Bricks
-
ప్రధాని మోదీ, జిన్‌పింగ్ చర్చలు
కజన్: బ్రిక్స్ సమావేశాల సైడ్‌లైన్స్‌లో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో రష్యాలో బుధవారం(అక్టోబర్ 23) సమావేశమయ్యారు. వీరిద్దరూ ఈ భేటీలో ఏం చర్చిస్తారన్నది కీలకలంగా మారింది. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారత్, చైనా వాస్తవాధీన రేఖపై పెట్రోలింగ్ నిర్వహించే విషయంలో ఇరు దేశాల మధ్య ఇటీవలే ఒప్పందం కుదిరిన నేపథ్యంలో జిన్‌పింగ్,మోదీ భేటీ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. 2020లో సరిహద్దులో జరిగిన భారత, చైనా సైనికుల ఘర్షణల తర్వాత చైనా,భారత్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి సరికాదు: మోదీ బ్రిక్స్ రెండో రోజు సమావేశాల్లో బుధవారం ప్రధాని మోదీ పాల్గొని మాట్లాడారు. సమావేశాలను పుతిన్ విజయవంతంగా నిర్వహించారని ఈ సందర్భంగా ప్రధాని కొనియాడారు. భవిష్యత్తులో బ్రిక్స్ మరింత పటిష్టమైన వేదిక అవుతుందన్నారు. బ్రిక్స్ చిన్న,మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రపంచంలో 40 శాతం జనాభాకు బ్రిక్స్ ప్రాతినిథ్యం వహిస్తుందన్నారు. ప్రతి ఒక్కరు తల్లి పేరుతో మొక్క నాటే కార్యక్రమాన్ని భారత్‌లో చేపట్టామని చెప్పారు. ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి ఉండటం సరికాదన్నారు. బ్రిక్స్ దేశాలు లోకల్ కరెన్సీ ద్వారా వ్యాపారం చేయడాన్ని ప్రోత్సహించాలని కోరారు. ఇదీ చదవండి: ఢిల్లీ కాలుష్యంపై సుప్రీం అసహనం -
బ్రిక్స్ మేయర్ల సదస్సుకు అనంతపురం మేయర్
జూన్ 21న రష్యాలోని కజాన్ నగరంలో జరుగుతున్న వివిధ దేశాలకు చెందిన మేయర్ల సదస్సుకు అనంతపురం నగర మేయర్ మహమ్మద్ వసీం సలీం హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుండి అనంతపురం ఏకైక నగరం కావడం విశేషం. దేశంలో జైపూర్, కాలికట్, త్రిస్సూర్ మరియు నాగర్ కోయిల్ నుండి మేయర్లు పాల్గొంటున్నారు.వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో పేద ప్రజలకు అందిన సంక్షేమం.. జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేకంగా రూపొందించిన పుస్తకాన్ని రష్యాలో జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల్లో ప్రదర్శించారు. అనంతపురం మేయర్ మహమ్మద్ వాసీం. ప్రపంచ వ్యాప్తంగా 50 మంది మేయర్లు రష్యా బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొన్నారు.ఏపీ నుంచి బ్రిక్స్ సమావేశాల్లో అనంతపురం మేయర్ మహమ్మద్ వాసీం ఒక్కరే పాల్గొన్నారు. గత ఐదు సంవత్సరాల వ్యవధిలో అనంతపురం నగరపాలక సంస్థ లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా జరిగిన గ్రామ స్వరాజ్యం వివరాలతో కూడిన ఓ పుస్తకాన్ని తయారు చేసిన మేయర్ మహమ్మద్ వాసీం... దానిని రష్యాలోని కజాన్ నగరంలో ఉన్న లైబ్రరీకి అందజేశారు. -
జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని.. ఆయన పేరుతో ఏకంగా!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ రేంజే వేరు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వరించింది. అందుకే ఎన్టీఆర్ అంటే అంతలా అభిమానిస్తారు. తాజాగా ఓ అభిమాని తన ప్రేమను వినూత్నంగా చాటుకున్నారు. ఏపీలోని కర్నూలుకు ఓ వీరాభిమాని తన కొత్త ఇంటిని నిర్మిస్తున్నారు. అయితే ఇంటి నిర్మాణానికి వినియోగించే ఇటుకలపై ఎన్టీఆర్ అని పేరును ముద్రించారు. ఈ విధంగా తన అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్‌పై ఉన్న ప్రేమను వ్యక్తం చేశారు. కాగా.. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్‌రాజ్, జిస్సు సేన్‌గుప్తా, శ్రీకాంత్, టామ్ చాకో, నరైన్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆ తర్వాత హృతిక్ రోషన్ మూవీ వార్-2లో ఎన్టీఆర్ కనిపించనున్నారు. బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దీనికి దర్శకత్వం వహించనున్నారు. Kurnool City & Dt@tarak9999 ఒక అభిమాని తన ఇంటి కోసం NTR అనే పేరు గల ఇటికలను తన ఇల్లు నిర్మాణం కోసం కావాలని తెప్పించుకున్నాడు ఇటువంటి అభిమానులు చాలా అరుదుగా ఉంటారు రాయలసీమలో #JaiNTR #ManOfMassesNTR pic.twitter.com/ZtOG35VSYt — MadhuYadav (jr.NTR) Kurnool (@MadhuYadavTarak) November 3, 2023 -
ఆ గ్రహంపై బంగాళ దుంప పిండి, ఉప్పుతో ఇళ్లు కట్టుకోవచ్చు.. అసలు మ్యాటర్ ఇదే!
భూమిపై రోజురోజుకూ జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. ఇలా ఇంకొన్ని రోజులు పోతే ఇక్కడి వనరులు కూడా సరిపోని పరిస్థితులు తలెత్తుతాయి. ఈ క్రమంలోనే ఇతర గ్రహాలపై మానవ నివాసం కోసం అన్వేషణ సాగుతోంది. అయితే భూమి కాకుండా మానవులు నివసించడానికి అనువుగా ఉండే మరో గ్రహం ఏదైనా ఉందా అంటే.. వెంటనే వచ్చే సమాధానం అంగారకుడు (Mars). మరి ఒకవేళ మార్స్‌పై నివాసాలు ఏర్పాటు చేసుకుంటే ఇంటి నిర్మాణం ఎలా చేపట్టాలి? ఇలా అనేక అనుమానాలు వ్యక్త మయ్యాయి. ఇందుకోసం వ్యోమగాముల రక్తం, మూత్రాన్ని ఇందుకోసం వాడుకోవచ్చని సైంటిస్ట్‌ల పరిశోధనల్లో తేలింది. వ్యోమగాములందరూ రక్తాన్ని ఇవ్వటానికి అంగీకరించకపోవచ్చు కూడా. దీన్ని దృష్టిలో పెట్టుకునే అదే అంతరిక్ష నిర్మాణాలకు ఉపయోగపడే దృఢమైన ఇటుకలను ఇటీవల మాంచెస్టర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించారు. వీటి తయారీకి వారు వాడిన పదార్థాలను తెలుసుకుంటే, ఎవరైనా ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాల్సిందే! సాధారణ కాంక్రీట్ దారుఢ్యం గరిష్ఠంగా 70 ఎంపీఏ వరకు ఉంటే, మాంచెస్టర్ శాస్త్రవేత్తలు తయారు చేసిన ఈ ఇటుకల దారుఢ్యం 72 ఎంపీఏ వరకు ఉండటం విశేషం. అంతరిక్ష ధూళి, బంగాళ దుంపలు, ఉప్పు సహా వివిధ పదార్థాల సమ్మేళనంతో తయారు చేసిన కాంక్రీట్ తరహా పదార్థాన్ని ఉపయోగించి ఈ ఇటుకలను తయారు చేశారు. ఇటుకల తయారీకి ఉపయోగించిన ఈ పదార్థానికి వారు ‘స్టార్‌క్రీట్’గా నామకరణం చేశారు. దీనిని ‘కాస్మిక్ కాంక్రీట్’గా కూడా అభివర్ణిస్తున్నారు. అత్యంత దృఢమైన కాంక్రీట్ తయారీలో భాగంగా వీరు చంద్రుడి ధూళిని ఉపయోగించి తయారు చేసిన ఇటుకల దారుఢ్యమైతే ఏకంగా 91 ఎంపీఏ పైగానే ఉంది. తమ ప్రయోగాలు విజయవంతమైతే, ప్రపంచంలోనే అత్యంత దృఢమైన కాంక్రీట్‌ను రూపొందించగలమని మాంచెస్టర్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
ఇటుక అండగా.. ఇల్లు చల్లన! కూల్ బ్రిక్స్ తయారీలో అసిస్టెంట్ ప్రొఫెసర్
వేసవిని జయించేందుకు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు ఎవరి స్థోమతకు తగ్గట్టు వాళ్లు పరికరాల్ని అమర్చుకుంటున్నారు. ఇవేమీ అవసరం లేకుండా.. ఇంట్లో వేడిని తగ్గించే ప్రయత్నం చేశారు నిట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఇంటి నిర్మాణం కోసం కూల్ బ్రిక్స్‌ను తయారు చేశారు. వీటి వాడకం వల్ల ఏడాదంతా ఇంటి లోపల చల్లని వాతావరణం ఉంటుంది. ఈ బ్రిక్స్ తయారీకి ఇటీవలే డాక్టర్ శశిరాం భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ కూడా పొందారు. ఆ చల్లని ఇటుకల విశేషాలేంటంటే.. – కాజీపేట అర్బన్ వ్యర్థానికో అర్థం చూపాలనుకున్నారు. డంపింగ్ యార్డులో పడేసిన బూడిదకు ఓ ఆకృతిని చ్చారు డాక్టర్ శశిరాం. ఆమె మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో 2017లో ‘కో ఫైర్డ్ బ్లెండెడ్ యాష్ బ్రిక్స్’ అనే అంశంపై పరిశోధన చేశారు. ఆ సమయంలో వివిధ రకాల బాయిలర్లను వేడి చేసేందుకు బయోమాస్, కోల్(బొగ్గు)ను ఉపయోగించడం గమనించారు. బొగ్గు వేడి చేసిన అనంతరం బూడిదగా మారిపోవడం, డంపింగ్ యార్డ్‌లో పడవేయడం చూశారు. ఆ వ్యర్థాలను ఉపయోగించి వేడిని తట్టుకునే ఇంటి నిర్మాణానికి ఇటుకలను రూపొందించాలనుకున్నారు. బొగ్గు, బయోగ్యాస్ బూడిద, సిమెంట్, ఇసుక, నీటిని ఉపయోగించి కూల్ బ్రిక్స్ తయారీకి ఉపక్రమించారు డాక్టర్ శశిరాం. చల్లగా ఎందుకంటే.. ఇంటి నిర్మాణంలో ఉపయోగించే ఎరుపు రంగు మట్టి ఇటుకలను బట్టీల్లో వేడి కాలుస్తారు. సిమెంట్ ఇటుకలను హీటింగ్ చేస్తారు. దీంతో ఇటుకలు వేడిని స్వీకరించి వేడిని విడుదల చేస్తాయి. శశిరాం తయారు చేసిన కూల్ బ్రిక్స్ సాంచా(మోల్డింగ్)లో బొగ్గు, బయోగ్యాస్ బూడిద, ఇసుక, సిమెంట్‌ను ఒక మిశ్రమంగా ఏర్పాటు చేసి ఇటుక ఆకారాన్ని తీసుకొస్తారు. వారంపాటు నీటిని ఇటుకలపై చల్ల డం ద్వారా ఇటుకలు గట్టిపడ్తాయి. ఇటుకలను బట్టీల్లో కాల్చని కారణంగా ఇవి పూర్తి చల్లదనాన్ని స్తాయి. మట్టి, సిమెంట్ ఇటుకలు 1.5 మెట్రిక్ కెల్విన్వాట్ ఉష్ణోగ్రతను కలిగి ఉండగా.. కూల్ బ్రిక్స్ కేవలం 0.5 ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి. కూల్బ్రిక్స్ 230 ఎంఎం పొడవు, 100 ఎంఎం వెడల్పు ఉంటాయి. 90 ఎంఎం ఎత్తుతో 3.3 కేజీల బరువుతో ఎరుపు మట్టి, సిమెంట్ ఇటుకకు దీటుగా ధృడంగా ఉంటాయి. నవంబర్‌లో పేటెంట్.. డాక్టర్ శశిరాం 2017లో పీహెచ్డీ పరిశోధనను ప్రారంభించి 2019లో పేటెంట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. భారత ప్రభుత్వం 2021 నవంబర్‌లో పేటెంట్‌ను అందజేసింది. కాగా.. త్వరలోనే ఈ ఇటుకలు అందుబాటులోకి రానున్నాయి. కూల్ ఓరుగల్లు కోసం.. భవిష్యత్‌లో ఓరుగల్లు ఉష్ణోగ్రతకు అనుగుణంగా బిల్డింగ్స్ డిజైన్స్, మోడల్స్ రూపొందిస్తున్నా. కూల్ ఓరుగల్లుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా. – శశిరాం, అసిస్టెంట్ ప్రొఫెసర్, నిట్ కూల్ బ్రిక్స్ తయారు చేస్తున్న శశిరాం -
కోడి ఈకలు.. చేపల పొలుసుతో ఇటుకలు
సాక్షి, అమరావతి: కోడి ఈకలు, చేప పొలుసు వంటి వ్యర్థాలను పర్యావరణ హితంగా మార్చి వివిధ వస్తువుల తయారీకి శ్రీకారం చుట్టింది విజయవాడ విద్యార్థిని మట్ల యశస్వి. ఈ వినూత్న ఆలోచనకు జాతీయ స్థాయిలో ఇన్స్పైర్ అవార్డు వరించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా యశస్వి ఈ అవార్డును అందుకోనుంది. ఈ ప్రాజెక్ట్ అంతర్జాతీయ పోటీలకు సైతం నామినేట్ అయింది. గత ఏడాది పదో తరగతి చదువుతున్నప్పుడు యశస్వి దీనిని రూపొందించింది. ప్రస్తుతం ఆమె ఇంటర్మీడియెట్ ఫస్టియర్ చదువుతోంది. ఇంకా మరెన్నో.. కోడి ఈకలు వాయు కాలుషం నివారణలో ఉపయోగపడతాయని యశస్వి నిరూపించింది. ఈ ఈకలను డిస్క్ మాదిరిగా చేసి ఫ్యాక్టరీ పొగ గొట్టాలు, వాహనాల సైలెన్సర్ల వద్ద ఉంచినప్పుడు కాలుష్యం తగ్గింది. అంతేకాకుండా కోడి ఈకలు, చేప పొలుసు, నీరు, గ్లిసరిన్ కలిసి వేడి చేస్తే బయో ప్లాస్టిక్ తయారవుతోంది. ఇది సులభంగా మట్టిలో కలిసిపోయి ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది. చేప పొలుసును నీటితో కలిపి వేడి చేస్తే ఫిష్ జెల్ తయారవుతోంది. దీనిని ఐరన్ రాడ్లకు పూస్తే తుప్పు పట్టకుండా నివారిస్తోంది. మోకాళ్ల నొప్పులకు సంబంధించి కార్టిలేజ్ ట్రీట్మెంట్లో చేపల పొలుసులు ఉపయోగపడనున్నాయి. ఇందులో కొలాజిన్ అనే పదార్థం ఉండటం వల్ల ఈ జెల్‌ను ఉపయోగిస్తే నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. పెయింట్ వేసేటప్పుడు ఈ జెల్‌ను కలిపి వాడితే గోడలకు చెమ్మ రాకుండా, పెచ్చులూడకుండా నివారించవచ్చు. ఏపీసీవోఎస్టీ అవార్డులు అందుకుంటున్న యశస్వి ఇన్స్పైర్ అవార్డుకు ఎంపికైంది ఇలా జాతీయ ఇన్స్పైర్ అవార్డు కోసం దేశం నలుమూలల నుంచి మొత్తం 581 మంది ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. ఇందులో యశస్వి రూపొందించిన ప్రాజెక్ట్ కూడా ఉంది. కరోనా నేపథ్యంలో జాతీయస్థాయి ఎంపికలు ఈ నెల 4నుంచి 8 వరకు వర్చువల్ విధానంలో జరిగాయి. ఇందులో యశస్వి ప్రాజెక్ట్ అవార్డుకు ఎంపికైంది. ప్రాజెక్టుపై జిల్లా కలెక్టర్ జె.నివాస్‌కు వివరిస్తున్న యశస్వి తయారీ ఇలా.. కోడి ఈకలలోని కొలాజిన్, చేపల పొలుసులోని కెరోటిన్లతో పర్యావరణ హితమై భూమిలో కలిసిపోయే బయో ప్లాస్టిక్, తేలికపాటి సిమెంట్ ఇటుకలు, బయో ఎరువులు, పెయింట్ల వినియోగంలో పెచ్చులూడి పోకుండా చేయడం, వాహనాల ద్వారా వచ్చే వాయు కాలుష్యాన్ని తగ్గించడం, కొలాజిన్ వినియోగంతో ఐరన్ తుప్పు పట్టే గుణం తగ్గడం, కార్టిలేజ్ ట్రీట్మెంట్ వంటి వాటిపై పరిశోధనలు చేసిన యశస్వి వాటిని శాస్త్రీయంగా నిరూపించింది. కోడి ఈకలు, చేప పొలుసును సిమెంట్, ఇసుక, నీటితో కలిపి తేలికగా ఉండే సిమెంట్ ఇటుకలను తయారు చేసింది. ఈ ఇటుకలను ల్యాబ్‌లో పరిశీలించగా బలంగానే ఉన్నాయని నిరూపణ అయ్యింది. యశస్విని సత్కరిస్తున్న జిల్లా కలెక్టర్ జె.నివాస్ ప్రోత్సాహం మరువలేనిది కోడి ఈకలు, చేప పొలుసు కాలువల్లో నీటికి అడ్డుపడటంతోపాటు, పర్యావరణానికి హాని కలిగించటం గమనించా. వీటితో పర్యావరణ హితమైన వస్తువులను తయారు చేయాలనిపించింది. ఇందుకు మా గైడ్, సైన్స్ టీచర్ హేమంత్‌కుమార్, ప్రిన్సిపల్ రామభారతి ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. మా అమ్మ, నాన్న శ్రీలక్ష్మి, దేవరామరాజు మొదటి నుంచీ పరిశోధనలపై ఆసక్తి చూపేలా చేశారు. ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. – యశస్వి, ఇన్స్పైర్ అవార్డు గ్రహీత -
మఠంలో రహస్య గది: బయటపడ్డ వెండి ఇటుకలు
సాక్షి, భువనేశ్వర్/పూరీ: పూరీలోని ఎమ్మార్ మఠం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. సుమారు 11 ఏళ్ల తర్వాత ఈ మఠంలో అత్యంత అమూల్యమైన ప్రాచీన సొత్తు నిక్షిప్తంగా ఉందనే నమ్మకం సర్వత్రా బలపడింది. ఈ మఠానికి గతంలో ఉన్న మహంత ఆధిపత్యం రద్దు చేసి ట్రస్టు బోర్డు ఏర్పాటు చేశారు. ఈ బోర్డు బాధ్యతల స్వీకరణ పురస్కరించుకుని మఠంలో వెలుగు చూస్తున్న సొత్తుపట్ల అంతా అవాక్కవుతున్నారు. అయితే ఈ సొత్తు లోగడ ఖరారు చేసిన జాబితాలో ఉన్నదీ లేనిదీ స్పష్టం కావలసి ఉంది. ట్రస్టు బాధ్యతల స్వీకరణలో భాగంగా శనివారం మఠం 4వ నంబరు గది తెరవడంతో ప్రాచీన కాంస్య ఆవు, దూడ విగ్రహం బయటపడింది. దీంతో పాటు 16 పురాతన కత్తులు, వెండి ఇటుకలు, ఆభరణాలు, వంటపాత్రలు బయటపడ్డాయి. ఆవు దూడ కాంస్య విగ్రహం ఝులన్ జాతర (డోలోత్సవం)లో వినియోగించి ఉంటారని భావిస్తున్నారు. ట్రస్టుకు బాధ్యతలు ఎమ్మార్ మఠం బాధ్యతలు ట్రస్టు బోర్డుకు అప్పగించారు. ఉత్తర పార్శ్వ మఠం మహంత నారాయణ రామానుజ దాస్, జగన్నాథ సంస్కృతి ప్రచారకులు నరేష్ చంద్ర దాస్, సంఘసేవకులు ప్రతిమ మిశ్రా, ప్రముఖ న్యాయవాది బొనొ బిహారి నాయక్, సిటీ డీఎస్పీతో కొత్త ట్రస్టు బోర్డు ఏర్పాటైంది. ఈ బోర్డు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మఠంలో ఒక్కో గది తెరిచి చూడబోతే అమూల్యమైన సంపద, సొత్తు బయటపడుతోంది. ఇంతకు ముందు 2011వ సంవత్సరంలో 522 వెండి ఇటుకలు వెలుగు చూసిన సంఘటన తీవ్ర సంచలనం రేపింది. అది మొదలుకొని మఠంలో అత్యంత అమూల్యమైన రత్నవైడూర్యాలు వగైరా నిక్షిప్త నిధి ఉండి ఉంటుందనే ఊహాగానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రాచీన మఠంగా గుర్తింపు శ్రీ మందిరం పరిసరాల్లో అత్యంత పురాతనమైనదిగా ఎమ్మార్ మఠం పేరొందింది. 12వ శతాబ్దంలో సంత్ రామానుజాచార్య ఆగమనం పురస్కరించుకుని ఎమ్మార్ మఠం నిర్మితమైనట్లు పరిశోధకుల అంచనా. జగన్నాథుని సంస్కృతి సంప్రదాయాలు, నైవేద్యాలు, ప్రసాదాల పరంపరతో ముడిపడిన మఠంగా ప్రాచుర్యం సంతరించుకుంది. శ్రీ మందిరం నలు వైపుల ఆధునికీకరణ పురస్కరించుకుని ఈ మఠం తొలగించేందుకు పూరీ జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. 2019వ సంవత్సరంలో ఈ పనులకు శ్రీకారం చుట్టారు. ప్రాథమిక తొలగింపు పనుల్లో రహస్య గదుల ఆనవాళ్లు బయటపడ్డాయి. ఈ గదుల్లో గుప్తనిధి ఉండవచ్చన్న అనుమానాలు బలపడ్డాయి. 1866వ సంవత్సరంలో సంభవించిన కరువు కాటకాల సమయంలో ఈ మఠం ప్రజలకు భోజనాదులు అందజేసి అక్కున చేర్చుకున్నట్లు తెలుస్తోంది. అలాగే వందలాది సంవత్సరాలు ఈ మఠం ఎందరో సాధుసంతువులు, భక్తులు, బీదాబిక్కి ప్రజలకు నిరవధికంగా అన్న సంతర్పణ చేసినట్లు పరిశోధకులు భావిస్తున్నారు. మెజిస్ట్రేట్ సమక్షంలో గాలింపు మెజిస్ట్రేట్, పోలీసుల సమక్షంలో ట్రస్టు బోర్డు సభ్యులు ఈ గాలింపు చర్యలు చేపడుతున్నారు. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టరు, ట్రస్టు సభ్యుల సమక్షంలో ఎమ్మార్ మఠం సొత్తు జాబితా తయారవుతోంది. ఇప్పటి వరకు 3 గదులు తెరిచి గాలింపు ముగించారు. మరో 50 పైబడి ఇటువంటి గదులు ఉన్నట్లు భావిస్తున్నారు. శనివారం నిర్వహించిన గాలింపులో తొలుత 8, తదుపరి 37 వెండి ఇటుకలు బయటపడినట్లు అనధికారిక సమాచారం. కాంట్రాక్టర్ చేతివాటం మఠంలోని 2 గదుల మరమ్మతు కోసం 2011లో పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో చెక్కపెట్టెల్లో 522 వెండి ఇటుకలు లభించాయి. మరమ్మతు పనులు చేపట్టిన కాంట్రాక్టర్ ఈ సొత్తును దొంగతనంగా కటక్ నగరంలో విక్రయించడంతో ఢెంకనాల్‌కు తరలిపోయింది. ఈ సంఘటన అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది. ఢెంకనాల్‌కు చెందిన ఒక వ్యక్తి నుంచి పూరీ సింహద్వారం స్టేషన్ పోలీసులు ఈ వెండి ఇటుకల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మఠం నిర్వాహకుడు మహంత రాజగోపాల్‌తో పాటు ఆయన అనుచరుల్ని పోలీసులు అరెస్టు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు వెండి ఇటుకలను జిల్లా పోలీసు ఆయుధాగారంలో భద్రపరిచారు. చదవండి: జనగామ: బయటపడ్డ లంకె బిందె.. బంగారం, వెండి లభ్యం! -
మూన్ బ్రిక్స్, ఇవి చాలా చీపండోయ్..
మనిషి ఆశాజీవి. ఉన్నచోట ఉండకుండా కొత్త ప్రదేశాలకు తరలిపోవడం మానవనైజం. ఇదే చరిత్రలో ఖండాల అన్వేషణకు అనంతరం అంతరిక్ష యానానికి కారణమైంది. కానీ వెళ్లిన ప్రతిచోట మనిషి నివాసమేర్పరుచుకోవడం కుదిరేపనేనా? అంటే భూమిపైన కుదిరే పనే కానీ అంతరిక్షం లో కుదరదనే చెప్పాలి. భూమిపై ఎక్కడైనా ఇటుకలు, రాళ్లు, మట్టి, సిమెంటు, సున్నం, గడ్డి, వెదురు ఇలా ఏదో ఒక గహనిర్మాణ అవసర వస్తు లభ్యత ఉంటుంది. కాబట్టి కొత్త ఖండాలు కనుగొన్నా నివాసయోగ్యంగా మార్చుకోవడానికి మనిషికి పెద్దగా శ్రమ కలగలేదు. కానీ అంతరిక్షంలో అలా కుదరదు. వెళ్లిన ప్రతిగ్రహంలో పైన చెప్పిన వస్తు లభ్యత ఉండక పోవచ్చు. అంతెందుకు ఉదాహరణకు చంద్రుడిపై భవిష్యత్ లో కట్టడాలు కట్టాలంటే భూమిపై నుంచి ఇటుకలు మోసుకుపోవాలి, లేదంటే చంద్రుడిపై బట్టీ పెట్టాలి. కానీ ఈ రెండిటితో పనిలేకుండా చంద్రుడిపై మట్టిని బ్యాక్టీరియాతో కలిపి ఇండియన్ సైంటిస్టులు మూన్ బ్రిక్స్‌ను తయారు చేస్తున్నారు. వీటితో ఎంతటి భారీ కట్టడాలనైనా చంద్రుడిపై అవలీలగా కట్టవచ్చట! ఇస్రో, ఐఐఎస్ కలిసి ఈ మూన్ బ్రిక్స్ రూపకల్పన చేశాయి. కొంత చంద్ర మత్తిక, కొన్ని బ్యాక్టీరియా, కొన్ని బీన్స్గింజలను ఉపయోగించి ఎంతటి బరువునైనా తట్టుకునే ఇటుకల్లాంటి స్ట్రక్చర్లను తయారు చేసినట్లు బెంగళూరు ఐఐఎస్ తెలిపింది. బయాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్ కలబోతతో ఈ కొత్త స్ట్రక్చర్లను ఉత్పత్తి చేశారు. చాలా చీప్ భూమిపై వనరులు తరిగే కొద్దీ ఇతర గ్రహాలపై ఆవాసానికి మానవుడి ఆతత అధికమవుతోంది. అయితే మనిషి ఆతతకు తగ్గట్లు ఇతర గ్రహాలపై నిర్మాణాలు చేపట్టడం అంత సులభం కాదు. అంతరిక్షంలోకి ఒక పౌండు వస్తువును పంపేందుకు రూ.7.5 లక్షలు ఖర్చవుతుంది. ఈలెక్కన నిర్మాణ సామాగ్రిని పంపాలంటే ఖర్చు లెక్కించలేం! అందుకే ఈ సమస్యకు పరిష్కారంగా మూన్బ్రిక్స్ రూపకల్పన చేశారు. చంద్రుడిపైకి వెళ్లాక అక్కడి మట్టినే ఉపయోగించి తక్కువ శ్రమతో ఇటుకలు తయారు చేయవచ్చని ఇస్రో బృందం తెలిపింది. ప్రయోగంలో తొలుత లూనార్ సాయిల్‌ను స్పోరోసార్సినా పాశ్చురై అనే బ్యాక్టీరియాతో కలిపారు. ఈ బ్యాక్టీరియా కాల్షియం కార్బొనేట్ స్ఫటికాలు తయారు చేస్తుంది. ఇందుకోసం యూరియా, కాల్షియం అవసర పడతాయి. ఇవి రెండూ మనిషి విసర్జకాల్లో లభిస్తాయి. అనంతరం ఈ మిశ్రమానికి బీన్స్ జిగురు కలిపారు. ఈ జిగురు సిమెంట్‌లాగా పనిచేస్తుంది. కొన్ని రోజుల ఇంక్యుబేషన్ అనంతరం వచ్చిన ఉత్పత్తి అత్యంత ధఢంగా ఉందని సైంటిస్టులు చెప్పారు. దీన్ని కావాల్సిన అచ్చుల్లో పోసి కావాల్సిన రూపంలో ఇటుకలు తయారు చేసుకోవచ్చన్నారు. పాశ్చురై బ్యాక్టీరియా ఖరీదైనది కాబట్టి దీనిస్థానంలో బాసిల్లస్ వెలెజెన్సిస్ అనే మరో బ్యాక్టీరియాను వాడి మంచి ఫలితాలే పొందామని తెలిపారు. ప్రస్తుతానికి చిన్న అచ్చుల్లో ఇటుకల తయారీ జరిగిందని, ఇకపై ప్రయోగాల్లో భారీస్థాయి ఉత్పత్తికి యత్నిస్తామని చెప్పారు. చంద్రుడిపై వచ్చే చంద్రకంపాలను సైతం ఇవి తట్టుకుంటాయని బల్లగుద్ది చెబుతున్నారు. ఆల్ ద బెస్ట్! -
చంద్రునిపై ఇల్లు: మూత్రంతో ఇటుకలు!
సాక్షి, న్యూఢిల్లీ: చిన్నప్పుడు మనం చంద్రున్ని చూస్తూ చందమామ రావే, జాబిల్లి రావే అంటూ గోరు ముద్దలు తింటుంటాం. అయితే రాబోయే రోజుల్లో నిజంగానే చంద్రునిపై జీవించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రునిపై నిర్మాణాలను చేపట్టడానికి వీలుగా ఉండే ఇటుకలను ఇస్రో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగుళూరు సంయుక్తంగా తయారు చేశాయి. ఈ ఇటుకల తయారీలో చంద్రుని మీద నుంచి తెచ్చిన మట్టి, కొన్ని రకాల బ్యాక్టీరియాలు, చిక్కుడు కాయల గుజ్జు ఉపయోగిస్తున్నారు. ఇందులో ఉన్న బ్యాక్టీరియా జీవక్రియలో భాగంగా ఇటుకకు ఎక్కువ మన్నిక లభించేలా చేసే కొన్ని పదార్ధాలను విడుదల చేస్తాయి. ఇవి యూరియాతో చర్యలు జరిపి కాల్షియం కార్భైడ్ లాంటి పదార్ధాల తయారిలో ఉపయోగపడతాయి. అందుకే ఈ ఇటుకల తయారీలో మూత్రం ద్వారా తయారయ్యే యూరియాను కూడా ఉపయోగిస్తారు. (కరోనా వాక్సిన్ : ప్రధాని మోదీ గుడ్ న్యూస్) అంతరిక్ష పరిశోధనలు గత శతాబ్ధ కాలంలో విపరీతంగా పెరిగాయి. అక్కడ నిర్మాణాలు చేపట్టాలని ఇప్పటికే చాలా ప్రయోగాలు చేశారు. వీటిలో ఒక పౌండ్ ఇటుకలను స్పేస్‌కు చేర్చడానికి రూ. 7.5 లక్షల ఖర్చు అవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఖర్చు కాల క్రమేణా తగ్గుతుందని తెలిపారు. సాధారణంగా ఇటుకలను ఒకదానికి ఒకటి జత చేయడానికి సిమెంట్‌ను ఉపయోగిస్తారు. కానీ ఈ ఇటుకలను కలపడానికి చిక్కుడు కాయల గుజ్జును ఉపయోగిస్తున్నారు. ఇది ఇటుకలను మరింత గట్టిగా పట్టి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటి నిర్మాణంలో కెమికల్, మెకానికల్ ఇంజనీరింగ్ రెండు కలగలిపి ఉన్నాయని ఐఐఎస్సీ, బెంగుళూరు అసిస్టెంట్ ప్రొఫెసర్ అలోక్ తెలిపారు. ఇస్రోతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. దీంతో త్వరలోనే చంద్రునిపై చేపట్టనున్న నిర్మాణాలలో ఇండియా ప్రముఖ పాత్ర వహించనున్నట్లు అర్థం చేసుకోవచ్చు. చదవండి: చైనా వస్తువులను పూర్తిగా నిషేధించాలి: మోదీ -
భూమి పూజకు 40 కిలోల వెండి ఇటుక
న్యూఢిల్లీ/ముంబై : బృహత్తర రామాలయ నిర్మాణ పనుల ప్రారంభానికి అయోధ్యాపురిలో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆగస్టు 5వ తేదీన జరిగే ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు మహారాష్ట్ర, బిహార్ ముఖ్యమంత్రులు ఉద్ధవ్ ఠాక్రే, నితీశ్ కుమార్ తదితర 50 మందిని ఆహ్వానించినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు వివరించింది. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రముఖుల్లో బీజేపీ కురువృద్ధ నేతలు అడ్వాణీ, ఎంఎంజోషీలూ ఉన్నారని తెలిపింది. భూమి పూజలో భాగంగా 40 కిలోల బరువైన వెండి ఇటుకను మోదీ పవిత్ర స్థలంలో ఉంచుతారని ఆలయ ట్రస్టు అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్ తెలిపారు. ‘ప్రధాన భూమిపూజ కార్యక్రమానికి మూడు రోజులు ముందుగా ఆగస్టు 3వ తేదీ నుంచే వేదోక్తంగా కార్యక్రమాలు మొదలవుతాయి. 4న రామాచార్య పూజ, ఆగస్టు 5వ తేదీ మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రధానమైన భూమిపూజకు ముహూర్తం ఖరారైంది. కోవిడ్–19 కారణంగా ఆహ్వానితులు భౌతిక దూరం పాటించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తులు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు వీలుగా అయోధ్యలో పెద్ద సంఖ్యలో భారీ స్క్రీన్ల టీవీలను ఏర్పాటు చేస్తారు’అని వివరించారు. రామాలయ ఉద్యమంతో సంబంధమున్న బీజేపీ నేతలుసహా కేంద్ర మంత్రులు పాల్గొంటారని చెప్పారు. -
ప్లాస్టిక్‌ను ఇలా కూడా వాడొచ్చు..
సాక్షి, అమరావతి : మానవాళి మనుగడకే పెను సవాల్ విసురుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలన పెద్ద సమస్యగా పరిణమించిన తరుణంలో వాటితో ఇటుకలు తయారు చేసి, నిర్మాణాల్లో ఉపయోగించ వచ్చనే విషయం పర్యావరణ పరిరక్షణ పరంగా ఊరట కలిగిస్తోంది. మట్టి, బూడిద (ఫ్లైయాష్).. సిమెంట్, ఇసుక మిశ్రమంతో తయారైన ఇటుకలతో నిర్మించే కట్టడాల కంటే ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారయ్యే ఇటుకలే పది కాలాలపాటు చెక్కు చెదరకుండా బలంగా ఉంటాయంటున్నారు ఇంజనీరింగ్ నిపుణులు, పరిశోధకులు. ప్లాస్టిక్ ఇటుకలతో నిర్మించే కట్టడాలకు నీటిని పీల్చుకునే స్వభావం చాలా తక్కువగా ఉంటుందని.. ఉష్ణోగ్రత, శబ్దాలను నియంత్రిస్తాయని శాస్త్రీయంగా నిరూపితమైంది. ఈ ఇటుకల ఉత్పత్తి వ్యయం కూడా తక్కువే. ఈ దృష్ట్యా కొంత కాలంగా పలు దేశాల్లో ప్లాస్టిక్‌తోనూ ఇటుకలు తయారు చేస్తున్నారు. ప్లాస్టిక్ వస్తువులు భూమిలో కలిసిపోవడానికి కనీసం 500 ఏళ్లు పడుతుంది. ప్రపంచంలో ప్లాస్టిక్ వినియోగం నానాటికీ పెరిగిపోతుండటం, ఆ వ్యర్థాల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గాలి, ఉపరితల, భూగర్భ జలాలు, భూమి, ఆకాశం కలుషితం అవుతున్నాయి. దీని వల్ల ఏటా కోట్లాది పక్షులు, జంతువులు, చేపలు మృత్యువాత పడుతున్నాయి. ఉభయతారకంగా వ్యర్థాల నిర్మూలన ప్రపంచంలో ప్లాస్టిక్ వినియోగంలో యూరోపియన్ దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో చైనా, అమెరికా, భారతదేశం ఉన్నాయి. ఏడాదికి సగటున ఒక యూరోపియన్ పౌరుడు 36 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలను బయట పడేస్తున్నాడు. తలసరి ప్లాస్టిక్ వ్యర్థాల పరిమాణం చైనాలో 28 కేజీలు, అమెరికాలో 24 కేజీలు, మన దేశంలో 11 కేజీల వరకు ఉంటుందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) అంచనా వేసింది. ఈ లెక్కన ఏడాదికి 26 వేల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు దేశంలో పోగుపడుతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో గాలి, నీరు, భూ కాలుష్యానికి దారితీస్తోంది. వీటి నిర్మూలనకు తొలుత అర్జెంటీనా విస్తృత పరిశోధనలు చేసింది. ఇటుకల తయారీలో ప్లాస్టిక్‌ను వినియోగించి.. మట్టి, ఫ్లైయాష్, సిమెంట్ ఇటుకల కంటే ఐదు శాతం పటిష్టంగా ఉంటాయని తేల్చింది. నీటిని పీల్చుకునే స్వభావం చాలా తక్కువగా ఉంటుందని వెల్లడించింది. ఉష్ణోగ్రత, శబ్ద తరంగాలను నిరోధించే స్వభావం ఉంటుందని స్పష్టం చేసింది. ఈ దృష్ట్యా ప్లాస్టిక్ ఇటుకలతో నిర్మించిన కట్టడాల మన్నిక అధికంగా ఉంటుంది. వీటి ఉత్పత్తి వ్యయం కూడా తక్కువ. దీంతో అర్జెంటీనాలో తొలిసారిగా భారీగా ప్లాస్టిక్ ఇటుకల తయారీ, వినియోగం మొదలైంది. ఆ తర్వాత యూరోపియన్.. అమెరికా, చైనా తదితర దేశాల్లోనూ ప్లాస్టిక్ ఇటుకల వినియోగం పెరిగింది. ఇటుకల తయారీ ఇలా.. ప్లాస్టిక్ వ్యర్థాలైన బాటిళ్లు, కవర్లను ఒక పెద్ద బాయిలర్‌లో వేసి 105 నుంచి 110 డిగ్రీల వరకు వేడి చేసి, ద్రవరూపంలోకి మారుస్తారు. ఈ ద్రావకాన్ని గది ఉష్ణోగ్రత వద్ద అంటే 27 డిగ్రీలకు వచ్చేలా చల్చార్చుతారు. ఒక శాతం ప్లాస్టిక్ ద్రావకానికి మూడు, నాలుగు లేదా ఐదు శాతం మట్టి లేదా ఫ్లైయాష్ (బూడిద) లేదా సిమెంట్‌ను చేర్చి మిశ్రమంగా మారుస్తారు. ఇటుక కావాల్సిన పరిమాణంలో రూపొందించిన దిమ్మల్లో ఆ మిశ్రమాన్ని పోసి ఇటుకలు తయారు చేస్తారు. వారం రోజులపాటు ఈ ఇటుకలపై నీటిని చల్లాక (క్యూరింగ్) నిర్మాణాల్లో వినియోగిస్తారు. దేశంలో కొచ్చిలో శ్రీకారం కేరళలోని కొచ్చిలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలనకు ఇంజనీరింగ్ విద్యార్థులు నడుంబిగించారు. 500 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను సమీకరించి.. 2,500 టన్నుల పరిమాణంలో ఇటుకలను తయారు చేసి, భవన నిర్మాణాల్లో వినియోగించేలా ప్రజలను చైతన్యవంతం చేశారు. ఒక టన్ను ప్లాస్టిక్ వ్యర్థాలను అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తే 800 కేజీల ప్లాస్టిక్ ద్రావకం వస్తుంది. ఒక శాతం ప్లాస్టిక్ ద్రావకానికి మూడు శాతం మట్టిని కలిపి తయారు చేసిన ఇటుక కంటే.. ఒక శాతం ప్లాస్టిక్ ద్రావకానికి నాలుగు శాతం మట్టిని కలిపి తయారు చేసిన ఇటుకలు బలంగా ఉంటాయని తేలింది. దేశంలోని నగరాలు, పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ప్లాస్టిక్ వ్యర్థాలు భారీ ఎత్తున పేరుకుపోయి, పర్యావరణానికి పెను సవాల్ విసురుతున్న తరుణంలో ప్లాస్టిక్ ఇటుకల తయారీ, వినియోగంపై ప్రజల్లో అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. ప్లాస్టిక్ ఇటుకల తయారీ, వినియోగాన్ని ప్రోత్సహించాలి ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇటుకల తయారీ పర్యావరణహితమైనది. భారీగా పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను సరైనరీతిలో రీసైక్లింగ్ చేసి, ప్రత్యామ్నాయ అవసరాలకు సద్వినియోగం చేసుకోవచ్చు. ఇతర ఇటుకలతో పోలిస్తే వీటి తయారీ వ్యయం, బరువు తక్కువ. నాణ్యత ఎక్కువ. మట్టి, ఫ్లైయాష్ ఇటుకల కంటే ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారయ్యే ఇటుకలు నిర్మాణ రంగంలో మరింత అనువుగా ఉంటాయి. వీటిని భిన్న ఆకృతుల్లో తయారు చేసి అలంకృతంగా కూడా ఉపయోగించుకోవచ్చు. ప్లాస్టిక్ ఇటుకల తయారీతో పాటు నిర్మాణ రంగంలో వీటి వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. – ఎస్పీ అంచూరి, ఆర్కిటెక్ట్, స్ట్రక్చరల్ ఇంజనీర్, హైదరాబాద్ -
వ్యవసాయ వ్యర్థాలతో బయో బ్రిక్స్
సాక్షి, సంగారెడ్డి: వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన పరిశోధకులు బయో ఇటుకలు తయారు చేశారు. ఇవి పర్యావరణహితంగా, తక్కువ ఖర్చులో ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. ఐఐటీ హైదరాబాద్ డిజైన్ డిపార్ట్మెంట్ పీహెచ్డీ స్కాలర్ ఆర్.ప్రియాబ్రతా రౌత్రే, కేఐఐటీ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ భువనేశ్వర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆర్.అవిక్‌రాయ్ బృందం బయో ఇటుకల తయారీపై పరిశోధనలు చేసింది. ఐఐటీ డిజైన్ విభాగం హెడ్ ప్రొఫెసర్ దీపక్ జాన్ మాథ్యూ, అ్రస్టేలియా స్విన్‌బర్న్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ బోరిస్ ఐసెన్‌బార్ట్ మార్గ నిర్దేశకంలో ఈ పరిశోధన ఫలితాలను అంతర్జాతీయ సదస్సులో నెదర్లాండ్‌లోని టీయూ డేల్ప్ వద్ద (ఐసీఈడీ–1019) ప్రదర్శించారు. వ్యవసాయ వ్యర్థాల నుంచి బయో ఇటుకలను అభివృద్ధి చేసే ప్రయోగం గత కొంతకాలంగా జరుగుతోందని ఆర్.ప్రియాబ్రతా రౌత్రే చెప్పారు. మట్టితో తయారుచేసే ఇటుకలను కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యం జరుగుతుందని వివరించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి బయో ఇటుకల తయారీకి 1990లో ప్రయోగాలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. భారత్‌లో ఏటా 500 మిలియన్ టన్నులకు పైగా వ్యవసాయ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని ప్రియాబ్రతా తెలిపారు. ఈ వ్యర్థాల్లో కొంత పశుగ్రాసంగా వాడుతున్నారని, దాదాపు 84 నుంచి 141 మిలియన్ టన్ను లు బుడిద అవుతోందని, దీంతో తీవ్ర వాయు కాలుష్యం ఏర్పడుతోందని వివరించారు. ప్రొఫెసర్ అవిక్‌రాయ్ మాట్లాడుతూ.. బయో ఇటుకలు మట్టి ఇటుకల కన్నా ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయని చెప్పారు. కాలిన మట్టి ఇటుకల్లా ఇవి బలంగా ఉండకపోయినా బరువు మోసే నిర్మాణాలకు ఉపయోగించలేమని తెలిపారు. చెక్క లేదా లోహ నిర్మాణాల్లో వాడితే తక్కువ ఖర్చుతో గృహాలు నిర్మించుకోవచ్చని పేర్కొన్నారు. భవనాల్లో తేమను నిరోధిస్తాయని చెప్పారు. మరింత మెరుగైన వాటిని తయారు చేసేందుకు ఇంకా పరిశోధనలు చేస్తామని, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్ ఇటీవల నిర్వహించిన గ్రామీణ ఇన్నొవేటర్స్ స్టార్ట్ ఆఫ్ కాన్క్లేవ్లో స్థిరమైన హౌజింగ్ కోసం ఈ బయో బ్రిక్ ప్రత్యేక గుర్తింపు ట్రోఫీని అందుకుందని చెప్పారు. ‘వరి వ్యర్థాలు, గోధుమ వ్యర్థాలు (గడ్డి తదితరాలు), చెరుకు పిప్పి, కాటన్ ప్లాంట్ వంటి పొడి వ్యర్థాలను ఉపయోగించి తయారు చేస్తాం. చెరుకు భాగస్సే (పిప్పి), సున్నం ఆధారిత ముద్ద తయారు చేయడం ఇటుక తయారీలో తొలి ప్రక్రియ. ఈ మిశ్రమాన్ని అచ్చులో పోసి, ఒకట్రెండు రోజులు ఆరబెట్టి, ఆ తర్వాత ఇటుకలను 15 నుంచి 20 రోజులు ఆరబెట్టాలి. ఆ తర్వాత వీటిని వినియోగించడానికి నెల రోజులు పడుతుంది.’ – ప్రియాబ్రతా రౌత్రే -
దిగొస్తున్న సిమెంట్ ధరలు..
సాక్షి, అమరావతి : చాన్నాళ్లుగా కొండెక్కి కూర్చున్న సిమెంట్, ఐరన్ ధరలు ఇప్పుడు దిగి వస్తున్నాయి. మధ్యతరగతి, నిర్మాణ రంగాల వారికి ఊరటనిచ్చేలా అందుబాటులోకి వస్తున్నాయి. కొన్నాళ్లుగా ఇవి పెరగడమే తప్పా తగ్గడం లేదు. దీంతో సొంతంగా ఇళ్లు, భవనాల నిర్మాణం చేపట్టే వారితో పాటు నిర్మాణరంగంలో ఉన్న వారికి వీటి ధరలు పెనుభారంగా పరిణమించాయి. ఫలితంగా నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతూ వచ్చింది. విజయవాడలో దాదాపు ఐదారు నెలల నుంచి 50 కిలోల సిమెంట్ బస్తా ధర రూ.350–380ల మధ్య ఉంది. ఇప్పుడది రూ.80 నుంచి 100 వరకు తగ్గింది. బెజవాడ మార్కెట్లో 20కి పైగా కంపెనీలు సిమెంట్ విక్రయాలు జరుపుతున్నాయి. ఒక్కో కంపెనీ మధ్య సిమెంట్ గ్రేడ్‌ను బట్టి బస్తాకు 20–80 వరకు వ్యత్యాసం ఉంటుంది. వారం పది రోజుల నుంచి సిమెంట్ ధరలు తగ్గుముఖం పట్టడం ప్రారంభమయ్యాయి. నెల రోజుల క్రితం వరకు కూడా 50 కిలోల బస్తా ధర రూ.350– 370 మధ్య ఉన్న సిమెంట్ ఇప్పుడు రూ.260–280కు దిగివచ్చింది. అదే సమయంలో ఇనుము «(ఐరన్) ధర కూడా బాగా తగ్గుముఖం పట్టింది. జాతీయ స్థాయిలో ఆర్థికమాంద్యం ప్రభావంతో టన్ను ఇనుము ధర రూ.10 నుంచి 12 వేల వరకు తగ్గింది. రెండు మూడు నెలల క్రితం ఐరన్ టన్ను రూ.50–52 వేల వరకు ఉండేది. కొద్ది రోజుల నుంచి తగ్గుతూ వచ్చి ఇప్పుడు సగటున రూ.38–40 వేల మధ్య లభ్యమవుతోంది. సిమెంట్, స్టీల్ ధరలు గణనీయంగా దిగివస్తున్న నేపథ్యంలో ఆ రంగంలో ఉన్న వర్తకులు సాధ్యమైనంత మేర నిల్వ ఉంచుకోవాలన్న ఆలోచన చేస్తున్నారు. కొన్నాళ్ల తర్వాత నిర్మాణరంగం మరింత ఊపందుకుంటే లాభపడవచ్చని వీరు యోచిస్తున్నారు. రాష్ట్రంలో నెలకు సగటున ఐరన్ 10 నుంచి 15 మిలియన్ టన్నులు, సిమెంట్ 15–20 మిలియన్ టన్నుల వినియోగం జరుగుతోంది. ఇటుక ధరలూ సరళం.. మరోవైపు సిమెంట్, ఇనుము ధరలతో పాటు ఇటుక ధరలు కూడా దిగివస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం వరకు వెయ్యి ఇటుకలు రూ.7 వేలకు విక్రయించే వారు. ఇప్పుడు రూ.5000–5,500కు లభ్యమవుతున్నాయి. ఈ లెక్కన వెయ్యి ఇటుకల వద్ద రూ.1,500–2000 వరకు తగ్గుముఖం పట్టినట్టయింది. త్వరలో ఇసుక కూడా అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఇలా నిర్మాణ రంగానికి అవసరమైన వీటి ధరలు ఒక్కొక్కటిగా తగ్గుతుండడం నిర్మాణ రంగం వారికి ఊరటనిస్తోంది. ప్రభుత్వం కొత్త విధానం ద్వారా ఇసుకను అందుబాటులోకి తీసుకొస్తే నిర్మాణ రంగం మళ్లీ ఊపందుకుంటుందని ‘క్రెడాయ్’ విజయవాడ చాంబర్ అధ్యక్షుడు సీహెచ్ సుధాకర్ ‘సాక్షి’కి చెప్పారు. -
ఇటుకలతో ఉపాధి
సాక్షి, నాగర్‌కర్నూల్ : నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంగా మారాక ఇక్కడ బహుళ అంతస్తుల నిర్మాణాలు చురుకుగా సాగుతున్నాయి. ఇంటి నిర్మాణాలకు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు ఎక్కువ కాలం మన్నిక ఉండేందుకు ఇటుకలకే మొగ్గు చూపుతారు. దీంతో ఇటుకలకు విపరీతమైన గిరాకీ పెరిగింది. మండల వ్యాప్తంగా ఎంతోమంది యువకులు ఇటుక బట్టీలలో నిమగ్నమై వారి కుటుంబాలను పోషించుకోవడంతో పాటు కూలీలకు పని కల్పిస్తూ ఉపాధిని చూపుతున్నారు. మండలంలోని నాగర్‌కర్నూల్ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు తూడుకుర్తి, బొందలపల్లి, శ్రీపూర్, దేశియిటిక్యాల, వనపట్ల తదితర గ్రామాలలో ఇటుక బట్టీలు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం వ్యవసాయ పనులు పూర్తి కావడంతో కూలీలు ఇటుక బట్టీల వైపు అడుగులు వేస్తూ ఉపాధిని పొందుతున్నారు. ఒక ట్రాక్టర్ ఇటుకను దాదాపు రూ.10 వేల నుంచి 15వేల వరకు కొనుగోలు చేస్తున్నారు. అందులో రకరకాల ఇటుకలను తయారు చేస్తూ వాటిని సకాలంలో భవన నిర్మాణ రంగానికి అందిస్తూ యువత ఉపాధి పొందుతున్నారు. భూములు లీజుకు తీసుకుని.. మండలంలోని శ్రీపురం, నెల్లికొండ, దేశియిటిక్యాల, తిరుమలాపూర్ తదితర ప్రాంతాలలో ఇటుక బట్టీ నిర్వాహకులు భూములను లీజుకు తీసుకుని అందుకు కావాల్సిన మట్టితో పాటు ఇటుకలను కాల్చేందుకు బొగ్గు, వంట చెరుకును సమీకరిస్తూ ఇటుక బట్టీలను ఏర్పాటు చేసుకుంటున్నారు. కూలీలకు వెయ్యి ఇటుకలు కోసేందుకు దాదాపుగా 750 నుంచి 1500 దాకా చెల్లిస్తున్నారు. ఇద్దరు కూలీలు కలిసి రోజుకు 3వేల దాకా ఇటుకలను తయారు చేస్తూ 2వేలకు పైగా సంపాదిస్తున్నట్లు పేర్కొంటున్నారు. భూములకు లీజు చెల్లిస్తూ కూలీల ఖర్చులు భరిస్తూ కొంత సంపాదించుకుంటున్నారు. ఖర్చు పెరిగిపోయింది ఇటుక తయారు చేసేందుకు ఒకప్పుడు మట్టి తక్కువ రేటుకు లభించేది. ప్రస్తుతం లైట్ వెయిట్ పెల్లను తయారు చేసేందుకు మట్టితో పాటు అందులో వరి పొట్టు, బూడిదను సేకరించాల్సి వస్తుంది. ఇందుకు గానూ ఖర్చు అధికంగా పెరిగి అనుకున్న లాభాలు రావడం లేదు. ఏదిఏమైనా ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ఇటుక బట్టీల తయారీతో కుటుంబాలను పోషించుకుంటున్నాం. – ఎ. రాంచందర్, ఇటుక బట్టీ నిర్వాహకుడు, మంతటి -
మురికి ఇటుకలు...
మురుగునీటిని శుద్ధి చేసి మళ్లీ వాడుకోవడం ఈ కాలంలో సహజమే. పర్యావరణానికి మంచిది కూడా. అయితే ఒక చిక్కుంది. నీళ్లన్నీ శుద్ధి అయిపోయిన తరువాత మిగిలిపోయే మడ్డి వృథాగా మిగిలిపోతూంటుంది. ఈ సమస్యకూ పరిష్కారం కనుక్కున్నారు ఆస్ట్రేలియాలోని ఆర్ఎంఐటీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ఈ మడ్డిని భవన నిర్మాణానికి ఉపయోగపడే ఇటుకలుగా మార్చడంలో వీరు విజయం సాధించారు. ఇటుకలు మొత్తం ఈ మడ్డితో తయారు కాలేదుగానీ.. నాలుగోవంతును వాడటం ద్వారా అనేక ప్రయోజనాలు సాధించవచ్చునని అంటున్నారు ఈ ప్రయోగాలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త అబ్బాస్ మొహర్జానీ. మడ్డి వాడినప్పటికీ ఈ ఇటుకలు దుర్వాసన ఏమాత్రం వెలువరించవు. అదే సమయంలో తయారీ సమయంలో సగం ఇంధనాన్ని మాత్రమే వాడుకుంటుంది. అంతేకాకుండా.. మడ్డిలోని భారలోహాలు కూడా ఇటుకల్లోకి చేరిపోవడం వల్ల పర్యావరణ సమస్యలను తగ్గించవచ్చునని వివరించారు. అయితే ప్రస్తుతానికి ఈ కొత్త రకం ఇటుకలను మరింత విస్తృతంగా పరిశీలించాల్సి ఉందని ఆ తరువాత మాత్రమే భవన నిర్మాణానికి వాడుకోవచ్చునని వివరించారు. -
ఉగ్రవాదమే పెద్ద సమస్య
బ్యూనోస్ ఎయిర్స్: నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఉగ్రవాదమేనని ప్ర«ధాని మోదీ శుక్రవారం అన్నారు. ఐక్యరాజ్య సమితి (ఐరాస) ఉగ్రవాద వ్యతిరేక వ్యవస్థను బలోపేతం చేసేందుకు, ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకుండా చేసేందుకు బ్రిక్స్, జీ–20 దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. జీ–20 (గ్రూప్ ఆఫ్ 20) సదస్సు కోసం మోదీ అర్జెంటీనాలో పర్యటిస్తుండటం తెలిసిందే. అక్కడ బ్రిక్స్ దేశాధినేతల మధ్య జరిగిన భేటీలో మోదీ ప్రసంగించారు. ఆర్థిక నేరగాళ్ల వల్ల ప్రపంచం ఆర్థిక స్థిరత్వానికి తీవ్ర ముప్పు ఎదురవుతోందనీ, మోసాలు చేసి స్వదేశాల నుంచి పరారైన నేరగాళ్లకు వ్యతిరేకంగా కూడా అన్ని దేశాలూ సహకరించుకోవాలని ఆయన సూచించారు. బ్రిక్స్ దేశాధినేతల భేటీలోనే కాకుండా ప్రత్యేకంగానూ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్, సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌లతోనూ విడివిడిగా భేటీ అయ్యారు. వాతావరణ మార్పులపై ఈ నెల 3 నుంచి పోలండ్‌లో జరగనున్న కాప్24 సదస్సులో భారత్ కీలక, బాధ్యతయుతమైన పాత్ర పోషిస్తుందని గ్యుటెరస్‌తో మోదీ చెప్పినట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే వెల్లడించారు. బ్యూనస్ ఎయిర్స్లో నిర్వహించిన యోగా ఫర్ పీస్ కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. శాంతి, ఆరోగ్యం కోసం ప్రపంచానికి భారత్ అందించిన బహుమతి యోగా అని అన్నారు. ట్రంప్ చెడగొట్టారు: పుతిన్ జీ–20 దేశాల మధ్య వాణిజ్యం, వాతావరణ మార్పులపై గతంలో ఉన్న ఏకాభిప్రాయాన్ని ట్రంప్ చెడగొట్టారని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోపించారు. అమెరికా ఇతర దేశాలపై ఆంక్షలు విధించడం, వ్యాపారంలో రక్షణాత్మక ధోరణిని అవలంబిస్తుండటాన్ని పుతిన్ తప్పుబట్టారు. 2008లో ఆర్థిక మాంద్యం సమయంలో జీ–20 దేశాధినేతల తొలి సదస్సు సమయం నుంచి ఆర్థిక స్థిరత్వానికి తీసుకుంటున్న చర్యలను ట్రంప్ పాడుచేశారని పుతిన్ దుయ్యబట్టారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ కూడా పుతిన్‌తో గొంతు కలిపారు. ట్రంప్, మోదీ, అబే భేటీ మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, జపాన్ ప్రధాని షింజో అబేల మధ్య తొలి త్రైపాక్షిక భేటీ శుక్రవారం జరిగింది. ప్రపంచ, బహుళ ప్రయోజనాలున్న ప్రధానాంశాలపై వారు చర్చలు జరిపారు. ఉమ్మడి లక్ష్యాల కోసం కలిసి పనిచేయడాన్ని భారత్ కొనసాగిస్తుందని ఈ సందర్భంగా మోదీ స్పష్టం చేశారు. ‘జై (జేఏఐ – జపాన్, అమెరికా, ఇండియా) సమావేశం ప్రజాస్వామ్య విలువలకు అంకితం. పలు భారతీయ భాషల్లో జై అంటే విజయం అని అర్థం’ అని మోదీ అన్నారు. ‘జై’ దేశాల తొలి త్రైపాక్షిక భేటీలో పాల్గొనడం తనకు ఆనందాన్నిచ్చిందని అబే చెప్పారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతి నెలకొనాలని వారు ఆకాంక్షించారు. ఈ ప్రాంతంలో చైనా దుందుడుకుగా వ్యవహరిస్తుండటం తెలిసిందే. -
చుక్కల్లో ఇటుక ధర
పశ్చిమగోదావరి ,తాళ్లపూడి : మట్టి ఇటుక ధరలు చుక్కలనంటాయి. దీంతో గృహ నిర్మాణ యజమానులు గగ్గోలు పెడుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం వెయ్యి ఇటుకలు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు విక్రయిస్తున్నారు. రెండు నెలల క్రితం ఈ ధర రూ.5 వేలుగా ఉండేది. ఇటుకల బట్టీ యజమానులు రోజుకు రూ.100, రూ.200 చొప్పున పెంచుతూ పోతున్నారు. దీంతో ధర చుక్కలనంటింది. పెరిగిన ఇటుక ధరలతో నిర్మాణ రంగంపై అదనపు భారం పడుతుంది. మరోవైపు ముడి సరుకుల ధరలు పెరగడంతో బట్టీ యజమానులు పూర్తిస్థాయిలో ఇటుకను తయారు చేయడం లేదు. దీంతో క్రమేపీ ధర పెరిగింది. జిల్లాలో తాళ్లపూడి మండలంలో తయారయ్యే ఇటుకలకు ఇతర ప్రాంతాల్లో కూడా మంచి డిమాండ్ ఉంది. ఇక్కడి నుంచి జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు, ఇతర జిల్లాలకు, హైదరాబాద్‌కు నిత్యం ఇటుకలను ఎగుమతి చేస్తున్నారు. ఈ ప్రాంతంలో తయారయ్యే ఇటుకలు నల్లరేగడి, జిగురుమట్టితో తయారు చేస్తుంటారు. పచ్చి ఇటుక ఎండలో ఆరిన తరువాత బట్టీపై పేర్చి వంటచెరకు, బొగ్గు, ఊకతో కాలుస్తారు. అందువల్ల ఇవి మరింత ధృడంగా తయారవుతాయి. జిల్లాలో 400 పైగా బట్టీలు జిల్లాలో 400కు పైగా ఇటుకల తయారీ బట్టీలు ఉన్నాయి. ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి. బట్టీ యజమానులు శ్రీకాకుళం, విజయనగరం, ఒడిశా నుంచి కార్మికులను తీసుకువచ్చి వారి వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసి ఇటుకల తయారీని చేపడుతున్నారు. ఒక్కో బట్టీలో సుమారు 10 నుంచి 20 మంది ఉపాధి పొందుతున్నారు. బట్టీ యజమానులు ఒక్కో కుటుంబానికి అడ్వాన్సు కింద భారీగా ఇచ్చి వారికి ఇక్కడకు తీసుకువస్తున్నారు. ఇటీవల కాలంలో వంట చెరకు, ఊక, మట్టి ధరలు భారీగా పెరిగాయి. దీంతో ధరలు పెంచాల్సి వచ్చిందని బట్టీ యజమానులు చెబుతున్నారు. ధర పెరగడంతో కొన్ని బట్టీల యజమానులు నాసిరకంగా ఇటుకలు తయారు చేస్తున్నారని గృహనిర్మాణదారులు ఆరోపిస్తున్నారు. సిండికేట్‌గా మారిన యజమానులు ఏటా నవంబర్ నుంచి జూన్ వరకు ఇటుకను ముమ్మరంగా తీయడం జరుగుతుంది. ఈ సమయంలో ఇటుక ధరలు అందుబాటులోకి వచ్చేవి. అయితే ఈ ఏడాది మాత్రం ప్రారంభం నుంచి అ«ధిక ధరలకు అమ్ముతున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో గృహాలకు ఇబ్బడి ముబ్బడిగా అనుమతులు ఇవ్వడంతో పాటు గ్రామాల్లో పాత ఇళ్లను పడగొట్టి కొత్తగా గృహాలను నిర్మిస్తున్నారు. ఇదే అదునుగా బట్టీల యజమానులు సిండికేట్‌గా మారి ఇటుక ధరలు మరింత పెంచేశారు. ఫిబ్రవరి, మార్చిలో 1,000 ఇటుక పెద్ద సైజ్ రూ.5,000 నుంచి రూ.5,500 వరకు విక్రయించారు. ప్రస్తుతం సైజు, నాణ్యతను బట్టి రూ.7,500 పైగా విక్రయిస్తున్నారు. ఇటుక తయారీలో ఒక్కో విడతకు పెద్ద సైజువి అయితే 20 వేల నుంచి 30 వేల వరకు తయారు చేసి కాల్చుతారు. ఒక్కో బట్టి తయారీకి రూ.2.25 లక్షల వరకు ఖర్చవుతుంది. సిమెంట్ ఇటుకల వైపు మొగ్గు మట్టి ఇటుకల ధరలు పెరగడంతో చాలా మంది సిమెంట్ ఇటుకల వైపు మొగ్గు చూపుతున్నారు. నాలుగు మట్టి ఇటుకల స్థానంలో ఒక సిమెంట్ ఇటుక పెడితే సరిపోతుంది. కూలీల ఖర్చు కూడా తగ్గుతుందని నిర్మాణ దారులు చెబుతున్నారు. అదనపు భారం ఇటుక ధరలు అమాంతం పెరగడంతో నిర్మాణంపై భారం పడింది. గతంలో వెయ్యి ఇటుక రూ.4,500 నుంచి రూ. 5,000 ఉంటేది. ప్రస్తుతం రూ.7,500లకు చేరింది. పేద, మధ్యతరగతి ప్రజలు ఎలా కొనుగోలుచేయాలి. ఎలా ఇల్లు కట్టుకోవాలి.– పి.సత్యనారాయణ, వేగేశ్వరపురం -
సిమెంటు వరలు, హాలో బ్రిక్స్‌లో ఇంటిపంటలు!
పెద్దగా ఖర్చు పెట్టకుండానే రసాయనాల అవశేషాల్లేని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను సొంతంగా ఇంటిపైనే పండించుకోవచ్చని ఈ ఇంటిపంటల తోటను చూస్తే అర్థమవుతుంది. హైదరాబాద్ నగరంలోని బీరంగూడ రాఘవేంద్ర కాలనీ(బీహెచ్ఈఎల్ దగ్గర)లో ఇండిపెండెంట్ హౌస్‌లో నివాసం ఉంటున్న గృహిణి లత తన అభిరుచి మేరకు తమ ఇంటిపైన స్వల్ప ఖర్చుతోనే సేంద్రియ ఇంటిపంటలను గత మూడేళ్లుగా సాగు చేసుకుంటున్నారు. 3 సిమెంటు వరలను ఆకుకూరల మడులుగా మార్చేశారు. 1500 చదరపు అడుగుల టెర్రస్ పైన మూడు కార్నర్లలో హాలోబ్రిక్స్తో మడులు ఏర్పాటు చేసి తీగజాతి కూరగాయ మొక్కలను పెంచుతున్నారు. పాలకూర, తోటకూర, కీర, వంగ, సొర కాయలతోపాటు.. పైనాపిల్ పండ్లు, ఆపిల్ బెర్ పండ్లను ఆమె సాగు చేస్తున్నారు. డ్రమ్ములో నాటిన ఆపిల్ బెర్ మొక్క ఏడాదికి 3 సీజన్లలోనూ మంచి ఫలసాయాన్ని ఇస్తున్నదని ఆమె తెలిపారు. అంజూర మొక్క కూడా నిరంతరం పండ్ల దిగుబడినిస్తున్నదని తెలిపారు. సీతాఫలం మొక్కలను కూడా పెంచుతున్నారు. చెట్టుచిక్కుడు కాస్తున్నది. కీర దోస కాయలను సైతం తమ ఇంటిపైనే లత(96032 32114) సాగు చేస్తుండడం విశేషం. -
ఇటుకలుగా రద్దయిన నోట్లు
న్యూఢిల్లీ: రద్దయిన పాత రూ.500, రూ.1,000 నోట్లను ముక్కలు చేసి ఇటుకలు (బ్రిక్స్)గా మారుస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. సమాచార హక్కు చట్టం ద్వారా పీటీఐ కరెస్పాండెంట్ అడిగిన సమాచారాన్ని ఈ మేరకు వెల్లడించింది. ‘రద్దయిన పాత రూ.500, రూ.1,000 నోట్లను లెక్కించి, అధునాతన కరెన్సీ వెరిఫికేషన్, ప్రాసెసింగ్ సిస్టమ్ (సీవీపీఎస్) ద్వారా ప్రాసెస్ చేస్తున్నాం. పలు ఆర్బీఐ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ష్రెడ్డింగ్, బ్రిక్వెట్టింగ్ యంత్రాల ద్వారా ముక్కలు చేసి బ్రిక్స్‌గా మారుస్తున్నాం’ అని వివరించింది. బ్రిక్స్ తయారు చేసిన వెంటనే టెండర్లు పిలిచి విక్రయిస్తున్నామని తెలిపింది. -
ఈ గోడ... చరిత్రకు జాడ!
సాక్షి, హైదరాబాద్: దాదాపు రెండడుగుల పొడవున్న భారీ ఇటుకలు.. గోడ తరహాలో వరుసగా పేర్చిన నిర్మాణం.. వృత్తాకారంలో ఉందన్నట్లు వంపు తిరిగిన ఆకృతి.. తాజాగా బయటపడ్డ ఓ గోడ ఆకృతి ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. శాతవాహనుల కాలం నాటి కట్టడంగా భావిస్తున్న ఈ గోడ బౌద్ధ నిర్మాణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాధారణంగా బౌద్ధ స్తూపాలు వృత్తాకారంలో ఉంటాయి. చైత్యాలు ఆంగ్ల అక్షరమాలలోని ‘యు’ఆకృతిలో ఉంటాయి. తాజాగా వెలుగుచూసిన కట్టడం ప్రాథమిక ఆనవాళ్లు వంపు తిరిగి ఉండటంతో స్తూపమో, చైత్యమో అయి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ కట్టడం పుట్టు పూర్వోత్తరాలు తేల్చేందుకు పురావస్తుశాఖ నడుం బిగించింది. బుధవారం ఉదయం పురావస్తు శాఖ సిబ్బంది ఆ ప్రాంతాన్ని సందర్శించి నిగ్గు తేల్చనున్నారు. జనగామకు చేరువలో.. భువనగిరి–జనగామ మధ్యలోని పెంబర్తికి కిలోమీటరున్నర దూరంలో ఉన్న ఎల్లంల గ్రామ శివారులో ఈ నిర్మాణం వెలుగు చూసింది. చాలాకాలంగా ఇక్కడ ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. ఐదు రోజుల కింద కూలీలు ఇసుక తవ్వుతుండగా రెండుమీటర్ల లోతులో ఇటుక నిర్మాణం కనిపించింది. విషయం తెలుసుకున్న స్థానిక ఉపాధ్యాయుడు రత్నాకర్‌రెడ్డి వెళ్లి పరిశీలించి అది పురాతన కట్టడంగా భావించారు. రెండు అడుగులకు కాస్త తక్కువ పొడవుతో ఉన్న ఇటుకలు కావటంతో అవి శాతవాహన కాలానికి చెందినవే అయి ఉంటా యని భావించి విషయాన్ని పురావస్తు శాఖ దృష్టికి తెచ్చారు. పురావస్తుశాఖ డైరెక్టర్ విశా లాచ్చి వెంటనే స్పందించారు. వాటిని పరిశీలించాల్సిందిగా అధికారి భానుమూర్తిని ఆదేశించడంతో ఆయన స్థానిక సిబ్బందితో కలసి బుధవారం ఆ ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. పర్యాటకానికి ఊతం.. ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో బౌద్ధ స్తూపాలు, చైత్యాలు వెలుగు చూశాయి. ఫణిగిరి, ధూళికట్ట, నేలకొండపల్లి, కోటలింగాలలో బౌద్ధ నిర్మాణాల జాడలు బయటపడ్డాయి. బుద్ధుడి బోధనలు వినేందుకు వెళ్లి వచ్చిన బావరి నివసించిన ప్రాంతం కూడా ఇక్కడే ఉండటం విశేషం. ఇక్కడి నుంచే బౌద్ధ మత ప్రచారం ప్రారంభమై చైనా వంటి దేశాలకు పాకిందన్న ఆధారాలు వెలుగుచూడటంతో రాష్ట్రంలో బౌద్ధ పర్యాటకానికి ప్రాధాన్యం పెరుగుతోంది. నాగార్జునసాగర్ తీరంలోని బుద్ధవనంలో తైవాన్‌లాంటి దేశాల సాయంతో బౌద్ధ విశ్వవిద్యాలయ స్థాపనకూ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటీవలే కేంద్రం బౌద్ధ ప్రాంతాల అభివృద్ధికి నిధులనూ కేటాయించింది. ఈ తరుణంలో జనగామ ప్రాంతంలో వెలుగుచూసిన కట్టడం బౌద్ధ నిర్మాణమైతే మరింత ఊతమొచ్చినట్లు అవుతుంది. -
మొండి బకాయిల్లో మనది ఐదోస్థానం!
ముంబై: అంతర్జాతీయంగా మొండిబకాయిల భారం (ఎన్పీఏ) మోస్తున్న దేశాల జాబితాలో భారత్ 5వ స్థానంలో నిలిచింది. బ్రిక్స్ (బ్రిటన్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల్లో మనదే మొదటి స్థానంలో నిలుస్తుండటం మరో ముఖ్యాంశం. భారత బ్యాంకుల మొండి బకాయిల భారం మొత్తంగా రూ.9.5 లక్షల కోట్లు. మొత్తం రుణాల్లో ఈ పరిమాణం దాదాపు 10 శాతం. ఈ విషయంలో భారతదేశం హై రిస్క్ కేటగిరీలో నిలుస్తున్నట్లు ‘కేర్’ రేటింగ్స్ విడుదల చేసిన తాజా నివేదిక తెలియజేసింది. నివేదికలోని మరిన్ని అంశాలు చూస్తే... ►యూరోపియన్ యూనియన్‌లో(ఈయూ) ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న నాలుగు దేశాలు–గ్రీస్ (36.4%), ఇటలీ (16.4 శాతం), పోర్చుగల్ (15.5 శాతం), ఐర్లాండ్ (11.9 శాతం) మొండి బకాయిల భారాన్ని మోస్తున్నాయి. భారత్ తరువాత ఆరవ స్థానంలో రష్యా (9.7 శాతం), ఏడవ స్థానంలో స్పెయిన్ (5.3 శాతం) నిలిచాయి. ►ఇంతకుముందు ఎన్నడూ లేనంతగా భారత ఆర్థిక వ్యవస్థ మొండిబకాయిల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ►కేర్ రేటింగ్స్ చీఫ్ ఎకనమిస్ట్ మదన్ సబ్నవీస్ విశ్లేషణ ప్రకారం– ఎన్పీఏల సమస్య భారత్‌లో తీవ్రంగా ఉంది. రుణ నాణ్యత (ఏఆర్క్యూ) విషయంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2015లో దృష్టి సారించిన తరువాత కూడా ఈ సమస్య పెరుగుతూనే వచ్చింది. అయితే యూరోపియన్ దేశాల్లో ఈ సమస్య చాలా కాలం నుంచీ నలుగుతున్నదే. భారత్‌లో మాత్రం కేవలం రెండేళ్లలో ఈ సమస్య ఆందోళనకర స్థితికి చేరింది. ► 2015 మార్చిలో ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎన్పీఏల విలువ రూ.2.78 లక్షల కోట్లు. ఈ విలువ 2017 జూన్ నాటికి ఏకంగా రూ.9.5 లక్షల కోట్లకు ఎగసింది. ►ఆదాయాల వృద్ధి మందగమనం, అధిక వడ్డీరేట్లు మొండిబకాయిలు పెరగడానికి కారణాల్లో ప్రధానమైనవి. ► కేంద్రం, ఆర్బీఐ, వాణిజ్య బ్యాంకులు సమస్యను అధిగమించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాయి. ఇటీవల భారత్ ప్రవేశపెట్టిన దివాలా (ఐబీసీ) చట్టం ఇందులో ఒకటి. కొన్ని కంపెనీలు ఇప్పటికే ఈ చట్టం సెగను ఎదుర్కొంటున్నాయి. అలాగే బ్యాంకింగ్‌కు ప్రభుత్వం నుంచి తగిన మూలధన మద్దతూ అందుతోంది. ► ఎన్పీఏల సమస్యను కేర్ నాలుగు కేటగిరీలుగా (లో, వెరీ లో, మీడియం, హై లెవెల్) విభజించింది. కేవలం ఒక శాతం ఎన్పీఏలను ఎదుర్కొంటున్న దేశాల్లో (లో కేటగిరీ) ఆస్ట్రేలియా, కెనడా, హాంకాంగ్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, బ్రిటన్ ఉన్నాయి. చైనా, జర్మనీ, జపాన్, అమెరికాల్లో ఈ సమస్య రెండు శాతంగా (రెండవ కేటగిరీ) ఉంది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు– బ్రెజిల్, ఇండోనేసియా, దక్షిణాఫ్రికా, టర్కీలు మూడవ కేటగిరీలో ఉన్నాయి. -
10బ్రిక్స్–20లో భారతీయ విద్యాసంస్థలు
న్యూఢిల్లీ: బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా)దేశాల్లో అత్యున్నత విద్య అందించే టాప్–20 వర్సిటీల్లో భారత్‌కు చెందిన నాలుగు విద్యాసంస్థలు చోటు సంపాదించాయి. ప్రతిష్టాత్మక క్వాకరెల్లీ సైమండ్స్(క్యూఎస్) సంస్థ 2017 సంవత్సరానికి విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఐఐటీ బాంబే(9), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్–బెంగళూరు(10), ఐఐటీ ఢిల్లీ(15), ఐఐటీ మద్రాస్(18) చోటు దక్కించుకున్నాయి. చైనాకు చెందిన సింఘువా వర్సిటీ, పెకింగ్ వర్సిటీ, ఫుడాన్ వర్సిటీలు ఈ జాబితాలో తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. మొత్తం టాప్–10 విద్యాసంస్థల్లో చైనాకు చెందిన వర్సిటీలే 8 స్థానాలను కైవసం చేసుకున్నాయి. బుధవారమిక్కడ ర్యాంకుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) చైర్మన్ వీఎస్ చౌహాన్ మాట్లాడుతూ.. సంస్థ పేరు ప్రఖ్యాతులు, అధ్యాపకులు విద్యార్థుల నిష్పత్తి, ప్రచురితమైన పరిశోధనా పత్రాలు, అందుకున్న బహుమతులు, అంతర్జాతీయ అధ్యాపకులు, విద్యార్థుల శాతం సహా 8 అంశాల ఆధారంగా ఈ సర్వే నిర్వహించినట్లు పేర్కొన్నారు. దేశంలోని టాప్–10 ప్రైవేటు విద్యాసంస్థల్లో బిట్స్ పిలానీ, థాపర్ విశ్వవిద్యాలయం, సింబియాసిస్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం, మణిపాల్ వర్సిటీ, అమృతా విశ్వవిద్యాలయం, విట్ వర్సిటీ, కళింగ యూనివర్సిటీ, ఓపీ జిందాల్ గ్లోబల్ వర్సిటీలు చోటు దక్కించుకున్నాయని వెల్లడించారు. -
ఇటుక కొంటే ఇత్తడే!
సాక్షి, అమరావతి: ఇటుక బంగారంలా మారిపోయింది. కొనుగోలుదారులకు పట్టపగలే చుక్కలు చూపిస్తోంది. కొద్దిరోజుల్లోనే ధర రెట్టింపు కావడంతో నిర్మాణదారులు బెంబేలెత్తుతున్నారు. కొందరైతే పనులను తాత్కాలికంగా నిలిపేశారు. విశాఖ జిల్లాలో నాలుగు నెలల కిందట వెయ్యి చిన్న ఇటుకల (నాలుగు, తొమ్మిది అంగుళాలు) ధర రూ.4,300 ఉండగా.. నేడు రూ.9,000కు చేరింది. అలాగే వెయ్యి పెద్ద ఇటుకల (ఆరు, తొమ్మిది అంగుళాలు) ధర రూ.6,400 నుంచి రూ.11,000కు ఎగబాకింది. ఇక విజయవాడలో అయితే పెద్ద స్థాయిలో సిఫార్సులు ఉన్న వారికే ఇటుకలు అమ్ముతున్నారు. ఈ ప్రాంతంలో గతంలో రూ.4.50 ఉన్న ఇటుకను.. ప్రస్తుతం మనిషిని, పరపతిని బట్టి రూ.7 నుంచి ఎనిమిది రూపాయలకు అమ్ముతున్నారు. వర్షాకాలంలో ఇటుకలు తయారు చేయడం దాదాపు నిలిపివేస్తారు. అచ్చుల్లో పోసి ఇటుకలను ఎండబెట్టిన తర్వాత వర్షం పడితే అవి పాడైపోతాయి. దీంతో వర్షాకాలంలో ఇటుకల ధర పది నుంచి 15 శాతం పెరుగుతుంది. కానీ ఈ ఏడాది మాత్రం చాలా చోట్ల ఇటుక ధరలు రెట్టింపయ్యాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత.. గత ఏడాది పెద్ద నోట్ల రద్దు ప్రభావం వల్ల నిర్మాణ రంగం పడకేసింది. ఈ ఏడాది నగదు కొరత తగ్గిపోవడంతో నిర్మాణ రంగం మళ్లీ పుంజుకుంది. దీనివల్ల ఇటుకలకు ఊహించని స్థాయిలో డిమాండ్ పెరిగింది. గిరాకీకి, సరఫరాకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటంతో అమ్మకందారులు ఇటుక ధరలను భారీగా పెంచేశారు. మరోవైపు ఇసుక ధరలు కూడా అదేస్థాయిలో పెరిగాయి. ప్రభుత్వం ఉచిత ఇసుక అని చెబుతున్నా.. అది అమలుకు నోచుకోవడంలేదు. నదుల్లో భారీగా నీరు చేరినందున వాహనం వెళ్లదని.. దూరం నుంచి కూలీలు మోసుకురావాలంటూ అధిక మొత్తం వసూలు చేస్తున్నారు. మరికొంతమంది రేవుల నుంచి ఇసుక తోడి స్టాక్‌యార్డులు ఏర్పాటు చేసి ఇసుకను విక్రయిస్తున్నారు. విజయవాడ నగర పరిసరాల్లో గతంలో ట్రాక్టరు ఇసుక ధర రూ.1,500 ఉండగా.. ఇప్పుడు రూ.2,500 నుంచి రూ.3,000 వరకూ తీసుకుంటున్నారు. విశాఖలోనూ ఐదు యూనిట్ల ఇసుకను రూ.22 వేల నుంచి రూ.24 వేల వరకూ అమ్ముతున్నారు. దీంతో భవన నిర్మాణదారులు పనులు నిలిపేశారు. -
ప్రతి మండలంలో ఇటుకల తయారీ కేంద్రాలు
– హౌసింగ్ శాఖ పరిధిలో 12 నిర్మిత కేంద్రాలు – డీఆర్డీఏ శాఖ పరిధిలో 42 – వచ్చే ఏడాది మార్చి ఆఖరుకు ఎన్టీఆర్ గృహాలు పూర్తి చేస్తాం – సమావేశంలో హౌసింగ్ పీడీ రాజశేఖర్ కోవెలకుంట్ల: ఎన్టీఆర్ గృహాల నిర్మాణాలకు కావాల్సిన సిమెంట్ ఇటుకల తయారీకి జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో నిర్మిత కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు హౌసింగ్ పీడీ రాజశేఖర్ చెప్పారు. శనివారం స్థానిక హౌసింగ్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీడీ మాట్లాడుతూ జిల్లాలో హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో 12 నిర్మిత కేంద్రాలు ఉన్నాయన్నారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 10 మండలాల్లో స్థలాలు సేకరించామని, మిగిలిన 32 మండలాల్లో స్థలాల అన్వేషణ జరుగుతోందన్నారు. ఆయా కేంద్రాల్లో సిమెంట్ ఇటుకలు తయారు చేసి లబ్ధిదారులకు సరఫరా చేస్తామన్నారు. సిమెంట్ ఇటుకలే కాకుండా ఎర్ర ఇటుకలు, నాపరాళ్లతో ఇంటి నిర్మాణం చేపడతామని లబ్ధిదారులు ముందుకు వస్తే వాటిని సరఫరా చేస్తామన్నారు. 103, 114 జీఓల ప్రకారం జిల్లాకు 14750 ఎన్టీఆర్ గృహాలు, 104 జీఓ ప్రకారం 4246 గృహాలు ప్రధాన మంత్రి ఆవాస్‌యోజన పథకం కింద మంజూరయ్యాయని పేర్కొన్నారు. ఎన్టీఆర్ గృహాలను వచ్చే నెలలో ప్రారంభించి వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి 10600 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు. ఎన్టీఆర్ గృహాలకు రూ. 1.50 లక్షలు, ప్రధానమంత్రి అవాస్‌యోజన గృహాలకు రూ. 2 లక్షలు చెల్లిస్తామని చెప్పారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణాలకు ఉపాధి పథకంతో అనుసంధానం చేశామనానరు. 90 పనిదినాలు, సిమెంట్ ఇటుకలు, వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి ఆ పథకం కింద రూ. 55వేలు, హౌసింగ్ పథకం కింద రూ. 95 వేలు చెల్లిస్తామన్నారు. ఎన్టీఆర్ గృహాలు మంజూరైన లబ్ధిదారులు ఉపాధి హామీ పథకంలో జాబ్‌కార్డు కలిగి ఉండాలని చెప్పారు. లబ్ధిదారులకు బేస్మెంట్, ఎల్ఎల్, ఆర్ఎల్, ఆర్సీ దశల్లో బిల్లులు చెల్లిస్తామని చెప్పారు. కార్యక్రమంలో హౌసింగ్ డీఈ కృష్ణారెడ్డి, ఏఈ రామసుబ్బన్న పాల్గొన్నారు. -
ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేయాలి
ప్రపంచ దేశాలకు బ్రిక్స్ పిలుపు బెనౌలిమ్(గోవా): ప్రపంచ దేశాలన్నీ తమ భూభాగాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని, ఉగ్రవాదంపై పోరులో భాగంగా ఐక్యరాజ్యసమితి తీర్మానానికి త్వరితంగా ఆమోదం తెలపాలని బ్రిక్స్ దేశాల సదస్సు కోరింది. గోవాలో జరిగిన వార్షిక సదస్సులో సభ్య దేశాలు బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలు ఈ మేరకు తీర్మానిస్తూ ఆదివారం ప్రకటన విడుదల చేశాయి. ఐరాస సాధారణ అసెంబ్లీలో అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందం(సీసీఐటీ) ఆమోదంలో ఆలస్యం చేయవద్దంటూ సదస్సు చివరి రోజు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్న వ్యవస్థీకృత నేరాలైన మనీ ల్యాండరింగ్, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నిర్మూలించడంతో పాటు ఉగ్రవాదుల స్థావరాల్ని నాశనం చేయడం, ఇంటర్నెట్ ద్వారా ఉగ్రవాద అనుకూల ప్రచారాన్ని తిప్పికొట్టడంపై ప్రధానంగా దృష్టి సారించాలని సదస్సు పేర్కొంది. ‘ఉగ్రవాదంపై విజయవంతమైన పోరాటానికి అన్ని అంశాల్ని పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. ఉగ్రవాద వ్యతిరేక పోరాటం అంతర్జాతీయ న్యాయం, మానవ హక్కులకు లోబడి ఉండాలి. ఈ పోరులో వివిధ దేశాల కూటముల మధ్య సమన్వయ పాత్రను ఐరాస పోషించాలి. ఐరాస ఉగ్రవాద వ్యతిరేక విధివిధానాలు సమర్థంగా అమలయ్యేందుకు కట్టుబడి ఉన్నాం’ అని సదస్సు తీర్మానంలో పేర్కొన్నారు. ఎఫ్ఏటీఎఫ్ను అమలు చేయాలి మనీ ల్యాండరింగ్, ఉగ్రవాదానికి ఆర్థిక సాయంపై పోరులో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌పోర్స్(ఎఫ్ఏటీఎఫ్) నిబంధనలకు కట్టుబడి ఉంటామని బ్రిక్స్ నేతలు చెప్పారు. ఉగ్రవాదులకు ఆర్థిక సాయంపై పోరుకు త్వరితంగా, సమర్థంగా అన్ని దేశాలు ఎఫ్ఏటీఎఫ్ అమలు చేయాలని కోరారు. మాదకద్రవ్యాల అక్రమ ఉత్పత్తి, రవాణాను అడ్డుకునేందుకు సహకారం, సమన్వయం బలోపేతం చేసుకోవాలని సదస్సు పిలుపునిచ్చింది. అవినీతిపై పోరుకు ప్రోత్సాహం అనేక దేశాల్లో రాజకీయ, భద్రతాపర అస్థిరతపై బ్రిక్స్ ఆందోళన వ్యక్తంచేసింది. అంతర్జాతీయ సమస్యల పరిష్కారంలో సహకారమందిస్తామంది. నిజాయతీతో కూడిన పన్ను వ్యవస్థకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. అవినీతిపై అంతర్జాతీయ సహకారానికి చేయూతనిస్తామని తెలిపింది. అక్రమ ధనం, విదేశాల్లో అక్రమ సంపదలు ఆర్థిక వృద్ధి, అభివృద్ధిపై ప్రభావం చూపుతాయన్న సదస్సు... అవినీతికి వ్యతిరేకంగా ఐరాస తీర్మానానికి అనుగుణంగా సాగుతున్న పోరును ప్రోత్సహిస్తామని తీర్మానించింది. రష్యా నుంచి గ్యాస్ పైప్‌లైన్ భారత్, రష్యా మధ్య ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఖర్చుతో నిర్మించ తలపెట్టిన గ్యాస్ పైప్‌లైన్ సంయుక్త అధ్యయనానికి ఇరు దేశాలు అంగీకరించాయి. బ్రిక్స్ సమావేశాల్లో మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌లు సంబంధిత పత్రంపై సంతకాలు చేశారు. ఈ సహజవాయివు పైప్‌లైన్ నిర్మాణానికి 25 బిలియన్ డాలర్ల ఖర్చవుతుంది. సైబీరియాలో ఉత్పత్తి అయిన గ్యాస్‌ను రష్యన్ గ్యాస్ గ్రిడ్‌కు అనుసంధానించి, 6 వేల కి.మీ పొడవైన పైప్‌లైన్ నిర్మాణం ద్వారా భారత్‌కు తీసుకొస్తారు.