కన్హయ్యపై చెప్పులు, షూలతో దాడి | Kanhaiya Kumar attacked with slippers, shoes at Nagpur rally | Sakshi
Sakshi News home page

కన్హయ్యపై చెప్పులు, షూలతో దాడి

Published Thu, Apr 14 2016 5:01 PM | Last Updated on Fri, Oct 19 2018 7:37 PM

కన్హయ్యపై చెప్పులు, షూలతో దాడి - Sakshi

కన్హయ్యపై చెప్పులు, షూలతో దాడి

నాగ్పూర్: నాగ్ పూర్ ర్యాలీ రసాభాసగా మారింది. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 వ జయంతి సందర్భంగా జేఎన్యూ విద్యార్థి యూనియన్ ప్రెసిడెంట్ కన్హయ్య కుమార్ నిర్వహించిన ర్యాలీలో చెప్పులు, బూట్లు గాల్లోకి లేచాయి. కుప్పలుగా కొందరు వ్యక్తులు కన్హయ్య కుమార్ పై చెప్పులు, షూలతో దాడి చేశారు. నాగ్ పూర్ లో నిర్వహించిన బహిరంగ సభలో వేదిక వద్దకు తొలుత కన్హయ్య వచ్చాడు.

అలా వచ్చాడో లేదో వెంటనే ఒక్కసారిగా చెప్పులు, షూలు అతడిపైకి కొందరు వ్యక్తులు విసిరారు. కన్హయ్య కుమార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చెప్పులు విసరడం ద్వారా ఎలాంటి దేశభక్తిని చూపించాలని అనుకుంటున్నారని కన్హయ్య కుమార్ ఈ సందర్భంగా వారిని ప్రశ్నించాడు. అంతకుముందు నాగ్ పూర్ లోకి ప్రవేశించగానే కన్హయ్య కుమార్ కారుపై బజరంగ్ దళ్ కు చెందిన కొందరు వ్యక్తులు దాడి చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement