ట్రంప్‌ దెబ్బకు దిగొచ్చిన చైనా.. భారత్ వైపు చూపు | Let's Make . Chinese Minister Amid US 'Tariff War' | Sakshi

ట్రంప్‌ దెబ్బకు దిగొచ్చిన చైనా.. భారత్ వైపు చూపు

Mar 7 2025 3:24 PM | Updated on Mar 7 2025 4:20 PM

Let's Make . Chinese Minister Amid US 'Tariff War'

బీజింగ్:  అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత దిగుమతి సుంకాలను భారీగా పెంచిన సంగతి తెలిసిందే. ప్రధానంగా కెనడా, మెక్సికో ఉత్పత్తులపై 25 శాతం చొప్పున, చైనా ఉత్పత్తులపై అదనంగా 10 శాతం సుంకాలు విధించబోతున్నామని, మంగళవారం నుంచే ఇది అమల్లోకి వస్తుందని ట్రంప్ ప్రకటించారు. అమెరికాకు వస్తువులను ఎగుమతి చేసే దేశాలు సుంకాలు చెల్లించాల్సిందేనని తెలిపారు.

దీనికి చైనా కూడా అంతే ఘాటుగా స్పందించింది. తమ దేశంలోకి దిగుమతి అయ్యే అమెరికా వస్తువులపై అదనంగా 15 శాతం టారిఫ్‌ విధిస్తున్నట్లు ప్రకటించింది. చికెన్, గోధుమలు, మొక్కజొన్న, పత్తి తదితర దిగుమతులపై ఈ టారిఫ్‌ వసూలు చేస్తామని, అలాగే జొన్న, సోయాబిన్, పోర్క్, బీఫ్, సముద్ర ఉత్పత్తులు, పండ్లు, కూరగాయాలు, పాడి ఉత్పత్తులపై అదనంగా 10 శాతం సుంకాలు విధించనున్నట్లు వెల్లడించింది.

అయితే చైనా ప్రస్తుత చూపులు భారత్ వైపు పడ్డాయి. భారత్ తో గతంలో ఉన్న విరోధాన్ని పూర్తిగా పక్కన పెట్టేందుకు సిద్ధమైంది చైనా.  భారత్ తో శత్రుత్వం కంటే మిత్రత్వమే మేలనే భావనకు వచ్చింది చైనా.-భారత్ తో కలిసి పని చేయాలని చూస్తోంది., ఈ మేరకు ఇప్పటికి ఓ మెట్టు దిగి భారత్‌ సహకారం కావాలంటోంది  డ్రాగన్‌.

ఇద్దరం కలిసి పని చేద్దాం: చైనా విదేశాంగ మంత్రి
భారత్ తో కలిసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి స్పష్టం చేశారు.  ఒకరిని ఒకరు కించ పరుచుకోవడం కంటే కలిసి పని చేస్తే అద్భుతాలు స్పష్టించవచ్చాన్నారు వాంగ్ యి.  ఆ దేశ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ మీట్ తర్వాత వాంగ్ యి మాట్లాడుతూ.. ‘ ఢిల్లీ‍, బీజింగ్ కలిసే పని చేసే సమయం ఆసన్నమైంది. డ్రాగన్, ఎలిఫెంట్ డ్యాన్స్ కలిసి చేస్తే బాగుంటుంది. ఇరుదేశాలు ఒకరికొకరు సహకరించుకోవాల్సిన అవసరం ఉంది. సహకారంతో పోయేదేమీ ఉండదు.  సహకారం ఇచ్చి పుచ్చుకుంటే మరింత బలోపేతం అవుతాం. ఇది దేశ ప్రజలకు, దేశాలకు మంచిది’ అని పేర్కొన్నారు.

ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన టీ20 విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత్ విదేశాంగ​ మంత్రి జైశంకర్ తో వాంగ్ యి భేటీ అయ్యారు. అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 2020లో గల్వాన్ ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.  అప్పట్నుంచి నిన్న మొన్నటి వరకూ ఇరు దేశాలు పెద్దగా సమావేశం అయ్యింది కూడా తక్కువే. ఆపై 2024లో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భేటీ తరువాత .ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కాస్త చల్లబడింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్న చోట నుంచి ఇరు దేశాలు తమ బలగాలను వెనక్కి పిలపించడంతో అప్పట్నుంచీ సామరస్య వాతావరణం కనిపిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement