Others
-
మన్మోహన్‌కు ప్రధాని,రాష్ట్రపతి నివాళి
మన్మోహన్సింగ్ పార్థివ దేహానికి ప్రధాని మోదీ నివాళులు..మన్మోహన్ సింగ్ ఇంటికి చేరుకున్న ప్రధాని మోదీమాజీ ప్రధాని పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించిన మోదీమన్మోహన్ సతీమణి గురుశరణ్‌కౌర్, కుటుంబ సభ్యులకు సంతాపంప్రధానితో పాటు మన్మోహన్ ఇంటికి వచ్చిన అమిత్ షా, జేపీ నడ్డా మన్మోహన్ పార్థివ దేహానికి రాష్ట్రపతి నివాళిమన్మోహన్సింగ్ పార్థివ దేహానికి రాషష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళిమన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపిన ముర్ము ఢిల్లీమన్మోహన్సింగ్ పార్థివ దేహానికి తెలంగాణ సీఎం రేవంత్ నివాళులుమన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులర్పించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిమన్మోహన్ సింగ్ భార్య గురుశరణ్ కౌర్‌ను, ,కుటుంబ సభ్యులను పరామర్శించిన రేవంత్ రెడ్డిమన్మోహన్ నివాసానికి కాంగ్రెస్ అగ్రనేతలుమన్మోహన్ ఇంటికి వచ్చిన సోనియాగాంధీ రాహుల్‌గాంధీ, మల్లికార్జునఖర్గే, ప్రియాంకగాంధీమన్మోహన్ పార్థివ దేహానికి నివాళులర్పించిన నేతలు వ్యక్తిగతంగా నాకు తీరనిలోటు: మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మన్మోహన్ లేని లోటు పూడ్చలేనిదిచాలా కాలం నుంచి మన్మోహన్ నాకు తెలుసుసభ్యతకు నిలువెత్తు రూపం మన్మోహన్సింగ్వీడియో విడుదల చేసిన మాజీ రాష్ట్రపతిఆ మాటే నిజమైంది: శశిథరూర్ మాజీ ప్రధాని మన్మోహన్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తూ పోస్టు పెట్టిన శశిథరూర్చరిత్ర నా పట్ల దయతో ఉంటుందని 2014లో వ్యాఖ్యానించిన మన్మోహన్ఆయన చెప్పిన మాటలను గుర్తుచేస్తూ పోస్టు పెట్టిన కాంగ్రెస్ ఎంపీపదేళ్ల తర్వాత అదే నిజమైందని వ్యాఖ్యమన్మోహన్ దేశ సేవ..రాబోయే తరాలకు స్ఫూర్తి: సిక్కిం సీఎం తమాంగ్మన్మోహన్ మృతిపట్ల సంతాపం తెలిపిన సిక్కిం సీఎం ప్రేమ్‌సింగ్ తమాంగ్ఆర్థిక సంస్కరణలకు నాంది పలికి దేశాభివృద్ధికి గట్టి పునాది వేశారుదేశానికి మన్మోహన్ చేసిన సేవలు రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని వ్యాఖ్య మాజీ ప్రధాని మన్మోహన్ మృతి పట్ల అమెరికా సంతాపంగత రెండు దశాబ్దాల్లో అమెరికా,భారత్ సాధించిన మన్మోహన్ పునాది వేశారుఅమెరికా, భారత్ పౌర అణు సహకార ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మన్మోహన్ కీలక పాత్ర పోషించారుభారత్ వేగంగా అభివృద్ధి చెందడానికి ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు ప్రజలకు గుర్తుండిపోతాయిప్రకటించిన అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ -
అంకిత భావం
అంకము అంటే గుర్తు, ముద్ర. అంకితం అంటే గుర్తు, లేక ముద్ర కలిగినది. తమ పని ఏదైనా ఏ విధంగా గుర్తించబడాలో సూచించే గుర్తును చెప్పటం అంకితం. మన కవులు అందరు తమ కావ్యాలను అంకితం చేశారు. రచన తమది అయినా ఆ రచనను చదివే వారికి మరొకరు మనసులో మెదులుతారు. అది తమ ఇష్టదైవం కావచ్చు. ఆదరించిన రాజో, మిత్రుడో, ఆత్మీయులో కావచ్చు. అది మరెవరి గుర్తింపు కొరకో తాము చేసే కృషి అని చెప్పటం. కావ్య అవతారికలోనే చెప్పటం సంప్రదాయం. ఆదికవి నన్నయ ఈ ఒరవడి ప్రారంభించినట్టు కనపడుతుంది. తన సహాధ్యాయి, రాజు, పోషకుడు అయిన రాజరాజ నరేంద్రుడి కోరిక మీద ఆయనకి అంకితంగా భారతసంహితా రచనా ధురంధురుడయ్యాడు. ఈ అంకితం కారణంగానే తిక్కనామాత్యులవారు అరణ్యపర్వశేషాన్ని స్పృశించలేదని కొండరు సాహిత్యవిమర్శకుల అభిప్రాయం. నన్నయభట్టు నరాంకితంగా చేసిన దానిలో మిగిలిన భాగాన్ని దైవానికి అంకితం ఇవ్వటం ఇష్టం లేక విరాటపర్వం నుండి ప్రారంభించి ఉంటారని భావన. పైగా ఆయనకి హరిహరనాథుడు స్వప్నంలో కనపడి ఆదేశించాడు కూడా. పోతనామాత్యుల వారి అంకితం కించిత్ ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. శివధ్యానం చేస్తున్న పోతనకి శ్రీరామచంద్రుడు దర్శనమిచ్చి కృష్ణకథ ప్రధానంగా ఉన్న భాగవతాన్ని తనకి అంకితంగా రచించమని కోరాడు. వాగ్గేయకారులు తమ కీర్తనలలో ప్రతిదానిలోనూ తమ ఇష్టదైవం నామాన్ని గాని ఒక ప్రత్యేకమైన పదాన్ని గాని గుర్తుగా పేర్కొంటారు. దానిని ముద్ర అంటారు. కీర్తనలు వేటికి అవి విడిగా ఉంటాయి. కావ్యంలో లాగా అవతారికలో ఒకసారి పేర్కొంటే సరిపోదు కదా! అందుకని ప్రతి కృతిలోనూ ముద్ర తప్పనిసరి. త్యాగరాజ కృతులలో ప్రతి దానిలోనూ త్యాగరాజనుత అనే ముద్ర కనపడుతుంది. శ్యామశాస్త్రివారి కీర్తనలలో శ్యామకృష్ణ అని, ముత్తుస్వామి దీక్షితులవారి కీర్తనలలో గురుగుహ అనే ముద్రలు దర్శనమిస్తాయి. ఆ ముద్ర చూడగానే అది ఎవరి రచన అన్నది తెలిసిపోతుంది. నిజానికి వారు మనకి తేలికగా తెలియటం కోసం పెట్టలేదు ముద్రలని. ఆ ముద్ర తనకి, ఎవరిని గురించి పాడుతున్నారో వారికి గుర్తింపు. వాచస్పతి మిశ్రుడు తన రచనకు ఏ మాత్రం ఇబ్బంది కలిగించకుండా సహకరించిన, అప్పటివరకు ముఖమైనా చూడని ధర్మపత్ని ‘భామతి’ పేరుని తన గ్రంథనామంగా ఉంచాడు. తమకు ఉన్న ప్రేమాభిమానాలను వ్యక్తపరచటానికి రచనాదికాలు చేయలేక పోయినా, తాము చేసిన ఏ ఘనకార్యమైనా అంకితం చేస్తూ ఉంటారు. అందరు ఏదో ఒక ఘనకార్యం చేసి అంకితం ఇవ్వలేక పోవచ్చు. వారు తమ జీవితాన్నే అంకితం చేయటం మనం గమనించ వచ్చు.‘‘నా జీవితం నీకే అంకితం..’’ అంటూ పాడిన పాటలు ఉదాహరణలు. అంటే, తన అస్తిత్వానికి ఒక గుర్తింపు అవసరం లేదు, అస్తిత్వంతో సహా అంతా సమర్పణమే ఇష్టదైవానికో, ఇష్టమైన వ్యక్తికో. చివరికి ఈ అంకిత ప్రక్రియ ఏ స్థాయికి చేరింది అంటే, ఆకాశవాణిలో గాని, దృశ్యశ్రవణ ప్రసార మాధ్యమాలలో గాని ఇష్టమైన పాటలని వేయించి, వాటిని అంకితం చేస్తున్నారు. వీరజవానులు తమ జీవితాలను దేశరక్షణకు అంకితం చేస్తారు. కొందరు దైవానికి తమ జీవితాలని అంకితం చేస్తారు. తన ఉనికి కోసం, గుర్తింపు కోసం తాపత్రయ పడకుండా మరెవరి గుర్తింపుకో నిస్వార్థంగా చేయటం అంకితం. కావ్యాలు, కీర్తనలు మాత్రమే కాదు ఏ సృజనాత్మక సృష్టి అయినా తన గుర్తింపు కోసం కాక ఇతరులకు గుర్తింపు కలగటం కోసం చేసినప్పుడు ఆ ప్రక్రియని అంకితం అంటారు. ఉదాహరణకి నన్నయభట్టు భారతాన్ని ఆంధ్రీకరించాడు. ఆయన పేరుతో పాటు అంకితం పుచ్చుకున్న రాజరాజనరేంద్రుడి పేరు కూడా చరిత్రలో శాశ్వతంగా నిలిచి ఉంటుంది. రాజుగా కన్న ఆంధ్రమహాభారతాన్ని అంకితం పుచ్చుకున్నవాడిగా గుర్తింపు అధికం. శ్రీనాథ కవిసార్వభౌముడి పేరు నిలిచి ఉన్నంత కాలం వీరారెడ్డి, అవచి తిప్పయ్య శెట్టి, పెదకోమటి వేమారెడ్డి మొదలైన వారందరి పేర్లు శాశ్వతం. రచనలు చేయలేదు కాని, కావ్యాలు అంకితం పుచ్చుకున్నారు కనక, ఆ కావ్యాలు ఆదరించబడినంత కాలం వారి పేరు చిరస్థాయిగా ఉంటుంది. – డా. ఎన్. అనంతలక్ష్మి -
ఇతరులూ కాంగ్రెస్ చీఫ్ కావొచ్చు
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లో గాంధీ కుటుంబం వారు కాకుండా ఎవరైనా అధ్యక్షుడు కావొచ్చని.. అయితే కచ్చితంగా గాంధీ కుటుంబం మాత్రం పార్టీలో చురుకుగా ఉండాల్సి ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ అన్నారు. గాంధీ ముక్త్ కాంగ్రెస్ పేరుతో కాంగ్రెస్ ముక్త్ భారత్ చేయడమే బీజేపీ అసలు లక్ష్యమని ఒక ఇంటర్వ్యూలో ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యంతో పార్టీ చీఫ్ ఎవరనే ప్రతిష్టంభనపై అయ్యర్ స్పందించారు. రాహుల్ కాంగ్రెస్ చీఫ్‌గా ఉండటమే మంచిదని.. అయితే ఆయన అభిప్రాయాలను నాయకులు, కార్యకర్తలు గౌరవించాలని అభిప్రాయపడ్డారు. గాంధీ–నెహ్రూ కుటుంబాలు అధ్యక్ష పదవిలో లేకున్నాపార్టీ మనగలుగుతుంది. క్లిష్ట పరిస్థితులు తలెత్తినప్పుడు.. నేతల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించే సత్తా వారికే ఉందని చెప్పారు. నెహ్రూ–గాంధీ కుటుంబంలోని వారు అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు పార్టీలో నేతల మధ్య తలెత్తిన సమస్యలను ఏ విధంగా పరిష్కరించారో ఉదహరించారు. చీఫ్‌గా రాహులే ఉంటారా? ఇతరులు వస్తారా? అన్న దానికి వేచి చూడాల్సిందే అని అయ్యర్ చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యంతో పార్టీ చీఫ్ పదవి నుంచి తప్పుకోవడానికి రాహుల్ ప్రతిపాదించగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తిరస్కరించింది. అయితే, చీఫ్‌గా ఎవరుండాలనేది పార్టీనే నిర్ణయిస్తుందని రాహుల్ ప్రకటించారు. -
'ఇతరుల’ కథ
ఓటర్ల జాబితాను ఎప్పుడైనా చూశారా? అందులో స్త్రీ, పురుష ఓటర్లతో పాటు మరో కాలమ్ ఉంటుంది. అదేమిటో గమనించారా? అదే ఇతర ఓటర్లు. అటు మహిళ, ఇటు పురుషులుగా గాకుండా థర్డ్‌జెండర్‌గా నమోదు చేసుకున్న వారిని ‘ఇతరులు’గా ఎన్నికల సంఘం పరిగణిస్తోంది. రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును ట్రాన్స్జెండర్లకు ఇవ్వాలని, మానవ హక్కులను కాపాడాలని పలు సంస్థలు అభ్యర్థించడంతో 2012లో కేంద్ర ఎన్నికల సంఘం వీరిని ఓటర్లుగా గుర్తించేందుకు పచ్చజెండా ఊపింది. ఈ విప్లవాత్మక మార్పునకు అప్పటి సీఈసీ చీఫ్ కమిషనర్ నవీన్ బీ చావ్లా శ్రీకారం చుట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొదటిసారిగా థర్డ్‌జెండర్స్ 2014 ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. గ్రేటర్లో అధికం మన రాష్ట్రంలో ఈ కేటగిరీ ఓటర్లు రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,663 ఓటర్లలో దాదాపు సగం రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, వరంగల్ (పట్టణ) జిల్లాలో నమోదయ్యారు. సిరిసిల్ల జిల్లాలో అత్పల్పంగా ముగ్గురు మాత్రమే ‘ఇతరులు’ ఉన్నారు. గతంతో పోలిస్తే ఇలా నమోదు చేసుకున్న వారి సంఖ్య పెరిగింది. రంగారెడ్డి జిల్లాలో 401, మేడ్చల్ 338, హైదరాబాద్ 317, వరంగల్ (పట్టణ) 172 మంది ఓటర్లు ఉన్నట్లు ఇటీవల ఈసీ విడుదల చేసిన ఓటర్ల తుది జాబితాలో పేర్కొంది. వాస్తవానికి ఈ ఓటర్ల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్నప్పటికీ, ఫారం–6లో ఇతరులుగా పేర్కొన్నవారినే ఈ కేటగిరీ కింద ఎన్నికల సంఘం నమోదు చేస్తోంది. ఇందులో లింగమార్పిడి చేసుకున్నవారే కాకుండా నడవడికలోనూ తేడాగా ఉన్నవారినీ ఈ కేటగిరీ కింద ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. అయితే, ఇదీ పూర్తిగా వారి విచక్షణపైనే ఆధారపడి ఉంటుంది. - డి.వెంకటేశ్వరరెడ్డి, సాక్షి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి -
మన జవాన్ల ప్రాణాలు ఎలా పోతున్నాయో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ : సాధారణంగా సరిహద్దులో జరిగే పరిణామాలతో సైనికులు ప్రాణాలు కోల్పోవటం తరచూ చూస్తున్నాం. అయితే యుద్ధం లేకపోయినా వందల సంఖ్యలో సైనికులు ప్రాణాలు వదులుతుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏటా సుమారు 1600 మందికి పైగా ఆర్మీ సిబ్బంది మృత్యువాత పడుతున్నారని ఓ సర్వేలో వెల్లడైంది. ఇందుకు గల కారణాలను విశ్లేషిస్తే... ఒక్క రోడ్డు ప్రమాదాల ద్వారానే ఏడాదికి 350 మంది సైనికులు, నావికులు, ఆర్మీ అధికారులు ప్రాణాలు కోల్పోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆత్మహత్యల ద్వారా మరో 120 మంది, అనారోగ్య కారణాలతో మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. 2014 నుంచి ఇప్పటిదాకా త్రిదళాలకు సంబంధించి మొత్తం 6,500 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువమంది ఆర్మీకి చెందిన వారే ఉన్నారు. రాత్రిపూటలో ప్రయాణాల సమయంలో ప్రమాదాలు, తీవ్ర ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకోవటం లాంటి కేసులే ఎక్కువగా నమోదు అయ్యాయి. ఇక ఈ ఏడాది 80 మంది పాక్, ఉగ్రవాద కవ్వింపు చర్యలకు బలికాగా, మిగతాకారణాలతో 1,480 మంది మరణించారు. అంటే 12 రేట్లు ఎక్కువగా ఆ మరణాలు చోటు చేసుకున్నాయన్న మాట. సైనికులను కోల్పోవటంపై ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ కొన్ని రోజుల క్రితం జరిగిన ఓ సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు కూడా. ఇప్పటిదాకా జరిగిన యుద్ధాల్లో మృతి చెందిన సైనికుల లెక్క ఈ కింది విధంగా ఉంది.(టైమ్స్ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో) -
శాంసంగ్, ఎల్జీలకు వియూ చెక్ పెడుతుందా?
న్యూఢిల్లీ: స్మార్ట్ టీవీల రంగంలో శాంసంగ్, ఎల్జీ కు పోటీగా వియూ శరవేగంగా ముందుకొస్తోంది. తాజాగా వియూ టెక్నాలజీస్ మూడు టీవీలను మార్కెట్ లో లాంచ్ చేసిన మిగిలిన పోటీ సంస్థలకు భారీ షాక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్మార్ట్ ఫీచర్స్ తో, తక్కువ ధరకే బడ్జెట్ స్మార్ట్ టీవీలతో వియూ వినియోగదారులను ఊరిస్తోంది. స్మార్ట్ ఫీచర్స్ ద్వారా అటు వినోదాన్ని, ఇటు సోషల్ మీడియాను టీవీ తెరపై వినియోగదారులకు అందుబాటులోకి తెస్తూ, టీవీ మార్కెట్ లో హల్ చల్ చేయడానికి సిద్ధమౌతోంది. 32 అంగుళం నుంచి 55 అంగుళాల పరిధిలో మూడు స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. వీటిధరలను రూ .20,000 నుంచి, రూ.52,000 గా నిర్ణయించింది. 32 అంగుళాల టీవీని అతి తక్కువ ధరలో రూ .20,000 లకే అందిస్తున్నట్టు వియు ప్రకటించింది. ప్రఖ్యాత వీడియో చానల్స్ యప్ టీవీ, రెడ్ బుల్ సహా, మిగిలిన అన్ని యాప్ లను ఈ టీవీలో అనుసంధానం చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. అలాగే ఫేస్ బుక్, ట్విట్టర్, లింక్డ్ ఇన్, లాంటి సోషల్ మీడియా లకు కనెక్ట్ అవడమే కాకుండా, స్ర్కీన్ షేరింగ్ అవకాశం కూడా ఉందని తెలిపింది. క్వాడ్-కోర్ ఇంటర్నెట్ వీడియో ప్రాసెసర్ తో పూర్తి హెచ్‌డిలో కంటెంట్ తో రెండు టీవీలను అందుబాటులోకి తెచ్చినట్టు స్పష్టం చేసింది. ఆన్ లైన్ లో ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ రోజు నుంచే ఈ టీవీలను బుక్ చేసుకోవచ్చు. -
స్వీటీతో జిమ్‌లో రానా హల్చల్
హైదరాబాద్: కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, ప్రత్యేక పాత్రలతో సాహసాలు చేస్తూ అందరిన్నీ అలరిస్తున్న టాలెండెట్ హీరోయిన్ అనుష్క. జిమ్ బాడీతో, ఆకట్టుకునే నటనతో, విభిన్న పాత్రలతో విమర్శకుల ప్రశంసలందుకుంటున్న విలక్షణ నటుడు రానా. వీరిద్దరూ కలిసి జిమ్‌లో సందడి చేస్తే ఎలా ఉంటుంది? నిజంగానే వీళ్లిద్దరూ జిమ్‌లో జాలీ జాలీగా ఎక్స్‌ర్‌సైజ్‌లు చేస్తూ టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా నిలిచారు. ఈ సరదా వీడియోను అనుష్క తన అధికారిక ఫేస్బుక్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. దీంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. 'సైజ్ జీరో' చిత్ర యూనిట్ కి రానా దగ్గుబాటి వ్యాయామ పాఠాలు నేర్పిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆరోగ్యంగా ఉండటం కోసం కొన్ని మెలకువలు నేర్పుతానంటూ రానా అనుష్క(స్వీటీ), ప్రకాశ్ కోవెలమూడి, కనికలతో రక రకాల వ్యాయామాలు చేయిస్తున్న ఈ వీడియో ఇపుడు టాక్ ఆఫ్ ఆది టౌన్. అయితే 'బయటివాళ్లకే కాదు, సినిమా వాళ్లకూ బరువు పెరిగిపోతున్నామేమో అన్న అభద్రతా భావం ఉంటుంది. సైజ్ జీరో అంటే సన్నగా ఉండిపోవడం కాదని అనుష్క మీడియాతో తెలిపింది. శరీర సౌష్టవం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుందని, ఎవరికి వాళ్లు సౌకర్యవంతంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పింది. వ్యాయామాల్ని, ఆరోగ్య సూత్రాల్ని ప్రోత్సహిస్తా కానీ.. సౌందర్యం పేరుతో లావుగా ఉన్న వాళ్లను అవహేళన చేయడం తగదని సూచించింది. ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో అనుష్క, ఆర్య, సోనాల్ చౌహాన్ కీలక పాత్రల్లో నటించిన 'సైజ్ జీరో' గత శుక్రవారం నుంచి థియేటర్లలో సందడి చేస్తున్నసంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం అనుష్క 20 కేజీల బరువు పెరిగింది. ఈ క్రమంలో కృత్రిమ పద్ధతిలో కాకుండా ఎంత కావాలంటే అంత సహజంగానే బరువు పెరుగగలనని నిరూపించిన స్వీటీ ఇపుడు మళ్లీ మునుపటి మెరుపు తీగలా మారేందుకు ప్రయత్నిస్తోందన్న మాట. -
పోలీసులే దొంగలుగా మారారు...
-
‘అదర్స్’లోనూ చోటులేదా..?
సమాజంలో అందరి నుంచి చీదరింపులు.. అవమానాలు.. ఎవరూ పట్టించుకోరు...ప్రభుత్వ పథకాలు అందవు.. ఎటువంటి జీవనోపాధి లేదు.. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లోనూ అవకాశాలు కరువు.. వారే హిజ్రాలు.. సమాజంలో అదర్స్‌గా చెలామణి అవుతున్న వీరికి ఆదరణ కరువై దిక్కుతోచని స్థితిలో భిక్షాటన చేస్తూ జీవిస్తున్నారు..ప్రభుత్వం వితంతువులకు, వికలాంగులకు, వృద్ధులకు పింఛన్లు ఇస్తోందని, తమకు మాత్రం ఎందుకు ఇవ్వడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు.. తమకు ఉపాధి కల్పించాలని, సంక్షేమ పథకాలు అందించాలని, అప్పుడే సమాజంలో స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవించగలమని అంటున్నారు... హిజ్రాలు నాగేటి రాజేశ్వరి, నాగేటి లాలస, రమ్య, అరుణ, పద్మలు సమాజంలో తమకు ఎదురవుతున్న బాధలను టేకులపల్లిలో ‘సాక్షి’కి వివరించారు.. ⇒ మేమంటే లెక్కలేదు..? ⇒ ప్రభుత్వ పథకాలు లేవు.. ⇒ ఆధార్, ఓటర్, రేషన్ కార్డులు ఇవ్వరు.. ⇒ డిగ్రీచేద్దామన్నా తిరస్కరించారు.. ⇒ ఆవేదన వ్యక్తం చేస్తున్న హిజ్రాలు టేకులపల్లి: కొత్తగూడెం గాజులరాజాం బస్తీలో సుమారు 50 మంది వరకు నివసిస్తున్నామని, తమకు ఆధార్, ఓటర్ గుర్తింపు, రేషన్‌కార్డు, ఇళ్లు, పింఛన్లు ఇలా ప్రభుత్వ పథకాలేమీ అందడం లేదని అంటున్నారు. తమకు ప్రభుత్వ పథకాలు అందించాలని పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఓటర్ నమోదులో తమ లాంటి వారి కోసం ‘ఆదర్స్’ ఆప్షన్ ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా ఓటు హక్కుకు దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇలా ఊరూరు తిరుగుతూ భిక్షాటన చేయూల్సి వస్తోందని అంటున్నారు. తాము ప్రభుత్వ పథకాలకు అర్హులం కాదా..? మేము మనుషులమే కాదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రభుత్వం స్పందించి తమలాంటి వారికి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఓపెన్ డిగ్రీకి దరఖాస్తు చేస్తే తిరస్కరించారు ప్రభుత్వ పథకాలతో పాటు చదువుకూ మమ్మల్ని దూరం చేస్తున్నారు. చిన్నప్పుడు స్కూల్లో అడ్మిషన్ ఇవ్వకపోవడంతో శతవిధాల ప్రయత్నించి ఓపెన్‌లో టెన్త్ పూర్తి చేశా. రెండు నెలల క్రితం ఓపెన్ డిగ్రీకి దరఖాస్తు చేసుకుంటే తిరస్కరించారు. చదువుకోవడానికి కూడా మాకు అర్హత లేదా..? గుండె నిండా బాధలు, సమాజం నుంచి చీదరింపులు ఎదురవుతున్నారుు. నరక యూతన అనుభవిస్తున్నప్పటికీ పెదవిపై చిరునవ్వుతోనే జీవిస్తున్నాం. ప్రభుత్వం స్పందించి ఆధార్, రేషన్, ఓటర్ గుర్తింపు కార్డులతో పాటు ఇల్లు, పింఛన్ సౌకర్యం కల్పించాలి. చదువుకునేందుకు అవకాశం కల్పించాలి. - లాలస -
ఇంటివారు వేలు చూపితే బయటి వారు కాలుచూపుతారు
నివృత్తం: ఇది ప్రవర్తనకు సంబంధించిన సామెత. సాధారణంగా ఏ మనిషైనా ఏవో కొన్ని తప్పులు చేయడం, సరిదిద్దుకోవడం సాధారణమైన విషయమే. గాని తప్పులు చేయడమే పనిగా పెట్టుకోకూడదు. కనుక ఈ విషయం తెలుసుకుని మసలుకోవాలి. మనపై మనంటి వారికి శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. మన కోసం కష్టపడి, ఏమైనా చేయగలిగిన వారే అయినా చిన్నచిన్న పొరపాట్లు తప్పులను వదిలేస్తారు గాని మన తప్పులు హద్దులు మీరుతుంటే ఎత్తిచూపుతారు. ప్రశ్నిస్తారు. సరిదిద్దుకోవడానికి అవకాశం ఇస్తారు. ఇంట్లో వారు వేలెత్తి చూపేలా నీ తప్పులున్నాయంటే ఈ వేషాలు బయటి వాళ్ల ముందు వేస్తే, ఇలాగే తప్పులు చేస్తే తన్ని పంపుతారు. అంటే ఇంట్లో వారు హెచ్చరించిన వెంటనే నీ తప్పులు సరిదిద్దుకో లేకపోతే కష్టాలు పడతావు అని అర్థం. దేవుడి వద్ద దీపం ఎందుకు పెడతారు? ఆలయం అయినా, పూజ గది అయినా నిరంతరం ప్రసన్నంగా, ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉండాలి. ఇందుకోసం పాటిస్తున్న సంప్రదాయాల్లో దీపం పెట్టడం ఒకటి. సాధారణంగా దైవ పూజలు ఇప్పట్లా ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా కచ్చితంగా, శాస్త్రోక్తంగా సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత పూజలు చేసేవాళ్లు. పూర్వం విద్యుత్తు వంటివి ఉండేవి కాదు కదా... అందుకే దీపం పెట్టి దేవుడ్ని ఆరాధించేవారు. పూజాధికాల తదనంతరం ఇతర భక్తులు ఎవరైనా దేవుడ్ని దర్శించుకోవాలన్నా దీపం వెలుగులో ఆ మూర్తి రూపం కనిపిస్తుంది. దర్శనానికి అనువుగా ఉంటుంది. లేకపోతే చీకటిలో ఇబ్బంది పడతారు కదా. అంతేగాకుండా ఏ ఆలయంలోనూ గర్భగుడిలో కిటికీలు ఉండవు. కాబట్టి దీపం వల్ల ఆలయంలో వెలుగు వస్తుంది. అందుకే ఇది ఒక సంప్రదాయంగా వచ్చింది. -
సూపర్ ఫైనల్స్
-
మేమూ ఓటర్లమే..
- ఓటర్ల జాబితాలో పెరుగుతున్న తృతీయ ప్రకృతి వ్యక్తులు - ‘అదర్స్’గా గుర్తింపు ఇచ్చిన ఈసీ - రాష్ట్ర ఓటర్లలో 4,422 మంది ఎలక్షన్ సెల్: ఓటర్ల జాబితాలో తృతీయ ప్రకృతి వ్యక్తుల సంఖ్య పెరుగుతోంది. దేశంలో ‘సెక్సువల్ మైనారి టీలు’గా గుర్తింపు పొందిన మూడో ప్రకృతుల జనాభా 60 లక్షల దాకా ఉంటుందని అంచనా. కానీ ఓటర్ల జాబితాలో మాత్రం వారికి కొంతకాలం క్రితం దాకా ‘ప్రత్యేక’ గుర్తింపు లేదు. దాంతో వారు స్త్రీ లేదా పురుషుడిగా మాత్రమే పేరు నమోదు చేయించుకోవాల్సి వచ్చేది. తమ అభీష్టానికి వ్యతిరేకంగా తప్పుడు లైంగికతను నమోదు చేసుకోలేక హిజ్రాలు, లింగమార్పిడి చేయించుకున్న వారు ఓటింగ్ ప్రక్రియకే దూరంగా ఉండే వారు. ఈ నేపథ్యంలో వారికి ఓటర్ల జాబితాలో ‘థర్డ్ సెక్స్’గా ప్రత్యేక గుర్తింపు కల్పిం చాలన్న డిమాండ్ 1994 నుంచే మొదలైంది. అది చివరికి 2009లో నెరవేరింది. హిజ్రాలకు, లింగ మార్పిడి చేయించుకున్న వారిని ‘అదర్స్’గా ఓటర్ల జాబితాలో ఎన్నికల సంఘం గుర్తింపునిచ్చింది. ప్రస్తుతం వీరి సంఖ్య రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో అత్యధికం (447)గా ఉంది. కర్నూలు జిల్లాలో 358, నల్లగొండ జిల్లాలో 63 మంది తృతీయ ప్రకృతులున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా నమోదైన 18-19 ఏళ్ల వయసున్న ఓటర్లలో 500 మంది తృతీయ ప్రకృతులున్నారు. ఎన్నికల్లో ఇదో ‘గే’ల... మైనారిటీల ఓట్లు మన దేశంలో ఎంత కీలకమో తెలిసిందే. ఎన్నికల వేళ పార్టీలన్నీ వారి ఓట్ల కోసం పాకులాడుతుంటాయి. మతపరమైన, భాషా పరమైన మైనారిటీల్లాగే లైంగికపరమైన మైనారి టీలు కూడా తాజాగా తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. ఈ వర్గాన్ని ‘లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్’ (ఎల్జీబీటీ)గా సంబోధి స్తున్నారు. ఐపీసీ 377 సెక్షన్ ప్రకారం స్వలింగ సంపర్కం నేరమేనంటూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు చెప్పడం తెలిసిందే. దేశంలో దాదాపు 25 లక్షల మంది స్వలింగ సంపర్కులున్నారని ఆ కేసు విచారణ సమయంలో కేంద్రం కోర్టుకు తెలిపింది. వారి వాస్తవ సంఖ్య దాదాపు 10 కోట్ల దాకా ఉంటుందన్నది స్వచ్ఛంద సంస్థల అంచనా. మన రాష్ట్రంలో 2014 ఓటర్ల జాబితాలో ఆడా, మగా కాని వారి సంఖ్య 4,422గా నమోదైంది. 2009 ఎన్నికలతో పోలిస్తే (2,423) ఇది దాదాపు రెట్టింపు. సామాజిక అవహేళనకు భయపడి చాలామంది తమ లైంగికతను బయటకు చెప్పుకోలేకపోతున్నారని చెబుతుంటారు. భారత్‌తో పోలిస్తే, పాశ్చాత్య దేశాల్లో ఎల్జీబీటీ వర్గం కోసం పోరాడే సంస్థలు చాలా క్రియాశీలంగా ఉన్నాయి. అవి ప్రభుత్వ విధానాలను సైతం ప్రభావితం చేయగలుగుతున్నాయి. అమెరికాలో స్వలింగ సంపర్కుల సంఖ్య దాదాపు 3.5 కోట్ల దాకా ఉంది. దాంతో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఎల్జీబీటీ వర్గానికి ఒబామా పలు వరాలు కురిపించారు. ఆయన గెలుపులో ఈ వర్గం పాత్ర కూడా గణనీయమైనదని విలియమ్స్ ఇన్స్టిట్యూట్ అధ్యయనంలో తేలింది. భారత్‌లోనూ వీరి సంఖ్య గణనీయంగానే ఉన్నా, సుప్రీం తీర్పు నేపథ్యంలో పార్టీలు ధైర్యంగా ముందుకొచ్చి ఎల్జీబీటీ హక్కులపై బాహాటంగా హామీలిచ్చే పరిస్థితి కన్పించడం