అమెరికా, ఇజ్రాయెల్‌కు ఖమేనీ హెచ్చరిక
దుబాయ్/టెహ్రాన్: గత నెలాఖరులో ఇజ్రాయెల్ తమ మిలటరీ లక్ష్యాలపై చేపట్టిన దాడులపై ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమెనీ తీవ్రంగా స్పందించారు. దిమ్మతిరిగేలా బదులిచ్చి తీరతామంటూ అమెరికా, ఇజ్రాయెల్‌లను హెచ్చరించారు. ‘‘మాకు, హెజ్‌బొల్లా, హమాస్ వంటి మా మిత్ర గ్రూపులకు హాని తలపెడుతున్నందుకు తగు మూల్యం చెల్లించుకోకతప్పదు. మాపై, మా మిత్ర దేశాలపై దాడులకు దిగితే తీవ్ర పరిణామాలుంటాయి.
శత్రువులను పూర్తిగా అణగదొక్కేలా మా ప్రతిస్పందన ఉంటుందని అమెరికా, ఇజ్రాయెల్ గ్రహించాలి. అనవసరంగా మా జోలికి రావొద్దు. ఇబ్బందుల్లో పడొద్దు’’అని శనివారం టెహ్రాన్ వర్సిటీ విద్యార్థులతో జరిగిన సమావేశంలో ఖమేనీ పేర్కొన్నారు. ఇరాన్ అధికారిక టీవీ చానల్ ఈ మేరకు తెలిపింది. ‘మా నరాల్లో ప్రవహిస్తున్న రక్తం మా నాయకుడికి బహుమానం’అంటూ ఖమేనీకి మద్దతుగా విద్యార్థులు భారీగా నినాదాలు చేశారు.
హమాస్, హెజ్‌బొల్లా అగ్ర నాయకులు హతమైన నేపథ్యంలో ఇరాన్ అక్టోబర్ ఒకటో తేదీన ఇజ్రాయెల్‌పై పెద్ద సంఖ్యలో క్షిపణులతో విరుచుకుపడింది. ప్రతిగా ఇజ్రాయెల్ గత శనివారం ఇరాన్‌లోని సైనిక లక్ష్యాలపై దాడులు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు పక్షాల్లో ఎవరు ఎవరిపై దాడికి దిగినా పశి్చమాసియా అగి్నగుండం అవుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్, అమెరికా శత్రు దేశాలుగా మారడానికి కారణమైన ఘటనకు ఆదివారం 45 ఏళ్లు నిండనుండటం మరింత ఉత్కంఠ కలిగిస్తోంది. 1979 నవంబర్ 4న ఇరాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని ఇస్లామిస్టు విద్యార్థులు దిగ్బంధించారు. సిబ్బందిని కార్యాలయంలోని బంధించారు. ఈ సంక్షోభం ఏకంగా 444 రోజులు కొనసాగింది. నాటినుంచే ఇరాన్, అమెరికా శత్రు దేశాలుగా మారిపోయాయి.
ఇజ్రాయెల్‌కు మరింత సాయం
ఇజ్రాయెల్‌కు అమెరికా మరింత సాయం ప్రకటించింది. అగి్నమాపక ఎయిర్ ట్యాంకర్ విమానాలు, బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థలు, ఫైటర్ విమానాలు, లాంగ్ రేంజ్ బి–52 బాంబర్లను పశి్చమాసియాకు తరలించనున్నట్లు శనివారం పేర్కొంది. అమెరికా ఇప్పటికే ఇజ్రాయెల్‌కు గగనతల రక్షణ వ్యవస్థలను, భారీగా సైనిక, ఆయుధ సామగ్రిని సమకూర్చడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment