న్యూయార్క్:అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆదివారం(అక్టోబర్ 20) పెన్సిల్వేనియాలోని మెక్‌డొనాల్డ్ రెస్టారెంట్‌లో సందడి చేశారు. అక్కడికి వచ్చిన కస్టమర్లకు ఫ్రెంచ్ ఫ్రైస్ వండి స్వయంగా వడ్డించారు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది.
POS Trump Staged the entire thing.
The McDonalds was CLOSED.
The “supposed customers” were vetted before drive thru
He thinks we won’t notice
Trump is the GOAT BALL LICKER
The People's President is Kamala pic.twitter.com/Q6txxKRDET— Larry (@SocratesBigBird) October 20, 2024
ఈ దుమారానికి కారణం ట్రంప్ వెళ్లిన మెక్‌డొనాల్డ్ అవుట్‌లెట్ మేనేజర్ ఆదేశాలు బయటికి పొక్కడం. ఆదివారం సాయంత్రం 4 గంటల దాకా అవుట్‌లెట్ మూసి ఉంటుందని మేనేజర్ ఆదేశాల సారాంశం. ట్రంప్ రాకకు వీలుగా అవుట్‌లెట్‌ను మూసివేసినట్లు తెలుస్తోంది. మేనేజర్ ఆదేశాల కాపీ సోషల్ మీడియా వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. మెక్‌డొనాల్డ్‌లో జరిగింది కేవలం షో అని, సహజంగా జరిగింది కాదని డెమొక్రాట్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: మెక్‌డొనాల్డ్‌లో ఫ్రెంచ్‌ఫ్రైస్ చేసిన ట్రంప్
Comments
Please login to add a commentAdd a comment