
మరో రెండు వారాల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్. రిపబ్లికర్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తమ సాయశక్తులా కృషి చేస్తున్నారు. ప్రత్యర్థుల బలహీనతలను ఎత్తిచూపుతూ, చిత్రవిచిత్ర ప్రచారాలతో ముందుకు సాగుతున్నారు
తాజాగా రిపబ్లికెన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియాలోని ఓ మెక్‌డొనాల్డ్స్ ఓట్‌లెట్‌లో కొంతసేపు పనిచేశారు. తెలుపు రంగు షర్ట్ మీద బ్లాక్ అండ్ ఎల్లో డ్రెస్‌కోడ్ ధరించి ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేశారు. ఇక వీటిని ట్రంప్ తన మద్దతుదారులలో కొందరికి అందించారు.
Fries: BAGGED ✅ pic.twitter.com/oj3T5KSazz
— Trump War Room (@TrumpWarRoom) October 20, 2024
ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ఈ పని తనకెంతో నచ్చిందని, ఇక్కడ పనిచేయడం సరాదాగా ఉందని తెలిపారు. తానెప్పటి నుంచో మెక్‌డొనాల్డ్స్‌లో పనిచేయాలనుకుంటున్ననని పేర్కొన్నారు. అయితే తాను యుక్త వయసులో ఉన్న సమయంలో మెక్డీలో పనిచేశానని ప్రచారాలు చేస్తున్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు ట్రంప్ ఈ విధంగా కౌంటర్ ఇచ్చారు. ఆమె కంటే 15నిమిషాలు ఎక్కువ పనిచేశానని ప్రత్యర్థి కమలా హారిస్‌పై విమర్శలు గుప్పించారు
— Donald J. Trump (@realDonaldTrump) October 20, 2024
ఇక ట్రంప్ డొనాల్డ్స్‌లో పనిచేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా అక్టోబర్ 20న కమలా హారిస్ 60వ పుట్టినరోజు. దీనిపై ట్రంప్ మాట్లాడుతూ..ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. కమలకు కొన్ని పువ్వులు ఇస్తాననని అదే విధంగా తాను తయారు చేసిన ఫ్రైస్ కూడా ఇస్తానని చమత్కరించారు.
ట్రంప్ వీడియో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ స్పందించారు. అద్భుతమైన వీడియో అంటూ ప్రశంసలు కురిపించారు. అయితే అధ్యక్ష ఎన్నికల్లో మస్క్ ట్రంప్‌కు మద్దతు తెలుపుతున్న విషయం తెలిసిందే. ఓటింగ్‌ను ట్రంప్‌కు అనుకూలంగా మార్చేందుకు అమెరికన్లకు తాయిలాలు ప్రకన్నారు. ఈ క్రమంలో పెన్సిల్వేనియాలో శనివారం నుంచి రిజిస్టర్డ్ ఓటర్ల నుంచి రోజూ డ్రా తీసి ఎంపికైన ఓటరుకు దాదాపు రూ.8.4 కోట్లు అందజేస్తామని చెప్పారు. నవంబర్ 5 ఈ లాటరీ కొనసాగుతుందన్నారు.
This is awesome 😎
pic.twitter.com/RMkE20qWo2— Elon Musk (@elonmusk) October 20, 2024
Comments
Please login to add a commentAdd a comment