
యోగేశ్వర్ దత్ నిశ్చితార్థం
భారత అగ్రశ్రేణి రెజ్లర్, ఒలింపిక్ పతక విజేత యోగేశ్వర్ దత్ త్వరలో ఒక ఇంటివాడు కానున్నాడు.
న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి రెజ్లర్, ఒలింపిక్ పతక విజేత యోగేశ్వర్ దత్ త్వరలో ఒక ఇంటివాడు కానున్నాడు. ఢిల్లీకి చెందిన షీతల్‌తో అతని వివాహ నిశ్చితార్థం ఆదివారం జరిగింది. వచ్చే జనవరి 16న వీరి పెళ్లి జరుగుతుంది. బీఏ విద్యార్థిని అయిన షీతల్... స్థానిక కాంగ్రెస్ నేత జై భగవాన్ శర్మ కూతురు. నిశ్చితార్థ కార్యక్రమానికి ప్రముఖ రాజకీయ నాయకులు, రెజ్లింగ్ సమాఖ్య అధికారులు హాజరయ్యారు.
2012 లండన్ ఒలింపిక్స్‌లో యోగేశ్వర్ కాంస్యం గెలుచుకోగా... నాడు రజతం గెలిచిన కుడుఖోవ్ డోపింగ్‌లో పట్టుబడటంతో యోగి సాధించిన కాంస్యం రజత పతకంగా మారింది.