ఆ విషయంలో మోదీనే గ్రేట్‌.. నేను పోటీ పడలేను: ట్రంప్ | USA Trump Praised PM Modi Over Negotiates Matter | Sakshi
Sakshi News home page

ఆ విషయంలో మోదీనే గ్రేట్‌.. నేను పోటీ పడలేను: ట్రంప్

Feb 14 2025 10:42 AM | Updated on Feb 14 2025 11:00 AM

USA Trump Praised PM Modi Over Negotiates Matter

వాషింగ్టన్‌: అమెరికాలో భారత ప్రధాని నరేంద్ర మోదీకి దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చారు. అనంతరం, దేశాధినేతలిద్దరూ సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీపై ట్రంప్‌ ప్రశంసలు కురిపించారు. మోదీ తన కంటే కఠినమైన సంధానకర్త అని ట్రంప్‌ చెప్పుకొచ్చారు.

భారత ప్రధాని మోదీతో ట్రంప్‌ భేటీ అనంతరం విలేకరులు పలు ప్రశ్నలు సంధించారు. ఈ క్రమంలో మీ ఇద్దరిలో ఎవరు మంచి సంధానకర్త అని ఓ విలేకరి ప్రశ్నించగా.. దీనికి ట్రంప్‌ సమాధానం ఇచ్చారు. ట్రంప్‌ స్పందిస్తూ.. మోదీ నా కంటే కఠినమైన సంధానకర్త. చర్చల్లో కఠినంగా వ్యవహరిస్తారు. ఆ విషయంలో మోదీతో నేను పోటీ పడలేను. మోదీనే గ్రేట్‌ అంటూ బదిలిచ్చారు. ట్రంప్‌ సమాధానంతో మోదీ సైతం ఆనందం వ్యక్తం చేశారు.

మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఇద్దరి మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు సాగాయి. ఇరు దేశాల పరస్పర వాణిజ్య, రక్షణబంధం బలోపేతానికి కట్టుబడి ఉన్నట్లు దేశాధినేతలు తెలిపారు. అమెరికా పర్యటనను ముగించుకొని ప్రధాని మోదీ కొన్ని గంటల క్రితమే భారత్‌కు తిరుగు పయనం అయ్యారు.

మోదీకి ట్రంప్‌ బహుమతి..
మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఆయనకు ట్రంప్‌ ఓ బహుమతి అందజేశారు. ట్రంప్‌ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చోటుచేసుకున్న కీలక సందర్భాలు, ప్రధాన ఈవెంట్లతో కూడిన ఫొటోబుక్‌ను ఇచ్చారు. ఇందులో ప్రధాని మోదీ 2019 నాటి అమెరికా పర్యటనలో నిర్వహించిన ‘హౌడీ మోదీ’, ఆ తర్వాత 2020లో ట్రంప్‌ భారత్‌కు విచ్చేసినప్పుడు ఏర్పాటుచేసిన ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు కూడా ఉన్నాయి. ఈ పుస్తకంపై ‘మిస్టర్‌ ప్రైమ్‌ మినిస్టర్‌, యూ ఆర్‌ గ్రేట్‌’ అని రాసి ట్రంప్‌ సంతకం చేశారు. అనంతరం పుస్తకంలోని పేజీలను తిప్పుతూ వీరిద్దరూ ఉన్న ఫొటోలను మోదీకి ఆయన చూపించారు. 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement