అకౌంట్లు హ్యాక్ అవడం.. అకౌంట్లను హ్యాక్ చేసి పోస్టు చేసే ట్వీట్లతో కంపెనీలు, ప్రముఖులు ఇరకాటంలో పడటం గమనిస్తుంటాం. ప్రస్తుతం అమెరికా ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం మెక్ డొనాల్డ్స్ కూడా ఇదే సమస్యలో చిక్కుకుంది. ఎవరో మెక్ డొనాల్డ్స్ అకౌంట్ ను హ్యాక్ చేసి, ట్రంప్ కు వ్యతిరేకంగా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సంచలనం సృష్టించింది. తమ అకౌంట్ హ్యాకింగ్ కు గురైనట్టు గుర్తించిన కంపెనీ, 20 నిమిషాల్లో ట్రంప్ కు వ్యతిరేకంగా నమోదైన ట్వీట్ ను డిలీట్ చేసింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టమంతా జరిపోయి, ఆ ట్వీట్ 200 సార్లు రీట్వీట్ అయింది.