థాయ్‌లాండ్‌కు చెందిన ఓ వినియోగదారుడు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. తనకు ఎదురైన చేదు అనుభవంపై ఆయన ఫేస్‌బుక్‌లో పంచకున్నారు. మెక్ డోనాల్డ్స్ లో కాఫీ ఆర్డర్ చేస్తే కాక్రోచ్ కాళ్లు ఒడ్డించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలి ఇలాంటి ఆరోపణలు తరచూ వినిపిస్తుండడంతో మెక్ డోనాల్డ్స్ సంస్థ మరోసారి ఇబ్బందుల్లో పడింది.
బ్యాంకాక్ చెందిన నోస్టాలిక్ ఐక్ (28) స్థానిక మెక్‌డోనాల్డ్స్ లో కాపుచ్చినో కాఫీ ఆర్డర్ చేశారు. ..వేడి..వేడిగా ..నురగలతో..కమ్మని వాసనతో అదరగొట్టాల్సిన కాఫీలో...కాఫీరంగులో తేలుతూ ఏదో ఏదో అనుమానాస్పదంగా కనిపించింది. తీరా చూస్తే... బొద్దింక కాళ్లు.. వెంటనే బాయ్‌ని పిలిచి వేరే కప్పు తెప్పించుకున్నారు. ఈసారి మరింత బెంబేలెత్తడం అతని వంతు అయింది. ఎందుకంటే.. రెండవ కప్పులో మరిన్ని బొద్దింక కాళ్లు తేలుతూ కనిపించాయి.
దీంతో మండిపడిన సదరు వినియోగదారుడు ..మెక్‌డొనాల్డ్ అంటే అధిక శుభ్రానికి, ప్రమాణాలకు పెట్టింది పేరని భావించిన తనకు గట్టి షాక్ తగిలిందంటూ తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. దీంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. ఎట్టకేలకు ఈ వ్యవహారంపై స్పందించిన మెక్‌డొనాల్డ్స్ వినియోగదారుడికి క్షమాపణలు చెప్పింది. కస్టమర్ ఆరోపణను ధృవీకరించడంతోపాటు విచారణ చేపట్టనున్నట్టు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment