మురికి ఇటుకలు... | Natural during this period to refine sewage treatment | Sakshi
Sakshi News home page

మురికి ఇటుకలు...

Published Thu, Jan 24 2019 1:15 AM | Last Updated on Thu, Jan 24 2019 1:15 AM

Natural during this period to refine sewage treatment - Sakshi

మురుగునీటిని శుద్ధి చేసి మళ్లీ వాడుకోవడం ఈ కాలంలో సహజమే. పర్యావరణానికి మంచిది కూడా. అయితే ఒక చిక్కుంది. నీళ్లన్నీ శుద్ధి అయిపోయిన తరువాత మిగిలిపోయే మడ్డి వృథాగా మిగిలిపోతూంటుంది. ఈ సమస్యకూ పరిష్కారం కనుక్కున్నారు ఆస్ట్రేలియాలోని ఆర్‌ఎంఐటీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ఈ మడ్డిని భవన నిర్మాణానికి ఉపయోగపడే ఇటుకలుగా మార్చడంలో వీరు విజయం సాధించారు. ఇటుకలు మొత్తం ఈ మడ్డితో తయారు కాలేదుగానీ.. నాలుగోవంతును వాడటం ద్వారా అనేక ప్రయోజనాలు సాధించవచ్చునని అంటున్నారు ఈ ప్రయోగాలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త అబ్బాస్‌ మొహర్‌జానీ.

మడ్డి వాడినప్పటికీ ఈ ఇటుకలు దుర్వాసన ఏమాత్రం వెలువరించవు. అదే సమయంలో తయారీ సమయంలో సగం ఇంధనాన్ని మాత్రమే వాడుకుంటుంది. అంతేకాకుండా.. మడ్డిలోని భారలోహాలు కూడా ఇటుకల్లోకి చేరిపోవడం వల్ల పర్యావరణ సమస్యలను తగ్గించవచ్చునని వివరించారు. అయితే ప్రస్తుతానికి ఈ కొత్త రకం ఇటుకలను మరింత విస్తృతంగా పరిశీలించాల్సి ఉందని ఆ తరువాత మాత్రమే భవన నిర్మాణానికి వాడుకోవచ్చునని వివరించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement