వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో మిగిలిపోయిన అరిజోనా స్టేట్ రిజలల్ట్స్ కూడా అధికారికంగా వెల్లడయ్యాయి. అరిజోనానూ ట్రంప్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇక్కడున్న 11 ఎలక్టోరల్ ఓట్లను ట్రంప్ గెలుచుకున్నారు. దీంతో ట్రంప్ ఈ ఎన్నికల్లో మొత్తం 312 ఎలక్టోరల్ ఓట్లు గెలుచుకున్నారు.
ప్రత్యర్థి డెమోక్రటిక్ అభ్యర్థి కమలాహారిస్‌కు 226 ఎలక్టోరల్ ఓట్లే వచ్చాయి. అరిజోనా విజయంతో అమెరికాలో ఉన్న ఏడు స్వింగ్ స్టేట్స్‌ను ట్రంప్ గెలుచుకున్నట్లయింది. అరిజోనాను 2016లో గెలుకున్న ట్రంప్ 2020లో బైడెన్ చేతిలో ఓటమి పాలయ్యారు. తిరిగి అక్కడ ఈ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేశారు.
అరిజోనా గెలుపుతో ఈ అధ్యక్ష ఎన్నికల్లో ఏడు స్వింగ్ స్టేట్స్‌ను ట్రంప్ గెలుచుకుని రికార్డు సృష్టించారు. కాగా, అధ్యక్ష ఎన్నికల ఫలితాలు పోలింగ్ జరిగిన నవంబర్ 5న వెలువడడం ప్రారంభమవగా అరిజోనాలో మాత్రం కౌంటింగ్ పూర్తవడానికి నాలుగు రోజులు పట్టడం గమనార్హం. ఈ ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ జనవరిలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఇదీ చదవండి: ట్రంప్ మార్కు కనిపించేనా..
Comments
Please login to add a commentAdd a comment