హమాస్‌ సిన్వర్‌ పోస్టుమార్టం రిపోర్టు.. తలలో బుల్లెట్‌, చేతి వేలు కత్తిరించి.. | Hamas Yahya Sinwar Autopsy Report Bullet In Head And Finger Cut Off | Sakshi
Sakshi News home page

హమాస్‌ సిన్వర్‌ పోస్టుమార్టం రిపోర్టు.. తలలో బుల్లెట్‌, చేతి వేలు కత్తిరించి..

Published Sat, Oct 19 2024 9:12 AM | Last Updated on Sat, Oct 19 2024 2:17 PM

Hamas Yahya Sinwar Autopsy Report Bullet In Head And Finger Cut Off

జెరూసలేం: ఇజ్రాయెల్‌ సైన్యం చేతిలో హమాస్‌ చీఫ్‌ యాహ్యా సిన్వార్ మృతిచెందాడు. ఈ క్రమంలో సిన్వర్‌ పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. సిన్వర్‌ తలపై బుల్లెట్‌ గాయం, ఎడమ చేతికి ఒక వేలును కట్‌ చేసినట్టు రిపోర్టులో వెల్లడించారు. బుల్లెట్‌ గాయంతోనే సిన్వర్‌ చనిపోయినట్టు నిర్ధారించారు.

ఇజ్రాయెల్‌ దాడుల్లో సిన్వర్‌ మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా హమాస్‌ అధినేత సిన్వర్‌ మృతదేహానికి డాకట్ర్‌ చెన్‌ కుగేల్‌ పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఈ క్రమంలో తలపై బుల్లెట్‌ గాయం ఉందని, దాని కారణంగానే అతడు మరణించి ఉంటాడని పోస్టుమార్టం రిపోర్టులో పేర్కొన్నారు. అంతేకాకుండా సిన్వర్‌ ఎడమ చేతికి ఐదు వేళ్లలో ఒక వేలు లేదని తెలిపారు. దీంతో, రిపోర్టు సంచలనంగా మారింది.

అయితే, దాడుల్లో చనిపోయిన వ్యక్తి సిన్వర్‌ అవునా.. కాదా? అని నిర్ధారించుకునేందుకే అతడి వేలిని ఇజ్రాయెల్‌ సైన్యం కత్తిరించినట్టు కథనాలు వెలువడ్డాయి. ఖైదీల మార్పిడి ఒప్పందంలో 2011లో విడుదలయ్యే వరకు సిన్వర్ రెండు దశాబ్దాల పాటు ఇజ్రాయెల్ జైలులో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆనాటి ప్రొఫైల్‌తో డీఎన్‌ఏ నిర్ధారణ కోసం అతని వేలును కత్తిరించినట్టు తెలుస్తోంది. మరోవైపు.. అతడి దంతాలను కూడా కత్తిరించినట్టు వార్తలు బయటకు వస్తున్నాయి.

 

 

ఇదిలా ఉండగా.. హమాస్‌ చీఫ్‌ సిన్వర్‌ చనిపోవడానికి ముందు అతడు ఉన్న పరిస్థితిని ఇజ్రాయెల్‌ సైన్యం ఓ డ్రోన్‌ ద్వారా రికార్డు చేసింది. మరణానికి ముందు సిన్వర్‌ ఓ శిథిల భవనంలో సోఫా కుర్చీలో కూర్చొని ఉన్నాడు. అప్పటికే అతడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయాల నుంచి రక్తం కారుతోంది. కూర్చున్న చోటు నుంచి లేవలేని నిస్సహాయత స్పష్టంగా కనిపిస్తోంది. శరీరమంతా దుమ్ము కప్పేసి ఉంది. అలాంటి పరిస్థితిలో.. తనవైపుగా వస్తున్న డ్రోన్‌పైకి కర్రలాంటి ఓ వస్తువును విసిరాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement