టెహ్రాన్: తమపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు పాల్పడితే అమెరికా పూర్తి బాధ్యత వహించాల్సిందేనని ఇరాన్ అమెరికాకు హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇజ్రాయెల్ ప్రణాళికల గురించి తమకు తెలుసునని పేర్కొంది. ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్, యూఎన్ భద్రతా మండలి స్విస్ ప్రెసిడెన్సీని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ రాసిన లేఖ తీవ్రమైన ఆందోళన, రెచ్చగొట్టే విధంగా ఉందని ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరవాని అన్నారు.
ఇరాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం.. చట్టవిరుద్ధమైన సైనిక దురాక్రమణకు అమెరికా పరోక్ష ఆమోదం, స్పష్టమైన మద్దతును ప్రకటిస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తుందని అన్నారు. ‘‘అంతర్జాతీయ చట్టం, ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘిస్తూ.. ఇరాన్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేసే దురాక్రమణ చర్యలను ప్రేరేపించటం, ప్రారంభించటంపై అగ్రరాజ్యం అమెరికా పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది’’ అని అన్నారు.
BREAKING: Iran says US will bear ‘full responsibility' for an Israeli retaliation.
— The International Index (@theintlindex) October 21, 2024
క్రెడిట్స్: The International Index
అక్టోబరు 1న ఇరాన్.. ఇజ్రాయెల్‌పై చేసిన మిసైల్స్ దాడికి ఎలా? ఎప్పుడు? స్పందిస్తుందని మీడియా అడిగిన ప్రశ్నకు జో బైడెన్ ఇటీవల స్పందించారు. ప్రస్తుతం ఇజ్రాయెల్.. ఇరాన్‌పై చేసే ప్రతీకార దాడిపై స్పష్టమైన అవగాహన ఉందని అన్నారు.
ఇక.. టెహ్రాన్ మద్దతుగల హమాస్, హెజ్‌బొల్లాకు చెందిన నాయకులు, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ జనరల్‌ను అంతంచేసినందుకు ప్రతీకారంగా ఇరాన్ ఇటీవల ఇజ్రాయెల్‌పై దాదాపు 200 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన విషయం తెలిసిందే. దీంతో అమెరికాకు మిత్ర దేశమైన ఇజ్రాయెల్.. గాజాలో హమాస్, లెబనాన్‌లోని హెజ్‌బొల్లాను దాడులకు అంతం చేసి ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment