పార్టీ ప్రధాన కార్యదర్శిగా రెండోసారి పగ్గాలు చేపట్టనున్న చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ గత ఐదేళ్లలో పార్టీలో తన వ్యతిరేకులు చేపట్టిన రాజకీయ తిరుగుబాటును పలుమార్లు అడ్డుకున్నారని చైనా ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అవినీతికి వ్యతిరేకంగా జిన్‌పింగ్ చేపట్టిన కార్యక్రమాలతో ఇబ్బందులు పడుతున్న కొందరు మాజీ రాజకీయ ప్రముఖులు ఈ కుట్ర పన్నారని చైనా సెక్యూరిటీస్ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ లియూ షియూ చెప్పారు.