ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరుకున్నాయి. అక్టోబరు 1న తమ దేశంపై దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఇరాన్‌పై విరుచుకుపడుతోంది. ఇరాన్‌లోని సైనిక స్థావరాలపై బాంబుల, క్షిపణుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో ఇరాన్‌లో క్షిపణి తయారీలో వినియోగించే ఘన ఇంధన మిశ్రమాన్ని తయారు చేసే డజనుకుపైగా ప్రదేశాలను ఇజ్రాయెల్ సైన్యం ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది.
ఇజ్రాయెల్ దాడులతో టెహ్రాన్‌లోని అణు శక్తి కేంద్రానికి రక్షణగా ఉన్న ఎస్-300 గగనతల రక్షణ వ్యవస్థను కూడా దారుణంగా దెబ్బతీసినట్లు సమాచారం. ఈ దాడులతో టెహ్రాన్‌కు భారీ నష్టం వాటిల్లినట్లు తెలిసింది.
ఇక ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చేసిన వివాదాస్పద ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. సామాజిక మాధ్యమం ద్వారా ఇజ్రాయెల్‌ను బెదిరిస్తూ పోస్టు పెట్టారు. జియోనిస్ట్ పాలకుల (ఇజ్రాయెల్) దుర్మార్గాన్ని తక్కువగా అంచనా వేయకూడదు లేదా అతిశయోక్తి చేయకూడదని అన్నారు. ఇరాన్ శక్తిని ఇజ్రాయెల్‌కు చూపాలని పిలుపునిచ్చారు. దీంతో ఆయన ట్వీట్ చేసిన ఖాతాను ‘ఎక్స్’ సస్పెండ్ చేసింది.
‘రెండు రాత్రుల క్రితం జరిగిన ఇజ్రాయెల్ దుష్టపాలన చర్యలను అతిశయోక్తి చేయకూడదు. లేదా తక్కువగా అంచనా వేయకూడదు. ఇజ్రాయెల్ పాలకుల తప్పుడు లెక్కలను భంగం చేయాలి. ఇరాన్ శక్తి, దేశ యువత బలం, సంకల్పం, చొరవను వారికి అర్థం చేయడం చాలా అవసరం’ అని అన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు వాడటంతో ఆ ఖాతాను ఎక్స్ సస్పెండ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment