mc donald
-
ట్రంప్ ‘మెక్‌డొనాల్డ్’ షోపై భారీ ట్రోలింగ్
న్యూయార్క్:అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆదివారం(అక్టోబర్ 20) పెన్సిల్వేనియాలోని మెక్‌డొనాల్డ్ రెస్టారెంట్లో సందడి చేశారు. అక్కడికి వచ్చిన కస్టమర్లకు ఫ్రెంచ్ ఫ్రైస్ వండి స్వయంగా వడ్డించారు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది.POS Trump Staged the entire thing.The McDonalds was CLOSED.The “supposed customers” were vetted before drive thru He thinks we won’t notice Trump is the GOAT BALL LICKERThe People's President is Kamala pic.twitter.com/Q6txxKRDET— Larry (@SocratesBigBird) October 20, 2024ఈ దుమారానికి కారణం ట్రంప్ వెళ్లిన మెక్‌డొనాల్డ్ అవుట్లెట్ మేనేజర్ ఆదేశాలు బయటికి పొక్కడం. ఆదివారం సాయంత్రం 4 గంటల దాకా అవుట్లెట్ మూసి ఉంటుందని మేనేజర్ ఆదేశాల సారాంశం. ట్రంప్ రాకకు వీలుగా అవుట్‌లెట్‌ను మూసివేసినట్లు తెలుస్తోంది. మేనేజర్ ఆదేశాల కాపీ సోషల్ మీడియా వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. మెక్‌డొనాల్డ్‌లో జరిగింది కేవలం షో అని, సహజంగా జరిగింది కాదని డెమొక్రాట్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.ఇదీ చదవండి: మెక్‌డొనాల్డ్‌లో ఫ్రెంచ్‌ఫ్రైస్ చేసిన ట్రంప్ -
సాస్ ఇవ్వలేదని రెస్టారెంట్‌ను బాంబులతో పేల్చేస్తానన్నాడు.. చివరికి
ఆహారం విషయంలో కొంతమంది భోజన ప్రియులు కచ్చితంగా ఉంటారు. అలాగే వారికి నచ్చిన ఆహారం కోసం గతంలో కొందరు వందల కిలోమీటర్లు వెళ్లిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇంత వరకు ఓకే గానీ ఏదైనా సృతి మించకూడదని అంటారు. కాగా ఓ వ్యక్తి ఆ విషయంలో చాలా దూరం వెళ్లాడు. ఎంతంటే ఏకంగా రెస్టారెంట్‌ను బాంబులతో పేల్చేస్తానంటూ ఆ యజమానికే కాల్ చేసి బెదిరిస్తూ రెచ్చిపోయాడు. అసలు అతనికి అంతలా ఆగ్రహానికి గల కారణం తెలిస్తే షాక్ అవుతారు. మరేమీ లేదండీ.. సాస్ ఇవ్వడం మరిచిపోయాడని అతను అంత రచ్చ చేశాడు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని లోవాలో నివసిస్తున్న రోబర్ట్ గాల్విట్జెర్ ఫుడ్ రెస్టారెంట్ సంస్థ మెక్ డొనాల్డ్స్‌కు ఫోన్ చేసి చికెన్ నగ్గెట్స్ ఆర్డర్ చేశాడు. మెక్‌డొనాల అంటేనే చికెన్ నగ్గెట్స్, బర్గర్స్కి ప్రత్యేకమని అందరికీ తెలిసిన విషయమే. ఇంకేముంది రుచికరమైన వంటకం వస్తోంది, ఓ పట్టు పట్టాలి అని ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఇంతలో అతనికి చికెన్ నగ్గెట్స్ అందాయి. కానీ, అవి డిప్ చేసి తినేందుకు అందులో సాస్ ఇవ్వడం ఆ రెస్టారెంట్ సిబ్బంది మరిచిపోయారు. అసలు సాస్ లేకుండా ఎలా డెలివరీ చేస్తారని మనోడికి కోపం వచ్చింది. వెంటనే డెలివరీ సిబ్బందిని కొట్టడమే కాకుండా, రెస్టారెంట్‌కు ఫోన్ చేసి.. బాంబులతో పేల్చేస్తానని బెదిరించాడు. దీంతో రెస్టారెంట్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా గాల్విట్జెర్‌ను అరెస్టు చేశారు. చదవండి: వాంటెడ్ క్రిమినల్‌గా ‘మార్క్ జుకర్‌బర్గ్’.. పట్టిస్తే రూ.22కోట్లు -
