
బీజింగ్: భారత్ తో స్నేహ హస్తం కోసం ఎదురుచూస్తున్న చైనా.. ప్రధాని నరేంద్ర మోదీ చేసి వ్యాఖ్యలను స్వాగతించింది. తమ దేశం భారత్ తో స్నేహం కోసం ఎదురుచూసే వేళ మోదీ ఈ తరహాలో పాజిటివ్ గా మాట్లాడగం నిజంగా అభినందనీయమని చైనా విదేశాంగ ప్రతినిధి మావ్ నింగ్ సంతోషం వ్యక్తం చేశారు. ఇదే తాము భారత్ నుంచి ఆశిస్తున్నదంటూ సంతోషం వ్యక్తం చేశారు ఆమె.
ఇరు దేశాలది ఎన్నో ఏళ్ల చరిత్ర
భారత్, చైనాలకు గత కొన్ని శతాబ్దాలుగా చారిత్రాత్మ ఘనతలు ఉన్నాయని, ఈ క్రమంలోనే ఎన్నో గుణపాఠాలు నేర్చుకుని రాటుదేలిన దేశాలు భారత్, చైనాలని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అమెరికా పాడ్ కాస్టర్, ఏఐ శాస్త్రవేత్త లెక్స్ ఫ్రిడ్ మ్యాన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో అంతర్జాతీయ అంశాలను మోదీ ప్రసావించారు. దీనిలో భాగంగా చైనాతో సంబంధాల గురించి ప్రస్తావించగా మోదీ తనదైన శైలిలో జవాబిచ్చారు. ప్రధానంగా ఇటీవల ఎలిఫెంట్, డ్రాగన్’ కలిసి డ్యాన్స్ చేస్తే బాగుంటుందని చైనా చేసిన వ్యాఖ్యలపై పాడ్ కాస్ట్ లో అడగ్గా మోదీ సూటిగా బదులిచ్చారు.
పోటీ అనేది వివాదం కాకూడదు..
ఎక్కడైనా పోటీ అనేది వివాదం కాకూడదని, బేధాభిప్రాయాలు అనేవి ఘర్షణ వాతావరణాకి దారితీయకూడదని అంటూ చైనాను ఉద్దేశించి మోదీ సుతిమెత్తని శైలిలో చెప్పుకొచ్చారు. ఎంతో ఘన చరిత్ర కల్గిన ఇరు దేశాల జీడీపీ.. వరల్డ్ జీడీపీలో 50 శాతానికి పైగానే ఉందన్నారు మోదీ. తమ మధ్య ఎంతో బలమైన సంబంధాలున్నాయనే తాను నమ్ముతున్నానని మోదీ పేర్కొన్నారు.
ఎలిఫెంట్, డ్రాగన్ డ్యాన్స్ కలిసి చేద్దాం
సరిగ్గా పదిరోజుల క్రితం భారత్ తో కలిసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఒకరిని ఒకరు కించ పరుచుకోవడం కంటే కలిసి పని చేస్తే అద్భుతాలు స్పష్టించవచ్చాన్నారు వాంగ్ యి. ఆ దేశ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ మీట్ తర్వాత వాంగ్ యి మాట్లాడుతూ.. ‘ ఢిల్లీ, బీజింగ్ కలిసే పని చేసే సమయం ఆసన్నమైంది. డ్రాగన్, ఎలిఫెంట్ డ్యాన్స్ కలిసి చేస్తే బాగుంటుంది. ఇరుదేశాలు ఒకరికొకరు సహకరించుకోవాల్సిన అవసరం ఉంది. సహకారంతో పోయేదేమీ ఉండదు. సహకారం ఇచ్చి పుచ్చుకుంటే మరింత బలోపేతం అవుతాం. ఇది దేశ ప్రజలకు, దేశాలకు మంచిది’ అని పేర్కొన్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన టీ20 విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ తో వాంగ్ యి భేటీ అయ్యారు. అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
కొంత కాలంగా ఇరుదేశాల మధ్య సామరస్య వాతావరణం
2020లో గల్వాన్ ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అప్పట్నుంచి నిన్న మొన్నటి వరకూ ఇరు దేశాలు పెద్దగా సమావేశం అయ్యింది కూడా తక్కువే. ఆపై 2024లో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భేటీ తరువాత .ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కాస్త చల్లబడింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్న చోట నుంచి ఇరు దేశాలు తమ బలగాలను వెనక్కి పిలపించడంతో అప్పట్నుంచీ సామరస్య వాతావరణం కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment