
‘‘మానవ తప్పిదాలు సహజమే’’, ‘‘అసలు తప్పే చేయనోడు మనిషే కాదు’’ ఇలాంటి మాటలు చెప్పుకోవడానికి బానే ఉంటాయి కానీ, తేడా వస్తే.. రిజల్ట్స్ భయంకరంగా ఉన్నాయి. దిమ్మదిరిగి బొమ్మ కనుపడుద్ది..తూచ్..నేనొప్పుకోను అంటే కుదరదు.. అస్సలేమీ అర్థం కాలేదు కదా... ఆ మాటల వెనుక మర్మం తెలియాలంటే ఈ కథనం గురించి తెలుసుకోవాలి.
మారుతున్న జీవన పరిస్థితులు, జన్యుపరమైన కారణాల రీత్యా అనేక మంది సంతాన సమస్యలతో బాధపడుతున్నారు. సహజంగా గర్భం ధరించడం కష్టమైన వారు కృత్రిమ పద్దతుల ద్వారా బిడ్డల్ని కనేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సమస్య. దీంతో వీధికో ఐవీఎఫ్ సెంటర్ (IVF) పుట్టుకోస్తోంది. ఇవి కొందరికి వరాలిచ్చే కేంద్రాలుగా మారుతుండగా, మరికొందరికి మాత్రం పీడకలగా మారుతున్నాయి.
ఆస్ట్రేలియాలోని ప్రముఖ సంతానోత్పత్తి కేంద్రాల్లో ఒకటైన మోనాష్ ఐవీఎఫ్ సెంటర్‌లో ఈ వివాదం నెలకొంది. ఐవీఎఫ్ ద్వారా గర్భధారణకు ప్రయత్నించిందో ఆస్ట్రేలియన్ మహిళ. మరో వైపు ఇదే ఆశతో బ్రిస్బేన కేంద్రానికి వచ్చిందో జంట. అయితే ఆ జంటకు చెందిన పిండాన్న ఆయా మహిళల గర్భంలోకి ప్రవేశ పెట్టారు. అనుకున్నట్టు ఆస్ట్రేలియన్ మహిళ గర్భం నిలిచింది. అంతులేని ఆనందంతో, నవమాసాలు మోసి కోటి ఆశలతో బిడ్డకు జన్మనిచ్చింది. తీరా అది తన బిడ్డకాదని తెలిసి ఒక్కసారిగా షాక్ అయింది. ఐవీఎఫ్ కేంద్రం చేసిన పొరబాటు కారణంగా మహిళ తానొక అపరిచితుడి బిడ్డకు జన్మనిచ్చినట్టు తెలుసుకుంది. ఇది చట్టపరమైన, నైతిక ఆందోళన లేవనెత్తింది.
చదవండి: సింగపూర్ ‘ట్రీ టాప్‌వాక్’ తరహాలో వాక్‌వే, క్యూ కడుతున్న పర్యాటకులు
తప్పయిదంటూ వివరణ, నష్ట పరిహారం
ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ ప్రకారం, ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో జరిగిన ఈ తప్పును. ఈ ఏడాది ఫిబ్రవరిలో గుర్తించారు. అయితే జరిగిన తప్పును అంగీకరించి ఐవీఎఫ్ సెంటర్ మోనాష్ బాధితులు అందరికీ క్షమాపణ చెప్పింది. అలాగే వారికి పెద్ద మొత్తంలో నష్ట పరిహారం చెల్లించింది. దాదాసే భారత కరెన్సీ ప్రకారం రూ.480 కోట్లు నష్ట పరిహారం చెల్లించింది.
ఇపుడా బిడ్డ ఎవరికి చెందుతుంది?
నిజమైన జన్యు తల్లిదండ్రులు ముందు కొచ్చిదీని గురించి చర్చించాలనుకుంటున్నారా, లేదా అనేది ప్రశ్న అంటోంది మోనాష్ సంస్థ. ఇది అన్ని చోట్ల భయంకరమైన, విచారకరమైన పరిస్థితి అని మోనాష్ ఐవీఎఫ్ నిపుణుడు పేర్కొన్నారు. ఇది పాల్గొన్న జంటల జీవితాన్నిమార్చివేసేది అయినప్పటికీ, తదుపరిసారి ఎక్కువగా బాధపడేది ఈ తప్పుకు కారణమైన శాస్త్రవేత్త" అన్నారు. ఆస్ట్రేలియాలోని చట్టం ఎలా నిర్ణయిస్తుందో తెలియదు, మానవులు తప్పులు చేస్తారని అంగీకరించడం తప్ప ఇంతకు మించి చేసేదేమీ లేదు అంటూ చెప్పుకొచ్చారు.
చదవండి: సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ టైటిల్ ఎగరేసుకుపోయాడు : ప్రైజ్‌మనీ ఎంతో?
అయితే తల్లైన జంట, బయోలాజికల్ తల్లిదండ్రులు ఎవరు, బిడ్డను ప్రస్తుతం ఎవరికి అప్పగించారు? ఈ శిశువు ఎవరికి చెందుతుందనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుత ఆస్ట్రేలియన్ చట్టం ప్రకారం, జన్మనిచ్చిన తల్లి , ఆమె భాగస్వామి చట్టపరమైన తల్లిదండ్రులుగా గుర్తించ బడతారని, జీవసంబంధమైన తల్లిదండ్రులను కస్టడీ హక్కులు లేకుండా చేసే అవకాశం ఉందని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. ఈ కేసు IVF పరిశ్రమపై భద్రత, పర్యవేక్షణకు పిలుపునిచ్చింది. దీంతోపాటు సహాయక పునరుత్పత్తి సాంకేతికతలలో మెరుగైన రక్షణల అవసరాన్ని హైలైట్ చేసింది.