Jinping
-
ఆ వ్యతిరేకత మనకు కలిసొచ్చేనా?
ట్రంప్ తిరిగి ఎన్నిక కావడం ఆయన చైనా విధానం గురించి ప్రశ్నలను లేవనెత్తుతోంది. అది ఇండో–పసిఫిక్ క్రియాశీలక శక్తులను ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా అమెరికా–చైనా ఉద్రిక్తతల నడుమ భారతదేశానికి పెట్టుబడులను ఆకర్షించే అవకాశాన్ని అందిస్తుంది.గతం నాంది అయినట్లయితే, అమెరికా అధ్యక్షులు వారి రెండవ టర్మ్‌లో మరింత దూకుడుగా ఉంటారని చెబుతారు. ట్రంప్ 2.0 చైనా విధానంపై తీవ్ర ప్రభావాన్ని చూపవచ్చు. ఎందుకంటే, తన మొదటి హయాంలో ట్రంప్, బీజింగ్‌తో వాషింగ్టన్ ప్రాథమిక ఒడంబడికనే మార్చేశారు. 1970ల చివరలో ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరినప్పటి నుండి, ఆర్థిక, శాస్త్రీయ సాంస్కృతిక రంగా లలో సహకారం పెరిగింది. ట్రంప్ రెండు దేశాల మధ్య ఆ బంధాన్ని తెంచేశారు.వాణిజ్యం, భౌగోళిక రాజకీయాలు, భద్రతలో సవాళ్లను కూడా పరిష్కరించాలని ట్రంప్ చూస్తున్నారు. వాణిజ్య లోటును తగ్గించేందుకు చైనా దిగుమతులపై ట్రంప్ ప్రభుత్వం సుంకాలు విధించిన నేపథ్యంలో చైనా–అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. చైనా సంతకం చేసిన వాణిజ్య ఒప్పంద నిబంధనల ప్రకారం, అమెరికా ఉత్పత్తుల కొనుగోళ్లను పెంచడానికీ, మేధో సంపత్తికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికీ, అమెరికన్ ఆర్థిక సంస్థలకు ఎక్కువ మార్కెట్ అందుబాటు ఇవ్వడానికీ అంగీకరించింది. అయితే, ట్రంప్ ప్రభుత్వం జిన్‌పింగ్ నేతృత్వంలోని చైనాను వ్యూహాత్మక ప్రత్యర్థిగా ముద్ర వేసింది. అందువల్ల, జాతీయ భద్రతా ఆందోళనలు ముఖ్యమైనవిగా మారాయి. సున్నితమైన రంగాలలో చైనీస్ పెట్టుబడులపై నియంత్రణలు, హువై, జీటీఈ వంటి చైనీస్ బడా వాణిజ్య సంస్థలపై పరిమితులు పెరిగాయి. టెలికాం నెట్‌వర్క్‌లు, సెల్‌ఫోన్ యాప్ పర్యావరణ వ్యవస్థలు, క్లౌడ్ కంప్యూటింగ్లలో చైనీస్ ప్రభావాన్ని ఎదుర్కోవాలనే ఒత్తిడి పెరిగింది.ఇదే పునాదిపై బైడెన్ పరిపాలన చైనాకు సున్నితమైన సాంకేతికత, పెట్టుబడి, మానవ మూలధన ప్రవాహాలను పరిమితం చేస్తూ తన చైనా విధానాన్ని నిర్మించింది. జిన్‌పింగ్ చైనా ఎలక్ట్రిక్ వాహనాల వంటి సాంకేతికత ద్వారా తన ప్రాధాన్యతను పెంచుకోగా, అమెరికా దాన్ని సుంకాల విధింపు ద్వారా దెబ్బతీసింది. అందువల్ల, రిపబ్లికన్, డెమొ క్రాట్ పరిపాలనల రాజకీయ ఎజెండా మొత్తంగా ఏమిటంటే చైనాను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నట్లు భావించే చర్య లను పెంచడమే.తన ఎన్నికల ప్రచారంలో భాగంగా, ట్రంప్ వస్తూ త్పత్తిలో అమెరికా ప్రాధాన్యతను పునరుద్ధరించడానికి ప్రయ త్నించారు. అధునాతన సమాచార సాంకేతికత, హై–ఎండ్ న్యూమరికల్ కంట్రోల్ మెషినరీ, రోబోటిక్స్, వైమానిక సామగ్రి, సముద్ర ఇంజనీరింగ్ టెక్నాలజీ వంటి ముఖ్యమైన రంగాలలో ఆధిపత్యాన్ని పెంపొందించడానికి ప్రయత్నిస్తున్న జిన్‌పింగ్ పాలనలోని చైనా తయారీ రంగ చొరవపై ట్రంప్ దెబ్బకొట్టారు. అధునాతన రైలు పరికరాలు, శక్తిని ఆదా చేసే వాహనాలు, విద్యుత్ పరికరాలు, వ్యవసాయ యంత్రాలు, బయో ఫార్మాస్యూటికల్స్, అధిక పనితీరు గల వైద్య పరికరాలు తదితర చైనా వస్తువులపై అధిక సుంకాలు విధించాలని ఆయన పిలుపునిచ్చారు. కోవిడ్ –19ని జిన్‌పింగ్ తప్పుగా నిర్వహించడమే 2020 ఎన్నికలలో తన పతనానికి దారితీసిందని ట్రంప్ భావిస్తున్నారు.చైనా విషయానికి వస్తే, ట్రంప్ తిరిగి రావడం దాని రాజకీయ, ఆర్థిక పథాలపై ఆందోళనలను రేకెత్తించింది. పాలనా మార్పు ద్వారా కమ్యూనిస్ట్ పార్టీని తొలగించే ప్రయత్నాలు జరగవచ్చని కూడా జిన్‌పింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణ ప్రజలలో కూడా దీని ప్రతిధ్వని వినిపించింది. చైనా ఉద్దేశించిన స్థూల దేశీయోత్పత్తి వృద్ధి లక్ష్యమైన 5 శాతాన్ని సాధించకపోవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. అమెరికా, చైనాల మధ్య క్షీణిస్తున్న సంబంధాలు, ఆర్థిక మాంద్యం బీజింగ్‌ను అమెరికన్ సంస్థలకు ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానం నుంచి తొలగించాయి. చైనాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న యూరో పియన్ వాణిజ్య సంస్థలు తాము పెట్టిన పెట్టుబడికి గానూ తగ్గిన రాబడులపై ఆందోళన వ్యక్తం చేశాయి. చైనీస్ మార్కెట్లోని సమస్యలు అపరిష్కృతంగానే ఉంటాయని అవి నమ్ముతున్నాయి. నియంత్రణ సమస్యలకు సంబంధించి చూస్తే, ప్రభుత్వ యాజమాన్యంలోని వ్యాపార సంస్థలకు ప్రాధాన్యత, మార్కెట్–ప్రాప్యత అడ్డంకులు, మితిమీరిన సామర్థ్యం కారణంగా చైనాలో పెట్టుబడి పెట్టడం గురించి ఈ సంస్థలు పునరాలోచించవలసి ఉంటుంది. భౌగోళిక రాజ కీయ ఉద్రిక్తతల మధ్య అమెరికా టెక్ కంపెనీలు చైనా నుండి నిష్క్రమించడం కూడా దీనికి తోడ్పడింది.భారతదేశం దీన్నుంచి తన ప్రయోజనాన్ని పొందేందుకు ప్రయత్నించాలి. ట్రంప్ గెలిచిన తర్వాత ఆయనతో అనుసంధానం అయిన మొదటి నాయకులలో ప్రధాని నరేంద్ర మోదీ ఒకరు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న తొలి సమయంలో సంబంధాలను పెంచుకోవడానికి మోదీ ప్రయత్నించారు. చైనాతో పాశ్చాత్య దేశాల విరక్తిని మరింతగా పెట్టుబడులను ఆకర్షించేందుకు భారత్ ఉపయోగించుకోగలదా అనేది ప్రశ్న. ట్రంప్ తొలి హయాంలో పునాది ఒప్పందాలపై సంతకం చేయడం ద్వారా సైనిక సహకారం అభివృద్ధి చెందింది. భారత్, చైనా వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి సైనిక ప్రతిష్టంభనను పరిష్కరించడానికి చర్యలు తీసుకున్నప్పటికీ, ఢిల్లీ తన నిరోధక సామర్థ్యాన్ని పెంపొందించడానికి దాని రక్షణ– పారిశ్రామిక సముదాయాన్ని మెరుగు పరచాలి. ట్రంప్ హయాంలో, 2017లో ‘క్వాడ్’ పునరుత్థానం చెందింది. పాకిస్థాన్ అధోగతి పాలైనవేళ, కశ్మీర్లో ఉగ్ర వాదం మళ్లీ పుంజుకుంటున్న వేళ, తన మొదటి ఇన్నింగ్స్‌లో భారత ఆందోళనలను పట్టించుకున్న ట్రంప్‌తో విధిగా మాట్లాడుతుండాలి. – హర్ష్ వి. పంత్, ‘ఓఆర్ఎఫ్’ చైనా స్టడీస్ ఉపాధ్యక్షుడు– కల్పిత్ మన్కికర్, ‘ఓఆర్ఎఫ్’ చైనా స్టడీస్ ఫెలో(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
భారత్ దౌత్య విజయం.. ఏకాభిప్రాయం అమలుకు చైనా సిద్ధం
బీజింగ్: రష్యాలో ఇటీవల జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన భేటీలో ముఖ్యమైన అంశాలపై కుదిరిన ఏకాభిప్రాయాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చైనా ప్రకటించింది. బ్రెజిల్లో జరగబోయే జీ20 సదస్సులో మోదీ, జిన్‌పింగ్ భేటీ కానున్న నేపధ్యంలో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ షియాన్ మీడియాతో మాట్లాడారు. ఇటీవల కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సులో అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారన్నారు.ఈ సందర్భంగా చర్చించిన ముఖ్యమైన అంశాలపై ఇరుదేశాల నాయకుల మధ్య కుదిరిన ఏకాభిప్రాయాన్ని అమలు చేయడానికి చైనా సిద్ధంగా ఉన్నదన్నారు. అలాగే ఇరు దేశాల మధ్య చర్చలు, సహకారాన్ని మెరుగుపరచడానికి, పరస్పర నమ్మకాన్ని పెంపొందించడానికి భారతదేశంతో కలిసి పని చేయడానికి చైనా సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. అయితే ఇరు దేశాల నేతలు, అధికారుల మధ్య త్వరలో జరగబోయే సమావేశపు షెడ్యూల్‌పై తన దగ్గర ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదని షియాన్ చెప్పారు.గత నెలలో రష్యాలోని కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సులో సందర్భంగా జరిగిన సమావేశంలో తూర్పు లఢాక్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంబడి మిగిలిన స్టాండ్ ఆఫ్ పాయింట్ల నుండి దళాలను ఉపసంహరించుకోవడంపై మోదీ, జిన్‌పింగ్ మధ్య చర్చ జరిగింది. విభేదాలు, వివాదాలను సక్రమంగా పరిష్కరించుకోవడంతోపాటు సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, సుస్థిరతకు విఘాతం కలగకుండా చూడాల్సిన అవసరాన్ని మోదీ ఈ సమావేశంలో స్పష్టం చేశారు. పరస్పర విశ్వాసం, పరస్పర గౌరవం ఇరు దేశాల సంబంధాలకు ప్రాతిపదికగా ఉండాలని ఆయన అన్నారు. అదే సమయంలో చైనా, భారత్‌లు వ్యూహాత్మక అవగాహనను కొనసాగించాలని, ఇరు దేశాలు సామరస్యంగా జీవించడానికి, కలిసి అభివృద్ధి చెందడానికి కలిసి పనిచేయాలని జిన్‌పింగ్ అన్నారు.ఇది కూడా చదవండి: Maharashtra: అనిల్ దేశ్‌ముఖ్ కారుపై రాళ్ల దాడి.. మాజీ మంత్రి తలకు గాయాలు -
ప్రధాని మోదీ, జిన్‌పింగ్ చర్చలు
కజన్: బ్రిక్స్ సమావేశాల సైడ్‌లైన్స్‌లో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో రష్యాలో బుధవారం(అక్టోబర్ 23) సమావేశమయ్యారు. వీరిద్దరూ ఈ భేటీలో ఏం చర్చిస్తారన్నది కీలకలంగా మారింది. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారత్, చైనా వాస్తవాధీన రేఖపై పెట్రోలింగ్ నిర్వహించే విషయంలో ఇరు దేశాల మధ్య ఇటీవలే ఒప్పందం కుదిరిన నేపథ్యంలో జిన్‌పింగ్,మోదీ భేటీ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. 2020లో సరిహద్దులో జరిగిన భారత, చైనా సైనికుల ఘర్షణల తర్వాత చైనా,భారత్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి సరికాదు: మోదీ బ్రిక్స్ రెండో రోజు సమావేశాల్లో బుధవారం ప్రధాని మోదీ పాల్గొని మాట్లాడారు. సమావేశాలను పుతిన్ విజయవంతంగా నిర్వహించారని ఈ సందర్భంగా ప్రధాని కొనియాడారు. భవిష్యత్తులో బ్రిక్స్ మరింత పటిష్టమైన వేదిక అవుతుందన్నారు. బ్రిక్స్ చిన్న,మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రపంచంలో 40 శాతం జనాభాకు బ్రిక్స్ ప్రాతినిథ్యం వహిస్తుందన్నారు. ప్రతి ఒక్కరు తల్లి పేరుతో మొక్క నాటే కార్యక్రమాన్ని భారత్‌లో చేపట్టామని చెప్పారు. ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి ఉండటం సరికాదన్నారు. బ్రిక్స్ దేశాలు లోకల్ కరెన్సీ ద్వారా వ్యాపారం చేయడాన్ని ప్రోత్సహించాలని కోరారు. ఇదీ చదవండి: ఢిల్లీ కాలుష్యంపై సుప్రీం అసహనం -
అట్టహాసంగా ఆరంభమైన ఆసియా క్రీడలు.. తెలుగు రాష్ట్రాల నుంచి వీరే
Asian Games 2023 Opening Ceremony: చైనాలోని హాంగ్జౌ వేదికగా ఆసియా క్రీడలకు తెర లేచింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ శనివారం సాయంత్రం ఈ మెగా ఈవెంట్ ప్రారంభమైనట్లు అధికారికంగా ప్రకటించారు. 19వ ఆసియా క్రీడల ఆరంభోత్సవంలో.. పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, మహిళా స్టార్ బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్ భారత బృందానికి పతాకధారులుగా వ్యవహరించారు. సంప్రదాయ దుస్తుల్లో ఈ వేడుకలో భారత క్రీడాకారులంతా ఖాఖీ రంగు ప్రధానంగా ఉన్న సంప్రదాయ దుస్తులు ధరించారు. మహిళా ప్లేయర్లు చీరలో మెరిసిపోగా.. పురుష క్రీడాకారులు కుర్తా.. పైజామా ధరించి హుందాగా కనిపించారు. చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో ఆసియా క్రీడల ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షుడు జావో ఝిదాన్, ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా తాత్కాలిక అధ్యక్షుడు రణ్‌ధీర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈసారి క్రికెట్ జట్లు కూడా ఇక ఈసారి భారత్ నుంచి అత్యధికంగా 655 మంది క్రీడాకారులు ఆసియా క్రీడల బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. అథ్లెట్ల, హాకీ జట్లతో పాటుగా.. భారత మహిళా, పురుష క్రికెట్ జట్లు తొలిసారిగా ఈ మెగా ఈవెంట్లో పాల్గొనబోతున్నాయి. ఇప్పటి వరకు 18 ఆసియా క్రీడల్లో పోటీపడి భారత్ మొత్తంగా 671 పతకాలు గెలవగా.. ఇందులో కేవలం 155 మాత్రమే స్వర్ణాలు ఉన్నాయి. అత్యధికంగా 316 కాంస్యాలు భారత్ ఖాతాలో ఉన్నాయి. అయితే, ఈసారి ఒలింపిక్స్ గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనున్నాడు. ఇదిలా ఉంటే.. ఆతిథ్య చైనా ఇప్పటి వరకు ఏకంగా 3187 పతకాలు గెలిచి తనకు తానే సాటి అన్నట్లుగా ముందుకు సాగిపోతోంది. ఇక హాంగ్జౌ ఏసియన్ గేమ్స్‌లో తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తంగా 30 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి.. ధీరజ్ బొమ్మదేవర, వెన్నం జ్యోతి సురేఖ (ఆర్చరీ), జ్యోతి యర్రాజీ (అథ్లెటిక్స్), కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధు, సాతి్వక్ సాయిరాజ్ (బ్యాడ్మింటన్), బాచిరాజు సత్యనారాయణ (బ్రిడ్జి), పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక (చెస్), నేలకుడితి అనూష (సాఫ్ట్ టెన్నిస్), సాకేత్ మైనేని (టెన్నిస్), ఆకుల సాయిసంహిత, దొంతర గ్రీష్మ (స్కేటింగ్), బారెడ్డి అనూష (క్రికెట్), శివ కుమార్ (సెపక్తక్రా). తెలంగాణ నుంచి.. వ్రితి అగర్వాల్ (స్విమ్మింగ్), అగసార నందిని (అథ్లెటిక్స్), పుల్లెల గాయత్రి, సిక్కి రెడ్డి (బ్యాడ్మింటన్), నిఖత్ జరీన్ (బాక్సింగ్), గురుగుబెల్లి గీతాంజలి (రోయింగ్), కైనన్ చెనాయ్, ఇషా సింగ్ (షూటింగ్), ఆకుల శ్రీజ (టేబుల్ టెన్నిస్), ఇరిగేశి అర్జున్ (చెస్), ప్రీతి కొంగర (సెయిలింగ్), బత్తుల సంజన (స్కేటింగ్), గుగులోత్ సౌమ్య (ఫుట్‌బాల్), తిలక్ వర్మ (క్రికెట్). 𝑺𝒂𝒃𝒔𝒆 𝑨𝒂𝒈𝒆 𝑯𝒐𝒈𝒂 𝑩𝒉𝒂𝒓𝒂𝒕💪🏻 The excitement & energy of the 🇮🇳 contingent is contagious as they walk into the opening ceremony of #AsianGames2022🔥 This edition of #BharatAtAG22 will rock for sure! #Cheer4India#HallaBol#JeetegaBharat pic.twitter.com/cnY5M0r2pN — SAI Media (@Media_SAI) September 23, 2023 The moment we've all been waiting for is almost here! 🌟 In just a few minutes, the Indian team will proudly march into the Asian Games opening ceremony at Hangzhou, China. 🎉 Let's unite, show our support, and create unforgettable memories together. 🙌🏆 #Cheer4India… pic.twitter.com/6PBePg9bMi — SAI Media (@Media_SAI) September 23, 2023 -
నిర్దిష్టమైన అంశాలపై ఒప్పందం
బీజింగ్: దాదాపు ఐదేళ్ల తర్వాత చైనాలో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగ మంత్రితో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య కొన్ని నిర్దిష్టమైన అంశాలపై ఒప్పందం కుదిరిందని జిన్‌పింగ్ ప్రకటించారు. అయితే ఆ ఒప్పందాల వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. ఇటీవల అమెరికా గగనతలంలో చైనా నిఘా భారీ బెలూన్లు చక్కర్లు కొట్టడం, వాటిని అమెరికా వాయుసేన కూల్చేయడం వంటి ఘటనలతో ఇరుదేశాల మధ్య సత్సంబంధాల్లో సందిగ్ధత నెలకొన్న విషయం తెల్సిందే. ‘‘ఇటీవల బాలీలో బైడెన్‌తో కుదిరిన ‘కనీస అవగాహన’కు కొనసాగింపుగా చైనా తన వైఖరిని స్పష్టంచేసింది. ప్రత్యేకంగా కొన్ని అంశాల్లో ఒప్పందాలు కుదిరాయి. ఇరు దేశాలు ఉమ్మడిగా పురోగతి సాధించాయి. పరస్పర గౌరవం, నమ్మకాల మీదనే చర్చలు సఫలమవుతాయి’’ అని భేటీ తర్వాత జిన్‌పింగ్ వ్యాఖ్యానించారని చైనా అధికార వార్తాసంస్థ సీజీటీఎన్. ‘ బ్లింకెన్ పర్యటనతో ఇరుదేశాల బంధం కీలక కూడలికి చేరుకుంది. అయితే చైనాపై అమెరికా విధిస్తున్న ఏకపక్ష ఆంక్షలను ఎత్తేయాల్సిన అవసరం ఉంది’ అని చైనా విదేశాంగ మంత్రి క్విన్ చెప్పారు. చైనాతో దౌత్య ద్వారాలు ఎప్పటికీ తెరిచే ఉండాలనే లక్ష్యంతో∙బ్లింకెన్ పర్యటన సాగిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
జిన్‌పింగ్‌కి వంగి నమస్కరిస్తూ చేతిని ముద్దాడిన పుతిన్!ఇది నిజమేనా?
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మూడు రోజుల రష్యా పర్యటన కోసం సోమవారమే మాస్కో చేరకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు అక్కడికి చేరుకున్న జిన్‌పింగ్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమై.. ఉక్రెయిన్ యుద్ధ శాంతి ప్రణాళిక చర్చలతో సహా పలు విషయాలను చర్చించనున్నారు. వాస్తవానికి ఈ యుద్ధంలో పాల్గొన్న ఇరు పక్షాలు తమ ఆందోళనలను విరమించి యుద్ధానికి ముగింపు పలికేలా చేయడమే ఈ పర్యటన లక్ష్యం. ఐతే ఉన్నతస్థాయి దౌత్య చర్చల మధ్య పుతిన్ జిన్‌పింగ్‌కి వంగి వంగి నమస్కరిస్తూ.. చేతిని ముద్దాడుతున్న పోటో ఒక్కసారిగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇలాంటి సమయంలో ఈ ఫోటో మరిన్ని విభేదాలకు తావిచ్చేలా ఉడటంతో ఇది అసలు నిజమా? లేక ఫేక్ ఫోటోనా అని తనిఖీ చేయడం ప్రాంభించారు నిపుణులు. ఆ తర్వాత ఇది నకిలీదని తేలింది. ఆర్టిఫషియల్ టెక్నాలజీతో రూపొందించిన ఫోటో అని నిర్థారించారు. దీనిపై క్షణ్ణంగా విచారణ జరిపిన అమండా ఫ్లోరియన్ అనే అమెరికన్ జర్నలిస్ట్ ఇలాంటి ఫోటోలు హాంకాంగ్, పోలాండ్, ఉక్రెయిన్ మూలాలకు సంబంధించన సైట్లో దాదాపు 239 ఫోటోలను చూశానని, ఇది నకిలీదని తేల్చి చెప్పారు. ఇది నకిలీ ఫోటోనే అని ఫ్రెంచ్ టెక్ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇమేజ్ డిటెక్టర్ సాయంతో నిర్థారించిందని తెలిపారు. ఆ ఫోటోను నిశితంగ పరిశీలిస్తే మనకు స్పష్టంగా అవగతమవుతుందని అన్నారు. ఉక్రెయిన్ వివాదా పరిష్కారం కోసం, ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను బలోపేతం చేసేందుకు జరగుతున్న భేటీని కాస్త దెబ్బతీసేలా ఈ ఫోటో ఉందన్నారు. ఈ ఫోటో కారణంగా ఇరు దేశాల మధ్య విభేదాలు సృష్టించి, సంబంధాలు దెబ్బతినే అవకాశం కూడా ఉందన్నారు. ఈ మేరకు సదరు జర్నలిస్ట్ మాట్లాడుతూ..ఇలాంటి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నప్పుడూ..నెటిజన్లకు ఏది నకిలీ ఏది రియల్ అనేది తెలుసుకోవడం అత్యంత కీలకమని చెప్పారు. లేదంటే తప్పుడూ సమాచారం వ్యాప్తి చెందడమే గాక ఇరు దేశాల మద్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకునే పరిస్థితికి దారితీసుందని హెచ్చరించారు. అదీగాక సరిగ్గా చైనా అధ్యక్షుడు పర్యటనలో ఉండగా ..ఇలాంటి ఫోటోలు మరింత వివాదాలకు తెరితీసే ఆస్కారం ఏర్పడుతుందన్నారు. కాబట్టి అలాంటి వాటికి చెక్‌పెట్టేలా జాగ్రత్తగా ఉండటమేగాక, పూర్తిగా తెలుసుకున్నాకే ఇలాంటి ఫోటోలను షేర్ చేయమని సదరు జర్నలిస్ట్ నెటిజన్లను కోరారు. Wait a minute.... WTF is this? 👀 pic.twitter.com/FekVlBfZ63 — MAKS 22🇺🇦 (@Maks_NAFO_FELLA) March 20, 2023 (చదవండి: హాట్ టబ్‌లో సేద తీరుతున్న జంటపై సడెన్‌గా మౌంటైన్ లయన్ దాడి..ఆ తర్వాత..) -
చరిత్రకెక్కిన జిన్‌పింగ్
బీజింగ్: డ్రాగన్ దేశం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్(69) సరికొత్త చరిత్ర సృష్టించారు. దేశాధ్యక్షుడిగా, సైన్యాధిపతిగా వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. జిన్‌పింగ్ ఎన్నికకు చైనా పార్లమెంట్ శుక్రవారం ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసింది. ఆయన చైనా అధ్యక్షుడిగా, అత్యంత శక్తివంతమైన సెంట్రల్ మిలటరీ కమిషన్(సీఎంసీ) చైర్మన్‌గా మరో ఐదేళ్లపాటు పదవుల్లో కొనసాగుతారు. ఒకవైపు అమెరికా, యూరోపియన్ యూనియన్(ఈయూ)తో ఉద్రిక్తతలు క్రమంగా పెరుగుతుండడం, మరోవైపు చైనా ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్న తరుణంలో జిన్‌పింగ్ వరుసగా మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన జీవితకాలం ఇదే పదవిలో కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకోసం పార్టీ రాజ్యాంగాన్ని 2018లో సవరించారు. ఉపాధ్యక్షుడిగా హన్ జెంగ్ జిన్‌పింగ్‌ను మరోసారి దేశాధ్యక్షుడిగా, సీఎంసీ చైర్మన్‌గా నియమిస్తూ అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) చేసిన ప్రతిపాదనను రబ్బర్ స్టాంప్ పార్లమెంట్‌గా ముద్రపడిన నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్(ఎన్పీసీ) లాంఛనంగా ఆమోదించింది. పార్లమెంట్‌లోని 2,952 మంది సభ్యులు అంగీకారం తెలిపారు. చైనాలో ఒక నాయకుడు మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఇదే ప్రథమం. జిన్‌పింగ్ కంటే ముందు పనిచేసిన అధ్యక్షులంతా రెండు పర్యాయాలే(10 సంవత్సరాలు) పదవీలో కొనసాగారు. చైనా మాజీ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు హన్ జెంగ్‌ను ఉపాధ్యక్షుడిగా ఎన్పీసీ నియమించింది. గత ఏడాది అక్టోబర్ జరిగిన కమ్యూనిస్ట్ పార్టీ ప్లీనరీలో జిన్‌పింగ్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా మళ్లీ ఎన్నుకున్న సంగతి తెలిసిందే. మావో జెడాంగ్ తర్వాత చైనా కమ్యూనిస్ట్ పార్టీకి మూడోసారి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైజిన్‌పింగ్ రికార్డుకెక్కారు. దూకుడు పెంచుతారా? జిన్‌పింగ్ చేతిలో ప్రస్తుతం మూడు శక్తివంతమైన పదవులు ఉన్నాయి. ఎలాంటి ఆటంకాలు లేకుండా మరోసారి కుర్చీ దక్కడంతో జిన్‌పింగ్ దూకుడు పెంచే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా. పొరుగు దేశం భారత్‌పై ప్రభావం అధికంగా ఉంటుందన్నారు. ఇరు దేశాల నడుమ ఉద్రిక్తతలు పెచ్చరిల్లే ప్రమాదం ఉందంటున్నారు. సెంట్రల్ కేబినెట్(స్టేట్ కౌన్సిల్)కు నేతృత్వం వహిస్తున్న చైనా ప్రధాని (ప్రీమియర్) లీ కెకియాంగ్ పదవీ కాలం ముగిసింది. ఆయన స్థానంలో జిన్‌పింగ్‌కు సన్నిహితుడైన లీ కియాంగ్‌ను శనివారం ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. (చదవండి: మళ్లీ క్షిపణిని ప్రయోగించిన ఉత్తరకొరియా) -
భారత్-చైనా సరిహద్దు గస్తీపై చైనా అధ్యక్షుడు ఎంక్వైయిరీ
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆసక్తికర పరిణామానికి దారి తీశారు. తూర్పు లడఖ్‌లో భారత్-చైనా సరిహద్దులో ఉన్న చైనా సైనికులతో వీడియోకాల్‌లో ముచ్చటించారు. అక్కడ గస్తీ నిర్వహణపై ఎంక్వైయిరీ చేశారు. సరిహద్దు వెంబడి పరిస్థితుల గురించి సైనికులను అడిగి తెలుసుకున్నాడు. అలాగే అక్కడ నిరంతరం మారుతున్న పరిస్థితులు గురించి ఆరా తీశారు జిన్‌పింగ్. ఈ మేరకు ఆయన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ప్రధాన కార్యాలయం నుంచి జిన్‌పింగ్ ఖుంజెరాబ్‌లోని సరిహద్దు రక్షణ స్థితిపై అక్కడ సైనికులను ఉద్దేశించి కాసేపు ప్రసంగించారు. అలాగే వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి గస్తీ కాస్తున్న సైనికులు తాము సమర్థవంతంగా పర్యవేక్షిస్తున్నామంటూ అధ్యక్షుడి జిన్‌పింగ్‌కి బదులిచ్చారు. సైనికులు అక్కడ ఎలా ఉంటున్నారో తెలుసుకోవడమే గాక వారి క్షేమ సమాచారాలను కూడా జిన్‌పింగ్ తెలుసుకున్నారు. వారు ఉన్న ప్రదేశాల్లో తాజా కూరగాయాలు దొరుకుతున్నాయో లేదా అని కూడా అడిగారు. అంతేగాదు జిన్‌పింగ్ సరిహద్దులో పోరాడేందకు వారికి కావాల్సిన సహాయసహకారాలు అందిస్తామని కూడా సైనికులకు భరోసా ఇచ్చారు. కాగా, ఇదే తూర్పు లడఖ్ ప్రాంతంలో 2020,మే5న పాంగోంగ్ సరస్సు ప్రాంతంలో హింసాత్మక ఘర్షణ చెలరేగి భారత్ చైనాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. అదీగాక తూర్ప లడఖ్ సరిహద్దు స్టాండ్ ఆఫ్‌పై భారత్, చైనా ఇరుపక్షాలు 17 రౌండ్ల ఉన్నత స్థాయి సైనిక చర్చలు జరిపాయి. చైనాతో ద్వైపాక్షిక సంబంధాల సమగ్ర అభివృద్ధికి వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి శాంతి, ప్రశాంతత అవసరమని భారత్ నొక్కి చెప్పింది. (చదవండి: పుతిన్ బతికే ఉన్నాడా! తెలియడం లేదు! జెలెన్స్కీ షాకింగ్ వ్యాఖ్యలు) -
పాలసీ తెచ్చిన ప్రజాగ్రహం
ఆశయం మంచిదే కావచ్చు... అది ఆచరణాత్మకం అవునో కాదో చూసుకోవడం ముఖ్యం. ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకోవడం మరీ ముఖ్యం. కోవిడ్–19కు జన్మస్థానంగా అపఖ్యాతి పాలైన అగ్రరాజ్యం చైనా అక్కడే విఫలమైంది. ఆ దేశం తలకెత్తుకున్న ‘జీరో కోవిడ్ పాలసీ’ తలవంపులు తెచ్చిపెడుతోంది. దేశంలో ఒక్క కోవిడ్ కేసూ లేకుండా ఉండేలా, ప్రతి కేసునూ తీవ్రంగా పరిగణించాలంటూ... ఎడతెగని లాక్డౌన్లు, ప్రజాజీవితంపై కఠోర నిర్బంధాలు విధిస్తున్న ఈ మతి లేని విధానం సహజంగానే చైనీయుల్లో అసహనాన్ని పెంచిపోషిస్తోంది. వివిధ ప్రాంతాల్లో ప్రజలు పెద్దయెత్తున నిరసనకు దిగడం, దేశాధినేత జిన్‌పింగ్ గద్దె దిగాలని నినదించడం దాని ఫలితమే. అయితే, కరోనా సమస్య పరిష్కారానికీ, ప్రభుత్వ విధానాన్ని సరిదిద్దుకొనేందుకూ ప్రయత్నించక పోగా, నిరసనల అణచివేతపై పాలకులు దృష్టి పెట్టడమే శోచనీయం. ఉరుమ్కీలో బహుళ అంతస్థుల భవన అగ్నిప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోవడం తాజా నిరసనలకు ప్రేరేపించింది. ‘జీరో కోవిడ్ పాలసీ’లో భాగంగా 109 రోజులుగా ఆ నివాసం లోని వారందరినీ ఇంట్లోనే నిర్బంధించారు. ఇళ్ళకు తాళాలు వేసి మరీ ప్రభుత్వం కోవిడ్ నిర్బంధాల వల్లే అగ్నిప్రమాదంలో అమాయకులు ప్రాణాలు పోగొట్టుకున్నారని ప్రజాగ్రహం పెల్లుబుకింది. దేశ రాజధాని బీజింగ్, వాణిజ్య రాజధాని షాంఘైలలో ఆదివారం శాసనోల్లంఘన ఉద్యమం సాగింది. కోవిడ్ జన్మస్థానమైన ఊహాన్‌కు సైతం నిరసన సెగ తగిలినా, ప్రభుత్వ వర్గాలు క్షేత్రస్థాయిలో అంతా బాగుందంటున్నాయి. వాస్తవాల్ని నివేదించడానికి ప్రయత్ని స్తున్న విదేశీ విలేఖరులను తిట్టి, కొట్టి, తిప్పలు పెడుతుండడం మరీ దారుణం. దేశంలో సెన్సార్‌షిప్‌తో చైనీయులు నినాదాలేమీ లేకుండా, తెల్ల కాగితాలు, తెలుపు బోర్డులు పట్టుకొని, నిరసన తెలియజేయాల్సి వస్తోంది. కోవిడ్ వచ్చినప్పుడు 2020లో రికార్డు సమయంలో తాత్కాలిక భారీ ఆసుపత్రులను కట్టి, ప్రపంచం తలతిప్పి చూసేలా చేసిన ఘనత చైనాది. తీరా ఇప్పుడు అదే అగ్రరాజ్యం దిక్కుతోచని స్థితిలో పడింది. మరుగుదొడ్లను సైతం తాత్కాలిక క్వారంటైన్ శిబిరాలుగా మార్చి, జనాన్ని అందులో ఖైదీల కన్నా నీచంగా చూస్తున్న అపకీర్తిని మూటగట్టుకుంది. ఇప్పటికీ చైనాలో 50కి పైగా నగరాలు, పట్నాల్లో జనం కొన్ని వారాలుగా లాక్డౌన్లతో ఇంటికే పరిమితమయ్యారు. అయినా, మునుపెన్నడూ లేనంతగా రోజూ 40 వేల కరోనా కేసులు నమోదవుతున్నాయంటే ‘జీరో కోవిడ్’ విధానం ఒక విఫల ప్రయోగమని అర్థమవుతూనే ఉంది. మహమ్మారిపై గత మూడేళ్ళుగా అనుసరిస్తున్న అవకతవక విధానాలతో లాక్డౌన్లు, నిర్బంధాలు నిత్యకృత్యమయ్యాయి. జనజీవనంతో పాటు ప్రపంచంలోని రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. సాధారణ జీవితం సాగించాలని ప్రాథేయపడుతున్న జనంలోని వీధినపడ్డ అసహనం అర్థం చేసుకోదగినదే. జీవితకాలం చైనాకు తిరుగులేని నేతగా ఇటీవలే కొత్త అధికారాలు సంతరించుకున్న జిన్‌పింగ్ నెల తిరిగేసరికల్లా ఎదురైన ఈ యాంటీ కోవిడ్ నిరసనలతో జీరో కోవిడ్ పాలసీని సరళీకరిస్తారా అన్నది ప్రశ్న. ఇవి రాజకీయ నిరసనలుగా మారుతుండడం సవాలే. విద్యార్థుల సారథ్యంలోని 1989 నాటి తియానన్మెన్ స్క్వేర్ ప్రజాస్వామ్య ఉద్యమం తర్వాత మళ్ళీ అలాంటి నిరసనలు కొందరి మాట. అప్పట్లో దాన్ని ఆర్మీతో అణిచేసిన అనుభవం ఉండనేవుంది. పైపెచ్చు, అంతర్గత సమస్యలు తలెత్తినప్పుడల్లా సరిహద్దుల్లో ఏదో ఒక రచ్చతో చైనీయుల్లో జాతీయవాదం రగిల్చి, అంతర్జాతీయ దృష్టి అంతా కొత్త అంశంపై మళ్ళేలా చేయడం డ్రాగన్ వ్యూహం. కనుక భారత్ అప్రమత్తం కావాలి. నియంతలు ప్రజాకాంక్షలకు విలువనివ్వడం కలలో మాటే. అలాగని చైనీయులు కళ్ళు తెరిచి చూస్తుంటే, మిగతా ప్రపంచం కోవిడ్‌ను దాటి ముందుకుపోతోంది. పొరుగునే ఉన్న తైవాన్‌లో తప్పనిసరి మాస్కుల నిబంధనను సైతం తప్పిస్తుంటే, తమ వద్ద తీవ్ర ఆంక్షలు వారిని ఉక్కపోతకు గురిచేస్తున్నాయి. ఫుట్‌బాల్ ప్రపంచ కప్ వేదిక సహా అన్నిచోట్లా వేలాది జనుల ఉత్సాహం వారికి కరోనా నిర్బంధరహిత జీవితంపై కోరిక రేపుతోంది. మిగతా ప్రపంచమంతా కరోనా నుంచి బయట కొచ్చేస్తున్నా, చైనా వేలకొద్దీ కరోనా కేసులతో కల్లోలం కావడానికి కొత్త వేరియంట్‌తో పాటు నిర్వ హణలోపాలూ కారణం. చైనాలో ఇప్పటికీ 80 ఏళ్ళు పైబడినవారిలో సగం మందికే ప్రాథమిక కరోనా టీకాకరణ జరిగింది. ఇక, బూస్టర్ డోస్ తీసుకున్నది వారిలో 20 శాతం లోపే. 60–69 ఏళ్ళ మధ్య వారిలోనూ పూర్తి టీకాకరణ జరిగింది 60 శాతంలోపే. పిల్లలకు టీకాల మాట దేవుడెరుగు. చైనా టీకాల సత్తా తక్కువ. అక్కడి టీకాలన్నీ ప్రభుత్వ రంగ సైనోఫార్మ్, ప్రైవేట్ సంస్థ సైనోవాక్ తయారీలే. వాటి క్లినికల్ ట్రయల్స్ డేటా ప్రజాక్షేత్రంలో ఇప్పటికీ లేదు. దీనికి తోడు ఇతర దేశాల టీకాలు వాడేది లేదన్న మూర్ఖత్వం సరేసరి. నిజానికి, తాజాగా చైనాను పీడిస్తున్నది బలమైన ఒమి క్రాన్ బీఎఫ్.7 వేరియంట్. నర్సింగ్‌హోమ్‌లు, స్కూళ్ళు, భవన నిర్మాణ స్థలాలలో సామూహిక ఇన్ఫె క్షన్లకు ఇది కారణం. చైనా విధానలోపం మాటెలా ఉన్నా, నేటికీ కరోనా పూర్తిగా వదిలివెళ్ళలేదని మిగతా దేశాలు గ్రహించాలి. సదరు వేరియంట్ అమెరికా, బ్రిటన్‌తో పాటు గత నెలలో కేరళకూ చేరింది. మన దగ్గర కేసులు తక్కువే ఉన్నా, పండుగలు దగ్గరకొస్తున్న వేళ టీకాలు, మాస్కుల లాంటి ప్రాథమిక జాగ్రత్తలే రక్ష. డ్రాగన్ సైతం భారత్ సహా ప్రపంచ దేశాల కరోనా నిర్వహణ విధానాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. భీష్మించుకు కూర్చుంటే ప్రజలకే కాదు పాలకులకూ కష్టమే! -
చైనా మిలటరీ చేతుల్లోకి వెళ్లిందా...?
-
చైనా ఆలోచనే డిఫరెంట్.. జిన్‌పింగ్ సర్కార్‌ను తిట్టిపోస్తున్న చైనీయులు!
బీజింగ్: మంకీపాక్స్ వైరస్ సోకకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని తమ ప్రజలకు చైనా వైద్య నిపుణులు సూచించారు. విదేశీయులను, విదేశాల నుంచి వచ్చిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ తాకవద్దని చెప్పారు. చైనాలోని తొలి మంకీపాక్స్ కేసు చాంగ్ఖింగ్ సిటీలో శుక్రవారం బయటపడింది. ఈ నేపథ్యంలో చైనాలో పేరుగాంచిన అంటువ్యాధుల నిపుణుడు వూ జున్యూ పలు సూచనలు జారీ చేశారు. స్కిన్ టు స్కిన్ కాంటాక్టు వల్ల మంకీపాక్స్ సోకుతుందని, అందుకే విదేశీయులను, ఇటీవల విదేశాల నుంచి వచ్చిన వారిని ముట్టుకోవద్దని తెలియజేశారు. అయితే, వూ జున్యూ సూచనలపై చైనాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అవి జాత్యహంకారాన్ని, జాతి వివక్షను ప్రోత్సహించేలా ఉన్నాయని జనం విరుచుకుపడుతున్నారు. అటు సోషల్ మీడియాలో సైతం తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. చైనాలో ఇప్పటికీ కరోనా ఆంక్షలు కొనసాగుతున్నాయి. కాగా, చైనాలో ఇటీవల మంకీపాక్స్ తొలి కేసు నమోదైంది. విదేశాల నుంచి ఇక్కడి చాంగ్క్వింగ్ నగరానికి చేరుకున్న ఓ వ్యక్తి.. కొవిడ్‌తో క్వారంటైన్లో ఉన్న సమయంలోనే మంకీపాక్స్ నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలోనే విదేశీయులను తాకవద్దంటూ సూచనలు చేశారు. Chief epidemiologist at the Chinese Centre for Disease Control and Prevention, Wu Zunyou, warned people not to touch foreigners after mainland China confirmed its first case of #monkeypox infectionhttps://t.co/enlrbXRqzc — IndiaToday (@IndiaToday) September 19, 2022 -
చైనా అరాచకం.. తైవాన్ రక్షణ శాఖ అధికారి ఖతం!
తైపీ: ఉద్రిక్తతల నేపథ్యంలో తైవాన్ రక్షణ శాఖ అధికారి అనుమానాస్పద మృతి సంచలనం సృష్టించింది. తైవాన్ రక్షణ శాఖకు చెందిన పరిశోధన, అభివృద్ధి విభాగం ఉన్నతాధికారి ఔ యాంగ్ లీ–సింగ్ శనివారం ఉదయం దక్షిణ తైవాన్‌లోని ఓ హోటల్ గదిలో శవమై కనిపించారు. ఆయన మృతికి కారణం ఏమిటన్నది ఇంకా నిర్ధారించలేదని రక్షణ శాఖ వెల్లడించింది. ‘నేషనల్ చుంగ్–షాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ డిప్యూటీ హెడ్ హోదాలో ఔ యాంగ్ వివిధ క్షిపణి అభివృద్ధి ప్రాజెక్టులను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం బిజినెస్ ట్రిప్పై కొనసాగుతూ అనుమానాస్పదంగా మరణించారు. ఇదిలా ఉండగా, చైనా దాడుల్లోనే ఔ యాంగ్ ప్రాణాలు కోల్పోయాడని తైవాన్ అధికారులు ఆరోపిస్తున్నారు. దీనిపై చైనా ఇంకా స్పందించలేదు. ఇది కూడా చదవండి: ప్లీజ్ ఆయన్ని అక్కడే ఉండనివ్వండి... అభ్యర్థించిన శ్రీలంక -
ఆత్మహత్యా సదృశం
దేనికైనా సమయం, సందర్భం ఉండాలంటారు. అవి లేకుండా ఏ పనైనా చేస్తే? పాతికేళ్ళుగా తమ దేశం నుంచి అత్యున్నత స్థాయివారెవరూ పర్యటించని తైవాన్‌కు అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ వెళతారనడం అలాంటిదే. ఆ వార్త తేనెతుట్టెను కదిలించింది. అమెరికా అధ్యక్షపదవికి తూగే హోదాలో ఉన్న ఆమె ఆసియా దేశాల పర్యటనలో భాగంగా తైవాన్‌నూ సందర్శిస్తారనడంతో చైనాకు పుండు మీద కారం జల్లినట్టయింది. జూలై 28న అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సంభాషిస్తూ, తైవాన్‌తో చైనా వ్యవహారంలో పరాయివారి జోక్యం సహించబోమని గట్టిగా చెప్పడం దాని పర్యవసానమే. వారాంతంలో తైవాన్ సమీపాన సాయుధ సైనిక విన్యాసాలకూ డ్రాగన్ దిగడంతో పరిస్థితి వేడెక్కింది. అమెరికా–చైనాల మధ్య ఉద్రిక్తతకు ఆజ్యం పోసింది. అసలే ఉక్రెయిన్‌లో యుద్ధంతో కిందా మీదా అవుతున్న ప్రపంచ దేశాలను ఉలిక్కి పడేలా చేసింది. పసిఫిక్ మహా సముద్రంలో చైనాకు ఆగ్నేయ తీరంలో వంద మైళ్ళ దూరంలోని ఒక చిన్న ద్వీపమైనా తైవాన్‌కు వ్యూహాత్మక ప్రాధాన్యం ఉంది. భౌగోళికంగా అమెరికా విదేశాంగ విధానానికి కీలకమైన స్నేహపూర్వక ద్వీపాల గొలుసుకట్టు మధ్య అది నెలకొంది. తైవాన్ను గనక చైనా స్వాధీనం చేసుకుంటే, పశ్చిమ పసిఫిక్‌లో దాని పట్టు బిగుస్తుంది. సుదూర గువామ్, హవాయ్ల లోని అమెరికా సైనిక స్థావరాలకూ అది ముప్పే. చైనా మాత్రం తమకలాంటి ఉద్దేశం లేదంటోంది. 1949లో చైనాలో అంతర్యుద్ధంతో కమ్యూనిస్టు పాలన వచ్చినప్పటి నుంచి తైవాన్ ప్రత్యేకంగా ఉంటోంది. సొంత రాజ్యాంగం, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నేతలతో స్వతంత్ర దేశంగా అడుగులు వేస్తోంది. వాటికన్ కాక, ఇప్పటికి ప్రపంచంలో 13 దేశాలే తైవాన్ సార్వ భౌమాధికారాన్ని గుర్తిస్తున్నాయి. అమెరికా, భారత్ సహా పలు దేశాలు ‘వన్ చైనా పాలసీ’కే కట్టు బడ్డాయి. ఇతర దేశాలేవీ ఆ ద్వీపదేశాన్ని గుర్తించకుండా ఉండేలా చైనా దౌత్యపరమైన ఒత్తిడి పెడుతూనే ఉంది. స్వపరిపాలన సాగిస్తున్నప్పటికీ తైవాన్ తమ నుంచి విడిపోయిన ప్రావిన్స్ అనీ, అది తమలో భాగమనీ మొదటి నుంచీ చైనా వైఖరి. అవసరమైతే బలప్రయోగం ద్వారానైనా సరే దాన్ని తమలో ‘పునరేకీకరించే’ లక్ష్యాన్ని సాధించి తీరాలనేది జిన్‌పింగ్ మాట. కానీ, అవసరమైతే బలగాలను దించి మరీ, తైవాన్ను తాము కాపాడడానికి సిద్ధమని బైడెన్ ఆ మధ్య అన్నారు. వాస్తవానికి తైవాన్‌పై చైనా దాడికి దిగితే సైనిక జోక్యం చేసుకోవాలా, వద్దా అనే అంశంలో అగ్రరాజ్యం అమెరికా దీర్ఘకాలంగా ‘వ్యూహాత్మక సందిగ్ధత’ విధానాన్నే అనుసరిస్తోంది. బైడెన్ మాటలు ఏమైనప్పటికీ, తమ వైఖరిలో మార్పు లేదని వైట్‌హౌస్ వర్గాలే తేల్చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉరుము లేని పిడుగులా అమెరికా స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్‌కు వెళతారనే వార్త తాజా తలనొప్పి తెచ్చిపెట్టింది. ఇంతలో ఆదివారం మొదలైన ఆమె పర్యటన షెడ్యూల్లో ఇప్పటికైతే సింగపూర్, మలేసియా, దక్షిణ కొరియా, జపాన్ తప్ప తైవాన్ సందర్శన ప్రస్తావన లేకపోవడం ఊరట. వర్తమాన ప్రపంచ అగ్రరాజ్యాలైన అమెరికా, చైనాల మధ్య సంబంధాలు 2017 –21 మధ్య అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హయాం నుంచి శరవేగంగా క్షీణిస్తూ వచ్చాయి. ఇరు దేశాల సంబంధాలు అలా ఉన్నా, అధినేతల స్థాయిలో రెండు గంటల పైగా గత వారం సంభాషణ సాగడం ఓ సాంత్వన. వాతావరణ మార్పు లాంటి వైరుద్ధ్యాలు లేని అంశాలపై చైనాతో మాటామంతీ జరుపుతూనే, దూకుడుకు పగ్గం వేయాలని బైడెన్ ఆలోచన. ఆంక్షలను సడలించేలా ఒప్పించి, అమెరికాకు చైనా సమస్కంధ అగ్రరాజ్యమని అంగీకరింపజేయాలనేది జిన్‌పింగ్ భావన. కానీ, ఎవరూ పట్టు సడలించడం లేదు. నవంబర్‌లో మధ్యంతర ఎన్నికలున్న బైడెన్ కానీ, ఈ ఏడాదిలోనే చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ 20వ మహాసభలున్న జిన్‌పింగ్ కానీ తమ వారి ముందు తగ్గేదేలే అన్నట్టుగానే ఉండాలనుకోవడంతో చిక్కొచ్చి పడుతోంది. ఈ ఏడాది చివరలో ఇద్దరు అధినేతలూ ప్రత్యక్షంగా కలసి, చర్చించుకొనే సూచనలున్నాయి. అయితే, కొన్నేళ్ళుగా ఇరుదేశాల మధ్య రగులుతున్న తైవాన్ అంశం మళ్ళీ తెర పైకి వచ్చి, ఉద్రిక్తతలు పెంచుతోంది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో, మరీ ముఖ్యంగా తైవాన్‌లో శాంతిభద్రతలు, ఆర్థిక వ్యవస్థ సుస్థిరత ప్రపంచానికి అవసరం. జీ7, నాటో, ఈయూ, క్వాడ్ దాకా అన్నీ ఆ మాటే గుర్తుచేస్తున్నాయి. ఎందుకంటే, కంప్యూటర్ చిప్‌ల ప్రపంచ ఉత్పత్తిలో తైవాన్‌దే అగ్రస్థానం. ప్రపంచమంతా వాడే ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, వాచీలు, గేమ్స్ కన్సోల్స్లోని ఎలక్ట్రానిక్ సామగ్రికి గుండె లాంటి కంప్యూటర్ చిప్‌లన్నీ తైవాన్ తయారీయే. ప్రపంచ మార్కెట్లో సగానికి పైగా ఒకే ఒక్క తైవానీ సెమీకండక్టర్ కంపెనీదే అని లెక్క. కొంతకాలంగా తరచూ తైవాన్‌లో గగనతల చొరబాట్లు సాగిస్తున్న చైనా గనక ఆ దేశాన్ని చేజిక్కించుకుంటే, ప్రపంచంలోని అతి ప్రధాన పరిశ్రమల్లో ఒకటి దాని వశమైనట్టే! అందుకే, తైవాన్‌లో చీమ చిటుక్కుమన్నా ఆ ప్రభావం అంతటా కనిపిస్తుంది. నిజానికి, చైనా, అమెరికా, తైవాన్లు మూడూ స్థూలంగా ప్రస్తుత యథాతథ స్థితి వైపే మొగ్గుతున్నాయి. కాకపోతే, ఎవరికి వారు అవతలివాళ్ళు దాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నారని భావిస్తున్నారు. అసలే కరోనాతో ప్రపంచ ఆర్థికవ్యవస్థ అతలాకుతలమైన పరిస్థితుల్లో యథాతథ స్థితిని కొన సాగనివ్వక ఎవరు కవ్వింపు చర్యలకు దిగినా, జిన్‌పింగ్ వేరే సందర్భంలో అన్నట్టు అది నిప్పుతో చెలగాటమే! అలాంటి అవివేక చర్యలను అనుమతించడం ప్రపంచ దేశాలన్నిటికీ ఆత్మహత్యా సదృశమే! -
టిబెట్‌పై చైనా కొత్త కుట్రలు.. లక్ష మందిని..!
బీజింగ్: టిబెట్‌ను బల ప్రయోగంతో ఆక్రమించుకున్న డ్రాగన్ దేశం చైనా ఇప్పుడు మరో కుతంత్రానికి తెరతీస్తోంది. 2030 నాటికి లక్ష మందికిపైగా టిబెట్ ప్రజలను వారి సంప్రదాయ జీవన విధానం నుంచి దూరం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే టిబెట్ పౌరులను వారి సొంత గ్రామాల నుంచి దూరంగా తరలిస్తారు. ఇందుకోసం చైనా చెబుతున్న సాకు పర్యావరణ పరిరక్షణ. సముద్ర మట్టానికి 4,800 మీటర్లకుపైగా ఎత్తున్న ప్రాంతాల్లో నివసించే వారిని ఇతర ప్రాంతాలకు తరలించనున్నట్లు చెబుతోంది. జనావాసాల కారణంగా పర్యావరణం దెబ్బతింటోందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నమ్మబలుకుతోంది. జనాన్ని తరలించడానికి చైనా ప్రభుత్వం తన సైనికులకు శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. వివాదాస్పద సరిహద్దుల్లో కొత్త గ్రామాలను చైనా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అవి తమ భూభాగాలే అని వాదిస్తోంది. వివాదాస్పద హిమాలయ ప్రాంతాల్లో 624 గ్రామాలను నిర్మించాలని చైనా లక్ష్యంగా పెట్టుకున్నట్లు హాంకాంగ్‌కు చెందిన ఓ పత్రిక ఇటీవల వెల్లడించింది. చైనా కుట్రల కారణంగా కనీసం 2 లక్షల మంది టిబెట్ ప్రజలు సహజ ఆవాసాల నుంచి దూరమయ్యే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదీ చదవండి: ముదిరిన రాజకీయ సంక్షోభం.. పార్లమెంటులోకి ప్రవేశించిన ఆందోళనకారులు -
భారత్, అమెరికాకు షాకిచ్చిన చైనా
భారత్, అమెరికాకు డ్రాగన్ కంట్రీ చైనా మరోసారి బిగ్ షాకిచ్చింది. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీ విషయంలో చివరి నిమిషంలో చైనా ట్విస్ట్ ఇచ్చింది. అబ్దుల్ రెహ్మాన్ మక్కిని గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించాలని ఇండియా, అమెరికా సంయుక్తంగా చేసిన ప్రతిపాదనను చైనా అడ్డుకున్నది. అయితే, అంతకుముందు.. ఇండియా, అమెరికా దేశాలు.. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని ఐసిస్, ఆల్ ఖైయిదా ఆంక్షల కమిటీ కింద ఉగ్రవాది మక్కిని గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించాలని ప్రతిపాదన చేశాయి. కాగా, సెప్టెంబర్ 26 దాడులకు పాల్పడిన లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ సోదరుడే మక్కి. ఇక, మక్కిని ప్రత్యేకమైన గ్లోబల్ టెర్రరిస్ట్‌గా చేస్తూ అమెరికా ట్రెజరీ శాఖ 2010 నవంబర్‌లో ప్రకటన చేసింది. దాని ప్రకారం మక్కీ ఆస్తుల్ని సీజ్ చేశారు. మక్కి తలపై రెండు మిలియన్ల డాలర్ల రివార్డును కూడా అమెరికా ప్రకటించింది. ఇదిలా ఉండగా.. తాజాగా మక్కీని గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించాలని ప్రతిపాదనను డ్రాగెన్ చైనా అడ్డుకుంది. ఇక, గతంలోనూ పాక్ ఉగ్రవాదులను నిషేధిత జాబితాలో చేర్చుతున్న సమయంలో ఆ ప్రయత్నాలను చైనా అడ్డుకున్న విషయం తెలిసిందే. మరోవైపు.. లష్కరే సంస్థ కోసం మక్కీ నిధులను సమీకరించినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇది కూడా చదవండి: అమెరికా రక్షణ శాఖలో కీలక పదవిలో రాధా అయ్యంగార్ -
యుద్ధం వేళ జిన్‌పింగ్‌తో జో బైడెన్ భేటీ.. పుతిన్ రెస్పాన్స్‌పై టెన్షన్..!
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై రష్యా బలగాల భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్ పౌరులను లక్ష్యంగా చేసుకొని రష్యా సైన్యం కాల్పులకు తెగబడుతోంది. తాజాగా సుమారు వెయ్యి మంది చిన్నారులు ఆశ్రయం పొందుతున్న మరియుపోల్ థియేటర్‌పై రష్యా బలగాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడిలో మృతుల సంఖ్య తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో చైనా, అమెరికా కీలక నిర్ణయం తీసుకున్నాయి. శుక్రవారం జో బైడెన్, జిన్‌పింగ్ మధ్య చర్చలు జరగబోతున్నట్టు వైట్ హౌజ్ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, ఉక్రెయిన్‌పై యుద్ధంలో పుతిన్‌కు చైనా సహకరించడం, ఆయుధ సామాగ్రి అందిస్తోందన్న అమెరికా ఆరోపణల నేపథ్యంలో వీరిద్దరి మధ్య చర్చ జరుగుతుండటం ఆసక్తికరంగా మారింది. అంతకు ముందు జిన్‌పింగ్ నాటో విస్తరణను సైతం వ్యతిరేకించిన విషయం తెలిసిందే. మరోవైపు.. ఉక్రెయిన్‌లో యుద్ధం ఆపాలంటూ అంతర్జాతీయ న్యాయస్థానం రష్యాను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు న్యాయస్థానం మాస్కో బలప్రయోగం పట్ల తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది. కానీ, న్యాయస్థానం తీర్పును లెక్కచేయకుండగా రష్యన్ బలగాలు దాడిని మరింత పెంచాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. -
Russia And Ukraine War:చైనా సడన్ ఎంట్రీ.. పుతిన్‌కు జిన్‌పింగ్ ఫోన్‌కాల్
మాస్కో: రష్యా సైనిక దాడుల కారణంగా ఉక్రెయిన్‌లో నరమేధం జరుగుతోంది. బాంబులు, మిస్సెల్స్‌తో రష్యా బలగాలు ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతున్నాయి. రెండవ రోజే ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను రష్యా బలగాలు చుట్టుముట్టాయి. తాజాగా.. ఉక్రెయిన్ పరిణామాలపై రష్యా విదేశాంగ మంత్రి కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్ సైన్యం పోరాటం ఆపితే చర్చలకు సిద్ధమని ప్రకటించారు. ఉక్రెయిన్ ఆర్మీ ఆయుధాల్ని వదలి లొంగిపోవాలని, అప్పుడే చర్చలు ముందుకెళ్తాయని ఆ ప్రకటనలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ వెల్లడించారు. ఈ ప్రకటన అనంతరం తాము కూడా చర్చలకు సిద్దంగా ఉన్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సైతం ప్రకటించారు. ఈ తరుణంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. శుక్రవారం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్.. పుతిన్‌తో ఫోన్లో మాట్లాడినట్టు సమాచారం. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపేయాలని జిన్‌పింగ్ కోరినట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్‌తో చర్చలు జరపాలని పుతిన్‌ను జిన్‌పింగ్ కోరారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొల్పేందుకు తాను సిద్ధమని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. దీంతో పుతిన్, జిన్‌పింగ్ మధ్య జరిగిన చర్చ ఆసక్తికరంగా మారింది. -
మీ అంతు చూస్తా..జిన్ పింగ్ వార్నింగ్
చైనాలో నోరు తెరవడం అంత ఈజీకాదు. నోరుతెరిచి ప్రభుత్వంపై జోకేయాలనుకున్నా కష్టమే. అలాంటిది ఎర్రపాలకులకు ఎర్రికోపం తెప్పిస్తే ఇంకేమన్నా ఉందా? కోపం తెపిస్తే ఏమవుతుందంటారా? మనుషులు ఉన్న చోట నుంచే మాయమైపోతారు. ఇలా మాయమైతున్న మనుషులు..మామూలు మనుషులు కాదు. వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతలున్న ప్రముఖులు కావడం విశేషం. ప్రభుత్వ విధానాలు నచ్చక కళ్లు మూసుకుని కూల్‌గా ఉండలేక ఇదేంటి అధ్యక్షా అని ప్రశ్నిచ్చారు. ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇదిగో చివరికి ఇలా కటకటాల పాలవుతున్నారు. ఇప్పటికే వ్యక్తులు, సంస్థలు' చైనా ప్రభుత్వ తీరుపై హడలెత్తిపోతుంటే తాజాగా.. అదే ప్రభుత్వం దెబ్బకు చైనాలో అతిపెద్ద బీమా సంస్థకు చైర్మన్‌గా ఉన్న వాంగ్ బిన్‌పై కమ్యూనిస్ట్ పార్టీ అవినీతి నిరోధక శాఖ విచారణకు ఆదేశించింది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ దేశంలోని రాజకీయ, ఆర్థిక వ్యవస్థల్ని ప్రక్షాళన చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాల్ని వ్యతిరేకిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా చైనాలో అతిపెద్ద బీమా సంస్థ 'చైనా లైఫ్ ఇన్సూరెన్స్' చైర్మన్‌గా ఉన్న 'వాంగ్ బిన్' పై కమ్యూనిస్ట్ పార్టీ చెందిన యాంటీ కరప్షన్ కమిషన్ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా వాంగ్ ప్రభుత్వ విధానాల్ని ఉల్లంఘించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అతడిపై డిసిప్లినరీ యాక్షన్ కింద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు చైనా సెంట్రల్ కమిషన్ ఫర్ డిసిప్లిన్ ఇన్స్పెక్షన్ పేర్కొంది. ఇందులో భాగంగా ప్రభుత్వ యాజమాన్యంలోని సెక్యూరిటీస్ టైమ్స్ ప్రకారం..ఈ ఏడాది అవినీతికి పాల్పడిన వ్యక్తుల్లో చైనా ఫైనాన్స్ రంగంలో వాంగ్ తొలి ఉన్నత స్థాయి అధికారి తెలిపింది. విచారణ పూర్తయితే ఆయనపై డ్రాగన్ కంట్రీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. కాగా ఇప్పటికే చైనా ప్రభుత్వం తీరుతో దిగ్గజ కంపెనీలు నామరూపాల్లేకుండా పోతుంటే, ఇటీవల కాలంలో 10లక్షల మందికంటే ఎక్కువ మంది అధికారుల్ని చైనా శిక్షించింది. ►ఇటీవల చైనా ప్రాపర్టీ దిగ్గజం ఎవర్‌గ్రాండే అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు సుమారు 300 బిలియన్ల డాలర్ల బాకీ పడింది. గడువులోగా వడ్డీలను తిరిగి చెల్లించడంలో విఫలమయ్యింది. అందుకు ప్రభుత్వం తెచ్చిన విధానాలేనని ఆర్ధిక వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ►260 మిలియన్ల లంచం తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్న చైనా అసెట్ మేనేజ్మెంట్ సంస్థలలో ఒకటైన హువారోంగ్ మాజీ ఛైర్మన్ లై జియోమిన్‌ను గత సంవత్సరం చైనా ఉరితీసింది. ►సెప్టెంబరులో యువాన్ రెంగువో, ప్రపంచంలోని అత్యంత విలువైన స్పిరిట్స్ కంపెనీ కీచౌ మౌటై మాజీ అధిపతి 17 మిలియన్లకు పైగా లంచం తీసుకున్నారనే కారణంగా జీవిత ఖైదు విధించింది. ►2020లో లంచం తీసుకున్నారనే ఆరోపణలపై చైనా ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ మాజీ అధిపతికి చైనా ప్రభుత్వం 11 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. చదవండి: చైనా చిల్లర బుద్ధి, అప్పుడు బయోవార్‌తో కరోనా..ఇప్పుడు బయోటెక్నాలజీతో.. -
జాక్ మాలా జిన్ పింగ్ కు మరో చైనీస్ బిగ్ షాట్ బలి
-
సిద్ధంగా ఉండండి: ఆర్మీకి జిన్‌పింగ్ పిలుపు
బీజింగ్ : యుద్ధనైపుణ్య శిక్షణను బలోపేతం చేయడంతో పాటు ఎల్లప్పుడూ దేనికైనా సిద్ధంగా ఉండాలని చైనా మిలటరీకి ఆ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. ఈ ఏడాది నుంచి కొత్తగా తీసుకువచ్చిన డిఫెన్స్ చట్టం అమల్లోకి రావడంతో మిలటరీ అధికారాలు మరింతగా పెరగనున్నాయి. చైనా కమ్యూనిస్టు పార్టీకి, సెంట్రల్ మిలటరీ కమీషన్‌కు అధిపతైన జిన్‌పింగ్ 2021లో పీఎల్ఏ, పీఎల్ఏఎఫ్కు సంబంధించిన నూతన చట్టంపై సంతకం చేశారు. ఈ చట్టం ప్రకారం ఆర్మీ ఇకపై సోషలిజంపై జింగ్పింగ్ ఆలోచనకు తగ్గట్లుగా నడుచుకోవడం, జింగ్పింగ్ ఆలోచనల ప్రకారం బలోపేతం కావడం చేయాల్సి ఉంటుంది. (అమెరికా బలగాలపై దాడికి చైనా సాయం?) 2018లో ఇలాంటి ఆదేశాలనే జిన్‌పింగ్ ఒకమారు జారీ చేశారు. తాజా ఆదేశాల ప్రకారం పీఎల్ఏ ఏ క్షణమైనా ఎలాంటి చర్యకైనా తయారుగా ఉండాలని సౌత్‌చైనా మార్నింగ్ పోస్టు పత్రిక తెలిపింది. ఆర్మీకి అవసరమైన కొత్త ఆయుధాలు సమకూర్చుకోవడం, మరింత మందిని నియమించి శిక్షణ ఇవ్వడం, డ్రిల్స్ మోతాదు పెంచడం, సదా సిద్ధంగా ఉండడమనేవి చేయాల్సిఉంటుందని తెలిపింది. -
చైనాకు మద్దతుపై డైలమాలో జపాన్..
టోక్యో: కరోనా వైరస్‌ను ముందే పసిగట్టినా ఎవరికి తెలియకుండా చైనా అందరిని మోసం చేసిందని ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి. కానీ జపాన్ మాత్రం చైనాతో అంశాల వారిగా మద్దతుకు ప్రయత్నిస్తోంది. అయితే 2018డిసెంబర్లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను ఏడు సంవత్సరాల తరువాత కలిసిన మొదటి ప్రధానిగా జపాన్ ప్రధాని షింజో అబే నిలిచిన విషయం తెలిసిందే. చైనాతో మైత్రి కొనసాగించడానికి జపాన్ డైలమాలో పడిందని, చైనాతో పోటీని కొనసాగిస్తునే ఆ దేశానికి సహకారం అందిస్తున్నామని జపాన్ సెక్యూరిటీ డైరెక్టర్ నార్శిగ్ మిచిస్త తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన చైనా, జపాన్ దేశాలు ఆర్థిక, రాజకీయ అంశాలలో సహకారం అందించుకోవాలని ఇది వరకే నిర్ణయించుకున్నాయి. కానీ ఇటీవల దేశంలో చైనా పెట్టుబడుల విషయంలో జపాన్ పలు ఆంక్షలను విధించింది. ఈ క్రమంలో దేశంలోనే విదేశీ పెట్టుబడులను ఆకర్శించేందుకు జపాన్ ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టింది. డిఫెన్స్ రంగంలో జపాన్‌కు చైనా సహకారం అందిస్తుంది, అందువల్ల చైనా విషయంలో జపాన్ సానుకూల వైఖరి అవలంభిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అయితే పర్యాటక రంగంలో చైనా, జపాన్ దేశాలు పరస్పరం సహకరించుకుంటున్నాయి. గత ఏడాది లక్షమంది వరకు చైనా విద్యార్థులు జపాన్ విశ్వవిద్యాలయాలలో చదువుకున్నారు. -
రిజర్వు బలగాలకూ జిన్‌పింగే బాస్
బీజింగ్: చైనా మిలటరీ రిజర్వు బలగాలు కూడా అధ్యక్షుడు జిన్‌పింగ్ నేతృత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ(సీపీసీ), సెంట్రల్ మిలటరీ కమిషన్(సీఎంసీ) అజమాయిషీ కిందికి వచ్చాయి. మావో సెటుంగ్ తర్వాత చైనాలో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఎదిగిన జిన్‌పింగ్ ఇప్పటికే సీపీసీ, సీఎంసీలకు నేతృత్వం వహిస్తున్నారు. దేశానికి ప్రపంచ స్థాయి సైన్యాన్ని నిర్మించడానికి తిరుగులేని నాయకత్వం అవసరమని భావిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. రిజర్వు బలగాలు జూలై 1వ తేదీ నుంచి సీపీసీ, సీఎంసీల ఆదేశాలకు లోబడి పనిచేస్తాయని అందులో పేర్కొంది. ప్రస్తుతం రిజర్వు బలగాలు సైనిక విభాగాలు, కమ్యూనిస్టు పార్టీ స్థానిక కమిటీల అజమాయిషీలో ఉన్నాయి. -
‘సార్స్’ను మించిన కరోనా
బీజింగ్/న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. 26 దేశాలకు విస్తరించిన ఈ వైరస్.. ఒక్క చైనాలోనే శనివారం నాటికి 813 మందిని బలికొన్నది. వారిలో శనివారం ఒక్కనాడే చనిపోయిన వారి సంఖ్య 89 కాగా, కొత్తగా ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 2656, అనుమానిత కేసుల సంఖ్య 3,916. ఈ వైరస్ సోకి, చికిత్స పొందుతున్నవారి సంఖ్య శనివారం నాటికి 37 వేలు దాటింది. 2002–03లో ప్రపంచాన్ని వణికించిన ‘సార్స్’వైరస్‌ను మించిన ప్రమాదకారిగా ఈ కరోనా పరిణమించింది. నాడు ‘సార్స్’కారణంగా ప్రపంచవ్యాప్తంగా చనిపోయినవారి సంఖ్య 774 కాగా, కరోనా మృతుల సంఖ్య 800 దాటింది. కరోనా తరహాలోనే సార్స్ వైరస్‌ను కూడా మొదట చైనాలోనే గుర్తించారు. ఈ 2 కూడా ఒకే వైరల్ కుటుంబానికి చెందినవి కావడం గమనార్హం.ఒక్క చైనాలోనే 37 వేల మందికి పైగా కరోనా వైరస్‌తో బాధపడుతున్న నేపథ్యంలో.. 6,188 మంది బాధితుల పరిస్థితి విషమంగా ఉందని చైనా ఆరోగ్య శాఖ ప్రకటించిన పరిస్థితుల్లో.. సార్స్‌తో పోలిస్తే కరోనా కారణంగా చనిపోయే వారి సంఖ్య మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. కరోనా కారణంగా ఫిలిప్పీన్స్‌లో ఒకరు, హాంకాంగ్‌లో ఒకరు చనిపోయారు. భారత్‌లో 3 నిర్ధారిత కేసులను గుర్తించారు. కేరళకు చెందిన ఆ ముగ్గురు ఇటీవల కరోనా విస్ఫోటనానికి కేంద్ర బిందువైన చైనాలోని వుహాన్ నగరం నుంచి వచ్చినవారే కావడం గమనార్హం. ప్రజా యుద్ధం కరోనా కట్టడికి చైనా ప్రజాయుద్ధమే(పీపుల్స్‌వార్) ప్రారంభించింది. వైరస్ వ్యాప్తిని నిరోధించడం, చికిత్స అందించడం, టీకాను రూపొందించే పరిశోధనలకు ఊతమివ్వడం..వంటి చర్యల కోసం 1200 కోట్ల డాలర్లకు పైగా కేటాయించింది. కరోనా బాధితుల కోసం వుహాన్ శివార్లలో 10 రోజుల్లోపే వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మించింది. ‘కరోనా’విషయంలో సున్నితంగా స్పందించాలని చైనా ప్రపంచ దేశాలను కోరుతోం ది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అదే విషయాన్ని స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ను ‘వుహాన్ వైరస్’, ‘చైనా వైరస్’అని పిలవడంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కరోనా కారణంగా చైనా అర్థిక వ్యవస్థపై తద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుం ది. ఇప్పటికే పలు దేశాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. చైనా నుంచి భారీగా బల్క్ డ్రగ్‌ను దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి. ఈ పరిస్థితుల్లో చైనా నుంచి బల్క్ డ్రగ్ దిగుమతులు నిలిచి పోతే.. ఫార్మారంగంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ నౌకలోని భారతీయులపై ఆందోళన కరోనా వైరస్ కారణంగా జపాన్ తీరంలో నిలిపేసిన డైమండ్ ప్రిన్సెస్ నౌకలో చిక్కుకుపోయిన భారతీయుల గురించి ఆందోళన వ్యక్తమవుతోంది. 3,700 మంది ఉన్న ఆ నౌకలో పలువురికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించారు.ఆదివారం మరో ఆరుగురు ఆ వైరస్ బారిన పడినట్లు ప్రకటించారు. వారిని ఆçస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నామన్నారు. అయితే, ఆ నౌకలోని భారతీయులెవరికీ కరోనా సోకలేదని విదేశాంగ మంత్రి జైశంకర్ శుక్రవారం పార్లమెంట్లో ప్రకటించారు. జిన్‌పింగ్ ఎక్కడ? దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తున్న సమయంలో అధ్యక్షుడు జిన్‌పింగ్ అజ్ఞాతంలో ఉండటంపై చైనాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. జిన్‌పింగ్ తరఫున ప్రధానమంత్రి లీ కెక్వియాంగ్ మాత్రమే ప్రజల్లోకొస్తున్నారు. ఆరు నెలల్లో టీకా? కరోనా వ్యాధిని ఎదుర్కోవడానికి అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు వివిధ దేశాల శాస్త్రవేత్తలు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. లక్షల కోట్ల డాలర్ల వ్యయంతో సంయుక్తంగా ఈ ప్రాజెక్టు చేపట్టారు. సాధారణంగా ఒక టీకా తయారు చేయాలంటే ఏళ్లకి ఏళ్లు పడుతుంది. మొదట జంతువుల మీద , ఆపై మనుషులపై క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేయాలి, తర్వాతే ఆ వ్యాక్సిన్‌కి అనుమతి లభిస్తుంది. వ్యాధి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని 6 నెలల్లో వ్యాక్సి న్ను తయారు చేస్తామనిఆస్ట్రేలియా పరిశోధకుడు కీత్ చాపెల్ చెప్పారు. భారత్ స్నేహ హస్తం కరోనా వైరస్ కారణంగా అతలాకుతలమవుతున్న చైనాకు భారత్ స్నేహ హస్తం అందించింది. కరోనా కట్టడికి అవసరమైన ఏ సాయమైనా చేసేందుకు సిద్ధమని తెలిపింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు ఆదివారం లేఖ రాశారు. కరోనా కారణంగా మరణించిన కుటుంబాలకు మోదీ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. చైనీయులకు సంఘీభావం తెలిపారు. గత వారం చైనా నుంచి 650 మంది భారతీయుల్ని సురక్షితంగా వెనక్కి తీసుకురావడంలో జిన్‌పింగ్ అందించిన సహకారాన్ని మోదీ తన లేఖలో కొనియాడారు. చైనాలోని భారతీయుల ఆరోగ్యం, భద్రత విషయంలో భారత్‌తో సమన్వయం చేసుకునేందుకు, కరోనాను ఎదుర్కొనే విషయంలో భారత్ సాయం తీసుకునేందుకు చైనా సిద్ధంగా ఉందని భారత్‌లో చైనా రాయబారి సున్ వీడాంగ్ పేర్కొన్నారు. -
‘చెన్నై కనెక్ట్’
సాక్షి ప్రతినిధి, చెన్నై/మామల్లపురం: విభేదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటూ సహకారంలో నూతన అధ్యాయం ప్రారంభించాలని భారత్, చైనాలు నిర్ణయించాయి. భారత్, చైనా సంబంధాల్లో ‘చెన్నై కనెక్ట్’ కొత్త ఊపునిస్తుందని ప్రధాని మోదీ అభివర్ణించారు. మామల్లపురంలో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల మధ్య ముఖాముఖి రెండోరోజు కొనసాగింది. ద్వైపాక్షిక చర్చలకు వేదికైన మహాబలిపురం సమీపంలోని కోవలం బీచ్ తాజ్ ఫిషర్మన్ కోవ్ రిసార్టుకు ఉదయం 9.30 గంటలకు చేరుకున్న జిన్‌పింగ్‌కు మోదీ స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు నేతలూ గోల్ఫకార్ట్లో తిరిగారు. బీచ్‌లో నడిచారు. అక్కడి ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అద్దాల గదిలో ఇద్దరు నేతలు ఏకాంతంగా 90 నిమిషాలసేపు చర్చలు జరిపారు. అనువాదకులు ఆ సమయంలో వారితో ఉన్నారు. తర్వాత భారత విదేశాంగ మంత్రి జైశంకర్, చైనా విదేశాంగ కార్యదర్శి వాంగ్యూ సహా ఇరుదేశాలకు చెందిన 8 మంది అధికారులతో కలిసి మోదీ, జిన్‌పింగ్ సమావేశమయ్యారు. రెండు రోజుల్లోనూ సుమారు 7 గంటలపాటు జరిపిన ముఖాముఖిలో రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడుల పెంపునకు ఉన్నతస్థాయి యంత్రాంగం ఏర్పాటు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీంతోపాటు ప్రతిపాదిత ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్సీఈపీ)పై జరుగుతున్న చర్చల్లో భారత్ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకునేందుకు, భద్రతలో సహకారం, సరిహద్దుల్లో శాంతికి మరిన్ని చర్యలు తీసుకునేందుకు చైనా హామీ ఇచ్చింది. మూడో భేటీకి చైనా రావాలన్న జిన్‌పింగ్ ఆహ్వానాన్ని ఈ సందర్భంగా మోదీ అంగీకరించారు. ఇద్దరు నేతలు ఏమన్నారంటే.. ‘వూహాన్ సమ్మేళనంతో ప్రారంభమైన రెండు దేశాల మధ్య సంబంధాల్లో ‘చెన్నై కనెక్ట్’తో కొత్త ఊపు వచ్చింది. చైనా అధ్యక్షుని రాకతో మహాబలిపురం గ్రేట్ వే ఆఫ్ ఫ్రెండ్షిప్గా చరిత్రపుటల్లో నిలిచిపోయింది’ అని మోదీ అన్నారు. ప్రధాని మోదీ, నేను మంచి స్నేహితులం. ఈ రెండు రోజుల్లో ఇద్దరం మనసువిప్పి మాట్లాడుకున్నాం’ అని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అన్నారు. తమిళనాడులో తాను పొందిన ఆతిథ్యాన్ని ఎన్నటికీ మరువజాలనని జిన్‌పింగ్ అన్నారు. డ్రాగన్, ఏనుగు నాట్యం కేవలం చైనా, భారత్‌ల విషయంలోనే సాధ్యమని జిన్‌పింగ్ పేర్కొన్నారు. ‘రెండుదేశాల మధ్య విభేదాలు దైపాక్షిక సహకారంపై ప్రభావం చూపజాలవు. ఏనుగు, డ్రాగన్ నాట్యం చేయడం భారత్, చైనాల విషయంలో మాత్రమే నప్పుతాయి. రెండు దేశాల కీలక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఏళ్లుగా నానుతున్న సమస్యలను విభేదాలను జాగ్రత్తగా పరిష్కరించుకోవాలి’ అని అన్నారు. ప్రస్తావనకు రాని కశ్మీర్ భేటీ అనంతరం విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే మీడియాతో మాట్లాడారు. ‘సరిహద్దుల్లో తరచూ తలెత్తే వివాదాలను పరిష్కరించుకునేందుకు, శాంతిని నెలకొల్పేందుకు పరస్పరం విశ్వాసం పాదుకొల్పే మరిన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. వాణిజ్యంలో సమతూకం సాధించేందుకు, వాణిజ్య, వ్యాపార సంబంధాలను విస్తృతం చేసుకునేందుకు ప్రత్యేకంగా ఉన్నత స్థాయి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని, తయారీ రంగం భాగస్వామ్యం, పెట్టుబడుల పెంపుపై ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ చర్చలకు చైనా ఉప ప్రధాని హు చిన్హువా, భారత్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వం వహిస్తారని తెలిపారు’ అని ఆయన తెలిపారు. ఇద్దరు నేతల మధ్య కశ్మీర్ అంశం చర్చకు రాలేదని, ఆ ప్రస్తావనే లేదని తెలిపారు. భారత్, చైనా దౌత్య సంబంధాలకు వచ్చే ఏడాది 70 ఏళ్లు నిండుతున్న సందర్భంగా రెండు దేశాల మధ్య సాంస్కృతిక, ప్రజా సంబంధాలను మరింత విస్తృతం చేసుకునేందుకు జిన్‌పింగ్ అంగీకరించారని చైనా అధికార వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. ఇలా ఉండగా, జిన్‌పింగ్ పర్యటనను పురస్కరించుకుని చైనా పర్యాటకుల కోసం ప్రత్యేకంగా ఐదేళ్ల ఈ వీసా సౌకర్యం కల్పిస్తున్నట్లు బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. మధ్యాహ్నం 12.55 గంటలకు జిన్‌పింగ్ కోవలం బీచ్ హోటల్ నుంచి చెన్నై విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో నేపాల్ వెళ్లిపోయారు. బీచ్‌లో మోదీ ప్లాగింగ్ చెత్తా చెదారాన్ని ఎత్తివేసి ప్రజల్లో స్ఫూర్తిని నింపిన ప్రధాని మహాబలిపురం సముద్ర తీరంలో మోదీ అరగంట సేపు స్వచ్ఛభారత్ నిర్వహించారు. అక్కడ పరిసరాలు చెత్తా చెదారంతో నిండిపోవడంతో ఆయన వాటన్నింటిని ఎత్తేశారు. స్వచ్ఛభారత్ అభియాన్, ఫిట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తిని ఏకకాలంలో ప్రజల్లో రగిల్చేలా చేశారు. నల్లని రంగు కుర్తా, పైజామా ధరించిన ప్రధాని మోదీ ఒక పెద్ద ప్లాస్టిక్ బ్యాగ్‌ని పట్టుకొని ఇసుక తిన్నెల్లో నడుస్తూ తాగి పారేసిన ప్లాస్టిక్ బాటిల్స్, క్యారీ బ్యాగ్స్ , స్ట్రాలు ఇతర చెత్తలన్నీ ఏరారు. బీచ్‌లో చెత్తను తీసి బ్యాగ్‌లో వేస్తూ.. ఇలా చేయడం వల్ల వంటికి వ్యాయామానికి వ్యాయామం జరుగుతుంది. పరిసరాలు శుభ్రానికి శుభ్రం అవుతాయి. దీనికి సంబంధించిన మూడు నిమిషాల వీడియోను ప్రధాని తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేశారు. ‘‘మహాబలిపురం తీరంలో ప్లాగింగ్ చేశాను. దాదాపుగా 30 నిమిషాల సేపు చెత్తలన్నీ ఏరి దానిని హోటల్ యజమాని జయరాజ్‌కు అందజేశాను. ప్రజలందరూ బహిరంగ ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అదే సమయంలో ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలి’’అని ప్రధాని ట్వీట్ చేశారు. అంతకు ముందు సముద్రం నీళ్లలో తడుస్తూ, అక్కడి సూర్యోదయం అందాలను వీక్షిస్తూ ప్రధాని చాలా సేపు బీచ్‌లో గడిపి సేద తీరారు. రోడ్లపై జాగింగ్ చేస్తూ చెత్తా చెదారాన్ని ఎత్తేపారేసే ప్రక్రియని ప్లాగింగ్ అని పిలుస్తారు. జిన్‌పింగ్ ముఖచిత్రంతో చేనేత పట్టు శాలువా చైనా అధినేతకు మోదీ అపూర్వ కానుక భారత్‌కు రెండు రోజుల పర్యటన కోసం వచ్చిన చైనా అ«ధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపురూపమైన కానుకని బహూకరించారు. చేతితో తయారు చేసిన ఎర్ర రంగులో ఉన్న ఈ శాలువాపై జిన్‌పింగ్ ముఖ చిత్రాన్ని డిజైన్‌గా వేయించారు. బంగారు రంగు అంచుల జరీతో మెరిసిపోతున్న ఈ శాలువా ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది. తమిళనాడులో కోయంబత్తూరు జిల్లాలోని సిరుముగైపుడూర్కి చెందిన శ్రీ రామలింగ సౌదాంబిగై చేనేత సహకార సంఘం మల్బరీ పట్టుతో ఎర్ర శాలువాని తయారు చేసింది. ఎరుపు రంగు ఎంచుకోవడానికి ఓ కారణం ఉంది. తన ఫొటో ఉన్న జ్ఞాపికను జిన్‌పింగ్ నుంచి స్వీకరిస్తున్న మోదీ చైనా జాతీయ జెండా రంగు, అధికార పార్టీ జెండా రంగు ఎరుపే. అంతేకాదు చైనా సంస్కృతిలో ఎరుపు రంగుని శుభసూచికంగా పరిగణిస్తారు. ఈ రంగుతో అదృష్టం కలిసివస్తుందని, జీవితం ఆనందోత్సాహాల్లో నిండిపోతుందని వారి నమ్మకం. ఈ శాలువాపై జిన్‌పింగ్ ముఖ చిత్రాన్ని డిజైన్‌గా వేయడానికి ఎలక్ట్రానిక్ ఫ్యాబ్రిక్‌ని వినియోగించారు. ఆ తర్వాత దానిపై బంగారు రంగు దారాలతో అల్లారు. చేతి వృత్తుల పరిశ్రమ, చేనేత కళలకు తమిళనాడు పెట్టింది పేరు. దశాబ్దాలుగా ఎందరో చేనేత కార్మికులు చేతితో తయారు చేసే వస్త్రాలతో అద్భుతాలు సృష్టించారు. కంచి, ఆరణి, మదురై, కోయంబత్తూరు వంటివి పట్టు వస్త్రాల ప్రపంచంలో తమకంటూ ఒక గుర్తింపుని సాధించాయి. మామల్లపురం బీచ్‌లో సేదతీరుతున్న మోదీ -
పల్లవ రాజు... పండిత నెహ్రూ
ఆసియా ఖండంలోని ఇద్దరు శక్తిమంతమైన నాయ కులు నరేంద్ర మోదీ, షీ జిన్ పింగ్ల ‘వ్యూహాత్మక’ సమావేశం ముగిసింది. సంయుక్త ప్రకటన వంటిది ఏమీ ఉండదని ముందుగానే చెప్పారు కనుక, ఏ అంశాల మీద వారిద్దరి మధ్యన చర్చలు జరిగి వుంటాయన్న దానిపై సహజంగానే ఆసక్తి వుంటుంది. ఆ ఆసక్తిని మించి, సగటు భారతీయుడి హృదయాన్ని రంజింప జేసే మరో ఆకర్షణీయ దృశ్యం ఈ సమావేశాల్లో ఆవిష్కృ తమైంది. అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుత ప్రపంచంలో అత్యంత శక్తిమంతుడి కింద లెక్క. ఆ తర్వాతి స్థానం చైనా అధ్యక్షుడైన జిన్ పింగ్దే. ఆయన మనదేశం వచ్చారు. మన ప్రధానితో కలిసి సమావేశమయ్యారు. ఇద్దరూ కలిసి భారతీయ శిల్పకళా సొగసులను తిలకించారు. సంగీత నాట్యాలను ఆస్వా దించారు. ఆలయాల వెలుపల కలయదిరుగుతూ టీవీల ద్వారా ప్రజలకు కనువిందు చేశారు. ఒక రాజును గొప్ప వాడిగా పరిగణించడానికి చాణక్యుడు నిర్దేశించిన ప్రమా ణాల్లో పొరుగు రాజులకంటే బలంగా కనిపించడం కూడా ఒకటి. నిన్నటి సమావేశం సందర్భంగా నరేంద్ర మోదీ ఆహార్యం, ఆంగికవాచకం చాణక్యుడు నిర్దేశించిన ప్రమాణాలకు సరిపోతాయి. మామల్లపురంలో పల్లవుల కాలంనాటి ఏకశిలా రథాల ముందు తమిళ సంప్రదాయ వస్త్రధారణతో, ఎడమ భుజంపై వున్న ఉత్తరీయం వెనుక భాగాన్ని కుడి ముంజేతిపై వేసుకొని జిన్ పింగ్ ఎదుట రాజసంగా కనిపించిన విధానం దేశ ప్రజలను కచ్చి తంగా ఆకర్షించి ఉంటుంది. మన సినిమాలు, నాటకాల్లో చక్రవర్తులు, రాజాధిరాజుల పాత్రలు ఈ భంగిమలోనే కనిపిస్తాయి. అంతర్జాతీయ వేదికలపై ఇతర దేశాల నాయకుల నడుమ మన నాయకుడు ప్రత్యేకంగా, కీల కంగా కనిపించాలని దేశ ప్రజలు బలంగా కోరుకుం టారు. ఎందుకంటే ఆ నాయకుడు ఆ వేదికపై మన దేశ సార్వభౌమాధికారానికి ప్రతీక. దక్షిణాసియా దేశాలు, అలీన దేశాలు వంటి పరిమిత స్థాయి వేదికలపై తప్ప, సంపన్న దేశాలు పాల్గొనే విస్తృత వేదికపై కొన్ని దశాబ్దాలుగా మన నాయకులు నిరాశపరుస్తూనే వున్నారు. ఇన్నాళ్లూ ఒకటి... ఇప్పుడొకటి అన్నట్టుగా నరేంద్ర మోదీ ఆ సంప్రదాయానికి చరమగీతం పాడారు. మూడు నెలల కిందటి ఆ గేమ్ చేంజర్ దృశ్యాన్ని బహుశా ఎప్పటికీ మరిచిపోలేమేమో. అసలే కోతి, ఆపై కల్లు తాగింది... అని సామెత చెప్పినట్టు అసలే ట్రంపు... ఆపై అమెరికా అధ్యక్షుడు. అతనితో వ్యవహారం అంటే మాటలా? ఉమ్మడి మీడియా సమా వేశంలో ఆకతాయిగా వ్యవహరించబోయిన ట్రంప్ చేతిపై తన ఎడమ చేత్తో చరిచి చాల్లే బడాయని ఒక భారత నేత అదుపు చేయడం గతంలో ఊహలకు కూడా అందని దృశ్యం. ఈ దృశ్యం సగటు భారతీయుని హృద యాన్ని సమ్మోహితం చేసింది. అతని ఆత్మగౌరవాన్ని ఉత్తేజ పరిచింది. అంతర్జాతీయ వ్యవహారాల్లో భారతదేశానికి సంబంధించినంత వరకు ఈ గాలి మార్పు ఎలా సాధ్య మైంది? మన కోటీశ్వరులు, అంతర్జాతీయ కోటీశ్వ రులతో పోటీపడుతూ ఫోర్బ్స్ జాబితాల్లోకి క్రమం తప్ప కుండా ఎక్కుతున్నందుకా? కాదు. మన ప్రభుత్వాలు అద్భుతాలు సృష్టించి ఆర్థికాభివృద్ధిని శరవేగంగా పరు గెత్తిస్తున్నందుకా?... కాదు. మన రక్షణ పాటవం అమాంతం పెరిగిపోయి, పొరుగుదేశాలు వణికిపోతు న్నందుకా? కానేకాదు. ప్రపంచంలో ఇప్పుడు భారత్‌కు లభిస్తున్న గౌరవం ఆ దేశపు మధ్య తరగతి మంద హాసం. వినిమయ వస్తువులను కొనుగోలు చేయగలిగిన మధ్య – ఉన్నత మధ్యతరగతి జనాభా దేశంలో 30 కోట్లు దాటింది. ఈ జనాభా నానాటికీ పెరుగుతున్నది. దాదాపు అమెరికా జనాభాతో సమానంగా భారత్‌లో ఒక కొనుగోలు మార్కెట్ తయారై వుంది. గనిలో, వనిలో, కార్ఖానాల్లో విరామ మెరుగక శ్రమించిన ముందుతరం త్యాగధనుల స్వేదంలోంచి కొత్త మధ్య తరగతి ఉద్భవించింది. పాడిపంటల్లో కాయకష్టం చేసిన లక్షలాది మంది తల్లుల కొంగుముడుల్లో దాగిన పొదు పులోంచి పుట్టుకొచ్చిన నయా మధ్యతరగతి ఉపాధివే టలో దేశదేశాలకు విస్తరించింది. విదేశాల్లో తమ అవసరాలను కుదించుకొని మాతృదేశానికి ఏటా లక్షల కోట్లు పంపిస్తూ ప్రవాస భారతీయులు భారతీయ వినిమయ మార్కెట్‌ను పటిష్టపరుస్తున్నారు. ఈ మార్కెట్ అంటే అమెరికాకు గౌరవమే, చైనాకూ గౌరవమే, వస్తు వులు అమ్ముకునే ప్రతిదేశానికీ గౌరవమే. ఈ మార్కె ట్ను పరిపాలిస్తున్న భారత ప్రభుత్వమంటే కూడా గౌరవమే ఉండితీరాలి. శరీరకష్టం పునాదిగా నిర్మితమైన భారత మధ్యతరగతి ఆత్మగౌరవ ఆకాంక్షలకు అనుగు ణంగానే అంతర్జాతీయ వేదికలపై మన చాయ్‌వాలా ప్రధాని వ్యవహరిస్తున్నారని భావించవచ్చు. ఇంతకూ మోదీ – జిన్ పింగ్ ఏ విషయాలపై సీరి యస్‌గా చర్చించి వుంటారు? ఏ దేశానికైనా దీర్ఘకాలిక లక్ష్యాలు వేరు. తాత్కాలిక వ్యూహాలు వేరు. ఇందుకు భారత్, చైనాలు కూడా మినహాయింపు కాదు. అమె రికాను అధిగమించి అగ్రరాజ్యంగా ఎదగాలన్న కోరిక చైనాకు వున్నది. కోరిక వుండటమే కాదు.. అది నెర వేర్చుకునేందుకు చాలాకాలంగా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నది. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకున్నది. అంతర్జాతీయ వర్తక వాణిజ్యాల్లో అమెరికాకు సవాల్ విసురుతున్నది. అందుకు ప్రతిగా చైనాను అదుపు చేసేం దుకు భారత్ సహాయాన్ని అమెరికా ఆశిస్తున్నది. తాను ఏర్పాటు చేసే ఇండో–పసిఫిక్ కూటమిలో భారత్ భాగం కావాలన్నది అమెరికా కోరిక. ఇది వాస్తవరూపం దాలిస్తే ఈ ప్రాంతంలో చైనా దూకుడుకు కళ్లెం పడుతుంది. కానీ, అమెరికా చెప్పుచేతుల్లో వుండటానికి భారత్ కూడా అంగీకరించదు. ప్రపంచ శక్తిగా ఎదగాల్సిన అవసరం, అవకాశం భారత్‌కు కూడా వున్నాయి. ఈ ప్రాంతంలో అమెరికా పెత్తనమయినా, చైనా ఆధిపత్య మైనా, భారత్ సహించే అవకాశమే లేదు. కనీసం దక్షి ణాసియా వరకైనా తన మాట చెల్లుబాటు కావాలన్న లక్ష్యం భారత్‌కు వుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి చైనా–పాక్ ఎకనామిక్ కారిడార్‌ను చైనా ఏర్పాటు చేసింది. ఇది భారత ప్రయోజనాలకు వ్యతిరేకం. పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత్ దూకుడుగా వ్యవహరించడం చైనాకు సమ్మతం కాదు. రెండు దేశాల మధ్యన 3,800 కిలోమీటర్ల పొడవున వున్న సరిహద్దుపై పేచీలు కూడా ఇప్పుడప్పుడే పరిష్కారమయ్యే సమస్యకాదు. భారత్– చైనాల మధ్య వర్తకం ఏటా రూ. ఏడు లక్షల కోట్లకు చేరు కున్నది. ఇందులో భారత్ నష్టపోతున్నది. చైనా ఎగుమ తులు ఐదు లక్షల కోట్లకిమ్మత్తు చేస్తుంటే భారత్ ఎగు మతులు (హాంకాంగ్‌తో సహా) రెండు లక్షల కోట్లు దాట డం లేదు. ఈ వ్యత్యాసాన్ని తగ్గించుకోవాలని భారత్ కోరుకుంటున్నది. ఇందుకోసం భారత్ ఎగుమతులకు చైనాలో మరిన్ని అవకాశాలివ్వాలని అడుగుతున్నది. భారత్‌లో భారీ పెట్టుబడులు పెట్టే అవకాశం లభించా లని చైనా కోరుకుంటున్నది. బహుశా ఈ రెండు అంశాల మీద కొంత పురోగతి వుండే అవకాశం వుంటుంది. భారత్–చైనాల దీర్ఘకాలిక లక్ష్యాలు రెండు దేశాల మధ్య సంపూర్ణ స్నేహ సంబంధాలకు అవకాశం ఇవ్వక పోవచ్చు. ఆర్థిక అవసరాల దృష్ట్యా తాత్కాలికంగా కొన్ని విషయాలపై రాజీ పడవచ్చు. మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ టెర్రరిస్టుగా ప్రకటించాలన్న భారత్ డిమాండ్‌కు అడ్డు తగులుతున్న చైనా దాన్నుంచి పక్కకు తప్పుకోవడం ఈ తాత్కాలిక వ్యూహంలో భాగంగానే చూడాలి. ఈ శతాబ్దాన్ని ఆసియా శతాబ్దంగా పరిగణి స్తున్నారు. కనుక ఆసియాలో ఎవరు సూపర్ పవర్ అవుతారో వారే సూపర్ గ్లోబల్ పవర్ కావచ్చు. అవ కాశం రెండు దేశాలకూ వున్నది. అందువల్ల ఒకరికి ఒకరు సంపూర్తిగా సహకరించుకొని మానవాళికి ఆద ర్శంగా మిగిలిపోతారని భ్రమించడం అవివేకమే అవు తుంది. 1962లో జరిగిన భారత్–చైనా యుద్ధానికి సంబంధించి ఇటీవల సీఐఏ కొన్ని పత్రాలను బయట పెట్టింది. వాటి ఆధారంగా అప్పటి చైనా ప్రధాని చౌ ఎన్ లై పండిత్ నెహ్రూను నమ్మించి గొంతుకోశాడని అది అభిప్రాయ పడింది. సామ్రాజ్యవాద దేశాలకు వ్యతిరే కంగా ఆఫ్రో– ఆసియా దేశాలు సంఘటితంగా పని చేయాలని నెహ్రూ భావించాడు. ఈ ప్రయాణంలో చైనాను నమ్మకమైన మిత్రదేశంగా భావించాడు. స్వాప్ని కుడు, ఆదర్శవాది అయిన నెహ్రూ ‘హిందీ–చీనీ భాయి భాయి’ అంటూ పులకించిపోయేవాడు. భారత్‌తో చైనా స్నేహం నటిస్తూనే యుద్ధ సన్నాహాలు పూర్తి చేసింది. యుద్ధానికి దారి తీయవలసినంత తీవ్రమైన పరిస్థితులు అప్పుడు లేవు. కానీ చైనా అంతరంగం మరొక విధంగా వున్నది. భారత్‌ను బలహీన దేశంగా ప్రపంచం ముందు చిత్రించడం ద్వారా మాత్రమే చైనా ప్రయోజనాలు నెర వేరగలవని ఆలోచించింది. ఈ విషయంపై యుద్ధం తర్వాత చైనా అధ్యక్షుడు లీ షావో చీ స్వీడన్ రాయబా రితో మాట్లాడుతూ భారత్‌కు గుణపాఠం నేర్పడానికే యుద్ధం చేశామని స్వయంగా చెప్పినట్టు ఈ పత్రాల్లో వెల్లడైంది. ఊహించని యుద్ధం కారణంగా భారత్ దారుణ పరాభవంపాలు కావలసివచ్చింది. నెహ్రూకు నమ్మకద్రోహం చేసిన చౌ ఎన్ లై కూడా మామల్లపురా నికి 1956 డిసెంబర్లో వచ్చారు. ఆ తర్వాత కొంతకాలా నికే చైనా భారత్‌పై దాడి చేసింది. ఇప్పుడు చైనా ప్రభుత్వం కూడా జిన్‌పింగ్ పర్యటనకు మామల్లపురాన్ని స్వయంగా ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ మహాబలిపురానికి చైనాకు రెండువేల ఏళ్లుగా సంబంధాలున్నాయి. పల్లవ రాకుమారుడొకరు ధర్మ ప్రబోధి అనే పేరుతో చైనాకు వెళ్లి అక్కడ షావోలిన్ మొనాస్టరీని స్థాపించి ధ్యాన బౌద్ధాన్ని బోధించాడు. మార్షల్ ఆర్ట్స్‌ను కూడా చైనీయులకు ధర్మప్రబోధుడే పరిచయం చేశాడని చెబుతారు. పల్లవరాజ్యం నుంచి చైనా దేశానికి భారీగా ఎగుమతులు జరిగేవని చెప్పడా నికి సాక్ష్యంగా మామల్లపురం రేవులో విస్తృతంగా ఆ కాలం నాటి చైనా నాణేలు దొరికాయి. మొదటి నర సింహవర్మ కాలంలో పల్లవరాజ్యం ఉచ్ఛదశను చూసింది. ఆ కాలంలోనే చైనాతో వర్తక వ్యాపారాలు వర్థి ల్లాయి. ఎగుమతులదే పైచేయిగా వుండేది. చౌ ఎన్ లై వచ్చివెళ్లిన 63 ఏళ్ల తర్వాత మరో చైనా నేత షీ జిన్ పింగ్ మామల్లపురం దర్శించి వెళ్లారు. ఇప్పుడేమవుతుంది? మరోసారి మోసపోవడానికి నెహ్రూలాగ స్వప్న లోకాల్లో విహరించే రకంకాదు నరేంద్ర మోదీ. చైనాకు ఎగుమతు లను పెంచి, వర్తకంలో లాభాలు పిండి నయా పల్లవ రాజు నరసింహవర్మ అవుతాడేమో చూడాలి. muralivardelli@yahoo.co.in వర్ధెల్లి మురళి