కజన్: బ్రిక్స్ సమావేశాల సైడ్‌లైన్స్‌లో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో రష్యాలో బుధవారం(అక్టోబర్ 23) సమావేశమయ్యారు. వీరిద్దరూ ఈ భేటీలో ఏం చర్చిస్తారన్నది కీలకలంగా మారింది. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
భారత్, చైనా వాస్తవాధీన రేఖపై పెట్రోలింగ్ నిర్వహించే విషయంలో ఇరు దేశాల మధ్య ఇటీవలే ఒప్పందం కుదిరిన నేపథ్యంలో జిన్‌పింగ్,మోదీ భేటీ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. 2020లో సరిహద్దులో జరిగిన భారత, చైనా సైనికుల ఘర్షణల తర్వాత చైనా,భారత్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న విషయం తెలిసిందే.
ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి సరికాదు: మోదీ
బ్రిక్స్ రెండో రోజు సమావేశాల్లో బుధవారం ప్రధాని మోదీ పాల్గొని మాట్లాడారు. సమావేశాలను పుతిన్ విజయవంతంగా నిర్వహించారని ఈ సందర్భంగా ప్రధాని కొనియాడారు. భవిష్యత్తులో బ్రిక్స్ మరింత పటిష్టమైన వేదిక అవుతుందన్నారు. బ్రిక్స్ చిన్న,మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రపంచంలో 40 శాతం జనాభాకు బ్రిక్స్ ప్రాతినిథ్యం వహిస్తుందన్నారు.
ప్రతి ఒక్కరు తల్లి పేరుతో మొక్క నాటే కార్యక్రమాన్ని భారత్‌లో చేపట్టామని చెప్పారు. ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి ఉండటం సరికాదన్నారు. బ్రిక్స్ దేశాలు లోకల్ కరెన్సీ ద్వారా వ్యాపారం చేయడాన్ని ప్రోత్సహించాలని కోరారు.
ఇదీ చదవండి: ఢిల్లీ కాలుష్యంపై సుప్రీం అసహనం
Comments
Please login to add a commentAdd a comment