మెల్‌బోర్న్ : ఉరుకుల పరుగుల జీవితంలో ఆహారం తయారుచేసుకునేందుకు ఎక్కువ సమయం కేటాయించేందుకు ఇష్టపడని జనం రెస్టారెంట్లను ఆశ్రయిస్తున్నారు. ఇన్‌స్టంట్ ఫుడ్‌పై నెట్టుకొస్తూ ఏదో తినేశామనిపిస్తున్నారు. రెస్టారెంట్లు సైతం సమయానికి డెలివరీపై దృష్టిసారించడమే కానీ ఆహార నాణ్యతను పట్టించుకోవడం లేదు. మెక్‌డొనాల్డ్స్ బర్గర్‌ను ఆర్డర్ చేస్తే నాణ్యత లేని ఆహారం తమ తలుపు తట్టిన తీరును ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన ఓ మహిళ ఫేస్‌బుక్ పోస్ట్‌లో వాపోయారు.
చికెన్, చీజ్‌కు ఆర్డర్ ఇస్తే చికెన్ బర్గర్‌లో మెటల్ రాడ్ ఉందని ఆద తిప అనే మహిళ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. తన మూడేళ్ల మేనకోడలు ఈ ఆర్డర్ చేసింని, తనకు ఇంకా ఈ చికెన్ బర్గర్ ఇవ్వకపోవడం మంచిదైందని ఆమె చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై పెద్దసంఖ్యలో నెటిజన్లు రెస్టారెంట్ నిర్వాకంపై మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment