టెహ్రాన్: గతేడాది అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపు దాడి చేసి.. సుమారు 250పైగా ఇజ్రాయెల్ పౌరులను గాజాకు బంధీలుగా తీసుకువెళ్లారు. అయితే.. ఇజ్రాయెల్‌పై దాడులకు ముందు హమాస్ బలగాలు ఇరాన్‌ను సంప్రదించారని ‘న్యూయార్క్ టైమ్స్’ మీడియా ఓ నివేదికను ప్రచురిచింది. దీనిపై తాజాగా ఇరాన్ స్పందించింది. ఆ నివేదికను ఇరాన్ తిరస్కరించింది. గతేడాది ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన దాడుల్లో టెహ్రాన్ పాత్ర లేదని న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ఇరాన్ శాశ్వత మిషన్ స్పష్టం చేసింది.
‘‘ఖతార్ రాజధాని దోహాలో ఉన్న హమాస్ అధికారులు ఇజ్రాయెల్‌పై దాడి ఆపరేషన్ గురించి తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. గాజాలో ఉన్న హమాస్ సైనిక విభాగం మాత్రమే ఆ దాడి ప్రణాళికను రచించుకున్నాయి. హమాస్ మమ్మల్ని ఇజ్రాయెల్‌పై వారు చేసే దాడికి కలిసి రావాలని సంప్రదించలేదు. అసలు దాడి చేసే సమాచారం కూడా మాకు ఇవ్వలేదు. ఆ దాడికి సంబంధించి ఇరాన్, హెజ్‌బొల్లాను లింక్ చేయడం సరికాదు. న్యూయార్క్ టైమ్స్ మీడియా ప్రచురించిన నివేదిక పూర్తిగా కల్పితం. అందులో ఎటువంటి నిజం లేదు’’ అని ఇరాన్ పేర్కొంది.
అక్టోబర్ 7 తేదీ ఘటన తర్వాత తమ హమాస్ చెరలో బంధీలుగా ఉన్న పౌరులను విడిపించుకోవటంతో పాటు, ఆ గ్రూప్‌ను అంతం చేయాలనే లక్ష్యంతో గాజాగాపై ఇజ్రాయెల్ సైన్యం పెద్ద ఎత్తున దాడులు కొనసాగిస్తోంది. హమాస్ బలగాలే లక్ష్యంగా ఇజ్రయెల్ సైన్యం చేసిన భీకర దాడుల్లో ఇప్పటివరకు గాజాలో 42,175 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు.
చదవండి: గురుడి చందమామ యూరోపా..
Comments
Please login to add a commentAdd a comment