న్యూయార్క్: పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలుస్తోంది. ఈ క్రమంలో ఇరాన్‌కు హెచ్చరికగా అగ్రరాజ్యం అమెరికా చర్యలు చేపట్టింది. పశ్చిమాసియాలో బాలిస్టిక్ క్షిపణి రక్షణ డెస్ట్రాయర్లు, దీర్ఘ-శ్రేణి బీ-52 బాంబర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో సహా అదనపు సైనిక పరికరాలు మోహరిస్తున్నట్లు అమెరికా శుక్రవారం ప్రకటించింది. ఇరాన్, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇదొక హెచ్చరిక అని పేర్కొంది.
"ఇరాన్.. ఆదేశ అనుబంధ మిలిటెంట్ గ్రూపులను అమెరికన్ సిబ్బంది లేదా మిత్రదేశాల ప్రాంత ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకోవడానికి వినియోగిస్తే అమెరికా సైతం మా ప్రజలను రక్షించుకునేందుకు అవసరమైన ప్రతి చర్యను తీసుకుంటుంది. మిడిల్ ఈస్ట్‌లో ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా అదనపు సైనిక, రక్షణ వనరులను విస్తరిస్తాం. గత నెల చివరిలో మోహరించిన THAAD క్షిపణి రక్షణ వ్యవస్థతో సహా అమెరికా సైన్యం నిర్వహిస్తుంది. అదనపు సైన్యం.. రాబోయే నెలల్లో రావడం మొదలవుతుంది’’ అని పెంటగాన్ ప్రతినిధి మేజర్ జనరల్ పాట్ రైడర్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
అక్టోబరు 26న ఇరాన్‌పై ఇజ్రాయెల్ భారీ దాడులతో విరుచుకుపడింది. కీలకమైన సైనిక, ఆయిల్ స్థావరాల మౌలిక సదుపాయాలను నాశనం చేసింది. మరోవైపు.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఇరాన్.. ఇజ్రాయెల్‌పై రెండుసార్లు మిసైల్స్‌తో దాడులకు దిగింది. ఏప్రిల్‌లో డమాస్కస్‌లోని తన కాన్సులేట్‌పై ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసిందని ఆరోపణలు వచ్చాయి. అనంతరం ఇరాన్.. ఇజ్రాయెల్ దాడి చేసింది. తమ దేశం మద్దతు ఇస్తున్న మిలిటెంట్ గ్రూప్ నేతల హత్యకు ప్రతిస్పందనగా అక్టోబర్‌లో మరోసారి ఇజ్రాయెల్‌పై విరుచుకుపడిన విషయం తెలిసిందే.
చదవండి: ఇజ్రాయెల్ హై అలర్ట్.. ఇరాన్ ప్రతీకార దాడి చేస్తుందని అనుమానం
Comments
Please login to add a commentAdd a comment