సీపీఆర్‌ఎల్‌తో మెక్‌డొనాల్డ్స్ కటీఫ్
న్యూఢిల్లీ: ఒప్పంద నిబంధనల ఉల్లంఘన, చెల్లింపుల ఎగవేత తదితర ఆరోపణలపై కనాట్ ప్లాజా రెస్టారెంట్‌తో (సీపీఆర్‌ఎల్) మెక్‌డొనాల్డ్స్ ఇండియా తెగతెంపులు చేసుకుంది. దీంతో సీపీఆర్‌ఎల్ తన అవుట్‌లెట్స్‌లో ఎక్కడా కూడా మెక్‌డొనాల్డ్స్ బ్రాండ్‌ను ఉపయోగించుకోవడానికి వీలుండదు. అయితే, ఉద్యోగులు, సరఫరాదారులు, అవుట్‌లెట్స్‌కు స్థలం ఇచ్చిన యజమానులపై ప్రతికూల ప్రభావం పడకుండా తగు పరిష్కార మార్గం కనుగొనే దిశగా సీపీఆర్‌ఎల్‌తో కలిసి పనిచేయడానికి తాము సిద్ధమని మెక్‌డొనాల్డ్స్ ఇండియా పేర్కొంది. సీపీఆర్‌ఎల్ ప్రస్తుతం తూర్పు, ఉత్తరాది రాష్ట్రాల్లో 169 ఫాస్ట్‌ఫుడ్ అవుట్‌లెట్స్‌ను నిర్వహిస్తోంది. ఢిల్లీలో సీపీఆర్‌ఎల్ ఆధ్వర్యంలో నడుస్తున్న 43 అవుట్‌లెట్స్ లైసెన్సులను పునరుద్ధరించుకోకపోవడం వల్ల మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో మెక్‌డొనాల్డ్స్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.