లేదు. విదేశాల్లో ఇలా... బ్రిటన్‌లో 50 మంది స్వలింగ సంపర్కులు రాజకీయంగా ఉన్నత స్థానాల్లో ఉన్నారు. బంగ్లాదేశ్‌లో హిజ్రా ఓటర్ల సంఖ్య లక్షకు పైబడింది. దాంతో ఎన్నికల కమిషన్ 2001 ఎన్నికల్లో వీరి కోసం పోలింగ్ బూత్‌ల వద్ద ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేసింది! యూరోపియన్ యూనియన్ దేశాల్లో స్వలింగ సంపర్కం నేరం కాదు. స్వలింగ వివాహాలకు 7 ఈయూ దేశాలు చట్టబద్ధత కల్పించాయి. ఉత్తర అమెరికా, ఈయూలతో పాటు పలు లాటిన్ అమెరికన్ దేశాల్లో కూడా స్వలింగ సంపర్కానికి ప్రజామోదం ఉంది. పశ్చిమాసియా, ఆఫ్రికా, రష్యా, ఆసియాల్లోని పలు దేశాల్లో అదే స్థాయిలో వ్యతిరేకత ఉంది. తొలి హిజ్రా ఎమ్మెల్యే షబ్నమ్ మౌసీ దేశంలో ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలి హిజ్రా షబ్నమ్ మౌసీనే. ఆమె మధ్యప్రదేశ్‌లోని సుహాగ్‌పూర్ నియోజకవర్గం నుంచి 1998 ఎన్నికల్లో గెలుపొందారు. అయితే అప్పట్లో వేరే ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఓటర్ల జాబితాలో తనను తాను మహిళగా నమోదు చేయించుకున్నారు! మో‘డీ అంటే ఢీ’... వారణాసిలో డాన్, హిజ్రాల పోటీ మో‘డీ అంటే ఢీ’ అంటూ ఒక మాఫియా డాన్, ఒక హిజ్రా కూడా వారణాసి బరిలోకి దిగారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో వారణాసి లోక్‌సభ స్థానంలో ‘ఆప్’ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తలపడుతున్న సంగతి తెలిసిందే. రాజకీయాల్లో ఆరితేరిన మాఫియా డాన్ ముఖ్తార్ అన్సారీ ప్రస్తుతం అండర్ ట్రయల్ ఖైదీగా జైలులో ఉంటూనే ఖ్వామీ ఏక్తా దళ్ (క్యూఈడీ) తరఫున వారణాసి లోక్‌సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మవు సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ముఖ్తార్ అన్సారీ, నాలుగు పర్యాయాలుగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదివరకు బీఎస్పీలో ఉన్న ఈ మాఫియా డాన్, ప్రస్తుతం క్యూఈడీ సభ్యుడిగా యూపీ అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మోడీపై ఈ ఎన్నికల్లో గెలుపు సాధిస్తానని ఈ అసెంబ్లీ‘డాన్’ ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత 2009 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మురళీ మనోహర్ జోషీకి గట్టి పోటీ ఇవ్వగలిగానని, కేవలం 20 వేల స్వల్ప తేడాతో గెలుపు చేజార్చుకున్నానని చెబుతున్నారు. వారణాసి నియోజకవర్గం పరిధిలోని సుమారు 2.50 లక్షల మంది ముస్లిం ఓటర్ల మద్దతు తనకే ఉంటుందని అంటున్నారు. మరోవైపు, కమలా అనే హిజ్రా కూడా వారణాసి లోక్‌సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. గోరఖ్‌పూర్‌లో ఇటీవల హిజ్రాల సంఘం నిర్వహించిన సమావేశంలో ఆమెదించిన తీర్మానం మేరకు కమలా గెలుపు కోసం వారణాసి నియోజకవర్గం పరిధిలో ఇంటింటా ప్రచారం నిర్వహించేందుకు ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి హిజ్రాలంతా తరలి రానున్నారు. తామంతా ములాయంసింగ్ యాదవ్‌ను తదుపరి ప్రధాని చేయాలంటూ ప్రచారం చేయనున్నామని హిజ్రాల తరఫు ప్రతినిధి సోనమ్సింగ్ యాదవ్ చెప్పారు. ములాయం మద్దతుదారులమని, ప్రధానిగా ఆయన మెరుగైన పాలన అందించగలరని భావిస్తున్నామని అన్నారు.