'ఒక్క పనితో మా మనసులు దోచేసింది'
మీరు రెస్టారెంట్‌కు వెళితే మీ బిల్లు ఎవరు కడుతారు.. అదేంటి ఇదేం ప్రశ్న అని అనుకుంటున్నారా.. సాధారణంగా అయితే మనం లేక మనతో పాటు వచ్చిన స్నేహితులలో ఎవరో ఒకరు బిల్లు చెల్లిస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం మెక్‌డొనాల్డ్‌లో పనిచేస్తున్న ఒక మహిళ ఒక కస్టమర్ బిల్లును తనే స్వయంగా చెల్లించి అతన్ని ఆశ్చర్యపరిచింది. అసలు విషయంలోకి వెళితే.. జోష్ అనే వ్యక్తి తన తల్లిని తీసుకొని మెక్‌డొనాల్డ్‌కు వచ్చాడు. తన తల్లికి ఇష్టమైన ఫుడ్ అడిగి ఆర్డర్ చేశాడు. ఫుడ్ తిన్న తర్వాత బిల్ చెల్లిద్దామని జోష్ కౌంటర్ వద్దకు వచ్చాడు. అయితే కౌంటర్లో ఉన్న మెక్‌డొనాల్డ్ ఉద్యోగిణి ఇన్యా మీ బిల్ నేను పే చేస్తున్నా అంటూ తన కార్డ్‌ను స్వైప్ చేసింది. కాగా జోష్ అందుకు సంబంధించిన వీడియోనూ తన ట్విటర్లో షేర్ చేశాడు. (చదవండి : వైరల్ వీడియో.. ప్రియుడిని తన్నిన యువతి) 'మెక్‌డొనాల్డ్‌లో ఎంప్లాయ్‌గా పనిచేస్తున్న ఇన్యా మా బిల్‌ను చెల్లించింది. ఆమె ఎందుకిలా చేసిందో నాకు చెప్పలేదు గాని.. నాకు మాత్రం చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే కొంచెం బాధతో వచ్చిన నన్ను ఇన్యా తన పనితో నా మొహంలో ఆనందం నింపింది. బహుశా నేను బాధలో ఉన్నట్లు ఇన్యా గుర్తించినట్లుంది. అందుకే ఆమె చేసిన ఈ సాయాన్ని గొప్ప ప్రతిఫలంతో తిరిగి ఆమెకు అందిస్తాను.'అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇన్యా చేసిన పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక్క పనితో మా మనుసులు దోచేసింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. A girl called “Enya” who works at Tile Hill @McDonaldsUK just paid for my meal as her act of kindness for the day. Proper cheered me up after having a depressing day with the fact I’m at high risk of redundancy. I will pay this kind act forward tomorrow for sure. ❤️❤️❤️ pic.twitter.com/8puiCUAkKy — Josh-U-R 🙌🏿🙌🏻🙌🏽 (@Josh_U_R_Artist) September 22, 2020 -
ఆకలేస్తుందని హోటల్లో హెలికాప్టర్ దించాడు
-
ఆకలేస్తుందని హోటల్లో హెలికాప్టర్ దించాడు
సిడ్నీ: బాగా ఆకలేస్తే సాధారణంగా ఏం చేస్తాం.. అందుబాటులో ఉన్న ఏ హోటల్‌కో లేదంటే రోడ్డు పక్కన ఉండే బండి వద్దకో వెళ్లి ముందు ఆ బాధ తీర్చేసుకుంటాం. అలా మనం వెళ్లినప్పుడు ఏ హోటల్ వ్యక్తి కూడా మనల్ని చూసి, అవాక్కవడం షాకవడం లాంటివి జరగదు. కానీ, ఆస్ట్రేలియాలోని సిడ్నీలో తమ హోటల్‌కు ఆకలితో వచ్చిన ఓ కస్టమర్‌ను చూసి మెక్ డోనాల్డ్ సిబ్బంది కాసేపు అవాక్కయ్యారు. షాక్‌లోకి వెళ్లిన వారు తేరుకొని అనంతరం అతడికి ఏం కావాలో ఇచ్చి పంపించారు. ఇంతకీ మెక్‌డోనాల్డ్ సిబ్బంది షాక్ తినడానికి గల కారణం ఏమిటంటే ఆ వచ్చిన వ్యక్తి మాములుగా రాలేదు.. ఏకంగా హెలికాప్టర్ వేసుకొని వచ్చాడు. హోటల్ ముందు ఉన్న ల్యాన్‌లోకి ఏకంగా తన హెలికాప్టర్‌ను దించి అలాగే, ఇంజిన్ ఆన్‌లో ఉంచి ఏం చక్కా లోపలికి నడుచుకుంటూ వెళ్లి తనకు కావాల్సిన ఆహారం పార్సిల్ తీసుకొని వెళ్లాడు. వెళుతూ తను ఆ హోటల్‌కు వచ్చిన సందర్భంగా తన చాపర్‌ను కూడా ఓ ఫొటో తీసుకుని అనంతరం దర్జాగా ఆ హెలికాప్టర్ వేసుకొని వెళ్లిపోయాడు. ఆ సమయంలో ఆ పైలట్‌ను చూసిన వారంతా కూడా తీవ్ర ఆశ్చర్యానికి లోనయ్యారు. సెల్ఫోన్లో చిత్రించిన ఈ వీడియో ఇప్పుడు ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. -
పోలీస్ చీఫ్ ఉద్యోగం ఊడింది
చికాగో: అమెరికాలో నల్లజాతి యువకుడిని తెల్లజాతి పోలీస్ అధికారి కాల్చి చంపిన ఘటనలో చికాగో పోలీస్ ఉన్నతాధికారి గ్యారీ మెక్ క్యాథీపై వేటు పడింది. ఘటన జరిగి 13 నెలలు గడిచినా కేసు విచారణ ఓ కొలిక్కి రాకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన్ను తొలగిస్తూ.. చికాగో మేయర్ ర్యామ్ ఇమాన్యుయల్ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. నల్లజాతి యువకుడిపై కాల్పులకు సంబంధించిన ఓ వీడియో ఇటీవల బహిర్గతమైంది. ఆ వీడియోలో తెల్లజాతి పోలీస్ ఆఫీసర్ వాన్ డైక్.. నల్లజాతి టీనేజీ యువకుడు మెక్ డొనాల్డ్ పై 16 రౌండ్లు కాల్పులు జరిపినట్లు కనిపించింది. ఈ వీడియోతో ఆగ్రహానికి లోనైన నల్ల జాతీయులు.. ఘటన జరిగి 13 నెలలు గడిచినా నిందితుడిని శిక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని చికాగోలో గత వారం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కేసు విచారణలో జరిగిన జాప్యం తనను తీవ్ర అసహనానికి గురి చేసిందని పేర్కొన్న మేయర్.. పోలీస్ ఉన్నతాధికారిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు వెల్లడించారు. అలాగే పోలీసు శిక్షణ, పనితీరును పరిశీలించేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. పోలీసు వ్యవస్థపై నమ్మకం పెరిగేలా ఈ కమిటీ పనిచేస్తుందని ఇమాన్యుయల్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి తాను పూర్తి బాధ్యత తీసుకుంటున్నట్లు తెలిపిన ఆయన.. ఇలాంటి ఘటనలపై తీసుకునే చర్యలకు ఇది ప్రారంభం మాత్రమే అని చెప్పారు. కాగా కాల్పులకు పాల్పడిన పోలీస్ ఆఫీసర్ వాన్ డైక్ సోమవారం 1.5 మిలియన్ డాలర్ల పూచీకత్తుతో బెయిల్‌పై విడుదలయ్యాడు.