అమెరికాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం | PM Narendra Modi America Tour, Know Important Things About Meeting With Donald Trump, More Details Inside | Sakshi
Sakshi News home page

అమెరికాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం

Published Thu, Feb 13 2025 7:04 AM | Last Updated on Thu, Feb 13 2025 10:01 AM

PM Modi on America tour meeting with Trump know Important things

వాషింగ్టన్‌ డీసీ: ప్రధాని నరేంద్ర మోదీ తన విదేశీ పర్యటనలో భాగంగా అమెరికా చేరుకున్నారు. ఆయనకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఈ పర్యటనలో ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. జనవరి 20న ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత అమెరికాను సందర్శించిన కొద్దిమంది ప్రపంచ నేతలలో ప్రధాని మోదీ కూడా ఉన్నారు.
 

ప్రధాని మోదీ, ట్రంప్ మధ్య జరిగే సమావేశంలో అనేక ద్వైపాక్షిక అంశాలును చర్చించే అవకాశం ఉంది. ట్రంప్‌ అధికారం చేపట్టిన తర్వాత వివిధ దేశాల నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలు విధిస్తామని  హెచ్చరిస్తున్న సమయంలో ప్రధాని మోదీ  పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

‘కొద్దిసేపటి క్రితమే వాషింగ్టన్ డీసీ చేరుకున్నాను. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలిసేందుకు,భారత్‌-యుఎస్ఎ సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఎదురుచూస్తున్నాను. ఇరు దేశల ప్రజల ప్రయోజనం కోసం, అత్యుత్తమ భవిష్యత్తు కోసం కలిసి పనిచేయనున్నాం’ అని ప్రధాని మోదీ ట్విట్టర్‌లో  పేర్కొన్నారు.

అమెరికా చేరుకున్న ప్రధాని మోదీ అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ తులసి గబ్బర్డ్‌ను కలుసుకున్నారు. అలాగే బ్లెయిర్ హౌస్ చేరుకున్న ప్రధాని ప్రవాస భారతీయులను కలుసుకున్నారు. ప్రధాని ఫిబ్రవరి 12-13 తేదీలలో అమెరికా పర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం కానున్నారు.

ప్రధానిని స్వాగతించడానికి వాషింగ్టన్ డీసీకి తరలివచ్చిన ప్రవాస భారతీయులు ఆయనను చూడగానే ‘వందేమాతరం’,'భారత్ మాతా కీ జై' నినాదాలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ అమెరికా పర్యటన జరుగుతోంది. అమెరికాలోని భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా విమానాశ్రయంలో ప్రధాని మోదీకి స్వాగతం పలికారు.

 

ఇది కూడా చదవండి: జేడీ వాన్స్‌ కుమారుని బర్త్‌డే వేడుకలకు ప్రధాని మోదీ
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement