కమాండర్ ఇన్ చీఫ్‌గా జిన్‌పింగ్
చైనా అధ్యక్షుడికి మరో హోదా
బీజింగ్: చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ అధికార కిరీటంలో మరో శక్తి చేరింది. ఆయన చైనా సంయుక్త దళాల జాయింట్ ఆపరేషన్స్ కమాండ్ సెంటర్.. కమాండర్ ఇన్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన చైనా ఆర్మీపై ఆయనకు పూర్తి నియంత్రణ లభించినట్లయింది. ఇప్పటికే జిన్‌పింగ్ అధికార కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీగా, సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మన్‌గా ఉన్నారు. బుధవారం కమాండ్ సెంటర్‌ను సందర్శించిన సందర్భంగా ఆయన ఈ బాధ్యతలు చేపట్టినట్లు స్థానిక మీడియా తెలిపింది. ప్రపంచ ప్రస్తుత పరిస్థితిని బట్టి యుద్ధ దళాల చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుందని జిన్‌పింగ్ చెప్పారు.