టెహ్రాన్: ఇజ్రాయెల్ దాడిలో హమాస్ నేత యాహ్యా సిన్వర్ మృతి చెందినప్పటికీ హమాస్ ఉనికి విషయంలో ఎటువంటి సమస్య లేదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అన్నారు. ఆయన యాహ్యా సిన్వర్ మృతి చెందిన అనంతరం తొలిసారి స్పందించారు. సిన్వర్ మృతి బాధ కలిగిస్తోందని, అయినప్పటికీ ఆయన మృతితో హమాస్ ఉనికి కోల్పోపోయినట్లు కాదని అన్నారు.
The loss of Yahya #alSinwar is painful for the Resistance Front. But this front didn’t halt its progress in wake of the martyrdoms of eminent figures like Sheikh Ahmed Yassin, Fathi Shaqaqi, Rantisi, & Ismail Haniyeh. Similarly, it won’t falter with Sinwar’s martyrdom either.
— Khamenei.ir (@khamenei_ir) October 19, 2024
‘‘సిన్వర్ మృతి హమాస్‌కు నష్టం. ఆయన మృతి చాలా బాధాకరం. కానీ హమాస్ ప్రముఖ నేతల బలిదానంతో ముందుకు సాగడం మానలేదు. హమాస్ సజీవంగా ఉంది.. సజీవంగానే ఉంటుంది. హమాస్ నేత మరణానికి సంతాపం తెలియజేస్తున్నాం. ఆయన ఒక ‘వీరోచిత ముజాహిద్’. దోపిడీ చేసే క్రూరమైన శత్రువుతో పోరాడటానికి తన జీవితాన్ని అంకితం చేశారు. నిజాయితీగల పాలస్తీనా ముజాహిదీన్, యోధుల పక్షాన నిలబడటం కొనసాగిస్తాం’’ అని అన్నారు.
Hamas is alive and will stay alive.
Yahya #Sinwar— Khamenei.ir (@khamenei_ir) October 19, 2024
ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7న దాడికి ఆదేశించిన హమాస్ నాయకుడు యాహ్యా సిన్వార్ శుక్రవారం మృతి చెందారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) అక్టోబర్ 17 చేసిన దాడిలో ఆయన మృతి చెందారని ప్రకటించింది. ఇజ్రాయెల్ టార్గెట్ చేసిన హమాస్ నేతల్లో ముఖ్యమైన నేత సిన్వర్ ఒకరు. ఇజ్రాయెల్ యాహ్యా సిన్వార్ చివరి క్షణాలను చూపించే డ్రోన్ ఫుటేజీని విడుదల చేసింది.
మరోవైపు.. తమ నాయకుడు యాహ్యా సిన్వార్ మృతిని హమాస్ ధృవీకరించింది. గాజాలో దురాక్రమణ ముగిసే వరకు అక్టోబర్ 7న తాము బంధీలుగా చేసుకున్న ఇజ్రాయెల్ పౌరులను ఎట్టిపరిస్థితుల్లో విడుదల చేయబోమని ప్రతిజ్ఞ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment