McDonald
-
మెక్ డొనాల్డ్స్ బర్గర్ లో బ్యాక్టీరియా
-
మెక్‌డొనాల్డ్స్‌లో ఫుడ్ పాయిజన్.. ఒకరు మృతి
మెక్‌డొనాల్డ్స్ ఔట్లెట్లో ఫుడ్ పాయిజన్ ఒకరి ప్రాణాలను బలితీసుకుంది. డజన్ల కొద్దీ కస్టమర్లు అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. మెక్‌డొనాల్డ్స్ క్వార్టర్ పౌండర్ హాంబర్గర్లో తిన్న ఒకరు ఈ.కోలి (E.coli) బ్యాక్టీరియా సోకి చనిపోయారని, పది మందికిపైగా అస్వస్థతకు గురయ్యారని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) మంగళవారం వెల్లడించింది. సెప్టెంబరు చివరి వారంలో ప్రారంభమైన వ్యాప్తి, 10 పశ్చిమ రాష్ట్రాలలో విస్తరించింది. మొత్తం 49 కేసులు నమోదుకాగా.. ఎక్కువగా కొలరాడో, నెబ్రాస్కాలో కేంద్రీకృతమై ఉన్నాయని సీడీసీ తెలిపింది.సీడీసీ ప్రకటన వెలువడి కొద్ది గంటల్లోనే మెక్‌డోనాల్డ్స్ షేర్లు 6 శాతానికిపైగా పతనమయ్యాయి. అస్వస్థతతకు గురైనవారిలో 10 మంది ఆసుపత్రిలో చేరారని, వీరిలో తీవ్రమైన కిడ్నీ సంబంధిత వ్యాధి హేమోలిటిక్ యురేమిక్ సిండ్రోమ్‌తో బాధపడుతోన్న చిన్నారి కూడా ఉంది. కొలరాడోలో ఓ వ్యక్తి మృతిచెందినట్టు సీడీసీ తెలిపింది. అస్వస్థతకు గురైన వ్యక్తులందరిలోనూ ఈ.కోలి బ్యాక్టీరియా ఆనవాళ్లు ఉన్నాయని, అనారోగ్యం బారిన పడటానికి వీరు ముందు మెక్‌డొనాల్డ్స్‌లో ఆహారం తీసుకున్నట్లు పేర్కొంది.వీరి అనారోగ్యానికి కారణమైన ఖచ్చితమైన పదార్ధాన్ని పరిశోధకులు ఇంకా గుర్తించనప్పటికీ, ఉల్లిపాయ ముక్కలు, బీఫ్‌ల(గొడ్డు మాంసం) కారణంగా ఇలా జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. దీనిపై విచారణ పెండింగ్‌లో ఉన్న ప్రభావిత రాష్ట్రాల్లోని రెస్టారెంట్లు ఈ రెండింటి వాడకాన్ని తొలగించాయి. ‘నాకు, మెక్‌డొనాల్డ్స్‌లోని ప్రతి ఒక్కరికీ ఆహార భద్రత చాలా ముఖ్యం. ఎంపిక చేసిన రాష్ట్రాల్లోని మా ఔట్లెట్లలో ముక్కల చేసి ఉల్లిపాయల వినియోగించరాదని నిర్ణయం తీసుకున్నాం’ అని ఆ సంస్థ అమెరికా విభాగం ఛైర్మన్ జో ఎర్లింగర్ ఒక వీడియో విడుదల చేశారు.మెజార్టీ రాష్ట్రాలు ఈ.కోలికి ప్రభావితం కాలేదని, వ్యాధి ప్రభావిత రాష్ట్రాల్లో బీఫ్ ఉత్పత్తుల సమా ఇతర ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇక, క్వార్డర్ పౌండర్‌లో ఆహారం తిని, డయోరియా, తీవ్రమైన జ్వరం, వాంతులు వంటి ఈ-కోలి లక్షణాలు బయటపడితే వైద్య సహాయం తీసుకోవాలని సీడీసీ సూచించింది. ఈ బ్యాక్టీరియా సోకిన మూడు నాలుగు రోజుల తర్వాత లక్షణాలు బయటపడతాయి. అయితే చాలా మంది నాలుగు నుంచి ఏడు రోజుల్లోపే ఎలాంటి చికిత్స లేకుండానే కోలుకుంటారు. అయినప్పటికీ కొన్ని కేసులు తీవ్రంగా మారడం వల్లపరిస్థితి విషమించి ఆసుపత్రుల్లో చేరాల్సి వస్తుంది. -
Video: మెక్‌డొనాల్డ్స్‌లో ఫ్రెంచ్ ఫ్రైస్ చేసిన ట్రంప్.. మస్క్ రియాక్షన్
మరో రెండు వారాల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్. రిపబ్లికర్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తమ సాయశక్తులా కృషి చేస్తున్నారు. ప్రత్యర్థుల బలహీనతలను ఎత్తిచూపుతూ, చిత్రవిచిత్ర ప్రచారాలతో ముందుకు సాగుతున్నారుతాజాగా రిపబ్లికెన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియాలోని ఓ మెక్‌డొనాల్డ్స్ ఓట్లెట్లో కొంతసేపు పనిచేశారు. తెలుపు రంగు షర్ట్ మీద బ్లాక్ అండ్ ఎల్లో డ్రెస్‌కోడ్ ధరించి ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేశారు. ఇక వీటిని ట్రంప్ తన మద్దతుదారులలో కొందరికి అందించారు.Fries: BAGGED ✅ pic.twitter.com/oj3T5KSazz— Trump War Room (@TrumpWarRoom) October 20, 2024ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ఈ పని తనకెంతో నచ్చిందని, ఇక్కడ పనిచేయడం సరాదాగా ఉందని తెలిపారు. తానెప్పటి నుంచో మెక్‌డొనాల్డ్స్‌లో పనిచేయాలనుకుంటున్ననని పేర్కొన్నారు. అయితే తాను యుక్త వయసులో ఉన్న సమయంలో మెక్‌డీలో పనిచేశానని ప్రచారాలు చేస్తున్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు ట్రంప్ ఈ విధంగా కౌంటర్ ఇచ్చారు. ఆమె కంటే 15నిమిషాలు ఎక్కువ పనిచేశానని ప్రత్యర్థి కమలా హారిస్‌పై విమర్శలు గుప్పించారుpic.twitter.com/MWEUVcY6YG— Donald J. Trump (@realDonaldTrump) October 20, 2024ఇక ట్రంప్ డొనాల్డ్స్‌లో పనిచేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా అక్టోబర్ 20న కమలా హారిస్ 60వ పుట్టినరోజు. దీనిపై ట్రంప్ మాట్లాడుతూ..ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. కమలకు కొన్ని పువ్వులు ఇస్తాననని అదే విధంగా తాను తయారు చేసిన ఫ్రైస్ కూడా ఇస్తానని చమత్కరించారు.ట్రంప్ వీడియో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ స్పందించారు. అద్భుతమైన వీడియో అంటూ ప్రశంసలు కురిపించారు. అయితే అధ్యక్ష ఎన్నికల్లో మస్క్ ట్రంప్‌కు మద్దతు తెలుపుతున్న విషయం తెలిసిందే. ఓటింగ్‌ను ట్రంప్‌కు అనుకూలంగా మార్చేందుకు అమెరికన్లకు తాయిలాలు ప్రకన్నారు. ఈ క్రమంలో పెన్సిల్వేనియాలో శనివారం నుంచి రిజిస్టర్డ్ ఓటర్ల నుంచి రోజూ డ్రా తీసి ఎంపికైన ఓటరుకు దాదాపు రూ.8.4 కోట్లు అందజేస్తామని చెప్పారు. నవంబర్ 5 ఈ లాటరీ కొనసాగుతుందన్నారు. This is awesome 😎 pic.twitter.com/RMkE20qWo2— Elon Musk (@elonmusk) October 20, 2024 -
మెక్‌డోనాల్డ్స్ హ్యాపీ మీల్ ఆర్డర్ చేస్తున్నారా ? ఈ మహిళ షాకింగ్ అనుభవం తెలిస్తే..!
UK Woman Finds Cigarette Butt In Child Happy Meal At McDonald: ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం మెక్‌డోనాల్డ్స్‌లో యూకేకు చెందిన మహిళకు చేదు అనుభవం ఎదురైంది. తన ఇద్దరు చిన్నారుల కోసం మెక్‌డొనాల్డ్స్‌లో హ్యాపీ మీల్‌ను ఆర్డర్ చేసింది. బిడ్డల ఆకలి తీర్చాలన్న ఆమె ఆరాటం కాస్తా ప్యాకెట్ విప్పిన చూసాక ఆవిరైపోయింది. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. గెమ్మా కిర్క్-బోనర్ ఇంగ్లాండ్‌లోని బారో-ఇన్-ఫర్నెస్‌లోని మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్ నుండి పిల్లల హ్యాపీ మీల్‌ను కొనుగోలు చేసింది. రెండు ఫిష్ ఫింగర్ హ్యాపీ మీల్స్‌ను ఇంటికి తీసుకెళ్లింది. ఒక ప్యాకెట్ విప్పి పెద్దకుమారుడు జాక్సన్(3)కి ఇచ్చింది. మరో మీల్ ఓపెన్ చేసిన ఏడాది వయస్సున్న చిన్న కుమారుడు కాలేబ్‌కు తినిపించాలని ప్రయత్నిస్తుండగా అందులో కాల్చి పారేసిన సిగరెట్ పీక, బూడిదను గమనించింది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది. చిన్న పిల్లాడికి తీనిపిస్తూ తాను చూశాను గనుక సరిపోయింది.. అదే పెద్దవాడు చూడకుండా తినేసి ఉంటే అన్న ఆలోచనే ఆమెలో అసహ్యాన్ని, ఆందోళననూ రేపింది. మరొకరికి తనలాంటి అనుభవం ఎదురు కాకూడదంటూ ఈ విషయాన్ని ఫోటోతో సహా ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. సిగరెట్ పీక, బూడిదతో ఇపుడు అదనపు రుచి అంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అంతేకాదు దీనిపై ఫిర్యాదు చేయబోగా డాల్టన్ రోడ్‌లోని మెక్‌డొనాల్డ్స్ బ్రాంచ్ మేనేజర్ కటువుగా మాట్లాడి ఫోన్ పెట్టేశాడని కూడా పేర్కొంది. ఈ వ్యవహారంలో తనకు న్యాయం కావాలని, కంపెనీ క్షమాపణ చెప్పాలని కోరుతోంది. దీనిపై స్పందించిన ఫ్రాంచైజీ కస్టమర్ల సంతృప్తి, ఆహార భద్రతే తమకు తొలి ప్రాధాన్యమని వెల్లడించింది. ఈ విషయాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. -
మెక్ డోనాల్డ్స్ అన్ని ఆఫీసులు మూత, ఉద్యోగాల కోతకు రంగం సిద్ధం!
న్యూఢిల్లీ: ప్రపంచంలోని అతిపెద్ద ఫాస్ట్‌ఫుడ్ చైన్లలో ఒకటైన మెక్‌డొనాల్డ్స్ సంచలననిర్ణయం తీసుకుంది. అమెరికా లోని అన్ని కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేసింది. ఈ మేరకు ఉద్యోగాలపై వేటు వేయనుంది. తాజాగా మరో రౌండ్ తొలగింపులకి సిద్ధమవుతున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ సోమవారం నివేదించింది. అయితే ఎంతమంది ఉద్యోగులను తొలగిస్తారనే దానిపై స్పష్టత లేదు. సోమవారం నుండి బుధవారం వరకు ఇంటి నుండి పని చేయడం ప్రారంభించాలని కంపెనీ గత వారమే మెక్ డోనాల్డ్స్ అమెరికా ఉద్యోగులకు మెయిల్ పంపింది. ఈ వారంలో షెడ్యూల్ అయిన అన్ని వ్యక్తిగత సమావేశాలను రద్దు చేయాలని కూడా కంపెనీ ఉద్యోగులను కోరినట్టు తెలుస్తోంది. అయితే ఏప్రిల్ 5, బుధవారం దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంచనా. త్వరలోనే ఉద్యోగులను తీసివేయనున్నట్టు కూడా మెక్ డోనాల్డ్స్ ప్రకటించనుందని వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. కాగా ప్రపంచ ఆర్థికమాంద్యం, ద్రవ్యోల్బణ ఆందోళనల నేపథ్యంలో ఇప్పటికే చాలా కంపెనీలు వేలాది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఖర్చులను తగ్గించుకునే క్రమంలో గూగుల్, అమెజాన్, ఫేస్‌బుక్‌తో సహా అనేక టెక్ దిగ్గజాలు భారీగా ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. -
మెక్ డొనాల్డ్స్ నిర్వాకం: కూల్ డ్రింకులో చచ్చిన బల్లి..చివరికి
అహ్మదాబాద్: కూల్ డ్రింక్స్‌లో పురుగు మందుల అవశేషాలున్నాయని అనేక రిపోర్టులు చెబుతున్నా పట్టించుకోని శీతల పానీయాల ప్రియులకు మరో షాకింగ్ న్యూస్. తాజాగా అహ్మదాబాద్‌లోని మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్‌కు వెళ్లిన ఇద్దరు స్నేహితులకు చేదు అనుభవం ఎదురైంది. భార్గవ జోషి అనే వ్యక్తి ఆర్డర్ చేసిన కూల్ డ్రింకులో చచ్చిన బల్లి దర్శనమిచ్చింది. బల్లిని చూసి షాకైన భార్గవ జోషి రెస్టారెంట్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లి, ఇందేంటని నిలదీశాడు. అయితే ఈ వ్యవహారాన్ని లైట్ తీసుకున్న సిబ్బంది డబ్బులు వాపస్ ఇస్తాం అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు. దీంత కడుపు మండి మున్సిపల్ అధికారులకు చేరేలా చేశాడు. ఈ సందర్భంగా తాను వీడియోను పోలీసులకు, అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు భార్గవ జోషి. అంతే క్షణాల్లో ఈ వీడియో వైరల్ అయింది. ఈ వ్యవహారంపై అహ్మదాబాద్ పురపాలక శాఖ స్పందించింది. మెక్ డొనాల్డ్స్ అవుట్ లెట్లో తనిఖీలు చేపట్టిన అధికారులు రెస్టారెంట్ అవుట్ లెట్‌కు సీల్ వేశారు. కూల్ డ్రింకు శాంపిల్స్ ను పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌కి పంపించినట్టు వెల్లడించారు. Here is video of this incidents happens with me...@McDonalds pic.twitter.com/UiUsaqjVn0 — Bhargav joshi (@Bhargav21001250) May 21, 2022 -
కంపెనీలో ఫుడ్ సర్వ్ చేసేవాడు..! ఇప్పుడు ఆ ఒక్కటే అంబానీనే దాటేలా చేసింది...!
ఒకప్పుడు మెక్‌డోనాల్డ్స్ ఔట్లెట్లో కస్టమర్లకు బర్గర్స్‌ను, కూల్ డ్రింక్స్ సర్వ్ చేసేవాడు. కట్ చేస్తే..ఇప్పుడెమో ముఖేశ్ అంబానీ సంపదనే దాటేసి ప్రపంచ కుబేర్ల జాబితాలో 11 వస్థానాన్ని కైవసం చేసుకున్నాడు చైనీస్ కెనాడియన్ చాంగ్‌పెంగ్ జావో. ఆ ఒక్క దానితో దశ తిరిగింది..! టెక్ బిలియనీర్లు ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్, బిల్ గేట్స్ , మార్క్ జుకర్‌బర్గ్ వంటి ప్రపంచ కుబేర్ల జాబితాలో చాంగ్‌పెంగ్ జావో నిలిచేందుకు ఆ ఒక్కటి ఎంతగానో ఉపయోగపడింది. అదే క్రిప్టోకరెన్సీ..! ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ప్లాట్‌ఫాం బినాన్స్‌ను స్థాపించి ఒక్కసారిగా ప్రపంచ కుబేరులకే సవాలును విసిరాడు జావో. బ్లూమ్‌బర్గ్ విడుదల చేసిన తాజా లెక్కల ప్రకారం...జావో నికర విలువ 96 బిలియన్ డాలర్లకు చేరుకుందని పేర్కొంది. దీంతో ఇండియన్ టైకూన్ ముఖేష్ అంబానీ స్థానాన్ని కూడా దాటేశాడు. అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రిప్టో బిలియనీర్ జావో అలియాస్ సీజెడ్ అవతారమెత్తాడు. సాఫ్ట్వేర్ డెవలపర్..! జావో సాఫ్ట్వేర్ డెవలపింగ్‌లో సిద్ధ హస్తుడు. అంతేకాకుండా బ్లాక్ చైయిన్ టెక్నాలజీను వేగంగా అలవర్చుకున్నాడు. 2008లో వచ్చిన క్రిప్టోకరెన్సీ భవిష్యత్తులో వాడే డిజిటల్ కరెన్సీగా చెలామణీ అవుతుందనే నమ్మకం అతన్ని ఒమ్ము చేయలేదు. బినాన్స్‌ను 2017లో స్థాపించి క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్‌కు అద్బుతమైన ప్లాట్‌ఫాంను క్రియేట్ చేశాడు ఈ సీజెడ్. ఈ ప్లాట్‌ఫాం ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ ప్లాట్‌ఫాంగా నిలుస్తోంది. కలిసొచ్చిన ఆదరణ..! తొలినాళ్లలో క్రిప్టోకరెన్సీపై ఉన్న ఆదరణ గణనీయంగా పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా క్రిప్టోకరెన్సీలపై పెట్టుబడి పెట్టేందుకు సిద్దమయ్యారు. ఇప్పుడే అదే ఆదరణ జావోను ప్రపంచ కుబేర్ల జాబితాలో ఉంచేలా చేసింది. బినాన్స్ రెగ్యులేటరీ ఫైలింగ్‌ల సమీక్ష ప్రకారం... ఒక్క 2021లో 20 బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇక కంపెనీలో జావో సుమారు 90 శాతం మేర షేర్లను కల్గి ఉన్నాడు. అంతకుమించే...! ఇక జావో బహిరంగంగా తన వ్యక్తిగత క్రిప్టో హోల్డింగ్స్ గురించి ఎక్కడా వ్యాఖ్యానించలేదు. అదే విధంగా, ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజ్ అయిన బినాన్స్ ఆర్థిక విషయాల గురించి పెద్దగా బహిర్గతం చేయదు. ఎందుకంటే ఇది ఒక ప్రైవేట్ క్రిప్టో ఎక్స్ఛేంజ్. బినాన్స్‌లో రోజుకు 170 బిలియన్ డాలర్ల క్రిప్టో ట్రేడ్లను ప్రాసెస్ చేస్తుంది. జావో పూర్తి సంపద ఎంతో తెలిస్తే అందరు షాక్ అవ్వడం కాయం. పూర్తిగా స్వచ్చంద సంస్ధకే..! జావో తన సంపదలో ఎక్కువ భాగాన్ని స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇస్తానని ఒక ఇంటర్య్వూలో చెప్పాడు. అంతేకాకుండా.. ‘వ్యక్తిగతంగా, నేను ఆర్థికంగా స్వేచ్ఛగా ఉన్నాను. నాకు డబ్బు అవసరం అంతగా లేదు.రాక్ఫెల్లర్ లాగే నా సంపదలో మెజార్టీ భాగాన్ని స్వచ్చంద సంస్థలకే అంకింతమని అన్నాడు. జావో తన సంపదలో 95 శాతం లేదా 99 శాతం స్వచ్చంద సంస్థలకే ఇవ్వాలనుకుంటున్నాడు. చదవండి: స్కార్పియో కావాలన్న కెన్యా పోలీసులు.. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్ -
చికెన్ బర్గర్లో మెటల్ రాడ్ ప్రత్యక్షం..
మెల్బోర్న్ : ఉరుకుల పరుగుల జీవితంలో ఆహారం తయారుచేసుకునేందుకు ఎక్కువ సమయం కేటాయించేందుకు ఇష్టపడని జనం రెస్టారెంట్లను ఆశ్రయిస్తున్నారు. ఇన్స్టంట్ ఫుడ్‌పై నెట్టుకొస్తూ ఏదో తినేశామనిపిస్తున్నారు. రెస్టారెంట్లు సైతం సమయానికి డెలివరీపై దృష్టిసారించడమే కానీ ఆహార నాణ్యతను పట్టించుకోవడం లేదు. మెక్‌డొనాల్డ్స్ బర్గర్‌ను ఆర్డర్ చేస్తే నాణ్యత లేని ఆహారం తమ తలుపు తట్టిన తీరును ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన ఓ మహిళ ఫేస్బుక్ పోస్ట్‌లో వాపోయారు. చికెన్, చీజ్‌కు ఆర్డర్ ఇస్తే చికెన్ బర్గర్లో మెటల్ రాడ్ ఉందని ఆద తిప అనే మహిళ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. తన మూడేళ్ల మేనకోడలు ఈ ఆర్డర్ చేసింని, తనకు ఇంకా ఈ చికెన్ బర్గర్ ఇవ్వకపోవడం మంచిదైందని ఆమె చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై పెద్దసంఖ్యలో నెటిజన్లు రెస్టారెంట్ నిర్వాకంపై మండిపడ్డారు. చదవండి : ఉద్యోగినితో ఎఫైర్ : మెక్‌డొనాల్డ్ సీఈవోపై వేటు -
పదేళ్లయినా పాడవని బర్గర్!
రేక్జవిక్ : బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ ఎన్ని రోజులు తాజాగా ఉంటాయి? మహా అయితే రెండ్రోజులు. కానీ, ఈ ఫొటోలో కనిపిస్తున్నవి ఏకంగా పదేళ్లయినా పాడవలేదు! ఆశ్చర్యంగా ఉందా? అయితే, ఇది చదవండి. బర్గర్లు, పీజాల తయారీలో ప్రసిద్ధి చెందిన మెక్‌డొనాల్డ్ కంపెనీ ఐస్లాండ్లో 2009లో తన చివరి అవుట్‌లెట్‌ను మూసివేసింది. అయితే, చివరగా హిజోర్టర్ స్మెర్సెన్ అనే వ్యక్తి ఆ షాప్‌లో ఫ్రెంచ్ ఫ్రైస్, ఓ బర్గర్ కొన్నాడు. అయితే అతను ఈ వాటిని తినేందుకు బదులు, మెక్‌డొనాల్డ్ గుర్తుగా అలానే ఉంచుకోవాలనుకున్నాడు. మొదట్లో అతను వీటిని తన దగ్గర నిల్వ చేశాడు. తరువాత నేషనల్ మ్యూజియంకు అప్పగించాడు. ఇప్పుడు వాటిని ఒక హోటల్లో భద్రపరిచారు. అయితే, సుమారు పదేళ్లయినా ఇప్పటికీ అవి తాజాగా ఉన్నాయి. దీని గురించి తెలుసుకున్న వారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. కాగా వీటి గురించి ఫుడ్సైన్స్కు చెందిన ఒక ప్రొఫెసర్ మాట్లాడుతూ తేమ ఏమాత్రం లేనందునే అవి తాజాగా ఉన్నాయని అన్నారు. -
కాపుచ్చినో కాఫీ.. కాక్రోచ్ కాళ్లు
థాయ్‌లాండ్‌కు చెందిన ఓ వినియోగదారుడు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. తనకు ఎదురైన చేదు అనుభవంపై ఆయన ఫేస్బుక్లో పంచకున్నారు. మెక్ డోనాల్డ్స్ లో కాఫీ ఆర్డర్ చేస్తే కాక్రోచ్ కాళ్లు ఒడ్డించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలి ఇలాంటి ఆరోపణలు తరచూ వినిపిస్తుండడంతో మెక్ డోనాల్డ్స్ సంస్థ మరోసారి ఇబ్బందుల్లో పడింది. బ్యాంకాక్ చెందిన నోస్టాలిక్ ఐక్ (28) స్థానిక మెక్‌డోనాల్డ్స్ లో కాపుచ్చినో కాఫీ ఆర్డర్ చేశారు. ..వేడి..వేడిగా ..నురగలతో..కమ్మని వాసనతో అదరగొట్టాల్సిన కాఫీలో...కాఫీరంగులో తేలుతూ ఏదో ఏదో అనుమానాస్పదంగా కనిపించింది. తీరా చూస్తే... బొద్దింక కాళ్లు.. వెంటనే బాయ్‌ని పిలిచి వేరే కప్పు తెప్పించుకున్నారు. ఈసారి మరింత బెంబేలెత్తడం అతని వంతు అయింది. ఎందుకంటే.. రెండవ కప్పులో మరిన్ని బొద్దింక కాళ్లు తేలుతూ కనిపించాయి. దీంతో మండిపడిన సదరు వినియోగదారుడు ..మెక్‌డొనాల్డ్ అంటే అధిక శుభ్రానికి, ప్రమాణాలకు పెట్టింది పేరని భావించిన తనకు గట్టి షాక్ తగిలిందంటూ తన ఫేస్బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. దీంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. ఎట్టకేలకు ఈ వ్యవహారంపై స్పందించిన మెక్‌డొనాల్డ్స్ వినియోగదారుడికి క్షమాపణలు చెప్పింది. కస్టమర్ ఆరోపణను ధృవీకరించడంతోపాటు విచారణ చేపట్టనున్నట్టు తెలిపింది. -
బర్గర్లు ఇవ్వమంటే.. ఇవ్వరా?!
రియో డి జెనీరియో : బ్రెజిల్‌లోని అత్యంత ఖరీదైన నగరాల్లో రియో డిజెనీరియో ఒకటి. ఆర్థిక లావాదేవీలు అత్యధికంగా జరిగే ప్రాంతం కావడంతో ఖరీదైన హోటళ్లు, రిసార్టులు, రెస్టార్లు భారీగా ఉన్నాయి. ఇవి ఏడాది పొడుగునా బిజీగానే ఉంటాయి. అందులోనూ మెక్ డోనాల్డ్ రెస్టారెంట్‌కు స్థానికంగా డిమాడ్ ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఆరుమంది వ్యక్తులు రెస్టారెంట్ వచ్చి 40 బర్గర్లు కావాలని చెప్పారు. వేడివేడిగా బర్గర్లు తెచ్చాక.. బిల్ పే చేయమని కౌంటర్లోని వ్యక్తి అడిగాడు.. బర్గర్ల కోసం వచ్చిన వ్యక్తి.. నేను బిల్ పే చేయను.. అంటూ.. తన వెంట తెచ్చుకున్న గన్‌తో ఒక్కసారిగా కాల్పులకు దిగాడు. అతనికి సహాయంగా మరో అయిదుమంది కూడా తుపాకులకు పని చెప్పారు. బుల్లెట్లు ఎక్కడ తగులుతాయన్న భయంతో రెస్టారెంట్లో ఉన్న వాళ్లంతా.. టేబుళ్ల కింద.. దాక్కున్నారు. ఈ ఘటనలో అదృష్టవవాత్తు ఎవరూ గాయపడలేదని మెక్‌డోనాల్డ్ అధికారులు ప్రకటించారు. బుల్లెట్లు తగిలి రెస్టారెంట్ పర్నీచర్ చాలా వరకూ పాడైందని.. చెప్పారు. అయితే బర్గర్లుకు డబ్బులు చెల్లించకుండా.. తుపాకి కాల్పుల పాల్పడ్డవారు.. డ్రగ్స్ డీలర్లని సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు చెబుతున్నారు. -
169 స్టోర్లు మూత:వేల ఉద్యోగాలు గల్లంతు?
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర, దక్షిణ భారతదేశంలో మెక్ డొనాల్డ్స్ స్టోర్లు భారీ ఎత్తున మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కన్నాట్ ప్లాజా రెస్టారెంట్లు లిమిటెడ్ (సీఆర్పీఎల్)తో ముగిసిన ఒప్పందం నేపథ్యంలో మెక్ డొనాల్డ్స్ షాపులు ఈ రోజు(బుధవారం) నుంచి మూతపడ నున్నాయి. దీంతో వేలాదిమంది ఉద్యోగులు ఉపాధి కోల్పోనున్నారు. మెక్‌డోనాల్డ్స్ ప్రకారం మొత్తం 169 దుకాణాల్లో మెక్ డొనాల్డ్స్ ట్రేడ్ మార్క్ ఆహార ఉత్పత్తుల అమ్మకాలు నిలిచిపోనున్నాయి. సెప్టెంబరు 6 నుంచి తన బ్రాండ్ పేరు , ట్రేడ్‌మార్క్‌ను ఉపయోగించే అధికారం సీఆర్‌పీఎల్‌కు లేదని పేర్కొంది. రద్దు నోటీసు కాలం సెప్టెంబరు 5 న ముగిసినందున, మెక్‌డొనాల్డ్ మేధో సంపత్తిని ఉపయోగించేందుకు సీఆర్‌పీఎల్‌కు అధికారం లేదు. అంటే వారు మెక్‌డొనాల్డ్ పేర్లు, ట్రేడ్‌మార్క్ పేర్లు, డిజైన్లు, బ్రాండింగ్, మార్కెటింగ్ లాంటివి ఉపయోగించడం మానివేయాలి. దీనికి సంబంధించి చట్టపరమైన , ఒప్పంద హక్కుల ప్రకారం తాము వ్యవహరించనున్నామని మెక్‌డోనాల్డ్ ఇండియా ప్రతినిధి చెప్పారు. అయితే స్టోర్లమూసివేతపై సీఆర్పీఎల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు బుధవారం నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించనున్నామని కంపెనీ ఎండీ విక్రమ్ బక్షి చెప్పారు. ఈ స్టోర్ల మూసివేత కారణంగా వేలాదిమంది ఉద్యోగులను రోడ్డుమీదికి నెట్టివేయనుందన్నారు. అంతేకాదు ఇది తమ వ్యాపారంపైనా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని విక్రమ్ బక్షి తెలిపారు. దాదాపు 10 వేల మంది (ప్రత్యక్షంగా ,పరోక్షంగా)తో పాటు కంపెనీ సరఫరాదారులు, ఇతర వ్యాపార భాగస్వాములకు తీవ్ర నష్టం కలిగిస్తుందని చెప్పారు. కాగా మెక్‌డొనాల్డ్‌తో ఫ్రాంఛైజ్ ఒప్పందం రద్దును సవాలు చేస్తూ సీఆర్పీఎల్ పిటిషన్‌ను మంగళవారం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కొట్టివేసింది. సీఆర్పీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ విక్రమ్ బక్షి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే -
సీపీఆర్‌ఎల్‌తో మెక్‌డొనాల్డ్స్ కటీఫ్
న్యూఢిల్లీ: ఒప్పంద నిబంధనల ఉల్లంఘన, చెల్లింపుల ఎగవేత తదితర ఆరోపణలపై కనాట్ ప్లాజా రెస్టారెంట్‌తో (సీపీఆర్ఎల్) మెక్‌డొనాల్డ్స్ ఇండియా తెగతెంపులు చేసుకుంది. దీంతో సీపీఆర్ఎల్ తన అవుట్‌లెట్స్‌లో ఎక్కడా కూడా మెక్‌డొనాల్డ్స్ బ్రాండ్‌ను ఉపయోగించుకోవడానికి వీలుండదు. అయితే, ఉద్యోగులు, సరఫరాదారులు, అవుట్‌లెట్స్‌కు స్థలం ఇచ్చిన యజమానులపై ప్రతికూల ప్రభావం పడకుండా తగు పరిష్కార మార్గం కనుగొనే దిశగా సీపీఆర్‌ఎల్‌తో కలిసి పనిచేయడానికి తాము సిద్ధమని మెక్‌డొనాల్డ్స్ ఇండియా పేర్కొంది. సీపీఆర్ఎల్ ప్రస్తుతం తూర్పు, ఉత్తరాది రాష్ట్రాల్లో 169 ఫాస్ట్‌ఫుడ్ అవుట్‌లెట్స్‌ను నిర్వహిస్తోంది. ఢిల్లీలో సీపీఆర్ఎల్ ఆధ్వర్యంలో నడుస్తున్న 43 అవుట్‌లెట్స్ లైసెన్సులను పునరుద్ధరించుకోకపోవడం వల్ల మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో మెక్‌డొనాల్డ్స్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. -
ట్రంప్ పై ట్వీట్.. ఇరకాటంలో పడ్డ మెక్‌డి
-
ట్రంప్ పై ట్వీట్.. ఇరకాటంలో పడ్డ మెక్‌డి
న్యూఢిల్లీ : అకౌంట్లు హ్యాక్ అవడం.. అకౌంట్లను హ్యాక్ చేసి పోస్టు చేసే ట్వీట్లతో కంపెనీలు, ప్రముఖులు ఇరకాటంలో పడటం గమనిస్తుంటాం. ప్రస్తుతం అమెరికా ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం మెక్ డొనాల్డ్స్ కూడా ఇదే సమస్యలో చిక్కుకుంది. ఎవరో మెక్ డొనాల్డ్స్ అకౌంట్ ను హ్యాక్ చేసి, ట్రంప్ కు వ్యతిరేకంగా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సంచలనం సృష్టించింది. తమ అకౌంట్ హ్యాకింగ్ కు గురైనట్టు గుర్తించిన కంపెనీ, 20 నిమిషాల్లో ట్రంప్ కు వ్యతిరేకంగా నమోదైన ట్వీట్ ను డిలీట్ చేసింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టమంతా జరిపోయి, ఆ ట్వీట్ 200 సార్లు రీట్వీట్ అయింది. ''డొనాల్డ్ ట్రంప్...మీరు చాలా విసుగు తెప్పిస్తున్నారు, ప్రెసిడెంట్ గా అవసరం లేదు. బరాక్ ఒబామా తిరిగి రావడాన్ని మీము ప్రేమిస్తాం. ప్లస్ మీరు చాలా చిన్న చేతులు కలిగిఉన్నారు. '' అని ట్వీట్ చేశారు. చిన్న చేతులు కలిగి ఉండటాన్ని తక్కువ సాయం చేస్తారనడంలో ఎక్కువగా వాడుతుంటారు. ఈ ట్వీట్లో ఇదే హైలెట్ గా నిలిచింది. ఈ ట్వీట్ పై స్పందించిన కంపెనీ తమ అకౌంట్ హ్యాక్ అయిందని, దీనిపై ఇప్పటికే విచారణ చేపట్టినట్టు ట్వీట్ చేసింది. అయితే ట్రంప్ కు వ్యతిరేకంగా నమోదైన ఈ ట్వీట్ కు మాత్రం అనూహ్య స్పందన వస్తోంది. ట్విట్టర్లో చాలామంది కంపెనీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కంపెనీ ఇప్పటివరకు చేసిన ట్వీట్లలో బెస్ట్ గా పేర్కొంటున్నారు. ఆ ట్వీట్ ను మళ్లీ పోస్టు చేస్తే, 100 మెక్ నగ్గెట్స్ కొంటామంటూ ఆఫర్ కూడా చేస్తున్నారు. -
‘డ్రాగన్’ చేతికి మెక్‌డొనాల్డ్ చైనా వ్యాపారం
బీజింగ్: అమెరికా ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం, మెక్‌డొనాల్డ్.. చైనా, హాంగ్‌కాంగ్ వ్యాపారానికి సంబంధించి నియంత్రిత వాటాను విక్రయించింది. ఈ వాటాను 208 కోట్ల డాలర్లకు చైనా ప్రభుత్వ సంస్థ సిటిక్, కార్లైల్ గ్రూప్‌కు అమ్మేశామని మెక్‌డొనాల్డ్ తెలిపింది. అంతర్జాతీయ టర్న్ అరౌండ్ప్లాన్లో భాగంగా ఈ వాటాను విక్రయించామని పేర్కొంది. విక్రయ ఒప్పందంలో భాగంగా సిటిక్ లిమిటెడ్, సిటిక్ క్యాపిటల్ హోల్డింగ్స్, కార్లైల్ గ్రూప్, మెక్డొనాల్డ్లు కలసి ఒక కంపెనీని ఏర్పాటు చేస్తాయి. ఈ కంపెనీలో సిటిక్, సిటిక్ క్యాపిటల్‌లకు 52 శాతం వాటా, కార్లైల్ గ్రూప్‌కు 28 శాతం వాటా, మెక్‌డొనాల్డ్‌కు 20 శాతం చొప్పున వాటాలుంటాయి. ఈ కంపెనీ చైనా, హాంగ్‌కాంగ్‌ల్లో మెక్‌డొనాల్డ్ వ్యాపారానికి 20 ఏళ్లపాటు ఫ్రాంచైజీగా వ్యవహరిస్తుంది. అమెరికా, ఫ్రాన్స్‌ల్లో వ్యాపారం మందగించడంతో ఇల్లినాయిస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మెక్‌డొనాల్డ్ సంస్థ అంతర్జాతీయ కార్యకలాపాలను పునర్వ్యస్థీకరిస్తోంది. దీనికి తోడు దక్షిణ చైనా సముద్ర సంబంధిత ఉద్రిక్తతల కారణంగా అమెరికాకంపెనీల వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో చైనా, హాంగ్‌కాంగ్‌ల్లో 2,600కు పైగా ఉన్న రెస్టారెంట్లను విక్రయించనున్నామని గత ఏడాది మెక్‌డొనాల్డ్ ప్రకటించింది. 1990లో చైనాలో తన తొలిస్టార్ను మెక్‌డొనాల్డ్ ప్రారంభించింది. ప్రస్తుతంచైనా, హాంగ్‌కాంగ్‌ల్లో ఉన్న రెస్టారెంట్లలో 1.2 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. సిటిక్.. అనేది చైనా ప్రభుత్వ రంగ దిగ్గజ సంస్థ.ఇంధనం నుంచి తయారీ రంగం, రియల్టీ రంగాల్లో ఈ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. -
దక్షిణాది రాష్ట్రాలపై మెక్ డోనాల్డ్ దృష్టి
సాక్షి, అమరావతి: దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు ‘మెక్‌డోనాల్డ్’ ప్రకటించింది. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో 242గా ఉన్న రెస్టారెంట్ల సంఖ్యను వచ్చే రెండేళ్లలో రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మెక్‌డోనాల్డ్ ఇండియా బిజినెస్ ఆపరేషన్స్ డెరైక్టర్ (సౌత్) గెరాల్డ్ డయాస్ తెలిపారు.ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల వారు స్పైసీ ఫుడ్‌ను ఇష్టపడతారని, వీరికోసం ప్రత్యేక మెనూ తయారు చేసినట్లు తెలిపారు. విజయవాడలో తొలి మెక్‌డోనాల్డ్ రెస్టారెంట్‌ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శాఖాహారం వారి కోసం ప్రతీ రెస్టారెంట్లోనూ ప్రత్యేక కిచెన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల రెస్టారెంట్ నిర్వహణ వ్యయం రెట్టింపు అవుతున్నా భారతీయుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని శాఖాహార వంటలపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. గత నెలలో నెల్లూరులో మొదటి రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశామని, త్వరలోనే గుంటూరు, విశాఖపట్నంలో రెస్టారెంట్లను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. విజయవాడలోని రెస్టారెంట్‌కు వచ్చిన స్పందన చూసిన తర్వాత విస్తరణపై దృష్టిసారించనున్నట్లు తెలిపారు. తెలంగాణాలో మెక్‌డోనాల్డ్ ప్రస్తుతం 21 రెస్టారెంట్లను కలిగి వుంది. మొత్తం ఇండియా వ్యాపారంలో 40 శాతం కేవలం దక్షిణాది రాష్ట్రాల నుంచే సమకూరుతుండటంతో ఈ రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
భారత్ వైపు చూస్తున్న మెక్ డొనాల్డ్
వాషింగ్టన్ : అమెరికాలో ఇబ్బందులు పడుతున్న ఫుడ్ సప్లయ్ జెయింట్ మెక్ డొనాల్డ్ కంపెనీ భారత ఉద్యోగులవైపు మళ్లుతున్నట్టు తెలుస్తోంది. అమెరికా కేంద్రంగా నడుస్తున్న ఈ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ చైన్..500 మిలియన్ల డాలర్ల కాస్ట్ కటింగ్ లో భాగంగా ఇండియానుంచి ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం చూస్తున్నట్టు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టీవ్ ఈస్టర్ బూక్ నేతృత్వంలో 500 మిలియన్ డాలర్ల కాస్ట్ కటింగ్ పేరుతో ఉద్యోగులను తొలగించబోతుందని పేర్కొంది. 2015లో అమెరికాలో 400 మంది ఉద్యోగులను తొలగించిన మెక్‌డొనాల్డ్ అభివృద్ధి స్తంభించిందని తెలిపింది. ఇప్పటికే వివిధ రకాలుగా భారత్ మార్కెట్ లోకి ఎంటరైనా సంస్థ అక్కడి ఉద్యోగులకోసం చూస్తోందని పేర్కొంది. అయితే అకౌంటింగ్ ఫంక్షన్ సహా తమ వ్యాపారాన్ని అనేక కోణాల్లో శాశ్వత ప్రాతిపదికన పునర్నిర్మించుకునే క్రమంలోనే ఈ చర్యలని సంస్థ ప్రతినిధి టెర్రీ హికీ చెప్పారు. 2017లో తమ వ్యాపారాన్ని విస్తరించుకునే పనిలో ఉన్నామన్నారు. అలాగే ఖర్చును తగ్గించుకోనున్నామని సంస్థ వెల్లడించింది. అయితే మెక్ డొనాల్డ్ అమెరికాలో ఉన్న ప్రాంతీయ ఆఫీసులను క్రమేపీ తగ్గించుకుంటూ వస్తోంది. గతంలో 40 గా ఉన్న ఈ సంఖ్య ప్రస్తుతం 25కి చేరడం విశేషం. కాగా కనీస వేతన చట్టాన్ని అమలుచేయాలని, జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ గతంలో ఉద్యోగులు భారీ ఆందోళన చేపట్టారు. తమకు చాలీ చాలని జీతాలు ఇస్తూ.. ఉద్యోగులను సంస్థ వేధిస్తోందని ఆరోపించిన సంగతి తెలిసిందే.