్టారు. కన్నయ్య తమతో తప్పుగా ప్రవర్తించాడని తమ ఫిర్యాదులో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా కన్నయ్య వచ్చే ఏడాది ఎన్నికల్లో సీపీఐ తరపున పోటి చేయనున్నారు.